పసిఫిక్ మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ba:Тымыҡ океан
చి r2.7.3rc2) (యంత్రము కలుపుతున్నది: se:Jaskesáhpi
పంక్తి 159: పంక్తి 159:
[[scn:Ocèanu Pacìficu]]
[[scn:Ocèanu Pacìficu]]
[[sco:Paceefic Ocean]]
[[sco:Paceefic Ocean]]
[[se:Jaskesáhpi]]
[[sh:Tihi ocean]]
[[sh:Tihi ocean]]
[[si:ශාන්තිකර සාගරය]]
[[si:ශාන්තිකර සාගරය]]

18:38, 16 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

Pacific Ocean
Pacific Ocean

భూమిపై గల మహసముద్రాలన్నిటిలోకీ పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) అతి పెద్దది. లాటిన్ భాషలో ఈ మహాసముద్రానికి "మేర్ పసిఫికమ్" Mare Pacificum అన్న పేరు ఆపాదించినవాడు పోర్చుగీసు నావికుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్. ఈ మాటకు "ప్రశాంతమైన సముద్రం" అని అర్ధం.

భోగోళిక స్వరూపం

పసిఫిక్ మహాసముద్రం ఉత్తరాన ఆర్కిటిక్ ధృవం నుండి దక్షిణాన అంటార్కిటిక్ ఖండం వరకు వ్యాపించి ఉన్నది. 169.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ మహాసముద్రం భూవైశల్యంలో మొత్తంలో 32 శాతాన్ని, జలభాగం లో 46 శాతాన్ని ఆక్రమించింది. ఈ మహాసముద్ర వైశాల్యం మొత్తం అన్ని ఖండాలన్నిటి సమైక్య వైశాల్యం కన్నా ఎక్కువ. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ఈ మహాసముద్రాన్ని ఉత్తర పసిఫిక్ సముద్రం, దక్షిణ పసిఫిక్ సముద్రాలుగా వ్యవహరిస్తారు. వాయువ్య పసిఫిక్ లో గల మరియానా అగడ్త భూమిపై అత్యంత లోతైన ప్రదేశం. ఈ ప్రదేశంయొక్క లోతు 10,911 మీటర్లు.భూమి పై ఉన్న అనీ అగ్ని పర్వతాలలోకీ అత్యంత చురుకైనవిగా పేరు బడ్డ అగ్నిపర్వతాలు పసిఫిక్ లోనే ఉన్నాయి. ఈ పర్వతాలు ఉన్న ప్రాంతానికి అగ్ని వలయమని పేరు. పసిఫిక్ ఉపరితల జలాలు సాధారణంగా ఉత్తరార్ధ గోళంలో సవ్యదిశలోనూ, దక్షిణార్ధ గోళంలో అపసవ్య దిశలోనూ ప్రవహిస్తాయి.

చరిత్ర

ఓర్తెలియుస్ చే 1589లో తయారుచేయబడిన పటం. పసిఫిక్ మహాసముద్రాన్ని సూచించిన తొలి పటం బహుశా ఇదే కావచ్చు.

చరిత్రకు అందని రోజుల్లో ప్రముఖమైన మానవ వలసలు పసిఫిక్ ప్రాంతంలో జరిగాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్ట్రోనేషియన్లు, పొలినేషియన్ల వలసలు. వీరు ఆసియా ఖండం నుండి తాహితి ద్వీపానికి, అక్కడ నుండి హవాయి, న్యూజిలాండ్ కు, ఆ తరువాత చాలా కాలానికి ఈస్టర్ ద్వీపానికి వలస వెళ్ళారు.

యూరోపియన్లు ఈ సముద్రాన్ని తొలిసారి 16వ శతాబ్దంలో వీక్షించారు. తొలిగా స్పెయిన్ నావికుడు వాస్కో న్యూనెజ్ డి బాల్బొవా 1513 లోనూ, ఆపై తన భూప్రదక్షిణంలో మాగెల్లాన్ (1519-1522) ఈ సముద్రంపై ప్రయాణించారు.