అభివాదం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: అభివాద మంత్రము అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధాన...
(తేడా లేదు)

09:38, 26 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

అభివాద మంత్రము అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధానం. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు అభివాదం మంత్రం ద్వారా పరిచయం చేసుకొనేవారు. ఈ మంత్రములో ఋషి ప్రవర, గోత్రం, శాఖ, సూత్రము, వ్యక్తి నామం, కులము వంటివి ఉంటాయి.

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు


ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత


సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ

.........................శర్మన్ అహం భో అభివాదయే ||

పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.

ఉదాహరణకు క్షత్రియ కులానికి చెందిన ఒక వ్యక్తి ఇలా చెబుతాడు: చతుస్సాగర పర్యంతం, గోబ్రాహ్మణేబ్య శుభం భవతు; అభివాదయే విశ్వామిత్ర, మధుచ్చంద, ధనుంజయ ఇతి త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్రస్య, ఆపస్తంభ సూత్ర, యజు సాఖాద్యాయీ రామకృష్ణ తేజ వర్మా నాం అహంభొ అభివాదయే.

"https://te.wikipedia.org/w/index.php?title=అభివాదం&oldid=801732" నుండి వెలికితీశారు