తెలుగుదేశం పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
updated info box
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}



{{భారతదేశ రాజకీయ పార్టీ |
{{Infobox Indian Political Party
party_name = తెలుగుదేశం పార్టీ|
|party_name = తెలుగుదేశం పార్టీ
party_logo = [[దస్త్రం:Tdplogo.jpg|centre|200px]]|
|party_logo = [[Image:TDPFlag.PNG|center|200px]]
| founder = [[నందమూరి తారక రామారావు]]
leader = [[చంద్రబాబు నాయుడు]]|
| leader = [[నారా చంద్రబాబు నాయుడు]]
foundation =[[మార్చి 29]], [[1982]]|
| foundation = మార్చి 29, 1982
alliance = [[నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్]] నుండి ఈ మధ్యనే విడిపోయింది|
|alliance = [[National Democratic Alliance (India)|NDA]] (2004-2009)</br>[[United National Progressive Alliance|TF]] (2009-present)
publication = |
|position = [[Centrism|Center]]
headquarters = రోడ్డు నంబరు.2, బంజారా హిల్స్, [[హైదరాబాదు]]-500033 |
| loksabha_seats = {{Infobox political party/seats|6|545|hex=#FFFF31}}
website = http://www.telugudesamparty.org/
| rajyasabha_seats = {{Infobox political party/seats|5|245|hex=#FFFF31}}
| state_seats = {{Infobox political party/seats|81|294|hex=#FFFF31}}
| symbol
|ideology = [[Regionalism (politics)|Regionalism]]<br> [[Social liberalism]]|publication =
|headquarters = Road No.2, Banjara Hills, [[Hyderabad, India|Hyderabad]]-500033
|website = [http://www.telugudesamparty.org/ telugudesamparty.org]
}}
}}



06:32, 8 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు


తెలుగుదేశం పార్టీ
నాయకుడునారా చంద్రబాబు నాయుడు
స్థాపకులునందమూరి తారక రామారావు
స్థాపన తేదీమార్చి 29, 1982
ప్రధాన కార్యాలయంRoad No.2, Banjara Hills, Hyderabad-500033
రాజకీయ విధానంRegionalism
Social liberalism
రాజకీయ వర్ణపటంCenter
కూటమిNDA (2004-2009)
TF (2009-present)
లోక్‌సభలో సీట్లు
6 / 545
రాజ్యసభలో సీట్లు
5 / 245
శాసనసభలో స్థానాలు
81 / 294
Website
telugudesamparty.org

తెలుగుదేశం పార్టీ లేదా TDP భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ఠ్రానికి చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని ప్రముఖ తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించాడు.[1] అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.

13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచినది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు
నందమూరి తారక రామారావు

నందమూరి తారక రామారావు శకం

నందమూరి తారక రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలొ సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమితెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 40 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్ధులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 500 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రేసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది.

వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భ్రుతిగా స్వీకరించినా, అది కేవలం NTRకు మాత్రమే చెల్లింది.

1988లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.

1988 మరియు 1994ల మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్-టైం విలేఖరి మరియు రాజకీయ చరిత్ర విద్యార్ధి అయిన లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నాడు. దేశం లోని కాంగ్రెస్ కి వ్యతిరేకం గా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయి లో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించి కేంద్రం లో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధాని ని చేశారు "నేషనల్ ఫ్రంట్" కు చైర్మెన్ గా వ్యవహరించారు.

1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు రెండవసారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి ఆర్ధిక మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్.టి.రామారావుకు తాను స్థాపించిన పార్టీ మీదనే అధికారం కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు ఎన్నికల సంఘం కూడా పార్టీ పేరును ఎన్.టీ రామారావు తరపు వారికి కాకుండా చంద్రబాబు తరపు వారికే కట్టబెట్టింది. దానితో ఎన్.టీ.రామారావు, ఎన్.టి.ఆర్ తెలుగుదేశం అనే కొత్త పార్టీని స్థాపించారు. సినిమాలలో "రాముడి"గా, "కృష్ణుని"గా వేరెవ్వరినీ ఊహించుకోవీలులేని విధంగా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిన ఆంధ్రుల "అన్నగారి మహాభినిష్క్రమణానికి హాజరైన జనసందోహమే ఆ మహానాయకుని అనంత కీర్తికి,ప్రజాభిమానానికి ప్రతీక.

చంద్రబాబు నాయుడి శకం

ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడు

1996లో రామారావు మరణము తరువాత ఆయన భార్య లక్ష్మీ పార్వతి అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్ధులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మరలా చీల్చినది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవడము మొదలైన కారణాలతో ఆ తరువాత జరిగిన ఎన్నికలలో నామమాత్రము లేకుండా పోయింది. ఇప్పుడు అధికారికముగా తెలుగు దేశము పార్టీగా గుర్తింపబడుతున్న అధిక సంఖ్యాక వర్గానికి నాయకుడు చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు నాయుడు హైదరాబాదు ను మరియు రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చినాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.

ప్రచురణలు

పుస్తకాలు

వీడియోలు

యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్లో [2] తెలుగు దేశం నాయకుల ప్రసంగాలు దృశ్యశ్రవణ మాధ్యమంగా లభిస్తున్నాయి.

మూలాలు, వనరులు

  1. తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : [1]వివరాలు జులై 19, 2008న సేకరించబడినది.
  2. యూట్యూబ్ లో తెలుగు దేశం పార్టీ టీవీ ఛానల్

ఇవికూడా చూడండి

బయటి లింకులు