బారామతి లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:बारामती लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 27: పంక్తి 27:


[[en:Baramati (Lok Sabha constituency)]]
[[en:Baramati (Lok Sabha constituency)]]
[[hi:बारामती लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:बारामती (लोकसभा मतदारसंघ)]]
[[mr:बारामती (लोकसभा मतदारसंघ)]]

14:56, 23 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

బారామతి లోకసభ నియోజకవర్గం (Baramati Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. కేంద్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఇక్కడి నుంచి 6 సార్లు విజయం సాధించాడు. తొలిసారి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తరఫున, 3 సార్లు కాంగ్రెస్ తరఫున, ఆ తర్వాత రెండు సార్లు నేషనలిస్ట్ పార్టీ తరఫున గెలుపొందినాడు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఈ నియోజకవర్గపు ప్రస్తుత లోకసభ సభ్యురాలు.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు

  1. దాండ్
  2. ఇందాపూర్
  3. బారామతి
  4. పురందార్
  5. భోర్
  6. ఖడక్‌వస్లా

విజయం సాధించిన అభ్యర్థులు

  • 1977: సంభాజీరావు కకాడే (భారతీయ లోక్‌దళ్)
  • 1980: శంకర్‌రావు పాటిల్ (కాంగ్రెస్ ఐ)
  • 1984:శరద్ పవార్ (ఇండీయన్ కాంగ్రెస్ సోషలిస్ట్)
  • 1985 (ఉప ఎన్నిక): సంభాజీరావు కకాడే (జనతా పార్టీ)
  • 1989: శంకర్‌రావు పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1991: అజిత్ పవార్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1996: శరద్ పవార్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1998:శరద్ పవార్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1999: శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
  • 2004: శరద్ పవార్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
  • 2009: సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)

2009 ఎన్నికలు

2009 లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుప్రియా సేలే తన సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాంతా నలవాడేపై 3,36,831 ఓట్ల మెజారిటీతో గెలుపొందినది. సుప్రియాకు 4,87,827 ఓట్లు రాగా, నలవాడేకు 1,50,996 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి

మూస:మహారాష్ట్ర లోకసభ నియోజకవర్గాలు