కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: hi:काकीनाड़ा लोक सभा निर्वाचन क्षेत्र
పంక్తి 108: పంక్తి 108:


[[en:Kakinada (Lok Sabha constituency)]]
[[en:Kakinada (Lok Sabha constituency)]]
[[hi:काकीनाड़ा लोक सभा निर्वाचन क्षेत्र]]
[[mr:काकिंदा (लोकसभा मतदारसंघ)]]
[[mr:काकिंदा (लोकसभा मतदारसंघ)]]

18:06, 5 మార్చి 2013 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వలన ఈ నియోజకవర్గం పెద్దగా మార్పులకు గురికాలేదు. ఈ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా జనరల్ స్థానాలుగానే ఉండటం విశేషం. ఈ నియోజకవర్గం పరిధిలో కాపు కులస్థులు అధికంగా ఉండుటవలన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్థులకే అత్యధిక సార్లు సీట్లు కేటాయించాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రిపదవులు కూడా చాలా సార్లు లభించాయి.[1] గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన యు.వి.కృష్ణంరాజు మంత్రిపదవిని పొందగా, రామసంజీవరావు కేంద్ర కమ్యునికేషన్ శాఖా మంత్రిగా పనిచేశాడు. రామసంజీవరావు కుమారుడైన పళ్ళంరాజు ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర రక్షణ శాఖా సహాయ మంత్రిగా కొనసాగుతున్నాడు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

నియోజకవర్గపు గణాంకాలు

  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 18,15,092 [2]
  • ఓటర్ల సంఖ్య: 12,42,734
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 15.31% మరియు 1.47%.

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

లోక్‌సభ పదవీకాలం గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952-57 సి.హెచ్.వి.రామారావు సి.పి.ఐ.
రెండవ 1957-62 బి. ఎస్. మూర్తి మరియు మొసలికంటి తిరుమలరావు భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 మొసలికంటి తిరుమలరావు భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 మొసలికంటి తిరుమలరావు భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 మల్లిపూడి శ్రీరామ సంజీవరావు భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977-80 మల్లిపూడి శ్రీరామ సంజీవరావు భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 మల్లిపూడి శ్రీరామ సంజీవరావు భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 తోట గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 తోట సుబ్బారావు తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 తోట గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ
పన్నెండవ 1998-99 ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ
పదమూడవ 1999-04 ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ
పదునాల్గవ 2004-2009 మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు భారత జాతీయ కాంగ్రెస్
15వ 2009-ప్రస్తుతం వరకు మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు భారత జాతీయ కాంగ్రెస్

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బిక్కిన విశ్వేశ్వరరావు పోటీ చేస్తున్నాడు. [3] కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.ఎం.పళ్ళంరాజు పోటీలో ఉన్నాడు. [4]

మూలాల విభాగం

  1. సాక్షి దినపత్రిక, తేది 13-09-2008
  2. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3
  3. ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
  4. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009