వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 362: పంక్తి 362:
:::గండడు గారు, వ్రాయవచ్చు. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 11:06, 19 ఫిబ్రవరి 2013 (UTC)
:::గండడు గారు, వ్రాయవచ్చు. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 11:06, 19 ఫిబ్రవరి 2013 (UTC)
:::[[అజ్మల్ కసబ్]] చూడండి. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 11:07, 19 ఫిబ్రవరి 2013 (UTC)
:::[[అజ్మల్ కసబ్]] చూడండి. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 11:07, 19 ఫిబ్రవరి 2013 (UTC)
:::: చావా గారు మరియు సత్య గారు... చాలా ధన్యవాదాలండి.--[[వాడుకరి:గండర గండడు|గండర గండడు]] ([[వాడుకరి చర్చ:గండర గండడు|చర్చ]]) 11:58, 19 ఫిబ్రవరి 2013 (UTC)

11:58, 19 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

<br=clear all>

ఏకవాక్య వ్యాసాలు.

నేను ప్రారంభించిన ఏకవాక్య వ్యాసముల రగడకు ప్రధాన కారణమయిన వ్యాసం (డయామీటర్)పై కొంత వివరణ:

నేను ఆంగ్లంలో ఉన్న కొన్ని వృక్షముల వ్యాసాలు తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు డయామీటర్ అనే పదం వచ్చింది. డయామీటర్ అనే ఇంగ్లీషు పదానికి తెలుగులో వ్యాసం అని అర్థం ఉన్నది. వ్యాసం అనే పదం మామూలుగా ప్రజల వాడుకలో లేదు, అందువలన సామాన్యుడిగా నాకు తెలియలేదు. అనువాద ప్రక్రియలో డయామీటర్ అనే ఆంగ్ల పదం వృత్తం లోపల అడ్డు కొలతలు అనే అర్థాల నిచ్చే డయా మరియు మెట్రాన్ అనే గ్రీకు భాష పదాల నుండి ఉద్భవించిందని అర్థమయింది. ఆధునిక వాడుకలో డయామీటర్ యొక్క పొడవును డయామీటర్ అనుట వలన నేను తెలుగు వారికి సులభంగా అర్థమయ్యేట్టూగా అడ్డుకొలత అనే పేరుతోనే వ్యాసం ప్రారంభించాను. అంతేకాక వ్యాసం అనే పేరుతో ఇతర వ్యాసం ఉండుట వలన వ్యాసం అయోమయనివృత్తి ఏర్పాటు చేశాను, అక్కడ నుంచి వ్యాసం (అడ్డుకొలత)కు దారిమార్పు ఇచ్చాను. నువ్వు ప్రారంభించిన వ్యాసం నువ్వే సరిచేయాలి అన్నట్లు ఇతరులు ఈ వ్యాసంపై విమర్శలు గుప్పిస్తే సరిచేయడానికి ప్రయత్నించాను. ఈ వ్యాసం పేరు మార్పుకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. పుస్తకానుభవం లేనందువలనే ఈ సమస్య వచ్చినందువలన ఈ వ్యాసం గురించి పుస్తకాలలో వెతుకుతున్నాను, త్వరలో అత్యంత అందంగా ఈ వ్యాసాన్ని సరిదిద్దుతాను. మీ YVSREDDY (చర్చ) 23:50, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ మధ్య కొందరు సభ్యులు పోటిపడి మరీ ఏకవాక్యయుతమైన కొత్తవ్యాసాలనుసృష్టిస్తున్నారు.అసలుకన్న కొసరుఎక్కువ అన్నచందాన వ్యాసాలచేర్పు జరిగిన,తెలుగు వికీపీడియా విలువలు దిగజారే ప్రమాదం పొంచివున్నది.ఏపాఠకుడైన ఏదైన సమాచారం కై ఒకపేజిని చూస్తే అందులో అంతో,ఇంతో సమాచారమున్న,రెండో పర్యాయము మళ్లి చూస్తాడు,అసలు మ్యాటరే లేని రెండు,మూడు ఇలాంటి వ్యాసాలను చూసి,ఆతరువాత టైం వేస్టంటూ అసలు తెవికీకే దూరమైయ్యే అవకాశమున్నది.ఈవిధంగా అసక్తిగల పాఠకులకు తెవికీ పట్ల చులకనభావం పేరుగుతుంది.ఎన్ని వ్యాసాలున్నాయన్నదికాక ఎంత సమాచార ము అందించగలమన్నదిముఖ్యము.అందుచే విజ్ఞజైన సభ్యులు వ్యాసరచన విషయంలో శ్రద్ధ పెట్టాలి.ఈలాంటి సభ్యులకు సీనియరు సభ్యులు,కార్యనిర్హకులు వెంటనే స్పందించి తగు సూచనలు లు,అవసరమైనచో హెచ్చరికలు ఇవ్వడం ఎంతో అవసరం.నేను ఇది ఏసభ్యుని పట్ల వ్యక్తిగత ద్వేషంతో వ్రాయడంలేదు.తెవికీ అభివృద్ధిని,పేరును దృష్టిలో పెట్టుకొని సూచిస్తున్నాను.తెవికీని విజ్ఞాన సర్వస్వముగానే వుంచుదాము.వుత్త స్వర్వసముగా కాదు.పాలగిరి (చర్చ) 03:36, 23 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అన్నివికీపీడియాలలో మొలక వ్యాసాలగురించి భిన్నాభిప్రాయాలు వుంటాయి. (గతంలో బాట్ ద్వారా గ్రామ వ్యాసాలు సృష్టంచడంజరిగింది.) దీనికి పరిష్కారం ఒక విషయంపై ఆసక్తి వున్న సభ్యులు కలిసికట్టుగా చర్చించి నిర్ణయంతీసుకొని ప్రాజెక్టు జట్టుగాపనిచేయడం. --అర్జున (చర్చ) 04:18, 23 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఏక వాక్య వ్యాసాలకు పూర్తికా వ్యతిరేకం. నేను ఒక మంచి ఆశయంతో తెవికి కి వచ్చాను. నా ఉద్దేశాన్ని కూడా నా వాడుకరి పేజిలొతెలియజేశాను. భౌతిక శాస్త్ర వ్యాసాలు ఎలా విస్త రిస్తున్నానో మీకు తెలుసు. భౌతిక శాస్త్ర వ్యాసాలు మరి కొందరు వ్రాస్తున్నారు. చాలా సంతోషం. అందులో కొన్ని సవరణలు చేస్తున్నాను. వ్యాసాలలొ కొన్ని అనవసర విషయాలు, బొమ్మలు ఉన్నపుడు నేను చర్చా పేజీలలొ వ్రాసినప్పటికీ సదరు సభ్యులు కాని.నిర్వాహకులు పట్టించుకోవటం లేదు. కొందరు విషయ ప్రాథాన్యత తగ్గించి కొత్త వ్యాసాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మీరు నూనెల వ్యాసాలు వ్యాసేటప్పుడు మేమెవరమూ అందులో తలదూర్చలేదు ఎందువలనంటే నాకు విషయం తెలియదు. పల్లెవాసుల జీవన విధానం వ్యాసం జొలికి పోను.ఎందువలనంటే నాకు విషయం తెలియదు. కాని నాకు తెలిసిన అంశాలలొ తప్పులుంటే నేను సహించలేను. నేను వ్యాసాలు రాస్తున్నాని నా కంటే ముందుగా కొందరు వ్యాసాలను ఏకవాక్యాలలొ మొదలుపెట్టడం అయినా వాటిని విస్తరించక పోవడం సంబందం లేని అంశాలు జొప్పించటం తప్పులు చెప్పినా పట్టించుకోకపోవటం సంబంధిత రంగంలో 18సం. అనుభవం గల నాకు బాథ కలిగింది. అందువలన భావోద్వేగంతో నేను మొదటిసారి ఒకేసారి అనేక ఏకవాక్య వ్యాసాలను వ్రాసినందుకు క్షంతవ్యుడను. నేను వ్రాసిన ఏకవాక్య వ్యాసాలను విస్తరించిన తదుపరి తెవికీ నుండి కొంతకాలం దూరంగా ఉంటాను( కె.వి.రమణ- చర్చ 05:17, 23 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
రమణగారు,
నేను జనరల్ గా చెప్పినది మీరు వ్యక్తిగతంగా తీసికొని నొచ్చుకున్నట్లున్నారు.ప్రస్తుతం భౌతిక,రసాయనశాస్త్రాలలో అధ్యాపకుడిగా అనుభవమున్న మీనుండి ఇంకా పైశాస్త్రాలకు సంబంధించిన ఎన్నోవ్యాసాలు రావసివున్నది.ప్రస్తుతం పైరెండు శాస్త్రాలకు సంబంధించి ఎన్నోచక్కని వ్యాసాలు మీరు వ్రాసారు.మీలాంటివారు మాలాంటి వారిమాటలను సహృదయంతో స్వీకరించి మునుముందు కూడా రచనలు సాగించండి.నా వ్యాఖ్యలు మీకు బాధకల్గించినందుకు క్షమించండి.తేవికీ నాఒక్కడి స్వంత అస్తికాదు.నేనుకూడా ఒక సామాన్య సభ్యుడనే.ప్రత్యేకమైన హక్కులు,అధికారాలేమిలేవు.తెవికీ అందరిది.నేను పైనచేసిన వ్యాఖ్యలు మీఒక్కరి గురించికాకుండగా,ఇతరసభ్యులు సలహలిస్తున్నప్పటికి పటించుకోనివారిగురించి.ఇదేమి మనస్సులో పెట్టుకోకుండగా మీరచనలు సాగించండి.పాలగిరి (చర్చ) 05:55, 23 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున వాడుకరి పేజీలో Santu గారి సందేహం
1. ఈ మధ్య కొందరు సభ్యులు విపరీతంగా ఏకవాక్య వ్యాషాలు మొలకలుగా సృష్టిస్తున్నారు. దీనికి కారణం ఎక్కువ వ్యాసాల చరిత్రలలో తమ పేరు ముందుగా ఉంటుందని వారి అభిప్రాయమైనట్లు గా తోచుచున్నది. దీని కారణంగా ఎవరూ వ్యాస విస్తరణ చేయుట లేదు. కొందరు అజ్ఝాత వాడుకరులు కూడా మొలకలను విపరితంగా సృష్టిస్తున్నారు. తెవికీ లో ఎక్కువ వ్యాసాలు సృష్టించే వారికి ప్రాధాన్యత అధికంగా ఉంటుందా?
2. వ్యాషాల చరిత్ర ను సభ్యులు చేర్చేన విషయం పరిమాణం ఆధారంగా సార్ట్ చేస్తే సభ్యులలో కొందరు ఉత్సాహంగా హెచ్చు విషయం చేర్చటానికి ప్రయత్నించరా?
3. ఒక వాడుకరి ఏకవాక్య వ్యాసం తో 1 శాతం రాస్తే 99 శాతం తో పూర్తి వ్యాసం పూర్తిగా రాసేవారు వ్యాస విషయ కర్తగా ఉండాలని కోరుకోవటంలో తప్పేముంటుంది?

(Santu (చర్చ) 02:21, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

తెవికీ అందరు కలిసికట్టుగా అభివృద్ధిచేయవలసినది. వ్యక్తులు వారి వారి అభీష్టాలమేరకు వారి ఆసక్తికి సంబంధించిన విషయాలపైన లేక వికీలో అచ్చుతప్పులు దిద్దడం, ఛాయాచిత్రాలు చేర్చడం లేక వ్యాసాల వర్గీకరణ, అంతర్వికీలింకులు, అనువాదాలు స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతుంది. ఈ మార్పులను ప్రధానంగా వ్యాస పేజీల మార్పులు వ్యాసేతర పేజీల మార్పులు గా చూడవచ్చు. ధనాపేక్షలేకుండా చేసేపనికి కనీసం సముదాయంలో గుర్తింపు కలిగిస్తే సభ్యులకు వుత్తేజం కలుగుతుందనుకుంటాను. తెవికీ పని గురించి రకరకాల పరామితులు అనగా మార్పుల సంఖ్య, లింకుల సంఖ్య,మార్పు పరిమాణం లాంటివి నెలవారీగా అందుబాటులో వున్నాయి. అందుకని 2010 లో వ్యాసాల మార్పులను లెక్కలోకి తీసుకొని మొదటి పదిస్థానాలలో వున్న సభ్యులను వారి చర్చాపేజీలలో వ్యాఖ్య ద్వారా గుర్తించడం జరిగింది. వ్యాస మార్పులుమాత్రమే కాకుండా వ్యాసేతర మార్పులు కూడా తెవికీ నాణ్యతకు ప్రధానం కాబట్టి 2011, 2012 లో రెండింటిలో ప్రధానంగా పనిచేసినవారిని గుర్తించడం, వ్యాఖ్య ద్వారా అభినందించడం జరిగింది. ఇవే కాకుండా తెవికీలో బాగా పనిచేస్తున్న వారికి సహసభ్యులు పతకాలతో సత్కరించడంకూడా జరుగుతున్నది. ఈ విధంగా చూస్తే తెలుగులో ఏ విధంగా పనిచేసిన గుర్తింపు కలిగించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ చర్చాపేజీలు చూసేవారికి మాత్రమే తెలుస్తాయి. ఛాయాచిత్రకర్తలకు ముఖపత్రపేజీలో గుర్తింపు ఇస్తున్నట్లు వ్యాసవిషయాలలో పనిచేసేవారికి ముఖపత్రపేజీలో గుర్తింపు ఇవ్వాలనుకొని, ప్రధానంగా కొత్త పేజీలకు సంబంధించిన మీకు తెలుసా శీర్షికలో వ్యాసాన్ని ప్రారంభించిన వారి పేరు చేర్చటం జరిగింది. అయితే మొలక వ్యాసాలలో ఆసక్తికరమైన విషయాలు పెద్దగా వుండవు కాబట్టి, ఈ శీర్షికను అన్ని వ్యాసాలకు అన్వయించి ఆసక్తికరమైన విషయం చేర్చిన వారి పేరు వ్యాసవిషయకర్త గా చేర్చటం జరిగింది. దీనిగురించి ఇటీవల ప్రారంభమైన చర్చలో కనీసం ఐదు మంది సభ్యులు కూడా పాల్గొనకపోవడంతో అసంపూర్తిగా మిగిలింది.
మొలక వ్యాసాలు ఎక్కువగా చేర్చటంవలన వికీఅభివృద్ధి వేగంగా జరుగుతుందా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. మళయాళం లాంటి వికీలో మొలకలను దాదాపు నిషేధించగా, తమిళ వికీలో ఒక మోస్తరు స్థాయిలో వాడుతున్నారు. దీనిపై నిర్ణయం లేక నిర్ణయంలో మార్పులు వికీసభ్యులు చర్చించి తీసుకోవలసివుంది. తెవికీ ప్రారంభించిన రోజుల్లో వుత్సాహవంతులైన సభ్యులు (నాకు తెలిసి దీనిగురించి చర్చజరపకుండానే) బాట్ సాయంతో ప్రతి గ్రామానికి మొలక వ్యాసాలు ప్రారంభించారు. తద్వారా తెవికీలో పనిచేసేవారిలో ఆసక్తి పెరిగి అవి పూర్తి వ్యాసాలుగా వృద్ధిచెందుతాయని భావించారు. అయితే చాలా కొద్ది గ్రామ వ్యాసాలు తప్ప మిగతావి మొలకలుగానే వున్నాయని నా అభిప్రాయం. తెవికీచదివేవారికి ఎక్కువ శాతం మొలకలుంటే ఆసక్తి తగ్గుతుందనుకునే వారిలో నేను ఒకడిని. మొలక వ్యాసాలలో వుండే విషయాలను మొదట జాబితాగా ఒక వ్యాసంలో రాస్తే దానిపై ఆసక్తిగలవారు దానిని ప్రత్యేక వ్యాసంగా తయారుచేయవచ్చు.
వ్యాస విషయ కర్త అనేదానిగురించి ఆ వ్యాసానికి సహకరించినవారందరు వ్యాసవిషయకర్తలే. దీనికి వ్యాస చరిత్ర పేజీ మరియు చర్చాపేజీలు చూడాలి. మీకు తెలుసా శీర్షికలో ప్రస్తావించిన విషయానికి మాత్రమే సంబంధిత సభ్యుని విషయకర్తని ముఖపత్రపేజీలో సూచించడం జరిగింది.
అందరూ అభిప్రాయాలు తెలియచేస్తే, ఓటింగు పద్ధతిద్వారా అత్యధిక సభ్యుల అభిప్రాయం ప్రకారం పని చేయవచ్చు. మీలాంటి వారు తెవికీ చర్చలలో ఎక్కువగా పాల్గొని తెవికీ అభివృద్ధికి కృషి చేయాలనుకోరుచున్నాను.--అర్జున (చర్చ) 03:30, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకవాక్య వ్యాసాలగురించి,మరియు మొలకల గురించి చర్చ జరుగవలసిన అగత్యం ప్రస్తుతం ఎంతైనవుంది.ప్రస్తుతం చురుకుగా రచనలు,దిద్దుబాట్లు చేస్తున్న సభ్యుల సంఖ్య తక్కువగా వున్నందున కొత్తసభ్యులను ప్రోత్యహించచలసిన అవసరమున్నప్పటికి,వ్యాసంలో విషయమే లేకుండగా పుంఖానుపుంఖాలుగా సృష్టిస్తున్న సభ్యులగురించికూడా త్రీవ్రంగావెంటనే స్పందించవలసిన అవసరమున్నది.ఈ పద్ధతికి స్వస్తి చెప్పకపోయిన,ఆ సభ్యున్ని ఆదర్శంగా తీసుకొని కొత్తసభ్యులుకూడా ఏకవాక్య వ్యాసాలు రాస్తారు.మొదటి సభ్యుని నియంత్రించని వాళ్ళం,ఆతరువాత సభ్యులను ఎలా నియంత్రించగలము. మొక్కయైవ్రంగనిది మ్రానయైవంగుతుందా?.కలుపుమొక్కలా ఈ ఏకవాక్యవ్యాసాలు తెవికీ నీ ఆక్రమించి,అసలు,సిసలు వ్యాసాలు కనుమరుగవుతాయి.తెవికీ ఆర్.టి.సి.వారి ఎర్రబస్సుకాదు,రైల్వేవారి జనరల్ కంపార్టుమెంట్ కాదు,ఎవ్వరుముందు కర్చీఫ్ వేస్తే వాళ్ళస్వంతమవ్వటానికి.ఒకసభ్యుడు ఏదైన శాస్త్రానికి సంబంధించి మంచి వ్యాసాలు రాస్తుంటే,ఈ ఇంకొకవిషయామేలేని సభ్యుడు ,రెండో సభ్యుడు రాయబోయే శీర్షిక వ్యాసాని చవుహించి ఆ పేరుటొ ఆవిషయాన్ని, ఏకవాక్యంతో కొత్త పేజి సృష్టించి అతని ఉత్సహంమీద నీళ్లుచల్లి,ముందరకాళ్లకు బంధం వేస్తున్నాడు.ఒకవేళ వేరే శీర్షికతో పూర్తి విషయంతో వ్యాసం మొదలెట్టినచో,ఆవ్యాసాన్ని తాను ఏకవాక్యంతో ప్రారంభించిన దానిలో విలీనంచెయ్యాలని,నిర్హాకులకు సందేశాలు పెట్టి,నిజమైన స్పూర్తితో రచనలు చేసె వారికి ఇబ్బంది కలుగ చేస్తున్నారు.కొత్తగా రచనలు చేస్తున్నవారి రచన విధానంలో తప్పులున్న,సినియరు సభ్యులు,లేదా నిర్హకులు సూచనలిచ్చిన ,స్వీకరించి తమ తప్పును సరిదిద్దుకోవటం విజ్ఞతగల సభ్యుని కర్తవ్యం.నేను రచనలు మొదలుపెట్టినప్పుడు రాజశేఖరు గారు,వాటిని గమనించి,బాగుంటే బాగుందని,తేడా వుంటే ఎలాచెయ్యాలో చెప్పేవారు,ఒక్కోసారి పోనుచేసి మరి చెప్పెవారు.అలాగే అర్జుంగారు,మరియు చంద్రకాంతరావుగారు నాపొరబాట్లను దిద్దారు.సహాకారంతో ముందుకు సాగాలి.మరి ఎందరో సభ్యులు నీఏకవాక్య వ్యాసాల పద్దతిమానుకోమని సహృదయంతో పనికట్టుకొని తమ విలువైన సలహాలిస్తుంటే వారికి ప్రత్యుత్తరమివ్వడం సంగతి దేవుడెరుగు,తన పద్ధతిలో విసుమంత మార్పులేకుండ ఆదేపనిగా అర్థంపర్దము లేకుండ వ్యాసాలు,వర్గాలు,వర్గాలకు వర్గాలు,మూసలు,మూసలకుమూసలు,ఇలా కొనసాగుతునే వున్నది.పోని వర్గాలు,మూసలు సృష్టించవలసినంత మేటరెమైనవుందా?.క్రమశ్క్షణారాహిత్యం అంటువ్యాధిలాంటిది.అంటుకుంటె వదలదు.కలరాలా మొత్తము చుట్తుకుపోతుంది.తెవికీ లో ప్రస్తుతం 18 మంది నిర్హాకులు న్నారు, దయచేసి వీరందరు ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వెళ్లడించాలి.అలాగే విషయంక్రొత్తగా చేర్చని మొలకలనుకూడా తొలగించాలి.మొలకలు ప్రారంభమైయ్యాకా మూడు సంవత్సరా లవరకు ఎటువంటి మార్పులేని వాటిని తొలగించాలి.ఏకవాక్య వ్యాసాలను నిరోధించాలి.ఒకే విషయంపై రెండువ్యాసాలున్నచో,ఎక్కువ విషయమున్నదానిలో రెండో వ్యాసము విలీనంచెయ్యాలి.విలీనంచెయ్యునప్పుడు, విలీనంచెయ్యువ్యాసంలోని వ్యాసకరలదిద్దుబాట్ల చరిత్రను కూడా తరలించాలి.వ్యాసంలో ఎలా తమపేరుండదు,కనీసంవ్యాసచరిత్రలో నన్న పేరుండలికదా. ఈ విషయమై మిగతా సభ్యులుకూడా స్పందిస్తారనే విశ్వాసంతోపాలగిరి (చర్చ) 05:11, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


ఏక వాక్య వ్యాసాలు అత్యధికంగా చోటు చేసుకోవడం వికీనాణ్యతను తగ్గింస్తున్నది వాస్తవం. రాశి కంటే వాసి ముఖ్యం. ఈ వ్యాసాలలో ఏదో ఉందని భావించి వాటిని చదవాలని అనికున్న వారికి అది తప్పక నిరాశను కలిగిస్తుంది. ఆంధ్ర ప్రదేశం లోని గ్రామాలను ప్రాజెక్ట్ కార్యక్రమంగా చేపట్తి వాటిని పూర్తి చేసారు. ఈ కృషిలో చదువరి గారూ, వైజా సత్య గారూ, కాసు బాబు గారూ విశేష కృషి చేసారు. వారి కృషి అభినందనీయం. చిరకాలం గుర్తించుకోవలసిన విషయం. ఇది మన గురించి మన గ్రామాల మనం తెలుసుకోవలసినది కనుక ఈ ప్రాజెక్ట్ తెవికీకి చాలా అవసరం. కానీ అన్ని గ్రామాల గురించి ఎవరూ వ్రాసి పూర్తి చేయలేరు కనుక అవి అసంపూర్తిగా మిగిలి పోయాయి. వాటిని పూర్తిగా వ్రాయలేక పోయినా వాటిని ఎప్పటికీ అలా ఉంచి వాటిని అభివృద్ధి చేయాలి. భవిష్యత్తులో ఐ పని జరగవచ్చు. అప్పుడు తెవికీ సభ్యుల సంఖ్య తక్కువ కనుక వాటిని అభివృద్ధి చేయడం వీలు పడలేదు కాని ఇప్పుడు సభ్యులకు తగిన ప్రోత్సాహం కలిగించి వాటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. మిగిలిన మొలక లలో విషయం లేనప్పుడు వాటిని తొలగించ వచ్చు. ఒకప్పుడు వాటిని తొలగిస్తూ వచ్చారు ఇప్పుడు ఆ పని కొంత వెనుకబడింది. ఒకప్పుదు దీని గురించి కొంత చర్చ జరిగింది. సభ్యులలో అనేక మంది వాటిని తొలగించలన్న అభిప్రాయం కనబరచారు. కొంత పని కూడా జరిగింది. మొలకలను సృష్టించకుండా ఉండడం మంచిది. సభ్యులకు తెలియజేసినా

కొంత మంది వాట్ని లక్ష్యపెట్తడం లేదు.

  • వికీపీడియాలో అందరూ స్వచ్చం సేవకులే కాని ఎవరూ ఎవరిని నియంత్రించ లేరు. నిర్వహకత్వం, అధికారి కూడా భాద్యాతా యుతమైనదే కాని అధికారయుతమైనది కాదు. ఈ పదవులు తోటి సభ్యులకు సహకరించ తగినవే కాని నియంత్రించ తగినవి కాదు. అలా నియంత్రించడనికి ప్రయత్నించి ధిక్కారానికి గురి కావడం మాత్రమే జరుగుతూ ఉంది.
  • కనుక సభ్యులు ఎవరికి వారు మొలకలను సృష్టించడం తగ్గించండి. అతి పెద్ద వ్యాసాలను మాత్రమే వ్రాయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ వ్రాయతగిన విసహాయంతో వ్యాసాన్ని ప్రారంభించి కనీసం చిన్న వ్యాసంగానైనా వ్రాయడం మంచిది. తరువాత ఆసక్తి ఉన్న సభ్యులు వాటిని అభివృద్ధి చేస్తారు. ఇది చురుకైన సభ్యులు కనీస బాధ్యతగా స్వీకరిస్తాం.
  • ఎవరో అభివృద్ధి చేస్తారన్న దృష్టితో వ్యాసాలను సృష్టించడం తగ్గించి విష య ప్రాధాన్యం ఉన్న వ్యాసాలను వ్రాయడం ప్రారంభిస్తాం.
  • కొత్త సభ్యులు అవగాహనా లోపంతో వ్రాసిన ఏక వాక్య వ్యాసాలను తొలగించడం మీద దృష్టి సారిస్తాం.

--t.sujatha (చర్చ) 05:22, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ అభివృద్ధికి అందరూ సోదర సభ్యులందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. సంతు గారు సందేహాలను అర్జున గారు నివృత్తి చేశారు. కాని ఏక వాక్య వ్యాసాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలి. నేను ఏకవాక్య వ్యాసాలకు వ్యతిరేకిని. గ్రామ వ్యాసాలలో విషయం తెలియక పోవచ్చు కనుక ఏకవాక్య వ్యాసాలు సృష్టించడంలో తప్పులేదని నా అభిప్రాయం. విషయ ప్రాధాన్యత గల వ్యాసాలకు అంతర్జాలంలో ఎన్నో రిఫరెన్సులు ఉన్నప్పుడు వాటికి ఏక వాక్య వ్యాసాలు అవసరం లేదని నా అభిప్రాయం. సోదర సభ్యులు అటువంటి వ్యాసాలు రాసే ఉద్దేశ్యం ఉన్నపుడు en.wikipedia లో గల వ్యాసాలను అనువాదం చేసుకోవచ్చు. కాని విషయ జ్ఞానం లేనపుడు ఆ వ్యాసాల జోలికి పోవడం మంచిది కాదు. సోదర సభ్యులు మొలకలను విపరీతంగా సృష్టిస్తున్నారు. కాని ఎన్ని రోజులైనా వాటిని విస్తరించడం పై ధృష్టి పెట్టడం లేదు. కొత్త వ్యాసాలపై దృష్టి పెట్టి ఎవరో పూర్తి చేస్తారులే అనే భావనతో ఉన్నారు. విస్తరించలవవి కానివాటికి ఫరవాలేదు. విస్తరించేందుకు వనరులున్నప్పటికీ విపరీతంగా మొలకలను పెంచుతున్నారు. దీనిని మనమందరం వ్యతిరేకించవలసి యున్నది. ఇది ఒక జాఢ్యంగా తయారై కొత్తగా వచ్చిన వారికి కూడా ఎలా వ్యాసం రాయాలో తెలియడం లేదు. నేను వ్యాసాలను ప్రారంభించే కొత్తలో రాజశేఖర్ గారు మంచి ప్రోత్సాహం యిచ్చారు. పాలగిరి వంటి వారు వ్యాస నాణ్యతకు అనేక సలహాలనిచ్చారు. సోదర సబ్యులు చర్చా పేజీలో లోపాలను రాసినప్పటికీ స్పందిచడంలేదు. అలానే నిర్వాహకులు కూడా ఏకవాక్య వ్యాసాల నిర్మూలనపై దృష్టి సారించాలి. కొత్త వ్యాసాలు ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం తెవికీ ఉపయోగించే వారికి విషయం తెలియనప్పుడు. ఈ విషయంలో పాలగిరి వాదనతో ఏకీభవిస్తాను. మొలకలను నిరోధిద్దాం! తెవికీ అభివృద్ధికి పాటుపడుదాం!( కె.వి.రమణ- చర్చ 05:58, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
నియమాలలో ఏకరూపత లేకపోతే ఒకదానికి మినహాయింపు ఇచ్చినప్పుడు ఇంకొకదానికిఎందుకివ్వకూడదు అనే వాదన వస్తుంది. మొలకలని పరిశీలిస్తే గ్రామాలకే కాక, సినిమాలు, పుస్తకాలు, వ్యక్తులు లాంటి వాటికి కూడా చాలా మొలకలు కనబడతాయి. గ్రామాల మొలకలు బాట్ లో చేసినవి పదులవేలల్లో వుంటాయి కాబట్టి వాటిని సంస్కరించాలంటే మనకు మరల బాట్ కావాలి. సాంకేతిక సభ్యులు క్రియాశీలంగా లేనందున వాటిని సంస్కరించటం వెంటనే చేయలేకపోవచ్చు. అందుకని మొలక వ్యాసాలు చేర్చేవారు మొలక మూస చేర్చాలని , దానికి నెలరోజులలోగా(ఉదాహరణగా) విస్తరణ జరగకపోతే ఆ మొలక వ్యాసం తొలగించబడుతుందని, అలా తొలగించిన వ్యాసాలు మరల సృష్టించేటప్పుడు కనీస పరిమాణం వ్యాసంగా వుండాలని నియమం పెడితే ఎలావుంటుందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.--అర్జున (చర్చ) 07:10, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకప్పుడు నేను చాలా ఏకవాక్య వ్యాసాలను వ్రాసినవాడిని; చాలా మంది సభ్యులు అభ్యంతరం చెప్పడం వలన వాటిని ఆపివేశాను. నేను తయారుచేసిన ఏకవాక్య వ్యాసాలు కొన్ని వేలల్లో ఉంటాయి. అవి మొలకలుగా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. వాడుకరులు ఇలాంటి వ్యాసాలు తయారుచేయడం ఆపాలని అనుకుంటే తప్ప వీటి నియంత్రణ కష్టం. కొన్నిటిని ఆయా శాఖల్లో నైపుణ్యం ఉన్నవారు అభివృద్ధి చేయవచ్చును. ప్రస్తుతం నేను ఏకవాక్య వ్యాసలను వ్యతిరేకిని. మంచి చర్చలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 08:14, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది ఇప్పటి సమస్య కాదు అని కొందరు చెప్పారు. వికీలో ప్రవేశించిన మొదట్లో చాలామంది సభ్యులు కేవలం ఎక్కువ చిన్న మార్పులు చేయడం ద్వారా, ఎక్కువ వ్యాసాలను ప్రారంభించడం ద్వారా, ఎక్కువ బొమ్మలు అప్లోడ్ చేయదం ద్వారా ఇలా పలురకాలుగా గుర్తింపు పొందాలనుకోవడం చూసాను. కొందరు ఒక వ్యాసాన్ని ప్రారంబిస్తే దానిని రెండు మూడు సార్లుగా పూర్తి చేసేసేవారు. వ్యాసం మొత్తం అలా పూర్తిచేసిన వారికంటే, చిన్నా చితకా మార్పులు చేసిన వారికి ఎక్కువ గుర్తింపు కలిగి వారికి అత్యధిక మార్పులు చేసిన వారిగా పతకాలు పెడుతుండేవారు. తద్వారా రాసి కంటే వాసి ముఖ్యం కాదూఅని, వ్యాసాల అభివృద్ది కంటే ఎక్కువ వ్యాసాల సృష్టి, మార్పుల ద్వారా గుర్తింపు కలుగుతుందని చాలామంది సభ్యులకు తెలిసేలా చేసినది మనమే (పాత సభ్యులు లేదా ఎక్కువగా క్రియాశీలకంగా ఉండే సభ్యులు లాంటివారు) ఇపుడు సమస్య తెలిసింది కనుక వాదనల జోలికెళ్ళకుండా, ఎవరు అభ్యంతర పెట్టినా ఆగకుండా మరీ ధారుణంగా ఉండే వ్యాసాలను తొలగించాలి. వాటిని నిజాయితీగా గుర్తించి తొలగించేవారు ఎవరు అనేది సభ్యులు నిర్ణయించుకొని వారికి ఆభాధ్యత అప్పగిస్తే కొంత స్పష్టత ఏర్పడుతుంది...విశ్వనాధ్ (చర్చ) 14:28, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాథ్ గారు చెప్పినట్లు అధిక మార్పులు చేసే వారికి ప్రాధాన్యత నిచ్చేకన్నా వ్యాసాల వృద్ధి పట్ల శ్రద్ధ కనబరిచే వారికి ప్రాధాన్యత నిస్తే మరికొంత మంది వ్యాస విస్తరణ పై దృష్టి పెడతారు. వ్యాసాల సంఖ్య మరియు అందులో చేర్చిన విషయం యొక్క బైట్లు యొక్క నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని ప్రోత్సాహకాలు అయిన పతకాలు ఇస్తె వ్యాస విస్తరణ పట్ల శ్రద్ద కలుగుతుందని నా అభిప్రాయం. ఒక సభ్యుడు 20 వ్యాసాలు లో 100 బైట్లు మాత్రమే చేరిస్తే అతని వ్యాస:విషయ నిష్పత్తి 1:5 అవుతుంది. వేరొక సభ్యుడు 2 వ్యాసాలలో 500 బైట్లు చేరిస్తే అతని వ్యాస,విషయ నిష్పత్తి 1:250 అవుతుంది. మొదటి సభ్యుని ఏవరేజ్ 5బైట్లు/వ్యాసం , రెండవ సభ్యుని ఏవరేస్ 250 బైట్లు/వ్యాసం అవుతుంది. ఈ విధంగా చేస్తే విషయాన్ని విస్తరించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.( కె.వి.రమణ- చర్చ 06:18, 26 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
రకరకాల పరామితుల అధారంగా గుర్తింపు ఇవ్వవచ్చు. అయితే అవి నేరుగా నివేదికలలోవుండనివైతే వాటిని గుణించడానికి సమయం కావాలి. సాధారణంగా సభ్యులు వ్యాసాల నాణ్యతను పెంచే వుద్దేశ్యంతో పనిచేస్తున్నారు కాబట్టి సులభమైన పరామితులనే వాడుతున్నాము.--అర్జున (చర్చ) 03:44, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ప్రారంభించిన వ్యాసాల నాణ్యత పెంపుదల బాధ్యత నుండి తప్పుకోను, వాటి నాణ్యత పెంచుతాను. నేను ప్రారంభించిన వ్యాసాల నాణ్యత పెంచిన వారికి ధన్యవాదాలు. ఏ శాస్త్రాల మీద నాకు పుస్తక అనుభవం లేదు, అనుభవించినవి, నచ్చినవి అనుభవించి వ్యాసాలు వ్రాసున్నాను. ఇటీవల పుస్తక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ వాటిలోని సమాచారాన్ని కూడా వ్రాస్తున్నాను. అవసరమయినవి, నేను విస్తరించగలిగినవే మాత్రమే వ్రాసాను, అందువలన నేను ప్రారంభించిన ప్రతి వ్యాసాన్ని అవసరమమయిన మేరకు విస్తరించగలను. రాజశేఖర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో నక్షత్రవనం వ్యాసం అభివృద్ధి పరుస్తున్నాను. సుజాత గారు నాపై పెట్టిన బాధ్యత లాగా పనిచేస్తున్నాను. తెలుగు వికీపీడియాలో పతకాలు పొందిన ప్రతి ఒక్కరి మీద అభిమానం పెంచుకున్నాను. ప్రతి అభినందనను, విమర్శను నా వ్యాసాల నాణ్యత పెంచుకోవడానికి ఉపయోగించుకున్నాను. సందర్భాన్ని బట్టి కొత్త వ్యాసాలు మొదలు పెట్టినను సోము గారు కోరినట్లుగా నేను ప్రారంభించిన ప్రతి వ్యాసాన్ని మొలక స్థాయి నుండి మొక్క స్థాయికి విస్తరించగలను. మీ YVSREDDY (చర్చ) 05:45, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుతం మీరు వ్రాసిన ఏకవాక్య వ్యాసాల నాణ్యత పెంచెటంతవరకైన క్రొత్తగా ఏకవాక్యవ్యాసాలను ప్రారంభించకండి.ముందు వాటిని మెరుగు పరచండి,ఆతరువాత కొత్తవ్యాసాలగురించి ఆలోచించండి.పాలగిరి (చర్చ) 07:02, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
(తే.27.01.2013ది. ఉదయం పాలగిరి గారి వ్యాఖ్య(YVSREDDY చర్చా పేజీ నుండి-రెడ్డి గారి వ్యాసముల గురించి)
మీప్రవర్తన పై గాటుగా రచ్చబండలో జర్చజరిగి,ఏకవ్యాక్య వ్యాసాలను విరోధించాలని చర్చలో పాల్గొన్న అందరు అన్నప్పటికి మీ ప్రవర్తనలో మార్పు రాలేదు.నిన్న జర్నలిజం అంటూ వ్యాసం 4 వాక్యాలతో ప్రారంభించారు.దాన్ని పూర్తిచెయ్యకముందే జెండా అంటూ మరో 4వాక్యాలతో మరోవ్యాసం మొదలైనది.ముందు జర్నలిజం వ్యాసాన్ని ముగించండి,ఆతరువాత రెండోది మొదలెట్టండి.తెవికీ లో పలానా రోజు లోపుగా వ్యాసాలు చేర్చండి అంటూ నింబంధనేది లేదు.ఒకవ్యాసానికి సంబంధించి తగినంతసమాచారము సేకరించిన తరువాతనే వ్యాసం మొదలెట్టండి.విజ్ఞతతో ఆలోచించండి.నాకుతెలినంతవరకు మీరు అనుసరిస్తున్న విధానం సరియైనదికాది. ఏమిచేసిన చిరంజీవి (ఆంజనేయస్వామి)........ అనే నానుడిని సార్ధకం చెయ్యకండి. వికీ సభ్యులెవ్వరు మీశత్రువులుకాదు.ఒకరిమొఖాలొకరికి తెయయదు.ఇంతమంది సలహా లిస్స్తున్నారంటే మీ వ్యాసాలలో విషయంలేకపోవడమే.మీరు విషయాన్ని అనుభవిస్తూ వ్రాసున్నానని సమాధానమిచ్చారు.ముందు విషయాన్నిఅనుభవించండి,ఆకలింపుచేసుకోండి.అప్పుడు తగినంత సమాచారాన్ని సమీకరించుకొని వ్యాసంవ్రాయండి.దయచేసి ఎదుటివారుచెప్పిందినేనుఎందుకు వినాలనే ఆహంభావంతో తెవికీని చలకనచెయ్యకండి.మీరు స్వంతంగా ఒక బ్లాగు తయారుచేసుకొని అందులో మీమనస్సుకు నచ్చినట్లుగా వ్రాసుకోండి.ఎవ్వరికి అభ్యంతరం వుండదు.నచ్చినవాళ్ళుచదివితే చదువుతారు.లేదంటే లేదు.తెవికీని లక్షలాది తెలుగువారికి ఉపయోగపడాలనే సదుద్దేశ్యంలో పనిఛేస్తున్నది. మీఅర్థంపర్థంలేని చర్యలతో చులకనకాకండి.భాస్కరనాయుడుగారు,రమణగారు,శ్రీ సుజాతగారు,విశ్వనాథ్ లాంటివారు ఏలావ్యాసాలురాస్తున్నారో చూడండి.మీరు మళ్ళి ఆలోచించండి.వికీలో ఏకాకిగా మిగలకండి. అందరితో కలసి పనిచెయ్యండి.(పాలగిరి 01:26, 27 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

(తే.27.01.2013ది. ఉదయం సోమేశ్ గారి వ్యాఖ్య(YVSREDDY చర్చా పేజీ నుండి-రెడ్డి గారి వ్యాసముల గురించి)
మీరు మీ వ్యాసాలను పేక ముక్కల భవంతిగా నా చర్చా పేజి లో పోల్చారు. వాటిని శాశ్వత గృహంగా చేస్తామనడం సంతోషించదగ్గ విషయం. మీరు విపరీతంగా తయారుచేసే మొలకలను మీరే మొక్కలయ్యే వరకైనా పెంచాలి. మీరు తయారుచేసిన మొలకలను ఎవరో విస్తరించాలని కోరుకుని మొలకల సంఖ్య పెంచడం మీ తప్పు. మీ వ్యాసాలు విస్తరించలేని గొప్ప వ్యాసాలు కాదు. మీ రోజుకు ఒక వ్యాసం వ్రాసినా అది పూర్తి చేయండి. అంతే గాని ఒక వాక్యం వ్రాసి మొలక మూసలు, విస్తరణ మూసలు, అనువాదం మూసలు, దారిమార్పులు, విలీనం మూసలు ఉంచడం సబబుగా లేదు. అనవసర వర్గాలు, పనికిరాని మూసలు చేస్తూ తెవికీ నాణ్యతా ప్రమాణాలు దిగజారుస్తున్నారు. ఒక వాక్యం కనిపిస్తే అందులో ప్రతి పదానికి విచక్షణాజ్ఞానం లేకుండా వ్యాసాలు మొదలు పెట్టడం భావ్యమా! (Somu.balla (చర్చ) 01:13, 27 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

రెడ్డిగారూ,
మీకు అనుభవం లేని వ్యాసాల జోలికి పోయేకన్నా మీకు అనుభవం ఉన్న రంగంలో వ్యాసాలు మొదలుపెట్టి వాటిని విస్తరించవచ్చు కదా. ఎన్ని వ్యాసాలు మొదలు పెట్టామని కాదు. ఎన్ని పూర్తిచేశామన్నదే గొప్పతనం. ఈ విషయం మీరు గ్రహించాలి. ఒక కార్యక్రమం మొదలు పెట్టే వాని కన్నా దానిని నిర్విఘ్నంగా పూర్తి చేసే వాడే ఘనుడు. మీ వ్యాసాలను విస్తరించండి.( కె.వి.రమణ- చర్చ 07:16, 26 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
'ఫలానా ఊరు ఫలానా జిల్లాలో ఉంద'ని రాస్తే చాలు... అది ఒక వ్యాసం....!
'ఫలానా కూర తినడానికి ఉపయోగిస్తార'ని రాస్తే చాలు... అది ఒక వ్యాసం....!
'ఫలానా చెట్టుకు ఫలానా పువ్వులు పూస్తా'యని రాస్తే చాలు... అది ఒక వ్యాసం...!
దీనికి తోడు 'ఆ మొక్క, ఆ చెట్టు, ఆ కొమ్మ, ఆ ఆకు, ఆ కాయ..... ' ఫోటోలుపెడుతూ, ఆ ఫోటోలలో వ్యాసకర్త కూడా చొరబడటం ఖచ్చితంగా ఇబ్బందే ...! తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ, తెలుగు సంప్రదాయానికీ, వ్యాసాలలోని విషయ సారాంశ ఖచ్చితత్వానికీ నిబద్ధతగా... కొలమానంగా... మేము (చాలా పత్రికలు) వార్తలు, వ్యాసాలూ రాసేటప్పుడు తెవికీలో వచ్చిన సారాంశాన్నే పరిగణన లోకి తీసుకుంటూ ఉంటాం...! తెవికీ అంటే మాకు అంత నమ్మకం...! (ఇంతకు ముందు తెవికీని అభివృద్ధి చేసినవారు అంత కృషి చేసారు. వారందరికీ కృతజ్ఞతలు. వారి కృషిని ఇప్పటికీ కొనసాగిస్తున్న నేటి తరం నిర్వాహకులకూ కృతజ్ఞతలు.) చాలా సార్లు వ్యాసాల వివరణ కోసం..., మరింత అదనపు సమాచారం కోసం... తెవికీలో పరిశీలిస్తే ఏకవాక్యంతో వ్యాసం ప్రత్యక్షమవుతుంది... ఇష్టంగా తింటున్న ఉప్మాలో కరగకుండా మిగిలిపోయిన ఉప్ప రాయిలా...! --- ఇందుకు పరిష్కారం ఏమిటంటే... ఏకవాక్య వ్యాసాలను తొలగించడం లేదా తక్షణమే అభివృద్ధి చెయ్యడం ! వ్యాసాలను అభివృద్ధి చేయగల సమాచారం వారివద్ద వుండి ఉన్నట్లయితే ఈపాటికే ఆ వ్యాసాలను అభివృద్ధి చేసి వుండేవారు. ఇంతవరకూ ఆ వ్యాసాల అభివృద్ధి జరగలేదు కాబట్టి, ఆ పూర్తి సమాచారం వారి వద్ద లేదని భావిస్తూ ఆ ఏకవాక్య వ్యాసాలను తొలగించడమే సమంజసం కాగలదు. ఇకపోతే వ్యాసాలతోబాటు చేర్చిన ఫోటోలలో వ్యాసరచయిత కూడా ఉన్నట్లయితే ఆ ఫోటోలను తొలగించడం మంచిదని నా సూచన. ఆపై విజ్ఞుల నిర్ణయం.....!........... Malladi kameswara rao (చర్చ) 07:32, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యా, అటువంటి చిత్రాలు, లేదా వ్యాసాలు కనబడినప్పుడు వాటి చర్చాపేజీలో వ్యాఖ్యానించండి. నిర్వహాకులుల తగు సవరణలు చేస్తారు. — వీవెన్ (చర్చ) 17:52, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తగా ఏకవాక్య వ్యాసాలను సృష్టించడం తగ్గించుకుందాం. మొలకలు ఒక విధంగా కొత్తవారికి వ్యాసాలను రాయమనే ఆహ్వానం కూడా. అయితే, ఇప్పటి వరకూ ఉన్న ఏకవాక్య వ్యాసాల విషయంలో (వాటిని గుత్తగా తొలగించడం కాకుండా) మనకు ఒక వ్యూహం అవసరం. విషయ ప్రాధాన్యత పరంగానో లేదా జనాలు ఎక్కువగా చూసే వ్యాసాలను గుర్తించి ముందుగా వాటిపై దృష్టి సారిస్తే మేలు. వివిధ వ్యాసాలకు ఉన్న రద్దీని తెలుసుకోడానికి ఈ జాల సేవను వాడుకోవచ్చు. జనాలు అంతగా చూడని వ్యాసాలు మొలకలుగా ఉన్నా ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేదు. ఆలా రంగాలకు సంబంధించిన వ్యక్తులు వీటి అభివృద్దికి వికీప్రాజెక్టులగా కృషి చేస్తే సరిపోతుంది. — వీవెన్ (చర్చ) 17:52, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వెరీ గుడ్, బాగానే చర్చ సాగుతుందే!! ముందుగా ఏకవాక్య వ్యాసాలను వ్యతిరేకించే వాళ్లకి - నేనూ మీవైపే. కానీ అది "మన" స్వంత అభిప్రాయంగా గుర్తించక తప్పదు. ఒక వేళ మనం అలాంటి వ్యాసాల్ని తొలగిద్దామనుకొండి, ఎప్పుడు తొలగించాలి? సృష్టించిన వెంటనే తొలగించాలా? కొన్నాళ్లు ఆగి, విస్తరించకపోతే తొలగించాలా? దానికి వీటిపై మనం ఒక కన్నేసి ఉంచాలి నిర్ణీత వ్యవధి తర్వాత తొలగిస్తుండాలి. దీనికంటే ముఖ్యమైన విషయం అసలు అలాంటి నిషేధం ఎందుకు విధించాలి అని ఆలోచించాలి. ఇక్కడ చేరిన సభ్యులందరూ మొదట ఇలాంటి చిన్న వ్యాసాలు వ్రాసినవారే. ఏకవాక్య వ్యాసాల వళ్ళ పెద్ద ఉపయోగం ఉండదని కొత్త సభ్యులకు నచ్చజెప్పాలి. అంతేకాని మీరు ఇంత పెద్దది వ్రాయగలిగితే ఇక్కడ వ్యాసం ప్రారంభించండి అనటం వికీపీడియా స్పిరిట్ కే వ్యతిరేకమని నా అభిప్రాయం. కొన్ని మొలకలుంటే మిగిలిన వ్యాసాలకు వచ్చిన నష్టమేవీలేదు. కొన్నేళ్ళ క్రితం ఇదే విషయం చర్చకొచ్చినప్పుడు కాసుబాబు గారు "మొలకలు ఉండడం మరీ అంత అవాంఛనీయం కాదు. ప్రస్తుతం మొలకలు అత్యధిక శాతం కావడమే మన సమస్య" అన్నారు. పెద్దాయనతో నేను ఏకీభవిస్తున్నాను. సంతోషకరమైన విషయమేవిటంటే గత మూడేళ్ళలో తెవికీలో మొలకలశాతం ఒక ఇరవై శాతం దాకా తగ్గింది. ఇక ఏకవాక్య వ్యాసాలు సృష్టించే వారికి, ప్లీజ్.....ఉన్న వ్యాసాలను విస్తరించి నాణ్యత పెంచేందుకు కృషి చేద్దాం. --వైజాసత్య (చర్చ) 06:00, 31 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వెరీ గుడ్, బాగానే చర్చ సాగుతుందే!! ముందుగా బహువాక్య (అనేక వాక్యాలు) వ్యాసాలను వ్యతిరేకించే వాళ్లకి - నేనూ మీవైపే. కానీ అది "మన" స్వంత అభిప్రాయంగా గుర్తించక తప్పదు. ఒక వేళ మనం అలాంటి వ్యాసాల్ని విడగొడదామనుకోండి. ఎప్పుడు విడగొట్టాలి, పెద్ద వ్యాసాలు మరీ పెద్దవిగా అయినప్పుడా, విడి విడిగా రాయనప్పుడా, రాసే వారికి సూచన లిద్దాము, వాటిని విడి విడిగా రాయటం వలన కలిగే ప్రయోజనాలను అతనికి తెలియజేద్దాం, ఒక పెద్ద వ్యాసంలో అనేక విశేషాలను రాసి ఒకే చోట ఉంచడం కంటే వాటిని ఎవరు ఏ సమాచారం కోసం వెతుకుతున్నారో ఆ పేరుతో పేజీలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న సమాచారాన్ని తెలుసుకునేలా రాయమని సలహా ఇద్దాం, కలగూరగంపలో లాగా ఏ కాయ ఏ మూలలో ఉందో తెలియనట్లుగా ఏ కార్తెలో ఏ పంటలు వేయాలో తెలుసుకుందామని వచ్చిన అతనికి ఆ కార్తె వెతకడానికి పట్టే సమయాభావాన్ని అతని తెలియజేద్దాం, అప్పటికి వినకుండా తన పని తాను చేసుకుంటూ పోతే వికిపీడీయా విధి విధానాల ప్రకారం ఆ వ్యాసాన్ని చర్చించి విడగొట్టే పనిని మనమే తీసుకుందాం. సంతోషకరమైన విషయమేవిటంటే ఇటీవల కాలంలో చెట్టు వేరు వ్యాసంగా వాటి నుంచి లభించే నూనెలు వేరు వేరు వ్యాసాలుగా వస్తున్నాయి. ఇక బహువాక్య (అనేక వాక్యాలు) వ్యాసాలు సృష్టించే వారికి, ప్లీజ్.....వ్యాసాలను విడి విడిగా విడగొట్టి అవసరమయిన చిత్రాలను ఉంచి బ్రౌజర్ వేగం పెంచేందుకు కృషి చేద్దాం. వై.వి.యస్.రెడ్డి (చర్చ) 19:41, 31 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం రెడ్డిగారూ, ఒక కథకు, నాటకానికి, కరపత్రానికి, న్యూస్ ఐటంకి, మాగజిన్ ఆర్టికల్కి విభిన్న శైలులున్నట్టే వికీపీడియాలోని వ్యాసాలకు కూడా ఒక శైలి ఉంటుంది. వికీపీడియాలో ఎలాంటి సమాచారం ఉండాలి, ఎలాంటిది అనవసరం అన్న విషయాలపై కూలంకషమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కేవలం ఒక పదాన్ని ఒక వాక్యంలో నిర్వచించడానికైతే వికీపీడియా వ్యాసం అవసరం లేదు. అలాంటి వాటికోసమే విక్షనరీ ఉంది. WP:NOT అనే మార్గదర్శకపు పేజీని చదవగలరు. వికీపీడియాలో సమస్తమైన పంటలు, మొక్కలు, చెట్ల గురించి సమాచారమున్నా వ్యవసాయ మార్గదర్శిని కాదు. అలాగే అన్ని ప్రదేశాల గురించి సమాచారమున్నా టూరు గైడు కాదు, ట్రావెలాగూ అంతకన్నా కాదు. --వైజాసత్య (చర్చ) 03:26, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో సమస్తమైన పంటలు, మొక్కలు, చెట్ల గురించి సమాచారముతో పాటు రైతులకు వ్యవసాయ మార్గదర్శినిగా కూడా ఉపయోగపడుతుందని YVSREDDY గారు తెలియజేయడంలో తప్పు ఏముంది. వై.వి.యస్.రెడ్డి (చర్చ) 23:41, 1 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మార్గదర్శకమ్ముగా ఉపయోగమ్ము పడుతుండవచ్చుగాని మార్గదర్శి కానేరదు ~ ~ ~ ~
మీరలా సూచించడంలో తప్పేమీ లేదు. ఏ ఒక్క వెబ్సైటు అందరికీ అన్నీ అవలేదు. వికీపీడియా దేన్నీ రెకమెండ్ చెయ్యలేదు. అందుకే అది వ్యవసాయ మార్గదర్శని, ట్రావెల్ గైడు, కెరీర్ కౌంసిలింగ్ వెబ్‍సైటు తదితర పాత్రలను పోషించలేదు. ఎందుకు రెకమెండ్ చెయ్యలేదు అని మీరు అడిగితే దానికి కొన్ని మంచి హేతువులున్నాయి. అందులో మొదటిది వికీపీడియా యొక్క తటస్థ ధృక్కోణానికి కట్టుబడి ఉండాలనే మూల నియమానికి ఉల్లంఘణ. ప్రతి సంస్థకు కొన్ని నిమయ నిబంధనలున్నట్టే అది వికీపీడియా నిర్ణయం. ఈ పైన వ్రాసిన అజ్ఞాత సభ్యుడు చెప్పినట్టు వికీపీడియా రైతులకు మార్గదర్శినిగా ఉపయోగపడితే సంతోషం. కానీ మార్గదర్శిని కావటం వికీపీడియా ఉద్దేశం కాదు. అందుకు అన్నదాత ఉంది కదండి. మీ వ్యక్తిగత లక్ష్యం రైతులకు మార్గదర్శనిగా ఉపయోగపడే వెబ్‍సైటు తయారుచెయ్యటమే అయితే మీరు వికీపీడియాలోని విషయాలన్నీ ఉపయోగించుకుని బేషుగ్గా ఒక మార్గదర్శిని వ్రాయవచ్చు. ఇందులోని కంటెంట్ వాడుకోవటానికి వికీపీడియాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. కేవలం విషయం వికీపీడియా నుంచి తీసుకున్నారని వ్రాస్తే చాలు. మాది రైతు కుటుంబం. నేను చదివిందీ వృక్షశాస్త్రమే. మీరలాంటి వెబ్‍సైటు తయారుచేస్తే నేను తప్పకుండా సంతోషిస్తాను --వైజాసత్య (చర్చ) 03:45, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
12 మంది పైగా చర్చలో పాల్గొనితమ అభిప్రాయాలను తెలియచేసినందులకు అందరికి ధన్యవాదాలు. నాకు అనిపించిన సారాంశం ఏమిటంటే, తెవికీకి కొత్తగా చేరేవారు మొలక వ్యాసాలు రాయటం సర్వసాధారణం. తెవికీలో అనుభవం గడించినతరువాతకూడా మొలక వ్యాసాలు సృష్టించటం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని మొలక వ్యాసాలు రాయటం మంచిది కాదు. అందరి అభిప్రాయాలు తెలిపినతర్వాత ఏ ఒక్కరు కూడా అ వుద్దేశ్యంతో పనిచేయడంలేదని స్పష్టమవుతున్నది. అందువలన తదుపరి చర్యలు గురించి ఈ ప్రతిపాదన చేస్తున్నాను. దీనిలో మార్పుల కొరకు ఒక వారం వేచి వుండి ఆ తరువాత ఓటింగు జరుపుదాం.

ప్రతిపాదన

"తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలను, ప్రారంభించిన నెలరోజులలోగా అవి కనీస స్థాయికి (మూసలు వికీ కోడ్లు లాంటివి లెక్కపెట్టకుండా 200బైట్ల పరిమాణం మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని తొలగించవలెను."--అర్జున (చర్చ) 09:23, 7 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావుగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇది సభ్యులందరికీ ఆమోదయోగ్యమొనదీ ఆచరణయోగ్యమైనది. మొలకలను తగ్గించడానికి ఉపకరించే ఐ ప్రతిపాదనకు నేను ఆమోదం తెలియజేస్తున్నాను.--t.sujatha (చర్చ) 03:47, 8 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిజంగా చాలా మంచి ప్రతిపాదన. అలాగే- ఇప్పటి వరకూ ప్రారంభించి, ఏక.. అర.. పావు.. వాక్యాలతో అసంపూర్తిగా వదిలేసిన వ్యాసాలను కనీస స్థాయికి (అర్జునరావు గారు ప్రతిపాదించినట్లుగా - మూసలు వికీ కోడ్లు లాంటివి లెక్కపెట్టకుండా 200బైట్ల పరిమాణం మరియు కనీసం ఒక అంతర్గత లింకు) పెంచకుండా కొత్తవ్యాసాల సృష్టి తగదని స్పష్టం చేస్తూ, అందుకోసం ఖచ్చితమైన నిబంధన ఏర్పాటు చేస్తే బావుంటుందేమో.... పరిశీలించగలరు. ....Malladi kameswara rao (చర్చ)

తొలగింపు నిర్వాహక బాధ్యతలు చురుకుగా జరిగితే విస్తరించబడని మొలక వ్యాసాలు కాలపరిమితి దాటగానే తొలగించబడతాయి కాబట్టి నిబంధనలు మరింత జఠిలం చేయడం అంతమంచిదికాదనకుంటాను. పరిమాణం పరిశీలించితే తెలుగులో ప్రతిఅక్షరానికి మూడుబైట్లు కావాలి. అందువలన 200బైట్లు ఒక చిన్న వాక్యంతోనే సరిపోతాయి. అందుకని సాధారణంగా వ్యాసానికి మూడు పేరాలు మరియు పేరాకు మూడు వాక్యాలు చొప్పున మొత్తం 9 వాక్యాలకి 1800బైట్లు కావాలి. దగ్గరి సంఖ్యగా పరిమితి 2000 బైట్లుగా నిర్ణయించితే మెరుగు. --అర్జున (చర్చ) 11:47, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావుగారూ ! పరిమితి ఎంత అన్నది మీరు నిర్ణయించండి. --t.sujatha (చర్చ) 14:33, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కొందరు వ్యాస విషయం లేకుండా చిత్రాలతోనే వ్యాసం వ్రాస్తున్నారు. కనుక 2000 బైట్లలో చిత్రాలు,మూసలు,వికీకోడ్లు మినహాయిస్తే బాగుంటుంది.( కె.వి.రమణ- చర్చ 14:57, 9 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
కోడ్లు మినహాయింపు ప్రతిపాదనలో వుంది. ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానమన్న సూత్రమందరికి ఆమోదయోగ్యంకాబట్టి కాబట్టి చిత్రం వుంటే పరిమాణం లో ఒక వెయ్యి బైట్లు మినహాయింపు ఇవ్వవచ్చు అని నా ఆలోచన. --అర్జున (చర్చ) 01:29, 12 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
2000 బైట్లలో చిత్రానికి 1000 బైట్లు పోతే మిగిలిన 1000 బైట్లకు 5 లేక 6 వాక్యాలు మాత్రమే వస్తాయి. అందువల్ల పరిమితి పెంచండి.223.177.58.78 03:10, 12 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
2కెబిలకు (గ్రామ వ్యాసాలకు మాత్రం మినహాయింపు ఇస్తూ) మించిన సమాచారంతో వ్యాసాలు సృష్టించాలనే చర్చ ఎప్పుడో జరిగింది. 106.66.55.100 12:03, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
దయచేసి మీలాంటి అనుభవజ్ఞులు వాటి లింకులు తెలిపితే వుపయోగంగా వుంటుంది. --అర్జున (చర్చ) 01:27, 14 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చిన్న పేజీల తొలగింపు పై యిదివరలో ఒక చర్చ జరిగింది. అందులో కాసుబాబు గారు కొన్ని ప్రతిపాదనలు చేశారు.వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత ప్రతిపాదనలు 4.అందులో "మూడు లైనులు, మూడు నెలలు" అనే ప్రతిపాదన చేశారు. దానిప్రకారం ఏక వాక్యవ్యాసాలు వృద్ధి చేయుటకు మూడునెలల పరిమితి ఇవ్వడం జరిగింది. దానిని ప్రస్తుతం ఒక నెలకు కుదించటం మంచిది. ఒక నెలలో విస్తరణ జరగనిచో ఆ వ్యాసపు పేజీలో తొలగింపు మూస ఉంచి వారంలోపులోగా తొలగించాలని సూచించడం జరిగినది.ప్రస్తుతం వ్యాస పరిమాణాన్ని పెంచటం మంచిది. వ్యాసంలో చిత్రమునకు 1000 బైట్లు పోతే మిగిలిన 1000 బైట్లతో కూడా అతి చిన్న వ్యాసమే అవుతుంది.( కె.వి.రమణ- చర్చ 04:01, 14 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
వాటికోసం వేదికేటంత సమయం నాకిప్పుడు లేదు కాని పైన రమణగారు సూచించిన లింకులో కూడా అలాంటి చర్చే జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా గ్రామవ్యాసాలు చిన్నగా ఉన్ననూ వాటికి వ్యతిరేకంగా మాట్లాడింది ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే. గ్రామవ్యాసాలను మొలక స్థాయి నుంచి దాటించడం చాలా సులభం కూడా. 106.66.47.57 16:58, 14 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతిపాదనపై చర్చలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు. నేను ఇంగ్లీషు వికీపీడియా విధానాలను, తెలుగులో ఇప్పటికి జరిగిన చర్చలను (చాలావరకు పూర్తి సమ్మతిగలవే లేక భిన్నాభిప్రాయాలున్నా వోటింగు జరపనివి) పరిశీలించాను అన్నింటికి ముఖ్యంగా ఏకాభిప్రాయం ప్రాతిపదిక ముఖ్యమని గమనించాను. వికీపీడియాలో ఏకాభిప్రాయం అంటే పూర్తి సమ్మతి కాదని గమనించండి. తెవికీ పురోగతికి విధానాల నిర్ణయంలో ఏకాభిప్రాయానికి ప్రయత్నించటం, భిన్నాభిప్రాయాలు వున్నప్పుడు వోటు ప్రక్రియద్వారా వ్యతిరేఖత ను అంచనావేసి అది తక్కువగావున్నప్పుడు ఏకాభిప్రాయం సాధించినట్లుగా అనుకొని ముందుకు పోవాలి. ఓటింగు ప్రక్రియకు మార్గదర్శకాలను మొదటి నిర్ణయించితే ఆ తరువాత ప్రతిపాదనపై ఓటింగు జరపవచ్చు. అందుకని వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి చూసి దాని చర్చాపేజీలో మీ అభిప్రాయాలు తెలపండి.

వికీమానియా 2013

2013 సంవత్సరం హాంగ్ కాంగ్ లో వికీమానియా సమావేశం కోసం అప్లికేషన్లు కోరబడుతున్నాయి. కుతూహలం ఉన్న వికీపీడియా సభ్యులు నమోదు చేసుకొనవచ్చును. వివరాలు క్రింద తెలియజేశాను.Rajasekhar1961 (చర్చ) 10:56, 23 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Scholarship applications for Wikimania 2013 in Hong Kong are being accept. The application window is one month (through 22 February).

Wikimania 2013 scholarship is an award given to an individual to enable them to attend Wikimania in Hong Kong from 7-11 August, 2013.

Two type of scholarships will be available this year. Partial scholarships will cover travel expenses to Wikimania, capped at 50% of the estimated air fare from your nearest international airport according to wm2013:Getting to Hong Kong. Full scholarships will cover round-trip travel, dorms accommodations as arranged by the Wikimania Team, and registration for Wikimania 2013.

Applicants will be rated on the following four dimensions:

  • 1. Activity within Wikimedia (on-wiki and off-wiki) - 50%
  • 2. Activity outside of Wikimedia and other free knowledge/software projects - 15%
  • 3. Interest in Wikimania and the Wikimedia movement - 25%
  • 4. Fluency of English language - 10%

To learn more about Wikimania 2013 scholarships, please visit https://wikimania2013.wikimedia.org/wiki/Scholarships To apply for a scholarship, you can fill out the application form here: https://scholarship.wikimedia.hk

If you have any question, email us at wikimania-shcolarship@wikimedia.org.

Good luck!

Simon Shek Community coordinator - Wikimania 2013 / Wikimedia Hong Kong wikimedia.hk

ధన్యవాదాలు రాజశేఖర్. 2010లో నేను ,2012లో రాజశేఖర్ వికీమేనియా మేధాఉపకారవేతనము పొంది సమావేశానికి హాజరవటం జరిగింది. ఈ సంవత్సరము కూడా తెలుగు వికీలలో పనిచేసేవారు తప్పక వికీమేనియాలో పాల్గొని తద్వారా వికీప్రపంచంలో జరుగుతున్న మార్పులను తెలుసుకొని తెవికీ అభివృద్ధికి తోడ్పడాలనికోరుతున్నాను. సందేహాలుంటే అడగండి. --అర్జున (చర్చ) 03:00, 24 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రెడ్డి గారికి వినతి

పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టెనేని బిగియపట్టవలయు
పట్టువిడుట కన్న పరగచచ్చుట మేలు
విశ్వదాభిరామ!వినురవేమ!

మీరు మీ చర్చా పేజీ లొ సభ్యుల సలహాలను నిషేధించారు. కనుక రచ్చబండ లోవ్రాయవలసి వస్తున్నందుకు చింతిస్తున్నాను.

పై పద్యంలో పట్టుపట్టరాదు(నాలా విషయం లేనపుడు వ్యాసం వ్యాయకండి) , పట్టివిడువరాదు(భాస్కరనాయుడు-పల్లెవాసుల జీవన విధానం లాగ) , పట్టెనేని బిగియపట్టవలయు(పాలగిరి గారి నూనెల వ్యాసాల లా) , పట్టువిడుట కన్న(మీ లాంటి వారి అసంపూర్తి ఏకవాక్య వ్యాసాలు వలె) .ఇలాంటి వ్యాసాలు రాసేకన్నా "పరగచచ్చుట మేలు"(రాయకుండా వుండటమే మంచిది.ఏదో పాటలో వలే "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా" ఎవరో విస్తరిస్తారని మొదలుపేట్ట రాదు.Somu.balla (చర్చ) 04:18, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక దేవాలయం నిర్మించాలంటే(వ్యాసం రాయాలనుకుంటే) స్వంత ధనమైనా లేదా చందాలతొ పొందిన ధనమైనా (స్వంత జ్ఞానం కాని,సేకరించిన విషయం గాని) ఉపయోగించి ప్రారంభించి పూర్తి చేయాలి. కాని ఏదీ లేకుండా పునాదులు తీసి (ఏక వాక్య వ్యాసాలు వ్రాసి) వదిలేస్తే అందరూ అందులో పడిపోతారు(చదివే వారు నష్టపోతారు). ఎలాగో దేవాలయం పూర్తి చేస్తే(వ్యాసం పూర్తి చేస్తే) ఇతర వనరులు(వ్యాసానికి తుది మెరుగులు)ఎవరైనా ఎవరైనా సమకూరుస్తారుఃSomu.balla (చర్చ) 05:08, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అడ్డుకొలత వ్యాసంపై సలహా కొరకు

చంద్రకాంతరావు గారికి,

డయామీటర్ అనే ఆంగ్ల వ్యాసానికి తెలుగులో అనేక పేర్లు కలవు. ఉదాహరణకు కొన్ని అడ్డుకొలత, వ్యాసరేఖ, వృత్తము మధ్య రేఖ, వ్యాసం, వృత్త వ్యాసం. అయితే డయామీటర్‍కు మూల అర్థం అడ్డుకొలత, అదే పేరు మీద నేను వ్యాసాన్ని ప్రారంభించి వ్యాసం (అడ్డుకొలత) నుంచి దారి మార్పు ఇచ్చి వ్యాసం అయోమయ నివృత్తి కూడా ఏర్పాటు చేసాను. అయితే కె.వి.రమణ గారు అడ్డుకొలత అనే పేరు సరియైనది కాదని వ్యాసము(diameter) అనే కొత్త వ్యాసాన్ని ప్రారంభించారు, దానిలో నేను వ్రాసిన విధంగానే వ్రాసి మరికొంత సమాచారాన్ని జోడించారు. అడ్డుకొలత అనే పేరు సరియైనది కాదు అని అనిపిస్తే సరియైన పేరుకు తరలించి వ్యాసము(diameter)ను విలీనం చేయవలెనని మనవి.YVSREDDY (చర్చ) 05:25, 23 డిసెంబర్ 2012 (UTC)

నేను రోడ్డు నియమాలు వ్యాసాన్ని ప్రారంభించినప్పుడు రాజశేఖర్ గారు దానిని పేజీ చరితం చెడిపోకుండా రహదారి నియమాలుకు తరలించారు. పేజీ చరితం చెడిపోకుండా పేరు మార్పు చేయగలిగినప్పుడు సరియైన పేరును సూచించి పేరు మార్చమని విన్నవించుకోవాలి గాని ఆ పేరు తప్పుగా ఉంది అని మరొక పేరుతో వ్యాసం సృష్టించడం ఏమిటి, అడ్డుకొలత పేరు సరియైనదిగా లేదని వ్యాసము(diameter) పేరుతో కె.వి.రమణ గారు కొత్తగా వ్యాసం ప్రారంభించారు, ఈ పేరు బాగా లేదని మరొకరు వ్యాస రేఖ అని ప్రారంభిస్తారు, ఈ పేరు కూడా బాగాలేదని మరొకరు మరొక వ్యాసం ప్రారంభిస్తారు, అలా ప్రారంభించవచ్చా సరైన సలహా ఇవ్వండి. మీ YVSREDDY (చర్చ) 14:06, 23 డిసెంబర్ 2012 (UTC)


అడ్డుకొలత వ్యాసానికి కె.వి.రమణ గారు సూచించిన సరియైన పేరు మార్పుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. మీ YVSREDDY (చర్చ) 15:44, 23 డిసెంబర్ 2012 (UTC)

చంద్రకాంతరావు గారికి నమస్కారములు, కొన్ని ఆంగ్ల పదములకు వేర్వేరు అర్థాలు ఉండవచ్చు. ఒక పదానికి సమానార్థం యిచ్చే పదం ఉండదు. కాని యించుమించు సమానార్థం యిచ్చె పదాలు లభిస్తాయి. ఉదాహరణకు 'bat' అనె పదమునకు రెండు అర్థాలుంటాయి. అవి 'బ్యాటు ' మరియు "గబ్బిలం" రెండు అర్థాలున్నాయని "గబ్బిలం" వ్యాసం వ్రాసేటప్పుడు మనకి నమానర్థం యిచ్చే పదాన్ని విస్తరించాలి కాని క్రికెట్ లో బ్యాట్ ను విస్తరించరాదు. అదే విధంగా cricket అనే పదమునకు "క్రికెట్"మరియు "మిడుత" అనే రెండు అర్థాలుంటాయి. మనవ్యాసమునకు సంబంధం ఉన్న అంశాన్ని తీసుకోవాలి. ప్రస్తుత విషయానికొస్తే "అడ్డు కొలత " అనే వ్యాసాన్ని రెడ్డి గారు ప్రారంభించారు. దాని సరియైన ఆంగ్ల పదం diameter అవ్వచ్చు లేదా measure of the cross section కావచ్చు. diameter అను పదమునకు రెండు అర్థాలుండవచ్చు. కాని జన సామాన్యంలో ఏ పదం ఎక్కువ వినియోగమే ఆ పేరుతో వ్యాసం వ్రాస్తే బాగుంటుంది. అందువలన వ్యాసము(diameter) పేరుతో వ్యాసం విస్తరించాను. ఇంకా విస్తరిస్తాను. తెవికీ లో వ్యాసములు తయారుచేయటం మన కొరకు కాదని రెడ్డి గారు గుర్తించాలి. సమాజం లో విధ్యార్థుల అవసరానికని గుర్తించాలి. ఎవరైనా విషయాన్ని విస్తరిస్తే ప్రోత్సహించాలి. గాని వివిధ రకాల పేర్లు పెట్టి దారి మార్పులు చేస్తూ వాడుకరులను అయోమయం లోకి నెట్టివేస్తున్నారు. అయినా తెవికీ వ్యాసాలలో మన పేరు ఉంటుందా! సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని వ్యాసాలు చేయాలి. ఆయన చేసిన వ్యాసాలు అడ్డుకొలత, వ్యాసం (అడ్డుకొలత),వ్యాసము(డయామీటరు),వ్యాసరేఖ వంటివి అనేకం ఉంచి అయోమయంలోని నెట్టివేస్తున్నారు.నేను యింకను ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేయదలచితిని. అందువలన దీనిని విలీనం చేయవద్దు. ఎవరైనా విశేషంగా వ్రాసినట్లయితే అందులో విలీనం చేయండి లేదా తొలగించండి.( కె.వి.రమణ- చర్చ 10:04, 23 డిసెంబర్ 2012 (UTC))
మీరిద్దరు పైన ఇచ్చిన విషయాలను మాత్రమే కాకుండా నేనూ రోజూ అందరి రచనలను పరిశీలనలో భాగంగా గమనించబడిన విషయాల ఆధారంగా నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే తెవికీ సంప్రదాయం ప్రకారం ఏదేని వ్యాసం మొదట ప్రారంభించినదే ఉంచి తర్వాత చేర్చిన వ్యాసాలను తొలిగించడం కాని దారిమార్పులు చేర్చడం కాని చేయడం జరుగుతుంది. చాలా వ్యాసాలు తెవికీలో ఇదివరకే ఉన్ననూ కొందరు ఆ విషయం గ్రహించక మళీ కొద్దిపేరుమార్పుతో ఇదివరకే ఉన్న వ్యాసం కన్నా పెద్దగా, నాణ్యతతో రచించిననూ తర్వాత చేర్చబడిన వ్యాస సమాచారాన్ని మొదటగా సృష్టించిన వ్యాసంలోకి విలీనం చేయడం జరుగుతుంది. 5 రోజుల క్రితం Sampathg185 అనే సభ్యుడు ఇదివరకే ఉన్న సినిమా వ్యాసాలను చివరన ...(సినిమా) పేరుతో కొత్తగా సృష్టించినాడు. పాత వ్యాసాలలోని సమాచారమే అందులో చేరి పాత వ్యాసాన్ని అతను సృష్టించిన వ్యాసానికి దారిమార్పు ఇచ్చాడు. (పాత వ్యాసానికి తరలింపు ద్వారా కొత్తపేరు ఇస్తే చరితం కూడా కొత్తవ్యాసానికి బదిలీ అవుతుంది కాని ఇలా చేయలేడు). అలా చేయడం వల్ల వ్యాసం అతనే సృష్టించినట్లు అవుతుంది. పాత వ్యాసం అభివృద్ధికి కృషిచేసినవారి పేరు కొత్తవ్యాసం చరితంలో కనిపించదు. కాబట్టి ఆ విషయం ఆ సభ్యునికి తెలియజేసి నేను అతను సృష్టించిన వ్యాసాలను తొలిగించి ఆ తర్వాత నేను కొత్తపేరుకు తరలించాను, ఇదీ పద్దతి. ఇదంతా చెప్పేది ఎందుకంటే ఎవరైననూ ఇప్పటికే ఉన్న వ్యాస సమాచారానికి పోలిన కొత్త వ్యాసం సృష్టించిననూ మొదటగా సృష్టించిన వ్యాసం మాత్రమే ఉంచబడుతుందని, అయితే వ్యాసం పేరు మాత్రం ఏదైనా ఉంచవచ్చు. ఇక మీ విషయానికి వస్తే మొదటగా YVSREDDY గారు అడ్డుకొలత పేరుతో ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పేరు నచ్చకనో మరే కారణమో కాని కె.వి.రమణ గారు వ్యాసము(diameter) పేరుతో మరో వ్యాసం ప్రారంభించారు. రమణగారు రెడ్డి గారు ప్రారంభించిన వ్యాసానికి కొత్తపేరుకు తరలింపునకు చర్చ ప్రారంభిస్తే బాగుండేది. ఏకంగా మరో వ్యాసం ప్రారంభించడం దానికీ, దీనికి కొన్ని దారిమార్పులు ఇవ్వడం కొంత అయోమయానికి దారితీసింది. చివరగా నేను చేప్పేది- రెడ్డి గారు ప్రారంభించిన వ్యాసమే ఉంచి, పేరు మాత్రం రమణ గారిది ఉంచితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మీరిద్దరికీ అంగీకారమేననుకుంటాను. ఎందుకంటే వ్యాసం చరితం ప్రకారం రెడ్డి గారు సృష్టించినట్లు, వ్యాసం పేరు రమణగారు సూచించినట్లు ఉంటుంది. ఇది ఇద్దరికీ అంగీకరమైతే నేను వెంటనే ఆ పనిచేస్తాను. లేకుంటే మాత్రం తెవికీ నియమాలు, సంప్రదాయం ప్రకారం, ఇతర సభ్యుల మెజారిటీ నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకోబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:06, 23 డిసెంబర్ 2012 (UTC)

పై సారాంశం చదివితే రమణగారు ప్రారంభించిన వ్యాసం YVSREDDY గారు ప్రారంభించిన వ్యాసంలో విలీనం అవుతుందని భావించి ఉంటారు కదూ, తప్పులో కాలేశారు.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే వికీపీడియాలో మీరొక్క కొత్త వ్యాసానికి ప్రారంభకులుగా ఉండాలనిపిస్తే అది ఏ వ్యాసమైనా, అది ఎవరు, ఎప్పుడు ప్రారంభించినా అది మీ ప్రారంభ వ్యాసంగా చేసుకోవచ్చు. ఎలా అంటారా సింపుల్ ఇదివరకే ప్రారంభించిన వ్యాసాన్ని తీసుకొని అందులోని సమాచారానికి కొద్దిగా మెరుగులు దిద్ది, కొద్దిగా పేరు మార్పుతో ఉదాహరణకు వ్యాసం(డయామీటరు) పేరుతో వ్యాసం ఉందనుకోండి, వ్యాసము(diameter) పేరుతో వ్యాసాన్ని ప్రారంభించి మెరుగులు దిద్దిన సమాచారాన్ని ఇందులో భద్రపరచండి. విలీనం ప్రతిపాదనలు వస్తే తొలగించండి. ఇక ఆ వ్యాసం మీ సొంతం. గమనిక: ఈ వ్యాసం మీ పేరుతో కొంతకాలం వరకే ఉంటుంది. ఎందుకంటే కలకాలం నిర్వాహకులు మనవారే ఉండరు కదూ....

రెడ్డిగారి వ్యాఖ్యకు సమాధానములు

YVSRగారు,

మీరు పైనచేసిన నిర్వహకులగురించి చేసిన వాఖ్య చాలా అనుచితమైనది.నిజానిజాలు తెలుసుకోకుండగా ఏకపక్షముగా,వారికి పక్షపాతదోరణిని అంటగట్టి వ్యాఖ్యానించడం సరికాదు.సభ్యులుకాని, నిర్వహకు కలుకాని ఇప్పటివరకు ఎలాంటి రాగద్వేషాలతో పనిచేస్తున్నట్లు కన్పించడంలేదు.ఇప్పుడు మీరు క్రొత్తగా నిర్వహాకులు ఎవ్వరినో వ్యక్తిగతంగా ప్రోత్యాయిస్తున్నట్లు,కొందరి పట్ల అనుచితవైఖరిగా వున్నట్లు వ్రాయడం,సరికాదు.మీరు ప్రస్తుతం మీరచనలలో జరుగుతున్న తొలగింపులను,విలీనాలను దృష్టిలో పెట్టుకొని తొందరపాటుతో భావోద్యోగాలను లోనయై ఈ వాఖ్యచేసినట్లు కన్పిస్తున్నది.వారు వ్యాసాలను మెరుగుపరచిస్థాయిపెంఛుటకు చేస్తున్న కృషిని మీరు అభినందించవలసినదిపోయి,ఇలాఅనుచితవాఖ్యలు చేసి మీపట్ల ఇతరులకువున్న గౌరవము పోగొట్టుకొనేట్టుచేసుకుంటూన్నారు.అస్తమానం ఆ అడ్దుకొలత వ్యాసాన్ని పట్టుకు వ్రేలాడే బదులు,వందల సంఖ్యలో అసంపూర్ణంగా వున్న మీప్రస్తుత వ్యాసాలను విస్తరించే పనిమొదలెట్టండి.మీరుఎంతకూ ఆపనిచెయ్యకపోబట్టేకదా ఇతరులు ఆపనిచేస్తున్నారు.మేరే మీ వ్యాసాలను సమీక్షించుకొని అనవసరమైనవి తొలగించుకుంటూ,అవసరమైన చోట విలీనాలు విస్తరణలు చేయ్యండి. అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారనే నమ్మకంతోపాలగిరి (చర్చ) 10:43, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


చంద్రకాంతరావు గారి వివరణ చదివినమీదట నాకొచ్చిన చిన్న ధర్మ సందేహం ఇది - అన్యదా భావించ వద్దని ముందుగా మనవి చేసుకుంటున్నాను. ఇక సందేహం ఏమిటంటే - ఎవరైనా ఏదయినా వ్యాసానికి ప్రారంభకులుగా వుండాలంటే 'ఒక హెడ్డింగు పెట్టి, ఒకటి లేదా రెండు మూడు లైన్లతో వ్యాసం రాస్తే సరిపోతుందా? వ్యాసాన్ని క్లుప్తంగా ఇచ్చినప్పటికీ, దానిలో కనీస సమాచారం కూడా లేకపోతే దానిని వ్యాసంగా పరిగణించ వచ్చా? వ్యాస ప్రారంభకులుగా వుండాలన్న ఆపేక్షతో "1వ వ్యాసం - అది శీర్షికతో అక్కడున్నదానిని 'అది' అంటారు. 2వ వ్యాసం - ఇది శీర్షికతో ఇక్కడున్నదానిని 'ఇది' అంటారు." .... అంటూ లైన్లు పేర్చుకుంటూ ఉంటే - వాటిని వ్యాసాలుగానూ, వారిని వ్యాస రచయితలుగానూ పరిగణించాల్సిం దేనా? అప్పుడు అందరూ లైన్ల పేర్పు పైనే శ్రద్ధ పెడతారు గానీ, వ్యాస విస్తరణపై ఎందుకు శ్రద్ధ చూపుతారు? ఒకరిద్దరు శ్రద్ధ చూపినా, ఆ వ్యాసం మరొకరి పేరుగా వుంటుందని తెలిసినప్పుడు 'కనీస సంతృప్తి' కూడా పొందలేకపోయామని బాధపడరా? అసలు ఏకవాక్య వ్యాసాల రచనలు నిర్దిష్ట కాలపరిమితి లోగా (అంటే- కేవలం 30 రోజుల సమయం మాత్రమే. నిజం చెప్పాలంటే సమగ్ర సమాచారం తెలిసినవారికి ఇది చాలా ఎక్కువ సమయం అనుకుంటాను.) సమగ్ర వ్యాసంగా అభివృద్ధి చెయ్యకపోతే అవి తొలగించబడుతుందని హెచ్చరించడం... ఆ హెచ్చరికను ఖచ్చితంగా అమలు చేసే ఖచ్చితమైన నిబంధన ఉంటే తప్ప అసమగ్ర వ్యాసాల బెడద తప్పదేమో...! ఇది కేవలం నా సూచన మాత్రమే...! పరిశీలించగలరు. ....Malladi kameswara rao (చర్చ) 10:38, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ లో వ్యాస నాణ్యత పెంచుటకు కృషి చేస్తున్న రాజశేఖర్ గారికి ధన్యవాదములు. రెడ్డి గారు రాజశేఖర్ పై అనవసమైన ఆరోపణలు చేస్తున్నట్లు తోస్తున్నది. రెడ్డి గారు మొదట అడ్డుకొలత వ్యాసం రాసారు. అందులో గణిత శాస్త్ర పమైన విషయాలు ఉన్నవి కనుక అందులో అనుభవమున్న నేను తగిన సలహాను ఇచ్చి సరిచేయమన్నాలు. దానికి రెడ్డి గారి నుండి స్పందనలేదు."వ్యాసం" అనే వ్యాసం గణిత శాస్త్రానికి సంబంధించినది మరియు essay అయినందున తెవికీ లో "వ్యాసము" అనే వ్యాసం ఉన్నందున నేను వ్యాసము (diameter) అనే వ్యాసం శాస్త్రప్రమాణాలతో విస్తరించాను. రెడ్డిగారు మరల వ్యాసం(డయామీటరు) అనే పేరుతో ఒకవ్యాసం రాసి దానిని అడ్డుకొలత కు దారిమార్పు చేశారు. మరల వ్యాసం(అడ్డుకొలత), వ్యాసరేఖ, ఛాతీ ఎత్తువద్ద, ఛాతీ ఎత్తు వద్ద అడ్డుకొలత అనే నాలుగు పేర్లతో వ్యాసాలను సృష్టించి వాటిని అడ్డుకొలత కు దారి మార్పు చేశారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. నేను ఆపై ఆ వ్యాసం గూర్చి వదిలి ఇతర భౌతిక శాస్త్ర అంశాలపై దృష్టి పెట్టాను. సోమేశ్ గారు తెవికీ ప్రక్షాలన చర్యలలో భాగంగా విలీన ప్రతిపాదనలు పెడితే వాటిపై చర్చించవలసినది పోయి వాటిని తొలగిస్తున్నారు. సోము గారు ఈ విషయాన్ని రాజశేఖర్ గారికి కూడా తెలియజేశారు. ఏకవాక్య వ్యాసాలను తొలగింపు, మరియు తెవికీ నాణ్యతను పెంచే చర్యలలో భాగంగా రాజశేఖర్ గారికి సోము గారు తెలియ జేసిన అభ్యర్థనను పరిగణనలో కి తీసుకుని వ్యాసం అనే దానికి ఇన్ని దారిమార్పులను తగ్గించడానికి వ్యాసం(గణితం) అనే వ్యాసంలో వీటన్నింటినీ విలీనం చేశారు. ఇది స్వాగతించాల్సినది పోయి నిర్వాహకులను నిందించడం రెడ్డి గారికి తగదు. తెవికీ లో ఏ ఒక్కరూ వ్యాసవిషకర్త కారు. ఒక వ్యాసం సమిష్టి కృషి అని గ్రహించాలి. రాజశేఖర్ వంటి వారు వ్యాస ప్రారంభకులు కావటానికి ఇలా చేశారనడం మంచి పద్ధతి కాదు. ఎవ్వరైనా తెవికీ అభివృద్ధికి, నాణ్యతను పెంచటానికి కృషి చేస్తే వారిని స్వాగతించాలి. రెడ్డిగారూ! మీ వ్యాసముల లో అధికంగా ఏక వాక్య వ్యాసాలే. వాటిని విస్తరించవచ్చుగదా. వ్యాసవిషయ కర్త కావాలని మీకు అనుభవం లేని వ్యాసాలను ఏక వాక్యాలుగా చేర్చి తెవికీ ప్రమాణాలను దిగజార్చడం మీకు తగదు. ఏక వాక్యాలపై ఇంత చర్చ జరిగినా మీ వ్యాస విస్తరణకు కృషి చేయకపోగా జర్నలిజం, జెండా వంటి ఏక వాక్య వ్యాసాలను మరలా చేర్చుతున్నారు. మీరు చేయని పనిని ఇతర సభ్యులు చేస్తుంటే వారిని కృషిని గుర్తించకపోగా వారిని లేనిపోని నిందలు వేయటం తగదు. మీరు అనేక వ్యాసాలలో మీ చిత్రాలనుంచారు. ఇది తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదా? మరికొన్ని వ్యాసాలు చిత్రాలతోనే ఉన్నాయి. వాటిలో అంశం లేదు. వృక్ష శాస్త్ర వ్యాసాలను కూడా ఏక వాక్యాలుగా చేరుస్తున్నారు. మీకు తెలియని అంశాల జోలికి పోకండి. తెవికీ ని పరిరక్షించే చర్యలను స్వాగతించండి. తెవికీ లక్షలాది మంది విద్యార్థులు ప్రమాణంగా ఉపయోగపడుతుంది. అందులో నాణ్యత లేకపోతే ఎట్లా. అలాగైతే నేను సృష్టించిన వ్యాసం కూడా వ్యాసం(గణితం) లో విలీనం చేసారు కదా! వ్యక్తిగత ప్రతిష్టలకు పోకండి. మన వ్యాసాలు ఇతరులకు ఉపయోగపడేటట్లు ఉండాలని ఆశించండి. నాకు విషయం తెలీక తెవికీ లో ఇంత శ్రద్ధతో వ్యాసాలను అభివృద్ధి చేయటం లేదు. నేను చేసిన వ్యాసం చాలా మందికి ఉపయోగపడాలని. ఇదే ఆశయంతో తెవికీ లో అనేకమంది స్వచ్చంద సభ్యులు నిరంతరంగా కృషి చేస్తునారు. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని. మీ వ్యాసాలను మంచి ప్రమాణాలతో విస్తరించండి. సహ సభ్యులు సహకారం అందిస్తారు. వ్యాస ప్రారంభకులుగా పోటీ పడకండి. వ్యాసం విస్తరణలో పోటీ పడండి.( కె.వి.రమణ- చర్చ 13:23, 29 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
  • వికీపీడీయాలో ఎవరూ వ్యాసాలకు కర్తకారు అన్ని వ్యాసాలు సమిష్టి కృషిలో భాగమే అయినప్పటికీ ప్రారంభించిన వ్యాసాన్ని మొలకస్తాయి దాటించవలసిన బాధ్యతా మాత్రం సభ్యులందరికీ ఉంది. రమణ వంటి విద్యావేత్త విద్యార్ధులకు ఉపకరించే నాణ్యమైన వ్యాసాలను అందించి తెవికీ నాణ్యతను పెంచగలరు. వారికి సభ్యులు సహకరించవలసిన అవసరం ఉంది. ఈ చర్చలకు ఇక ముగింపు పలికి మనపనిలో మనం కొనసాగుతాం. --t.sujatha (చర్చ) 17:17, 29 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డిగార్కి, మీరెవరో నాకు తెలియదు. కొన్ని చిత్రాలలో చూడటం తప్ప. మీ వివరాలు తెలియదు.నన్ను అమావాస్య చండ్రుడులా కళా విహీనమవుతారని సెలవిచ్చారు. మీరు అమావాస్య చంద్రుడు గా ఉన్నారు. మీరు మీ కళలను క్రమంగా పెంచుకుంటూ పొర్ణమి చంద్రుడులా మారాలని మా సహసభ్యుల కోరిక. నేనెవరో నా స్థాయి యేమిటో మీకు తెలియదు. తెలియవలసిన అవసరం కూడా లేదు. నేను సమాజంలో గొప్ప అధికారినైనా తెవికీ లో ఒక వ్యాసకర్తను కాదు, కవిని కాదు, రచయితను కాదు. కాని ఒక పనివాడిని. ఎందుకంటే తెవికీ మహా క్షేత్రంలో కలుపుమొక్కలైన నాణ్యత లేని వ్యాసాలను చూసి కలత చెంది తెవికీ క్షేత్రంలో అటువంటి వ్యాసాలు తగ్గించి ఎందరో పాఠకులకు మేలు చేయాలని ప్రవేశించాను. కాని నాకు ఎవ్వరి పైన ద్వేషాలు లేవు. మీరు ఎవరో తెలియనప్పుడు మీ మీద నాలు పక్షపాత ధోరణి ఎందుకు. మీరు మీ థోరణి మార్చుకోండి. మీ మైండ్ సెట్ మారాలి. అనవసర వ్యాఖ్యలు మానుకోండి. తెవికీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ తెవికీ శుద్ధి చేయుటకు తన పాత్రను నిర్వాహకుడిగా సమర్థవంతం గా నిర్వహింస్తున్న రాజశేఖర్ గారినే విమర్శిస్తున్నావంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి. మీరు ఎవరి మాట వినరు.మీరు ఉన్నతంగా ఎదగాలని ఎందరో సలహాలిస్తుంటే వారినే విమర్శిస్తారా. మీరు మీ వాడుకరి పేజీలో అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. సంతోషం.అందరికీ పొగడ్తలు అవసరంలేదు. మీరు నాణ్యమైన వ్యాసాలు తయారు చేసే వ్యాసకర్తగా మారితే అదే అందరికీ గౌరవించినట్లు. సుజాతగారు అధిక వ్యాసాలు తయారు చేయమని చెప్పారన్నారు. నా ఉద్దేశ్యంలో ఉన్నత ఆశాయాలు గల సుజాత గారు అటువంటి సలహాలివ్వరు. నాణ్యమైన వ్యాసాలు తయారు చేయమనే సలహాలిస్తారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు. మీ ఉద్దేశ్యంలో వ్యాసం అనగా ఏమో తెలియనట్లుంది. ఒక వ్యాసం ఒక పాఠకుడు చదివితే అందులో అతనికి అన్ని విషయాలు అర్థమయ్యేటట్లు ఉండాలి. కాని అసంపూర్తిగా ఉండి "ఎందుకండీ తెవికీ లో ప్రవేశించాను" అనే ఏహ్య భావం కలుగరాదు. ప్రమాణాలు పెంచటానికి మీరు కృషి చేయాలి. మీ ఉద్దేశ్యంలో ప్రతి వ్యాసం ప్రక్క మీ పేరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఉదాహరణకు గాంధీ వ్యాసానికి, "గాంధీ(YVSREDDY) " అని వ్యసనములు అనే వ్యాసానికి "వ్యసనములు(YVSREDDY) అని మొండితనం అనే వ్యాసానికి "మొండితనం(YVSREDDY) అని పేర్లు మీకు అవకాశం ఇస్తే పెడతారు. మీకు విమర్శించాలని కాదు. కొన్ని చిత్రాలకు వాటి పేర్లలో YVSREDDY అని తగిలించారు. చంద్రకాంతరావుగారు మీ చర్చా పేజీలో సూచనలు యిచ్చినప్పటికి మీ ధోరణి మారక పోవడం విచారకరం. వ్యాసాలలో వ్యాస విషయ కర్త చిత్రాలను చేర్చడం తెవికీ సాంప్రదాయానికి వ్యతిరేకం అయినా మీరు అనేక వ్యాసాలలో మీ చిత్రాన్ని ఉంచుతారు. ఎందుకండీ ఈ అనవసర విషయాలు. ఎందుకండీ మీ అనవసరమైన విమర్శలు. మిమ్మల్ని మీ వ్యాసాలను బట్రాజులా పొగిడే వారు మీకు యిష్టం. కాని మంచి సలహాలను స్వీకరించరు. మీరే కాదు ఎవరు అనవసర వ్యాసాలు వ్రాసినా తెలియ జేస్తాను. మీ వ్యాసాలలో తొలగింపు,విలీనం,దారిమార్పు మూసలు ఉంచితే మీరు చిత్తశుద్ధితొ ఉంటే చర్చించండి. నిర్వాహకులు చర్యలు తీసుకుంటారు. కాని వాటిని ఎలా మీరు తొలగిస్తారు. తెవికీ మీ స్వంత బ్లాగు కాదని మీరు గమనించాలి. తెవికీ ఒక సమిష్టి కృషి మీ స్వంతం కాదని గమనించండి. మీస్వంత బ్లాగులాగ "నా చర్చా పేజీలోకి రాకండి" "నా చర్చా పేజీని తోలగించండి" అనే వ్యాఖ్యలు మీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనాలు. పాలగిరి వంటి వారే నిర్వాహకుల సలహాలను స్వీకరిస్తారని గమనించాలి. అనవసర వ్యాఖ్యలు మానుకొని తెవికీ అభివృద్ధికి కృషి చేయండి.(Somu.balla (చర్చ) 02:17, 30 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ SIG సమావేశం

2013 సంవత్సరంలో మొట్టమొదటి హైదరాబాద్ SIG సమావేశం ఈ నెల 26 వ తేదీన హైదరాబాద్ లో జరుగబోతుంది. కుతూహలం ఉన్న సభ్యులు సమావేశానికి హాజరుకావలసిందిగా కోరుతున్నారు. ఈ గ్రూపులో చేరండి. https://lists.wikimedia.org/mailman/listinfo/wikimedia-in-hyd Rajasekhar1961 (చర్చ) 07:58, 24 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Help turn ideas into grants in the new IdeaLab

I apologize if this message is not in your language. Please help translate it.

  • Do you have an idea for a project to improve this community or website?
  • Do you think you could complete your idea if only you had some funding?
  • Do you want to help other people turn their ideas into project plans or grant proposals?

Please join us in the IdeaLab, an incubator for project ideas and Individual Engagement Grant proposals.

The Wikimedia Foundation is seeking new ideas and proposals for Individual Engagement Grants. These grants fund individuals or small groups to complete projects that help improve this community. If interested, please submit a completed proposal by February 15, 2013. Please visit https://meta.wikimedia.org/wiki/Grants:IEG for more information.

Thanks! --Siko Bouterse, Head of Individual Engagement Grants, Wikimedia Foundation 20:54, 30 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Correct it here.)

"imperial units" కు సరైన తెలుగు పేరు

తెవికీ సహోదరులకు నమస్కారం.
గణీత శాస్త్రంలో వివిధ ప్రమాణాలను విస్తరించదలిచితిని. "imperial units" కు సరియైన తెలుగు పేరు సూచించగలరు.( కె.వి.రమణ- చర్చ 01:46, 3 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

తెలుగు అకాడమీ వారి భౌతిక శాస్త్ర పారిభాషిక పదకోశంలో చూడండి. ప్రస్తుతానికి రాచరిక కొలమానము అని వాడితే బాగుంటుందేమో. అన్నట్లు ఇటువంటి సందేహాలను వికీపీడియా:సహాయ_కేంద్రం వాడడం బాగుంటుంది.--అర్జున (చర్చ) 09:36, 7 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గణితశాస్త్రానికి రాచరికానికి సంబంధం ఏమిటో? కేవలం పదాలను బట్టి దాని అర్థం చెప్పలేము, సందర్భం బట్టి అర్థం మారవచ్చు. పై వాటి అర్థం అధికారిక కొలమానం అయి ఉండవచ్చు. అయిననూ సందర్భం, వాక్యం, పేరా, ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేవి లేనిదే సరిగ్గా అనువదించడం అన్ని సందర్భాలలొ కుదరదు. 106.66.81.73 14:37, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించిన వ్యాసాల సమాచారం ఎక్కడకు చేరుతుంది

గమనిక: తొలగించిన వ్యాసాల సమాచారం ఎక్కడకు చేరుతుంది పేజీలో వ్రాసిన విషయాన్ని ఇక్కడకు తరలించాను. — వీవెన్ (చర్చ) 03:57, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సమాచారం ఉన్న వ్యాసాలను నిర్వాహకులు తొలగించినప్పుడు ఆ సమాచారం ఎక్కడకు చేరుతుంది. వాటి లింకులను మరికొన్ని వివరాలను తెలియజేయగలరు. ఈ వ్యాసంపు చర్చా పేజీలో వ్రాయగలరు. తొలగించిన సమాచారం తెలుసుకోవడం నాకు కష్టంగా ఉంది మీరు తెలియజేయగలరు. YVSREDDY (చర్చ) 17:45, 4 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించిన సమాచారం డాటాబేసులో ఉంటుంది. దాన్ని నిర్వహాకులు చూడగలరు. అవసరమైతే పునఃస్థాపితం చెయ్యగలరు కూడా. — వీవెన్ (చర్చ) 04:01, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డిగారి వ్యాసాల్ని వేటినీ నేను పూర్తిగా తొలగించలేదు. వాటిలోని సమాచారాన్ని మరొక వ్యాసంలో విలీనం చేశాను. మీరు చేర్చిన సమాచారం భద్రంగానే ఉన్నదని గమనించండి.Rajasekhar1961 (చర్చ) 08:41, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సోము గారు ఉద్ధేశ పూర్వకంగా నేను ప్రారంభించిన వ్యాసాలను మాత్రమే విలీనం చేయమని, తొలగించమని కోరుతున్నారు, సోము గారు కోరిన వెంటనే కొంపలు మునిగిపోతున్నట్టు నిర్వాహకులు వెను వెంటనే విలీనం చేయడం, తొలగించడం చేస్తున్నారు, వికీపీడియా తొలగింపు విధానాన్ని తెలపగలరు, ఇంతకు ముందు నేను ప్రారంభించిన వ్యాసాలు ఎవరి పేరుతో ఎక్కడకి తరలిపోయాయో, ఇంకెవరి పేరుకి తరలిపోతాయో తెలియటం లేదు, ఒకరు ప్రారంభించిన వ్యాసాన్ని అదే సమాచారంతో నిర్వాహకులు కొత్త పేజి సృష్టించి ఆ సమాచారాన్ని అందులోకి మార్చుకొన్న తరువాత ఆ వ్యాసాన్ని తొలగించవచ్చా. వికీపీడియాలో సోము గారికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేయగలరు. ఇంకా ఎన్నో సందేహలు... YVSREDDY (చర్చ) 12:04, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రెడ్డి గార్కి,

నేను విషయ ప్రాదాన్యతను పరిశీలించి తొలగింపు, విలీనం ప్రతిపాదనలు చేస్తున్నాను. నేను ఏక వాక్య వ్యాసాల వ్యతిరేకినని గమనించాలి. వ్యవసాయ పంచాంగం ఉండగా దానిలో 27 కార్తెలకు లఘు వ్యాసాలు అవసరమా! మీరు ఒక సంవత్సరం నుండి ఇప్పటివరకు విస్తరణకు కూడా గురి కాని ఏక వాక్య వ్యాసాలు, అర వాక్య వ్యాసాలు ఉండగా వాటిని వదిలి కొత్త వ్యాసాలపై దృష్టి పెట్టడం ఎందుకు. తెవికీ నాణ్యత గల వ్యాసాల భండాగారంగా ఉండటం మీకు ఇష్టం లేనట్లు ఉన్నది. తెవికీ లో ఫలానా తేదీ లోగా యిన్ని వ్యాసాలు చేర్చాలని నియమం ఏదైనా ఉంటే తెలుపగలరు. విక్షణరీ లో ఉండవలసిన అర్థాలు కూడా వ్యాసాలైతె తెవికీ ఎవరికి ఉపయోగపడుతుంది. ఇచ్చట వ్యాసాలు ఏ ఒక్కరి స్వంతం కాదని గమనించాలి. "నేను ప్రారంభించిన వ్యాసాలు" అంటున్నారు కాని "నేను విస్తరించిన వ్యాసాలు" అనే స్థితికి రండి. నేను ఉద్దేశపూర్వకంగా చేయటం లేదు. అన్ని వ్యాసాలను పరిశీలిస్తున్నాను. మీరు తెవికీని "కల్పవృక్షం"గా చూడాలనుకుంటున్నారా, లేదా విషయం లేని వ్యాసాలతో "విష వృక్షంగా" చూడాలనుకుంటున్నారా, మీ అభిప్రాయం ఈ రచ్చబండలో తెలియజేయండి.(Somu.balla (చర్చ) 12:19, 5 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

ఈ క్రింది వాటిలో నేను ప్రారంభించిన పేరు వేరు, అందులోని సమాచారం మరొక చోటకి విలీనం చేసిన తరువాత పేరు వేరు, ఉదాహరణకు రూపం నుంచి రూపముకు, ఆకారం నుంచి ఆకారము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..... YVSREDDY (చర్చ) 12:55, 5 ఫిబ్రవరి 2013 (UTC) (తేడాలు • చరితం) . . సమ్మె‎; 12:37 . . (+106)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . ఔషధ మొక్క‎; 12:37 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . ధర్మో రక్షతి రక్షితః‎; 12:35 . . (+124)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . పుట్టిన రోజు‎; 12:34 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . పుట్ట గొడుగు‎; 12:33 . . (+79)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విలీనం ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . గృహవైద్యం‎; 12:32 . . (+26)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విస్తరణ గూర్చి అభ్యర్థన) (తేడాలు • చరితం) . . తులసి‎; 12:31 . . (+1)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (→‎పురాణాలలో తులసి: ) (తేడాలు • చరితం) . . వైద్య నిపుణులు‎; 12:29 . . (+22)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విలీనం ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . వాడుకరి చర్చ:Rajasekhar1961‎; 12:28 . . (+493)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (→‎వ్యాస విలీనం గూర్చి: ) (తేడాలు • చరితం) . . శెలవు‎; 12:23 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . వికీపీడియా:రచ్చబండ‎; 12:19 . . (+2,677)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (→‎తొలగించిన వ్యాసాల సమాచారం ఎక్కడకు చేరుతుంది: ) (తేడాలు • చరితం) . . ఆకారము‎; 12:10 . . (+9)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . రూపము‎; 12:09 . . (+9)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . అరంగేట్రం‎; 12:05 . . (+138)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . వికీపీడియా:రచ్చబండ‎; 12:04 . . (+1,758)‎ . . ‎YVSREDDY (చర్చ • రచనలు)‎ (→‎తొలగించిన వ్యాసాల సమాచారం ఎక్కడకు చేరుతుంది: ) (తేడాలు • చరితం) . . చెక్క‎; 12:03 . . (+33)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విలీనం ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . బెరడు‎; 12:02 . . (+92)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . మైనం‎; 12:01 . . (+89)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . మంజిష్ఠ‎; 11:59 . . (+73)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (అర వాక్యం వ్యాసం తొలగించు) (తేడాలు • చరితం) . . పూతకొమ్మ‎; 11:57 . . (+16)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . పోతువెదురు‎; 11:55 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . కేసరము‎; 11:54 . . (+70)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . కామాక్షి‎; 11:53 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . తెల్లబూరుగ‎; 11:52 . . (+67)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . చర్చ:ఏనుగదంత‎; 11:51 . . (+298)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . చరణాలు‎; 11:50 . . (+44)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగించు) (తేడాలు • చరితం) . . అనుపల్లవి‎; 11:49 . . (+82)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . చర్చ:పల్లవి‎; 11:48 . . (+157)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . పేము‎; 11:47 . . (+50)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . కనప‎; 11:46 . . (+26)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . గారచెట్టు‎; 11:45 . . (+160)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . శాస్త్రీయ నామం‎; 11:43 . . (+134)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . వృక్షో రక్షతి రక్షితః‎; 11:42 . . (+132)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . డెంకాడ‎; 11:42 . . (-170)‎ . . ‎115.113.235.82 (చర్చ)‎ (→‎మండలంలోని పట్టణాలు: ) (తేడాలు • చరితం) . . గోరి‎; 11:41 . . (+6)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . గారడి‎; 11:40 . . (+36)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (విలీనం ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . ఖడ్గ యుద్ధం‎; 11:39 . . (+39)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . దూరదర్శిని‎; 11:36 . . (+167)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తొలగింపు ప్రతిపాదన) (తేడాలు • చరితం) . . భవిష్యత్తు‎; 11:34 . . (+1)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . భవిష్యత్తు‎; 11:34 . . (+14)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (తేడాలు • చరితం) . . వాడుకరి చర్చ:Rajasekhar1961‎; 11:30 . . (+1,097)‎ . . ‎Somu.balla (చర్చ • రచనలు)‎ (→‎వ్యాస విలీనం గూర్చి: కొత్త విభాగం)[ప్రత్యుత్తరం]

మీకు చేతనైతే మీరు సృష్టించిన వ్యాసాలను విస్తరించండి. ఒక వాక్యంతో ఆపకండి. మీకు చేతనైతే నేను చేసిన ప్రతిపాదనలపై చర్చించడి. అంతే గాని మీ స్వంత ఆస్థి పోతున్నట్లు ఎందుకింత బాధ పడిపోతున్నారు.ఒక వ్యాసానికి మీరు మాత్రమే వ్యాస కర్తగా ఉండాలనుకోవటం తెవికీ లో జరుగదు. ప్రతి వ్యాసం సమిష్టి కృషి అని గమనించాలి. మీకు అంత బాధ కలిగితే పై వ్యాసాలను విస్తరించు చూపండి. లేదా మీరొక స్వంత బ్లాగు పెట్టుకుని మీ యిష్టం వచ్చినట్లు రాసుకోండి. తెవికీ లో రాయాలంటే విషయ నాణ్యత గల వ్యాసాలు రాయండి. సహసభ్యులు సంతోషిస్తారు. మీరు విస్తరించకుండా ఎన్ని సార్లు మూసలు తొలగించినా అన్ని సార్లు తొలగింపు,విలీనం మూసలు ఉంచుతానని గమనించాలి.Somu.balla (చర్చ) 13:07, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక నిర్వాహకుడు ఏకపక్షంగానే చేస్తున్నారు అని చెప్పాలి. ఎవరో ఒకలు కొన్ని వ్యాసాలు తొలిగించు అని చెప్పిన వెంటనె ఒక నిర్వాహకుడు అవే వ్యాసాలు తొలిగించడం లేదా వేరే వాటిలో కలపడం తప్పు అని చెప్పాలి. కొందరి పైన విచక్షణతో చేయడం తప్పు అని చెప్పాలి. వికీలో వేలకొదిగా అతిచిన్న వ్యాసాలున్నాయి ఇది నిర్వాహకులు తెలుసుకొవాలి. అయినప్పటికి ఒక సభ్యుడు వ్యాసంలో తోలిగించు మూసలు పెట్టగా ఒకనిర్వాహకుడు అతని అనుకూలంగా ప్రవర్తించడం తప్పు అని చెప్పాలి. చర్చ ఇంకా జరుగుతున్నది అది కంప్లీట్ కాకుండానే కొంపలు మునిగిపోయినట్లు ప్రవర్తించడం తప్పు అని చెప్పాలి. ఎవరైనా ఏమైనా రాయవచ్చు అందరూ పెద్దపెద్ద వ్యాసాలు రాయలేరు అని తెలుసుకోవాలి. ఒకేఓక్క వ్యాసం ఉంటే తొలిగించాలి కాని అంతకంటె ఎక్కువ వాక్యాలు ఉన్నా కూడా ఎందుకు తొలిగిస్తారు అని ఎవరు ఎందుకు చెప్పరు. చిన్న వ్యాసాలు నచ్చని వాల్లు వికి మొత్తం జల్లెడ పట్టి చిన్నవ్యాసాలు తొలించమనవలె కాని ఆ పని చేయలేరు. ఎందుకు. నిర్వాహకులు ఉదాసీనంగా ఉన్నందుకే ఇలా జరిగుతున్నది అని చెప్పాలి. బాగా తెలిసిన నిర్వాహకులు ఈ విశయం పట్టించుకొన నందున ఇలా జరుగుతుందని చెప్పాలి. ఒకనిర్వాహకుడు చిన్న వ్యాసాలు తొలిగిస్తే ఎప్పుడు తొలిగించాలి, అది చేర్చిన వెంటనా, విస్తరించనప్పుడా ఆలోచించమని చెప్పారు. మరి ఈ నిర్వాహకుడు ఎవరిని చెప్పకుండా తొలిగించడం , కల్పడం తప్పు అని చెప్పాలి. 49.14.93.100 14:54, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అనామక సభ్యులు చర్చా పేజీలో చేర్చిన విషయాలు పరిగణింపబడవు. మీరు మీ సభ్య నామముతో చర్చలలో పాల్గొనండి. తెవికీ సంరక్షణ చర్యలను స్వాగతించడి. మీరు బహువాక్య వ్యాసాలకు వ్యతిరేకిలా ఉన్నారు. ఏ సభ్యుడైనా విషయం లేని వ్యాసాల ల పట్ల చర్చించవచ్చు. తొలగింపు ప్రతిపాదనలు, విలీన ప్రతిపాదనలు చేయవచ్చు. నిర్వాహకులపై అభాండాలు వేయడం సభ్యులకు తగదు. "బొంగరాలు" , "బొంగరాల ఆట" లకు రెండు వ్యాసాలు అవసరమా! ఆ రెంటినీ కలిపి మహోన్నతంగా మంచి వ్యాసం తయారు చేస్తే అది తప్పు ఎలా అవుతుంది. దానిని ఎవరైనా స్వాగతించాలి. రెడ్డిగారు ఉక్రోషంతో మరల బొంగరాల ఆట అనే వ్యాసం ప్రారంభించటం సబబా! వికీలో వేలకొలది వ్యాసాలుండవచ్చు. అలా అని ఎవరూ పట్టించుకోకుండా వదిలివేయాలా! మనకి తారస పడిన తప్పులను నిర్వాహకుల దృష్టికి తీసుకునివెళ్ళటం తప్పా! తొలగింపు మూసలు, విలీనం మూసలు ఉంచినపుడు వాటిపై చర్చించమని రెడ్డి గారికి చెప్పండి. ఎవరైనను ఏమైలా వ్రాయవచ్చు అన్నారు. అలా తెవికీలో రాయకూడదు. అందుకు ఒక నియమావళి ఉంటుంది. మీ యిష్టం వచ్చినట్లు వ్రాసుకోవాలంటే మీరు స్వంత బ్లాగు పెట్టుకోవాలి. ఏమైనా రాసుకోవచ్చు అన్నారు. అంటే అశ్లీలత గూర్చి కూడా చేరుస్తారా! స్వంత ఫొటోలను చేరుస్తారా. చిత్రాలకు ఇచ్చే నామంలో స్వంత పేరును వినియోగిస్తారా.అందరూ పెద్దపెద్ద వ్యాసాలు వ్రాయలేరు అన్నారు. విషయం కొంతయినా ఉండాలి కదా! ఏక వాక్యం, అరవాక్యం, పావు వాక్యం తో వ్యాసాలు వ్రాస్తారా! మీకు వ్యాసం అంటే ఏమిటో తెలియనట్లుంది. చిన్న వ్యాసాలను జల్లెడ పట్టినా తొలగించలేరనే మీ వాదన వ్యర్థమైనది. మన పరిధిలో గల కొన్ని వ్యాసాలైనా నిర్వాహకుల కు తెలియజేయవలసిన భాద్యత తెవికీ సభ్యులకు లేదా? ఇలా చేస్తే కొన్ని సంవత్సరాలకైనా తెవికీ బాగుపడదా! ఉదాసీనంగా అన్నారు. నిర్వాహకులు చూసీ చూడనట్లు ఉంటే పరవాలేదా. ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్న నిర్వాహకుడు ఉదాసీనంగా ఉన్నట్లా. ఏ నిర్వాహకుడు పట్టించుకోక పోటే యిలా ఏక, అర, పావు వాక్య వ్యాసాల సంఖ్య మితి మీరిపోతుంది.కాని ఒక విషయం రచ్చబండలో ఏకవాక్య వ్యాసాల గూర్చి చర్చ జరిగినది కనుక వాటిపట్ల తీసుకోవాల్సిన చర్యలు, ఎప్పుడు తొలగించాలి. అనే నియమాలు ఓటింగ్ పెట్టడం మంచిది. కాని నిర్వాహకులను తప్పుపట్టడం అవివేకంSantu (చర్చ) 15:57, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అనామక వాడుకరుల అభిప్రాయాలు పరిగణించబడవు అన్న నియమమేదీ వికీపీడియాలో లేదు. గమనించండి. — వీవెన్ (చర్చ) 03:56, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకే మెంబరు రకరకాల పేర్లతో వచ్చి రాస్తున్న దాన్ని నిర్వాహకులు ఎందుకు పట్టించుకొరు. దానిపై విచారన చేయాల. వ్యాసాలను తొలిగిస్తున్న నివాహకుడిది తప్పు. సభ్యుడుపై నిశెదం పెట్టడం తప్పు అని చెప్పాల. విచారణ చెసి ఒకే మెంబరు ఎక్కువ పెర్లతొ చర్చలు చెస్తె అతనిపై నిశేదం విధంచాల. మిగిత నిర్వహకులు ఎక్కడ పోయారు. 49.14.255.61 16:31, 5 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకే వ్యక్తి అని మీకు ఎలా తెలిసింది లేదా నేను ఎలా తెలుసుకోగలను? నిర్వాహకులు విధానాలకు తగినట్టు వారివారి వీలును బట్టీ నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అనుకున్న వాటిని చేయాలని నిర్వాహకులకు చెప్పనవసరం లేదు. — వీవెన్ (చర్చ) 03:56, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికీ, ఇలా అన్నింటినీ కలగట్టి చూసే బదులు, ఒక్కో వీలీన/తొలగింపు ప్రతిపాదనపై లేదా జరిగిన చర్యపై అదెందుకు కూడదో/చెయ్యాలో విషయపరంగా ఆయా చర్చా పేజీలలో చర్చించండి. వికీపీడియాకు ఇక్కడ సమాచారం చేరడం ముఖ్యం. అలానే సమిష్టి కృషి, వాడుకరుల మధ్య సహకారం, శాంతియుత చర్చలు ముఖ్యం. — వీవెన్ (చర్చ) 03:56, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వహకునిది తప్పు అయితె అతనిపై చర్య తిసుకొవలె. ఒకరు తాన అంటె నిర్వహకుదు తందాన చెప్పదం నెరం. 27.97.94.41 13:07, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాగా దిద్దుబాట్లు చేస్తున్న సభ్యుడిపై నిషేధం వేయడం అనేది చాలా అరుదుగా చేయాలి, అదీ ముందస్తు హెచ్చరిక చేస్తూ. కేవలం నిర్వాహకులను విమర్శించినంతమాత్రనా వేటు వేయడం తగదు. రాజశేఖర్ గారు చురుకైన సభ్యుడికి కూడా ఎలాంటి హెచ్చరిక లేనిదే నిషేధం వేయడం తప్పు. 106.66.55.100 12:08, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]



వ్యవసాయ పంచాగం

వ్యవసాయ పంచాంగం వ్యాసం బాగుంది. కాని అందులోని సమాచారాన్ని మల్లీ 20 పైగా చిన్న వ్యాసాలుగా విభజించి రెడ్డిగారు పేజీలను తయారుచేశాను. వీటి గురించి సభ్యుల అభిప్రాయాల్ని తెలియజేస్తే మంచిది.Rajasekhar1961 (చర్చ) 07:55, 7 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తి వ్యాసం 40 కిబైట్లకు లోపే వున్నప్పుడు దానిలోని విషయాలతో ‌‌చిన్న వ్యాసాలుగా విభజించడం అంత వుపయోగకరం కాదు. --అర్జున (చర్చ) 09:39, 7 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యవసాయ పంచాంగం వ్యాసం లో రెడ్డిగారు వ్రాసిన 27 కార్తెలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అందువలన దీనికి ఉప వ్యాసాలు అవసరం లేదని నా అభిప్రాయం. 27 కార్తెలలోని విషయాన్ని ఒకే వ్యాసంగా విలీనం చేస్తే విషయమంతా ఒకేదగ్గర లభిస్తుంది.( కె.వి.రమణ- చర్చ 12:59, 7 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
కార్తె అనే మరొక వ్యాసం ఉన్నదని తెలిసింది. అలాగే ఆయా నక్షత్రాలకు వేర్వేరు వ్యాసాలున్నాయి. వీటిని ఎలా విలీనం చేస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:10, 8 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కార్తె అనే వ్యాసం నందు కార్తెల లక్షణాలు ఉంటాయి. వ్యవసాయ పంచాంగం లో కార్తెల లో ఎలాంటి పంటలు వేయాలో ఉండాలి. అందువల్ల 27 కార్తెలలో పంటలకు సంబంధించిన వ్యాసాలను వ్యవసాయ పంచాంగం లో విలీనం చేస్తే బాగుంటుంది. Somu.balla (చర్చ) 10:12, 8 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల మొలకల గురించి ...

గ్రామ వ్యాసాల గురించి సభ్యులు అడపా దడపా అక్కడా ఇక్కడా ఒక వాక్యం వ్యాసాలు, అనవసరం, తొలగించాలి అని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామాల గురించి ఈ వ్యాసాలు చాలా అమూల్యమైనవి. ఒక్క వాక్యం ఉన్నా గానీ, ఈ గ్రామ వ్యాసాలను మిగతా ఒక్క వాక్య వ్యాసాలతో పోల్చకూడదు. రెండూ వేరు వేరు. గ్రామ వ్యాసాల మొలకలు తొలగించడం సమస్యకు సమాధానం కాదు. గ్రామ గ్రామాన వికీ కాంట్రిబ్యూటరును ఏర్పాటు చేసుకోవడం సమాధానం. కానీ కనుచూపు మేరలో ఆ లక్ష్యం దరిచేరేట్టు కనిపించడం లేదు. అప్పటి వరకు తొందరపడి ఈ గ్రామ వ్యాసాలు తొలగిస్తారేమో అని ఈ వ్యాఖ్య. అప్ కోర్స్ అంతిమ నిర్ణయం వికీ యాక్టివ్ సభ్యులదే అనుకోండి. Chavakiran (చర్చ) 16:51, 9 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలానా జిల్లా ఫలానా మండలంలో ఫలానా గ్రామం ఉందని తెలియజేస్తే అది ఖచ్చితంగా వ్యాసమే. సంగ్రహంగా అది సమాచారమే. ఆ ఊరికి సంబంధించిన 'ప్రత్యేకతలు' తెలిసినవారు - ఆ విషయాన్ని జోడించేందుకు అవకాశం కల్పించడమే...! అందులో సందేహం లేదు...! ఏకవాక్య వ్యాసాలు ఎలా ఉంటున్నాయో చెప్పడం కోసమే - ఏవిధమైన సమాచారం లేకుండా 'డిక్షనరీ' పదాలతో వ్యాస సృష్టి జరుగుతోందని తెలియజేసే 'ఆతృత'లో - ఫలానా ఊరు ఫలానా జిల్లాలో ఉంద'ని రాస్తే చాలు... అది ఒక వ్యాసం....! - అని పేర్కొనడం జరిగిందని గమనించ ప్రార్థన. ...Malladi kameswara rao (చర్చ) 08:30, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామ వ్యాసాలను మొలకల కిందికి పరిగణించరాదని ఎన్నేళ్ళో క్రితం నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఏకవాక్య వ్యాసాలకు, గ్రామ వ్యాసాలకు సంబంధం లేదు. నిజమైన తెవికీ అభివృద్ధి కోసం పాటుపడేవారెవరూ గ్రామవ్యాసాల తొలిగింపుకు గాని దానికి వ్యతిరేకంగా గాని వ్యాఖ్యానించరు. 106.66.81.73 14:16, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామ వ్యాసాలు మరియు ఏక వాక్య వ్యాసాలు మొలకలు విస్తరణ మరియు తొలగింపు గూర్చి ఇదివరకే చర్చ జరిగింది.వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత ప్రతిపాదనలు 4. అందులో గల చర్చల సారాంశాన్నిబట్టి కాసుబాబు గారు కొన్ని ప్రతిపాదనలు చేయటం జరిగింది.( కె.వి.రమణ- చర్చ 03:52, 14 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
తెవికీలో మొలక వ్యాసాల నిర్థారణకు నిర్దేశిత ప్రమాణాలు ఉన్నాయా? లేదా నిర్వాహకుల / సభ్యుల విచక్షణపై ఆయా వ్యాసాలు మొలకలుగా నిర్థారింపబడతాయా? ఎవరైనా సభ్యుల వద్ద సమాచారం ఉంటే తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:25, 14 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటివరకైతే అలాంటి నిర్దేశిత ప్రమాణాలేవీ లేవండి ఖాదర్ గారు, మీరనుకుంటున్నట్లు అవి సభ్యుల విచక్షణపైనే ఆధారపడతాయి కాని ఒక్కో సభ్యునికి ఒక్కో రకమైన విచక్షణ ఉంది/ఉంటుంది. సాధారణంగా 2 కెబిలు అని చాలా సభ్యులన్నట్లు చర్చలలో నమోదైంది. మీరడిగే సమాచారం ఏమిటో అర్థం కాలేదు, పైన అడిగినదేనా? లేదా మొలకలను విస్తరించడానికి కావలసిన సమాచారమా? గ్రామవ్యాసాలను విస్తరించడానికి మాత్రం (మొత్తం 26వేల గ్రామాలకు సంబంధించి) నా వద్ద పూర్తి సమాచారం ఉంది. 106.77.116.28 15:09, 14 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలండి. నేను కొత్తగా వ్రాస్తున్న కొన్ని వ్యాసాల పరిమాణం 5000 కెబిల పైన ఉన్నప్పటికీ కొందరు సభ్యులు వాటిని మొలకలుగా పేర్కొనటం గమనించాను. వికీ ప్రమాణాలు పాటించినప్పటికీ ( మూసలు, లంకెలు , మూలాలు పేర్కొనడం) ఇలా జరగడం చూసి. ఇంకా ఏవైనా నిర్దేశిత ప్రమాణములు ఉన్నాయేమో అని అడిగాను. మరొక్కసారి ధన్యవాదములు. మీ పేరు తెలియకలోవడం వలన పేర్కొనడం కుదరలేదు. క్షంతవ్యడను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:59, 15 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా సర్వసభ్య సమావేశం - ఒక ప్రతిపాదన

తెలుగు వికీపీడియా మరింతగా అభివృద్ధి చెందడానికి వీలుగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే బావుంటుందేమో అన్నది నా సూచన. ఈ సమావేశంలో తెవికీ రచనలు, రచనా వ్యాసాంగానికి సంబంధించి సమగ్ర చర్చతో బాటు, మెరుగైన సేవలందిస్తున్న వ్యాసకర్తలకు ఉత్సాహంగా ఉండేందుకు ప్రశంసా పత్రాలను (ప్రింటెడ్ సర్టిఫికెట్లు) అందిస్తే - కొత్త రచయితలు వికీకి చేరువ కాగలరన్నది నా సూచన. ఈ సమావేశం మన తెలుగువారి తొలి వెలుగైన ఉగాది రోజున తెలుగు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో జరిపితే బావుంటుంది. నిర్వాహకులతో ముఖాముఖీగా జరిగే ఇష్టాగోష్టి చాలారకాల అపోహలను, ఆభిప్రాయ బేధాలను తొలగించి, వికీ నాణ్యతా ప్రమాణాల మెరుగుదలకు దోహదకారి కాగలదని నా ఆభిప్రాయం. పరిశీలించవలసిందిగా నా విన్నపం. ...Malladi kameswara rao (చర్చ) 15:40, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మల్లాదిగారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నను. అయినా ఇది ఆచరణ సాధ్యమా అన్నది ఆలోచించతగిన విషయం. --t.sujatha (చర్చ) 03:05, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చాలా మంచి ఆలోచన. మల్లాదివారు తలుచుకొంటే చేయగలరని నా నమ్మకం. ఇది వికీపీడియాలో కృషి చేస్తున్న సభ్యులకు వ్రాత పూర్వకంగా ఒక ప్రశంసా పత్రం ఇవ్వడం (ఇప్పుడు మనం ఇస్తున్న చక్రాల కన్నా) చాలా బాగుంటాయి. మీడియాలో అందర్నీ ఆహ్వానించి వికీపీడియాకి వారి అవసరాన్ని, వారికి మన అవసరాన్ని తెలియజేస్తే ఇద్దరికీ ఉపయోగం. వికీపీడియా స్థాపన నుండి విశేష కృషి చేసిన వైజాసత్య వంటి ములస్తంభాల వంటి వారిని సన్మానిస్తే, వారిని మనం గుర్తించినవారమౌతామనిపిస్తుంది. దీనికి భారతీయ వికీమీడియా (బెంగుళూరు) వారి నుండి అనుమతి తీస్కొని, అవసరమైన నిధుల్ని సమకూర్చమని కోరవచ్చును. ఈ కార్యక్రమాన్ని ఉగాదినాడు నిర్వహించితే తెలుగుతనం వస్తుంది.Rajasekhar1961 (చర్చ) 06:27, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యత పెంచుటకు పనులు

వికీపీడియా నాణ్యతను పెంచటానికి అవసరమైన పనులను సంఖ్యాపరంగా తెలియచేసే పేజీ గణాంకాలు కాకుండా ఇంతవరకు చేయబడలేదు. దానిని నేను రెండు చోట్ల ప్రారంభించాను. వికీపీడియా:నిర్వాహకుల_నోటీసు_బోర్డు మరియు వికీపీడియా:సముదాయ_పందిరిలో చేయవలసిన పనుల జాబితాలో గణాంకాలు చేర్చడం. దీనిని విస్తరించి సభ్యులు తమసమయంలో కొంత భాగాన్ని నాణ్యతని పెంచడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. --అర్జున (చర్చ) 06:42, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిపేజీ నిర్వహణ స్థితి

మొదటిపేజీ నిర్వహణ స్థితి మూసని ఈ పేజీలో పై భాగంలో చేర్చడమైనది. ఎర్ర లింకుల వారాలున్నప్పుడు, నాలుగైదు వారాల పైగా తెవికీలో మార్పులు చేసిన అనుభవంగల సభ్యులు ఆయా ఎర్రలింకుగల వారాలకి వ్యాసాలు,బొమ్మలు సిద్ధంచేసి నిర్వహణలో తోడ్పడమని మనవి. దీని నిర్వహణని కొంతకాలంపాటు ఎవరైనా చేపట్టితే మరీమంచిది. ----అర్జున (చర్చ) 12:39, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

PDF కింద దిగుమతించు తొలగించడానికి ప్రతిపాదన.

PDF కింద దిగుమతించు లింకు వ్యాసాలకు ఎడమపక్క పట్టీలో వస్తుంది. ఇది తొలగించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

కారణం: అది తెలుగు భాషకు పనిచెయ్యడం లేదు. గుణింతాలు సరిగ్గా రెండర్ అవ్వడం లేదు. ఆ దోషం సరిఅయ్యేంతవరకూ ఈ లింకు ఎడమ పక్కపట్టీలో చూపడం తెవికీ క్వాలిటీ ఔట్ లుక్ ను హీనం చేస్తుంది. Chavakiran (చర్చ) 16:29, 10 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదేశ వరసలు కలెక్షన్ ఎక్సటెన్షన్ వలన కనపడుతున్నాయి. పిడిఎఫ్ మునుజూపు పీడియాప్రెస్ వారి సైటులో సరిగానే కనబడుతున్నా ఇక్కడ లోపముంది.ఇంతకు ముందు ఈ విషయమై నేను వికీసాంకేతిక నిపుణులతో చర్చించాను, బగ్ రాశాను. ఈ ఎక్సెటెన్షన్ కి మార్పులు జరిపే వుద్దేశ్యములేదని ముందు కొత్త సాంకేతికాలతో పుస్తక సేకరణ చేయబడుతుందని తెలిపారు. అంతవరకు ఈ ఆదేశ వరుస కనబడకుండా చేయడం సమర్థనీయమే. --అర్జున (చర్చ) 01:41, 12 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం కావాలి మూస పరిధి విస్తరణ

{{సహాయం కావాలి}} ని ఏ చర్చాపేజీలోనైనా వాడేటట్లుగా మార్చాను. దీనికి సంబంధించిన గణాంకాలు, తద్వారా లింకులు సముదాయపందిరిలో చేతిలోవున్న పనులు రచ్చబండ మరియు సముదాయపందిరి లో ప్రత్యేక పెట్టెలలో కనబడతాయి. తెవికీలో క్రియాశీల సభ్యులు తక్కువ కాబట్టి, ఏ చర్చా పేజీలలో సహాయం అవసరమైనా అక్కడే ఈ మూసని వాడితే చర్చ సరియైన స్థానంలో వుంటుంది. అనుభవమున్న వికీ సభ్యుని చర్చా పేజీలో నేరుగా సంప్రదించవలసిన పనిలేదు. అందరు సభ్యులు సముదాయపందిరి గమనించితే బాగుంటుంది. ముందు ముందు అవసరమైతే దీని స్థితిని రచ్చబండను చేర్చవచ్చు గమనించితే బాగుంటుంది. ఈ చర్య తెవికీ అభివృద్ధికి దోహదపడ్తుందని భావిస్తాను. --అర్జున (చర్చ) 01:11, 11 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ లోగో మార్పుకు ప్రతిపాదన

తెవికీ లోగో చాలా పాతదిగా కనిపిస్తూ ఉంది. కొత్త ఖతులు వచ్చాక ఇంకా పాత ఖతులలో సరిగా ఆనటం లేదు. నేను ఒక కొత్త లోగో రూపొందించాను.

Wikipedia-logo-v2-te-changed font

దయచేసి సూచనలు తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 13:56, 12 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ లోగో పెద్దగా స్పష్టంగా ఉన్నది. పాతదాన్ని మార్చండి.Rajasekhar1961 (చర్చ) 06:19, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
"వి" అక్షరం చిన్నదిగా కనిపిస్తోంది, తొలి అక్షరం చిన్నగా ఉండడం బాగుగా అనిపించదు. "వికీపీడియా" మాత్రం పాతఖతే బాగుంది. రెండో వరస మారిస్తే ఫరవాలేదు. రాజశేఖర్ గారు చెప్పినట్లు ఈ లోగో పెద్దగా, స్పష్టంగా అని చెప్పడానికి వీలుండదు. తయారుచేసిన లోగో ఎంతపెద్దగా ఉన్నా ఆ స్థానంలో పెడితే ఇప్పుడున్న సైజులోనే ఉండి స్పష్టత తగ్గిపోవచ్చు. సైజు పెంచితే సైడ్ బార్ వెడల్పు పెరుగుతుంది, తద్వారా తక్కువ వెడల్పు గల కంప్యూటర్లలో ఎడిట్ బాక్సు పరిమాణం చాలా చిన్నది అయిపోతుంది. 106.66.81.73 14:04, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అసలు దీన్ని "లోగో మార్పు"గా చెప్పలేము. ఎందుకంటే లోగోను మార్చే అధికారం తెవికీకి లేదు. ఇక్కడ మార్చేది లోగో కింది అక్షరాలు మాత్రమే. అలాంటప్పుడు లోగో స్పష్టంగా ఉంది అనే చెప్పే అవకాశమే లేదు, కాకుంటే కొత్త ఖతుల వల్ల అక్షరాలు మాత్రం స్పష్టంగా ఉండవచ్చు. 106.66.81.73 14:26, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రోత్సాహం కావాలి

కొత్త సభ్యులకు, కొత్త వ్యాసాలకు ప్రోత్సాహమివ్వండి విశ్వనాధ్ గారు

బాదంపాలు వ్యాసం ఆంగ్లంలో ఉన్నందున నేను ఆ వ్యాసాన్ని ప్రారంభించాను, ఈ వ్యాసాన్ని నేను విస్తరణ చేస్తుంటే విశ్వనాథ్ గారు వ్యక్తిగత కారణాల వలన తొలగిస్తున్నారు. వ్యక్తిగత కారణాలు అంటే ఈ క్రింది విషయాన్ని చదివితే మిగతా నిర్వాహకులకు, సభ్యులకు అర్థమవుతుంది.

చిత్రలేఖనం వ్యాసంలో మీరు వ్రాసిన సమాచారం ఒక లైన్ మాత్రమే - ఊహను రూపంగా మలచగల ఒకే ఒక సాదనం చిత్రలేఖనం. ఈ కళకు పరిమితులు లేవు. మానవ చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించి మానవుని అభివృద్దిలో కీలకమైనది చిత్రలేఖనం. ఇలాంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించేవారిని చిత్రకారులు అంటారు.

సమగ్ర చిత్రలేఖనం లో YVSREDDY వ్రాసిన సమాచారం ప్రస్తుతం నాలుగు లైన్ లు - చిత్రలేఖనం ద్వారా చిత్రించిన చిత్రంలో పొందుపరచాలనుకున్న సమగ్ర విషయాన్ని లేక చూపించాలనుకున్న సమస్త సమాచారాన్ని ఒకే చిత్రంలో అగుపరచడాన్ని లేక చూపించడాన్ని సమగ్ర చిత్రలేఖనం అంటారు. సమగ్ర చిత్రలేఖనాన్ని ఆంగ్లంలో పనోరమ పెయింటింగ్ అంటారు. సమగ్ర చిత్రాలు విశాలమైన ప్రాంతంలో ఆవరించి ఉన్న విశేషాన్ని సమూలంగా వీక్షించేందుకు తయారు చేసిన భారీ కళాఖండాలు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని తరచుగా ప్రకృతి దృశ్యం, సైనిక యుద్ధం, లేక చారిత్రక సంఘటనలను వంటి చిత్రాలను ఈ సమగ్ర చిత్రాల ద్వారా చిత్రిస్తుంటారు. 19 వ శతాబ్దం నుండి యూరప్ మరియు అమెరికా రాష్ట్రాలలో ఈ సమగ్ర చిత్రలేఖనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని శృంగారభరిత కవిత్వ రచయితల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొన్ని సమగ్ర చిత్రలేఖనాలు 21 వ శతాబ్దంలో మనుగడ సాగించాయి మరియు ప్రజా ప్రదర్శనలో ఉన్నాయి.

చిత్ర రచన లో YVSREDDY వ్రాసిన సమాచారం ప్రస్తుతం నాలుగు లైన్ లు - ఒక వస్తువు యొక్క చరిత్రను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా అక్షరాలను కూర్చుతూ వ్రాసే రచనను చిత్రరచన లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం. చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది. (ఫోటో లోని సమాచారం తో సహా) అయితే వీటిని నేను ఇంకా అభివృద్ధి పరుస్తున్న సమయంలో సమగ్ర చిత్రలేఖనం, చిత్రరచన వ్యాసాలలో సమాచారం తక్కువగా ఉందని ఎలా తొలగిస్తావు - YVSREDDY (చర్చ) 22:16, 12 అక్టోబర్ 2012 (UTC)

ఎవరిని విమర్శించే ఉద్ధేశ్యం లేనప్పటికి నేను ప్రారంభించిన వ్యాసాలను రక్షించుకోవటానికి కారణాలు తెలియజేస్తున్నాను, మిగతా నిర్వాహకులు సహకారం అందించాల్సిందిగా కోరుచున్నాను. మీ YVSREDDY (చర్చ) 08:52, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వ్యాసాలను అభివృద్ధి చెందే దాక, మీ సభ్యపేజీకి ఉపపేజీలుగా ప్రారంభించితే వాటిజోలికి వేరెవరూ వెళ్లరు. పరిశీలించండి. బాదంలో బాదం పాలు విలీనం గురించిన చర్చలో పాల్గొనండి. --అర్జున (చర్చ) 11:03, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీలో చర్చలు జరిగేటప్పుడు అవి వ్యక్తిగత అభిప్రాయాలకు కారణం కారాదు. తెవికీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒక వ్యాసం పాఠకులకు అర్థమయ్యేటట్లు ఉండాలి. రెడ్డిగారు వ్రాసిన వ్యాసాలు సంగ్రహంగా ఉన్నప్పుడు అవి విలీనం చేస్తే తప్పు యేమిటి? విలీనం ప్రతిపాదనలు ఉన్నప్పుడు వాటిపై చర్చ జరగాలి. ఆపై నిర్వాహకులు ఏది సరియైనదైతే అదే చేస్తారు. కాని నిర్వాహకులపై వ్యక్తిగత దూషణలు చేయటం సరియైనది కాదు. ఇదివరకు రాజశేఖర్ గారిని కూడా యిలానే విమర్శిస్తున్నారు. మీ అభిప్రాయాలను తెలియజేయాలి కాని దూషణలు చేయకూడదు. పైన మీరు తెలియజేసిన వ్యాఖ్యలో విశ్వనాథ్ గారిని "సమగ్ర చిత్రలేఖనం, చిత్రరచన వ్యాసాలలో సమాచారం తక్కువగా ఉందని ఎలా తొలగిస్తావు" అని వ్రాసారు. నిర్వాహకుల పైనా లేదా సహ సభ్యుల పైనా ఏకవచన ప్రయోగం చేస్తారా. ఇతరుల అభిప్రాయాలను, ఇతరులను గౌరవించాలని రెడ్డిగారు తెలుసుకోవాలి. మీరు సృష్టించిన బాదం,బాదం పాలు ల విలీనంపై చర్చలో పాల్గొనండి. లేదా మీరు సృష్టించిన వ్యాసాలు సరియైనవనిపిస్తే వాటిని విస్తరించండి.( కె.వి.రమణ- చర్చ 11:36, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
తెవికీలో కోందరు నిర్వాహకులు, సభ్యులు అందరూ కలిసి ఒక చురుకైన సభ్యుడిపై దాడి చేయడం సమంజసం కాదు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇప్పటికే సదరు సభ్యుడిపై అనాలోచితంగా ఒక నిర్వాహకుడు నిషేధం విధించాడు. అసలు తప్పు ఆ నిర్వాహకునిపైనే ఉంది. చర్చ జరుగుతున్నప్పుడే, అది పూర్తి కానిదే రెడ్డిగారు సృష్టించిన చాలా వ్యాసాలను ఇతర వ్యాసాలలో విలీనం చేయడమైనది. ఎలాంటి కారణం లేకుండా, చర్చ ఫలితం లేకుండా అలా విలీనం చేసిన వ్యాసాలను తిరిగి సృష్టించడాన్ని తప్పుపట్టే అవసరం లేదు. ఒకవేళ చిన్న వ్యాసాలను తొలిగింపు లేదా విలీనం చేయదలిస్తే తెవికీలో ఇప్పటికే వేలాది వ్యాసాలపై ఎందుకు చర్య తీసుకోవడం లేదు. రాజశేఖర్ గారు సృష్టించిన వందల వ్యాసాలలో ఎటువంటి సమాచారం లేదు. అవి సృష్టించి రెండేళ్ళకు పైగా సమయం అయిననూ అవి ఎటువంటి పురోగతి లేకుండా అలానే ఉన్నాయి. మరి వాటి సంగటేంటీ? ఇక్కడ నిర్వాహకులకు ఒక న్యాయం, సభ్యులకు మరో న్యాయమా? చాలా రోజుల నుంచి ఉన్న చిన్న వ్యాసాలను తొలిగిస్తూ వస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. కొత్తవ్యాసాలను మాత్రం సృష్టించరాదని రెడ్డి గారికి చెప్పవచ్చు. ఇప్పుడు చిన్న వ్యాసాలను తొలిగించే వారు రెడ్డిగారు చిన్న వ్యాసాలను సృష్టించే సమయంలోనే ఎందుకు చెప్పలేరు? వందల వ్యాసాలు సృష్టించిన పిదప ఇప్పుడు అభ్యంతరం ఉంటే, వాటిని తొలిగించడానికి మరికొంతసమయం వేచిచూడాల్సిందే. అప్పటికీ అభివృద్ధి పర్చకుంటే మాత్రం తప్పకుండా తొలిగించవచ్చు, అదీ సీనియారిటీ ప్రకారమే కాని కేవలం ఈ ఒక్క సభ్యునిపై మాత్రమే దృష్టి పెట్టడం వివక్షగా పరిగణించబడుతుంది. ఈ వ్యాసాలను అభివృద్ధి పరుస్తానని రెడ్డిగారు చెబుతున్ననూ పట్టుపట్టి తొలిగించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా! ప్రజాస్వామ్యం అంటే కేవలం మెజారిటీ నిర్ణయం కాదు. ఐదుగురు కలిసి ఒక సభ్యునిపై వివక్షతో అతని వ్యాసాలను తొలిగించాలని మెజారిటీ నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్య పద్దతినే అపహాస్యం పాలు చేసినట్లవుతుంది. మరోవిషయం ఈ సభ్యుడిపై మాత్రమే దృష్టిసారించిన సోముబల్లా అనే సభ్యుడు ఎవరనే విషయం ఆరా తీయాలి. స్టీవార్డులను సంప్రదిస్తే ఈ విషయం చాలా సులభంగానే తెలిసిపోతుంది. అది సాక్పిప్పెట్ సభ్యత్వం అయితే శాశ్వత నిషేధం విధించి, అసలు సభ్యునిపై కూడా పరిమితకాలం నిషేధం విధించవచ్చు. అసలు బాదంపాలుపై చర్చ జరుగుతునప్పుడే ఆ వ్యాసాన్ని నిర్వాహకులు ఎందుకు తొలిగించారు. చర్చాపేజీ కూడా తొలిగించడానికి అధికారం ఉందా? ఇలాంటి పనుల వల్ల నిర్వాహక హోదాను దుర్వినియోగపర్చినట్లుగా ఎందుకు పరిగణించరాదు. చర్చలతో సంబంధం ఉన్న నిర్వాహకులే వ్యాసాలనూ, చర్చాపేజీలను తొలిగించడం, సభ్యులపై నిరోధం విదించడం లాంటివిచేస్తే మామూలు సభ్యుల ఎదుట తమ నిర్వాహక హోదా ప్రతాపాన్ని చూపించినట్లుగా ఎందుకు భావించరాదు? నిర్వాహక హక్కులనేవి తమకు అనుకూలంగా ఉపయోగించడం తప్పు కాదా? కొందరు నిర్వాహకులు అలా చేస్తున్నప్పుడు మిగితా నిర్వాహకులు ఎందుకు పట్టించుకోవట్లేదు? నాకు గుర్తున్న ఒక ఉదాహరణ చెబుతాను- సెప్టెంబరు 15, 2008 నాడూ రాజశేఖర్ గారు అలవాటుగా మరో అతిచిన్న వ్యాసం ప్రారంభించారు. చూడండి అది అతిచిన్న వ్యాసం (ఏకవాక్యం) మాత్రమే కాకుండా కేవలం ఊహ ప్రకారం రాసిన విషయ పరిజ్ఞానం లేని వాక్యం. అయిననూ నేను వాటిని తొలిగించకుండా రాజశేఖర్ గారి చర్చా పేజీలో వ్రాశాను (చూడండి) ఆ చర్చలో కాసుబాబు గారు చెప్పిన విషయాలు మాత్రం గుర్తించుకోవాలి. దాని ప్రకారం చెప్పాలంటే వ్యాసం ప్రారంభించినవారే సమగ్రవ్యాసంగా తీర్చిదిద్దాలనేది ఏమీ లేదు. విషయ పరిజ్ఞానం లేకున్నా వ్రాసే అధికారం అందరికీ ఉంది. మొలకలు లేకుండా వృక్షాలు పెరగవు గనుక మొలక వ్యాసాలు మొదలు పెట్టడం అవసరమేనని కూడా కాసుబాబు చెప్పారు. అయితే ఆ వ్యాసాన్ని వెంటనే కాసుబాబు మరియు నేను కలిసి విస్తరించామే కాని తొలిగింపునకు ఎటువంటి ప్రయత్నం చేయలేమని గుర్తించుకుంటే మంచిది. "వికీ పట్ల ఉన్న తపనతో ఒక తపస్విలా రాజశేఖర్ చాలా వ్యాసాలు సృష్టించారు కాని అవి అతి అయినాయని నాకు అనిపిస్తుంది" అని కాసుబాబు గారు రాజశేఖర్ గారినుద్దేశించి (సున్నితంగా చురక అంటిస్తూ) చెప్పారు కాని ఎలాంటి చర్యలు తీసుకోలేరు. ఇప్పుడు దానికి సరిగ్గా వ్యతిరేక భావన రాజశేఖర్ గారు రెడ్డి గారిపై చూపిస్తున్నారనిపిస్తుంది. అంతకు ముందే అంటే మే 2, 2008 నాడే రాజశేఖర్ గారి చర్చాపేజీలో చిన్న వ్యాసాలు వద్దండీ అని చెప్పానే కాని తొలిగింపుకు ప్రతిపాదన చేయలేను. ఇప్పుడు రెడ్డిగారు సృష్టించిన చిన్న వ్యాసాల కంటే కొన్ని రెట్లు అధికంగా రాజశేఖర్ గారు అతిచిన్న వ్యాసాలు సృష్టించినప్పుడు లేని వివాదం ఇప్పుడెలా వచ్చింది. ఇదివరకు చిన్నవ్యాసాలు సృష్టించిన రాజశేఖర్ గారు వాటిని పూర్తిచేయకుండానే ఇపుడు ఈ వివాదంలో రెడ్డిగారిపై నిష్కారణంగా చర్యలను తీసుకోవడం సమంజసమేనా? ఈ వివాదం ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు? ఇప్పటికే ఇంతవరకు ఏ చర్చా జరగనంత సుధీర్ఘంగా దీనిపై జరిగింది. కొందరు ఉదాసీనంగా వ్యవహరించడం, మరికొందరు దుడుకుగా వ్యవహరించడం సరైనదేనా? తెవికీలో వ్యాసాలు వ్రాయడం దిద్దిబాట్లు చేయడం ఎంత అవసరమో నిర్వహణ పనులు చేయడం అంతకన్నా అవసరం అని ఎందుకు గుర్తించడం లేదు. నియమాలు స్పష్టంగా లేకున్ననూ సభ్యులపై తీవ్ర చర్యలు తీసుకొనడం సమంజసమేనా? రెడ్డిగారు ఎవరిపై విమర్శలు చేయకుండా, తనపై చర్యలు తీసుకున్నా మౌనంగానే ఉంటూ వ్యాసాల అభివృద్ధికై కృషిచేస్తుంటే అతని(వ్యాసాల)పై నలువైపులా అందరూ దాడికి పూనుకోవడం ఒక సభ్యుని దిద్దుబాట్ల హక్కులను భంగం కలిగించినట్లు కాదా? ఈ వివాదాన్ని స్వస్తి పలకడానికి ఏకైకమార్గం రెడ్డిగారికి ప్రస్తుతమున్న చిన్న వ్యాసాలు వృద్ధిపర్చడానికి వీలుకల్పిస్తూ కొత్త వ్యాసాలు సృష్టించరాదని తెలియపర్చడమే. దీనిపై మరెవరూ మళ్ళీమళ్ళీ అతని దిద్దుబాట్లుకు భంగం కలిగించరాదు. చివరగా నా అభిప్రాయం చెప్పాలంటే నేనూ చిన్న వ్యాసాలకు వ్యతిరేకినే. ఇదే విషయం ఎందరికో చెప్పాను. నియమాలు స్పష్టంగా లేకుండుటచే ఎలాంటి చర్యకు వీలుకలుగలేదు. ఇప్పుడూ అవే నియమాలున్ననూ చర్యలు తీసుకోవడం, నిషేధం విధించడం బాగుండదు. అలాగే ఏకవచన ప్రయోగం తప్పుకాదని తెలియజేస్తున్నాను. ఇక సెలవు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:23, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ, చాలా కాలం తర్వాత రచ్చబండలో మీ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించారు.తెవికీలోని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనే దిశగా నిర్వాహకులు మరియు సభ్యులు ప్రయత్నిస్తే బాగుంటుంది. ఇక్కడ ఎవ్వరూ అధికులు కారు. తమ తమ విషయ పరిగ్నాగ్నానాన్ని ఇతరులతో పంచుకోవాలనే తెవికీ లక్ష్యానికి సభ్యులందరూ తోడ్పడాలని కోరుకొంటున్నాను. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:01, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దిగజారటం మొదలైంది కనుక నేనూ దిగజారిపోవాలని నిర్ణయించుకొన్నాను అదీ చంద్రకాంతరావు దయవలన అతడికి ఏకవచనం తప్పుకాదు కనుక ఇలా రాస్తున్నాను. ఒక సభ్యుని తప్పులను సరిదిద్దుతూ అతనికి సహాకారము అందించుట సీనియర్ సభ్యుల భాద్యత. రెడ్డి పై మొదట్లో ఎవరికీ ఏ భావమూ లేదు కొంతవరకూ అందరూ సహకరించారు. కాని ఎందరు సరిదిద్దలని ప్రయత్నించినా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేయడం వలన ఈ సమస్య తలెత్తింది. అతడు చెప్పినా ఎందుకు చేయడం లేదు అనేదే సమస్య. తెలియనపుడు నేర్చుకోవడం అనేది మమూలే కాని ఎందరు రాసినా చూడనట్టుగా తనపని తాను చేసుకు వెళ్ళడం ఇతర సభ్యులను అగౌరవపరచడం అవుతుంది. సభ్యులు వీటి గురించి అతడి సభ్యపేజీలో రాసిన సమాచారము అంతా చెరిపేయడం చేస్తాడని నీకు తెలియనట్టున్నది. నాకెందుకులే వదిలేద్దాం అనుకోవడానికి ఇది నాదీ నీదీ రెడ్డి యొక్క సొంత సైట్ కాదు. నాకు అతడు ఎవరో తెలియదు. రెండు వ్యాసలకు సంభందించిన సమాచారం ఒకేవిధంగా ఉండుట వలన విలీనం చేసాను. దానిని అతడు మళ్ళీ సృష్టించాడు. నేను విలీనం చేసాను అని చెప్పి మళ్ళీ సృష్ట్ంచవద్దని మళ్ళీ తొలగించాను అతడు మళ్ళీ సృష్టించాడు. ఇదేమన్నా ఆటా పనీ పాటా లేకుండా చేస్తూ పోవడానికి. వ్లీనం చేసిన వ్యాసాన్నే ఎందుకు అభివృద్ది పరచకూడదు. అలా జరిగితే అతడు నువ్వు అనే అవసరమే ఉండదు. ఎవరినైనా సమర్ధించాలనుకొన్నపుడు అతడు ఏం చేస్తున్నాడు అని చూసి మొదట అతడికి చెప్పి నీమాట వింటే అపుడు సమర్ధించు. కనుక అతడిని సంస్కరించే పనిలో ఉండు.విశ్వనాధ్ (చర్చ) 13:03, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిజంగానే దిగజారినందులకు చాలా సంతోషం. పూర్తిగా దిగజారిన సభ్యునికి ఇక చెప్పడం అంటూ ఏమీ ఉండదు. తెవికీ సమాజానికి నేను చెప్పదలుచుకున్నదేమంటే అసలు ఈ చర్చ ఇన్ని నెలలు సుధీర్ఘకాలం జరిగిందంటే అది ఎలా మొదలైంది అనేది పరిశీలిస్తే కేవలం ఒక్క ఏకవచనం పదం వల్లనే. నెలల తరబడి సభ్యునిపై దాడులపై దాడులు విషయం అందరికీ తెలుసు కాని ముగింపు కావడం లేదు. నిర్వాహకులు వారికి తోడు కొందరు కొత్త సభ్యులు (?) జతకావడంతో సమస్య మరింత ముదిరిపోయింది. చివరగా నేను చెప్పిన అభిప్రాయాలలో రెడ్డిగారికి ఏకోశాన మద్దతు పలకడం కాని, అతను చేసింది సరైనదేనని ఎక్కడా చెప్పలేను. నిర్వాహకులు, కొందరు సభ్యులు కలిసి పదేపదే దాడి చేయడాన్ని మాత్రం తప్పుపట్టాను. నిర్వాహకహోదా దుర్వినియోగపర్చడాన్ని తప్పుపట్టాను. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారికి మద్దతు ఇవ్వకపోవడమే నేను చేసిన తప్పు!! కొందరి పొరపాటు వల్ల సభ్యుడు తన వ్యాసాలను రక్షించుకోవడానికి దీనంగా నిర్వాహకుల సహాయం అర్థింస్తుంటే, తప్పు చేస్తున్నవారికి మీది తప్పు అనడమే సరైనది కాకుంటే ఇది నిరంకుశమే తప్ప ప్రజాస్వామ్యమనిపించుకోదని అర్థం చేసుకోని వారికి నేను చెప్పేదేమీ ఉండదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:37, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త సభ్యులకు ప్రోత్సాహం ఇవ్వండి విశ్వనాద్ గారు అని హెడ్డింగ్ పెట్టి మరీ మొదలెట్టారు. 2006 నుండి నేను వికీలో పని చేస్తున్నాను. ఇంతవరకూ ఏ సభ్యుడినీ నేను ఇబ్బంది పెట్టిన సంధర్భం లేదు. ఉంటే చూపించండి నేను తెవికీ నుండి తప్పుకుంటాను శాశ్వతంగా. ఇక అదే 2006 నుండి ఇప్పటి వరకూ ఎందరినో సభ్యులను చూసాను ఎవరూ ఎవరినీ ఏకవచనంతో రాయడం జరగలేదు. మరి మీ ఇద్దరే ఎందుకు చేస్తున్నారు. ఎవరు ముందుగా దిగజారినట్టు. నువ్వా నేనా. చాలా రోజుల ముందు రెడ్డి సభ్య పేజీలో ఇదే విషయం రాసాను. దయచేసి ఏకవచనంతో సంభోదించకండి అని (దించకం'డీ అని) అతడు మళ్ళీ అదే చేసాడు. అప్పుడు అది నీకు చాలా బావున్నట్టున్నది. ఇక నుండి అందరూ మర్యాద లేకుండా ఎవరిని బడితే వాళ్ళను ఎలాగైనా సంభోదించవచ్చునని నువ్వు శెలవిచ్చావు, కాదు నువ్వు మరియు రెడ్డి కలిసి వికీలో ఒక సరికొత్త ఒరవడి ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. రెడ్డి యొక్క ఒక వ్యాసాన్ని విలీనం చేసినందుకే నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ రెడ్డి గురించి ఇలా రాసావు" దీనిపై మరెవరూ మళ్ళీమళ్ళీ అతని దిద్దుబాట్లుకు భంగం కలిగించరాదు. అని ఇదేమైనా రూలా చంద్రకాంతరావూ. అంటే ఇక ఏ సభ్యుడూ రెడ్డి ఏం రాసినా దానికి అభ్యంతర పెట్టకూడదా. అంతేనా ఇంకా మరేమైనా రూల్సు ఉన్నాయా.నీకు మాత్రమే తెల్సినవి. తెలియచేస్తే మేమంతా పాఠిస్తాం.విశ్వనాధ్ (చర్చ) 15:56, 18 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

"అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు" అనే వాక్యంలో ఏకవచన ప్రయోగం తప్పు కాదు అంటే, అమ్మ గారిని, నాన్న గారిని ఏకవచనంతో పిలవమని కాదు. మీ YVSREDDY (చర్చ) 00:20, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఎవరైనా నీ నాన్నను బయటకు రమ్మను అని పిల్చేదానికీ, మీ నాన్న గారిని బయటకు రమ్మనండి అని పిలిచేదానికీ చాలా వ్యత్యాసం ఉంది. నీ మీ ల మద్య అంతరం నీకు తెలియదు అది నీకు అర్ధం కాకనే ఏకవచనాలు మొదలెట్టావు నీపేజీలో తోటి సభ్యులను గౌరవించండి అని నేను రాస్తే అది చెరిపేసావు. ఎవరైనా దేనిగురించైనా రాస్తున్నా చెరిపేసుకుంటున్నావు. మంచిగా ఉండేవి మాత్రమే ఉంచుకొంటూ అలాటి వాటిని చెరిపేయడం ద్వారా కొత్తగా నీ పేజీ చూసేవాళ్ళను తప్పుదోవ పట్టించి ఈయన మీద అందరూ కలసి దాడి చేస్తున్నారు అనిపించేలా చేయడం అంత మంచిది కాదు. తప్పులు చేయడం సహజం సరిదిద్దుకోవడం అంతే సహజం. వికీలో ప్రవేశించిన మొదట్లో ప్రతి ఒక్కరికీ జరిగేదే ఇది. దీనిగురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు.విశ్వనాధ్ (చర్చ) 07:19, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తికాలం నిషేధం ఎందుకు విధించాలి?

చంద్రకాంతరావు గార్కి నమస్కారములు,

మీకు నేసు చేసిన చర్యలు దుశ్చర్యలుగా భావించినట్లయితే మీరుకూడా నిర్వాహకులే కదా! నన్ను కారణం చూపి పూర్తి కాలం నిషేధించండి. తెవికీకి మీరే శాశ్వత సభ్యులుగా ఉండండి. సంతోషిస్తాను. నేను ఏఒక్కరి వ్యాసాల పైనావివక్ష వహించడం లేదు. ఎన్నో పూర్తిగా విషయం లేని వ్యాసాలను తెలియజేశాను.అజ్ఞాత వాడుకరులు సృష్టించిన అనవసర పేజీలలో తొలగింపు మూసలుంచాను. వ్యాసాలలో తప్పులను తెలియజేశాను. అలా తెలియజేయతం తప్పంటారా! నేను ఏనాడు ఏ ఒక్క వ్యాసాన్ని గాని, వ్యాస భాగాన్ని గాని తొలగించటం చేయలేదని గమనించగలరు. చాలా మంది సభ్యుల వ్యాసాల పై అభిప్రాయాలను తెలియ జేశాను. మీరు నా రచనలు లో చూసి పరిశీలించండి. నాకు "తొలగింపు", "విలీనం","విస్తరణ " , "అనువాదం" మూసలు ఉంచే హక్కు లేదంటారా? నేను ప్రతిపాదన చేసిన తర్వాత దానిపై చర్చ జరిగి నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలి. నేను తొలగించమంటే మీ నిర్వాహకులు తొలగిస్తారా? దానిపై చర్చ అవసరం లేదా! అటువంటి మూసలు ఉంచటం తప్ప నేను తెవికీ ప్రమాణాలను, నాణ్యతను ఏ విధంగా దిగజార్చలేదని మీరు గమనించాలి. అటువంటి మూసలు ఉంచటం తెవికీ విధివిధానాలకు అనుగుణంగా లేకపోతే అటువంటి మూసలు పూర్తిగా నిషేధించండి. నేను ప్రతిపాదన చేసిన తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నాను. మీరెవరూ చర్చలో పాల్గొనకుండా తొలగించి ఆ తప్పు, వివక్ష నాపై జల్లడం భావ్యమా! మీకు పైన నేను తెలిపిన చర్యలు యిష్టం లేనట్లయితే నన్ను నిషేధించండి. నిషేధించే ముందు ఈ రచ్చబండలో నేను చేసిన తప్పులను తెలియజేయండి. యిక సెలవు.(Somu.balla (చర్చ) 14:49, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

నాపై గౌరవనీయ నిర్వాహకులు చంద్రకాంతరావు గారు చేసిన వ్యాఖ్యకు స్పందించండి.నిర్వాహకులు,సహసభ్యులు నేను చేసిన విధానం తప్పు అంటే తప్పుకుంటాను.(Somu.balla (చర్చ) 14:49, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
సోము గారు. మీరు చేసింది, నేను చేస్తున్నది. వికీ అభివృద్ధి కోసం. ఏ ఒక్కరిని ఉద్దేశించినవి కావు. మీలాంటి కృషిచేస్తున్న వారు వికీపీడియాకు చాలా అవసరం. ఒక్క రెడ్డిగారిని నియంత్రించడం ఒక్కటే మన పని కాదు. ఇంకా చాలా ఉన్నది. దయచేసి దయచేసి తప్పుకోవద్దు.Rajasekhar1961 (చర్చ) 15:28, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నా వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారు. సాక్పిప్పెట్ అయితేనే పూర్తికాలం నిషేధం అన్నాను కాని మాటిమాటికి ఒక సభ్యుని జోక్యం చేసుకున్న మాత్రానికే పూర్తినిషేధం అనలేను. అయిననూ ఒక సభ్యునికి వ్యతిరేకంగా మరీ ఇంతగా అతని దిద్దుబాట్ల విషయంలో జోక్యం చేసుకోవడం అవసరమా అని మీరే ఆలోచించండి. చిన్న వ్యాసాల సమస్య అనేది మొదట నుంచే ఉన్నది. సంవత్సరాల నుంచీ ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి కాని ఏ ఒక్క సభ్యునిపై ప్రత్యేకించి ఇలాంటి వ్యతిరేక భావనలు రాలేవు. ఆ సంగతి వదిలేయండి. ఇక మీ విషయానికి వస్తే మీరు ఏ సభ్యునికీ సాక్పిప్పెట్ కాకపోతే మీకు అభ్యంతరం ఎందుకు? ఒకవేళ సోముబల్లా, రోజారాణి, సంతు కొత్త సభ్యపేర్లు సాక్పుప్పెట్ అయితే సంబంధిత సభ్యులు ముందే ఒప్పుకోవడం మంచిది. మెటావికీలో స్టీవార్డులను సంప్రదిస్తే మొత్తం తెలిసిపోతుంది. ఇదివరకే ఒక సభ్యత్వం ఉండి ఉద్దేశ్యపూర్వకంగా మరో సభ్యత్వంతో ఇతరులను ఇబ్బందిపరిస్తే మాత్రం తప్పకుండా పూర్తికాలం నిషేధం విధించాల్సిందే. దానికి ఎవరూ అడ్డుచెప్పరు. అలాగే మీరు పైన చెప్పిన కొన్ని వ్యాఖ్యలు సమంజసంగా లేవు. "అటువంటి మూసలు ఉంచటం తెవికీ విధివిధానాలకు అనుగుణంగా లేకపోతే అటువంటి మూసలు పూర్తిగా నిషేధించండి" అనడం తెవికీ వ్యవస్థ పైనే దాడిచేయడం లాంటిది. మూసలున్నంత మాత్రాన ఎలా ఉపయోగించాలో మరీ చెప్పే అవసరం లేదనుకుంటాను. కత్తిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు అంత మాత్రాన దుర్వినియోగపర్చినందుకు తెలియజేస్తే కత్తి ఎందుకు తయారుచేశారు అని అనగలమా? సి. చంద్ర కాంత రావు- చర్చ 15:42, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డిగారిని నియంత్రించడమే పనికి పెట్టుకున్నారా? సి. చంద్ర కాంత రావు- చర్చ 15:42, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చాలా మంది సభ్యుల విషయం లేని వ్యాసాలపై వ్యాఖ్యానించాను. నేను "రెడ్డిగారి వ్యాసాలు" "X గారి వ్యాసాలు" అని భావించడంలేదు. తెవికీ వ్యాసాలుగా భావిస్తున్నాను. నేను విస్తరణ కొరకు సలహాలిస్తే సభ్యునికి నియంత్రించినట్లా! నేను ఏక, అర,పావు,అసలు విషయం లేని వ్యాసాలలో మాత్రమే తొలగింపు మూసలుంచాను. గాని ఉపయోగకరమైన వ్యాసాలలో ఉంచలేదని గమనించాలి. నేను మూసలను దుర్వినియోగ పరచడం లేదని తెలియ జేస్తున్నాను. ఒక సభ్యుని వేరొక సభ్యుడు నియంత్రించగలడా! ఆయన వ్యాసాలు విస్తరిస్తే అందరికీ సంతోషదాయకం.(Somu.balla (చర్చ) 15:57, 16 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
సభ్యునికి నియంత్రించినట్లు మీకు చెప్పలేను. "ఒక్క రెడ్డిగారిని నియంత్రించడం ఒక్కటే మన పని కాదు" అని పలికిన సభ్యునికి ఉద్దేశించి చెప్పినది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:01, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సోము గారు, తెవికీకి మీలాంటి చురుకైన సభ్యుల తోడ్పాటు ప్రస్తుతం చాలా అవసరం. నాణ్యమైన వ్యాసాల కొరకు మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం. దయచేసి చంద్రకాంతరావు గారి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ కృషిని ఇలాగే కొనసాగించి తెవికీ వ్యాసాలను మరింత మెరుగు పర్చాలని కోరుకుంటున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:14, 16 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికీ మనవి

ప్రస్తుతం వికీపీడియాలో క్రియాశీలకంగా మార్పులు చేస్తున్న అందరు సభ్యులకీ ఒక చిన్న మనవి. ఒక పది నిమిషాలు ఆగి ఈ మూడు పేజీలు చదవండి ప్లీజ్ (Deletionism, Exclusionism, Inclusionism). మూడింటిలో ఒక్క సిద్ధాంతాన్ని ఖరాఖండిగా వికీపీడియా పాటించదు. వికీపీడియన్లు పలు రకాలు. అలాగే తెవికీ సభ్యులు కూడాను. వారి వారి స్వభావ రీత్యా ఒక్కొక్కొరు ఒక దాని వైపు మొగ్గుచూపుతారు. అలా అన్ని రకాల సభ్యుల కృషి వళ్ల జరిగే కలగాపులగమే వికీపీడియా :-) టేకిట్ ఈజీ ఫ్రెండ్స్ --వైజాసత్య (చర్చ) 13:41, 17 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తిగత వ్యాసాలు తొలగింపు

షర్మిల అనే వ్యాసములో సదరు వ్యక్తి వ్యక్తిగత సమాచారం ఉన్నది. ఈమెకు ఎటువంటి ప్రభుత్వ పదవి లేదు. వ్యాసంలో రచయిత సదరు వ్యక్తిని స్థుతిస్తూ వ్రాయడం జరిగింది. ఈ వ్యాసం తొలగించాల్సిందిగా నిర్వాహకులకు మనవి. లేకపోతే ఇలాంటివి మరిన్ని పుట్టుకొచ్చే ప్రమాదం ఉన్నది.--గండర గండడు (చర్చ) 04:48, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసాన్ని ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారో ఆ వ్యాసం యొక్క పేజీ చర్చలో వ్రాయండి. తొలగించవచ్చు కానీ దానికి సరైన కారణాలుండాలి. వికీపీడియాలో వ్యాసం ఉండటానికి ప్రభుత్వ పదవులే ఉండనక్కర లేదు. ఒక సులువైన పరీక్ష ఏమిటంటే. వికీపీడియా, బ్లాగులు మరియు ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కాకుండా, వార్తాపత్రికలు, మేగజిన్సు, పుస్తకాలలో ఈ వ్యక్తి గురించిన సమాచారముంటే వికీపీడియాలో పేజీ ఉండటానికి అభ్యంతరము లేదనుకుంటా --వైజాసత్య (చర్చ) 07:01, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సత్యాగారూ, అలాగైతే అఫ్జల్ గురు మరియు కసబ్ ల గురించి కూడా తెవికీలో రాయవచ్చునా?--గండర గండడు (చర్చ) 10:58, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గండడు గారు, వ్రాయవచ్చు. Chavakiran (చర్చ) 11:06, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అజ్మల్ కసబ్ చూడండి. Chavakiran (చర్చ) 11:07, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చావా గారు మరియు సత్య గారు... చాలా ధన్యవాదాలండి.--గండర గండడు (చర్చ) 11:58, 19 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]