కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 2: పంక్తి 2:


==చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు==
==చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు==
మహమ్మదీయుల పాలనలో కమ్మవారు చౌదర్లు గా ఉండేవారు. కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు<ref>ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232.[http://www.archive.org/details/andhrulacharitra025965mbp]</ref>. [[కమ్మనాడు]], [[కమ్మ రాష్ట్రం]] అను ప్రదేశాల పేర్లు పెక్కు [[శాసనము]]లలో పేర్కొనబడినవి. ఒక [[కులము]]గా పదవ శతాబ్దము నుండి తెలియుచున్నది<ref>దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909[http://www.archive.org/details/CastesAndTribesOfSouthernIndiaVolV Castes and Tribes of Southern India]</ref>. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ అను శూద్ర కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు పుత్ర సంతానం కోసం తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. కావున నేడు ఉన్న కమ్మవారు కాకతీయ గణపతిదేవ మహారాజుకి మరియు జపపసేనాని చెళ్ళెళ్ళకు పుట్టినవారై యుండవచ్చును. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు. [[సూర్యదేవర నాయకులు]], [[ముసునూరి నాయకులు]], [[పెమ్మసాని నాయకులు]], తంజావూరు నాయకులు, [[మధురై నాయకులు]] దీనికి ఉదాహరణ.
కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు<ref>ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232.[http://www.archive.org/details/andhrulacharitra025965mbp]</ref>. [[కమ్మనాడు]], [[కమ్మ రాష్ట్రం]] అను ప్రదేశాల పేర్లు పెక్కు [[శాసనము]]లలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని బౌద్ధులు పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ ధరణికోట, భట్టిప్రోలు, చందవోలు మున్నగు ఊళ్ళు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక [[కులము]]గా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు<ref>దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909[http://www.archive.org/details/CastesAndTribesOfSouthernIndiaVolV Castes and Tribes of Southern India]</ref>. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ అను శూద్ర కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు. [[సూర్యదేవర నాయకులు]], [[ముసునూరి నాయకులు]], [[పెమ్మసాని నాయకులు]], తంజావూరు నాయకులు, [[మధురై నాయకులు]] దీనికి ఉదాహరణ.


==ప్రస్తుత స్థితి==
==ప్రస్తుత స్థితి==

12:16, 22 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

కమ్మ (Kamma) లేక కమ్మవారు అనునది దక్షిణ భారతదేశంలో ఒక కులం[1]. ఈ కులస్తులు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో కర్ణాటకలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 4 నుండి 5% ఉంటారని అంచనా.[2][3]. వీరి భాష ప్రధానంగా తెలుగు. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలోను, మరియు తమిళనాడులో కొన్ని ప్రాంతాల(కోయంబత్తూరు, మదురై, రాజాపాళ్యం, తంజావూరు)లోను ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరిని వివిధ ప్రాంతాలను బట్టి కోస్తా ఆంధ్ర లో చౌదరి, రాయలసీమ లో నాయుడు గా పిలుస్తారు. తమిళనాడులో నాయకర్ అనేది ఎక్కువగా వాడబడుతోంది.

చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు

కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు[4]. కమ్మనాడు, కమ్మ రాష్ట్రం అను ప్రదేశాల పేర్లు పెక్కు శాసనములలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని బౌద్ధులు పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ ధరణికోట, భట్టిప్రోలు, చందవోలు మున్నగు ఊళ్ళు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు[5]. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ అను శూద్ర కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు. సూర్యదేవర నాయకులు, ముసునూరి నాయకులు, పెమ్మసాని నాయకులు, తంజావూరు నాయకులు, మధురై నాయకులు దీనికి ఉదాహరణ.

ప్రస్తుత స్థితి

చాలాకాలం వ్యవసాయం ప్రధానమైన వృత్తిగా ఉన్న ఈ కులస్తులు నేడు రాజకీయ, పారిశ్రామిక, విద్య, వైద్య, వాణిజ్య, ట్రావెల్స్, నిర్మాణ రంగాల్లో రాణిస్తున్నారు. మీడియా రంగాలైన టివి, వార్తా పత్రికలు, సినిమా రంగాలు అధిక భాగం వీరికి చెందినవే.

ప్రముఖ వ్యక్తులు

  • యన్.టి రామారావు
  • అక్కినేని నాగేశ్వరరావు
  • అక్కినేని నాగార్జున
  • ఘట్టమనేని శివరామకృష్ణ
  • ఘట్టమనేని మహేష్ బాబు
  • ఉప్పు శోభన్ బాబు
  • రామోజీరావు
  • చంద్రబాబునాయుడు
  • మురళీమోహన్

మూలాలు

  1. కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006
  2. Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India, కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ
  3. 1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories, కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిధ్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి
  4. ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232.[1]
  5. దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909Castes and Tribes of Southern India
"https://te.wikipedia.org/w/index.php?title=కమ్మ&oldid=800629" నుండి వెలికితీశారు