అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: to:Puleʻanga fakatahataha ʻAmelika (deleted)
చి Bot: Migrating 253 interwiki links, now provided by Wikidata on d:q30 (translate me)
పంక్తి 401: పంక్తి 401:
{{Link FA|zh}}
{{Link FA|zh}}


[[en:United States]]
[[hi:संयुक्त राज्य अमेरिका]]
[[kn:ಅಮೇರಿಕ ಸಂಯುಕ್ತ ಸಂಸ್ಥಾನ]]
[[ta:அமெரிக்க ஐக்கிய நாடு]]
[[ml:അമേരിക്കൻ ഐക്യനാടുകൾ]]
[[ab:Америка Еиду Аштатқәа]]
[[ace:Amirika Carékat]]
[[af:Verenigde State van Amerika]]
[[als:USA]]
[[am:አሜሪካ]]
[[an:Estatos Unitos]]
[[ang:Ȝeānedu Rīcu American]]
[[ar:الولايات المتحدة]]
[[arc:ܐܘܚܕܢܐ ܡܚܝܕܐ]]
[[arz:امريكا]]
[[as:আমেৰিকা যুক্তৰাষ্ট্ৰ]]
[[ast:Estaos Xuníos d'América]]
[[av:Америкалъул Цолъарал Штатал]]
[[ay:Istadus Unidus]]
[[az:Amerika Birləşmiş Ştatları]]
[[ba:Америка Ҡушма Штаттары]]
[[bar:Vaeinigte Staatn]]
[[bat-smg:JAV]]
[[bcl:Estados Unidos]]
[[be:Злучаныя Штаты Амерыкі]]
[[be-x-old:Злучаныя Штаты Амэрыкі]]
[[bg:Съединени американски щати]]
[[bi:Yunaeted Stet blong Amerika]]
[[bm:Amerika ka Kelenyalen Jamanaw]]
[[bn:মার্কিন যুক্তরাষ্ট্র]]
[[bo:ཨ་མེ་རི་ཁ་རྒྱལ་ཕྲན་མཉམ་འབྲེལ་རྒྱལ་ཁབ།]]
[[bpy:তিলপারাষ্ট্র]]
[[br:Stadoù-Unanet Amerika]]
[[bs:Sjedinjene Američke Države]]
[[bxr:Амеэрикын Нэгэдэһэн Улас]]
[[ca:Estats Units d'Amèrica]]
[[cbk-zam:Estados Unidos de America]]
[[cdo:Mī-guók]]
[[ce:Ӏамерикан ХӀоьттина Мехкаш]]
[[ceb:Estados Unidos]]
[[chr:ᏌᏊᎢᏳᎾᎵᏍᏔᏅᏍᎦᏚᎩ ᎾᎿ ᎠᎺᏰᏟ]]
[[chy:United States]]
[[ckb:ویلایەتە یەکگرتووەکانی ئەمریکا]]
[[co:Stati Uniti d'America]]
[[crh:Amerika Qoşma Ştatları]]
[[cs:Spojené státy americké]]
[[csb:Zjednóné Kraje Americzi]]
[[cu:Амєрїканьскꙑ Ѥдьнѥнꙑ Дрьжавꙑ]]
[[cv:Америкăри Пĕрлешӳллĕ Штатсем]]
[[cy:Unol Daleithiau America]]
[[da:USA]]
[[de:Vereinigte Staaten]]
[[diq:Dewletê Amerikayê Yewbiyayey]]
[[dsb:Zjadnośone staty Ameriki]]
[[dv:އެމެރިކާ]]
[[dz:ཡུ་ནའིཊེཊ་སི་ཊེས]]
[[ee:United States]]
[[el:Ηνωμένες Πολιτείες Αμερικής]]
[[eml:Stat Unî]]
[[eo:Usono]]
[[es:Estados Unidos]]
[[et:Ameerika Ühendriigid]]
[[eu:Ameriketako Estatu Batuak]]
[[ext:Estaus Unius]]
[[fa:ایالات متحده آمریکا]]
[[ff:Dowlaaji Dentuɗi]]
[[fi:Yhdysvallat]]
[[fiu-vro:Ameeriga Ütisriigiq]]
[[fo:USA]]
[[fr:États-Unis]]
[[frp:Ètats-Unis d’Amèrica]]
[[frr:Feriind Stoote foon Ameerika]]
[[fur:Stâts Unîts di Americhe]]
[[fy:Feriene Steaten]]
[[ga:Stáit Aontaithe Mheiriceá]]
[[gag:Amerika Birleşik Devletläri]]
[[gan:美國]]
[[gd:Na Stàitean Aonaichte]]
[[gl:Estados Unidos de América - United States of America]]
[[glk:آمریکا]]
[[gn:Tetã peteĩ reko Amérikagua]]
[[got:𐌱𐌰𐌽𐌳𐌰𐍂𐌴𐌹𐌺𐌾𐌰]]
[[gu:સંયુક્ત રાજ્ય અમેરિકા]]
[[gv:Steatyn Unnaneysit America]]
[[ha:Amurika]]
[[hak:Mî-koet]]
[[haw:‘Amelika Hui Pū ‘ia]]
[[he:ארצות הברית]]
[[hif:United States]]
[[hr:Sjedinjene Američke Države]]
[[hsb:Zjednoćene staty Ameriki]]
[[ht:Etazini]]
[[hu:Amerikai Egyesült Államok]]
[[hy:Ամերիկայի Միացյալ Նահանգներ]]
[[ia:Statos Unite de America]]
[[id:Amerika Serikat]]
[[ie:Federativ States de USA]]
[[ig:Njikota Obodo Amerika]]
[[ik:United States of America]]
[[ilo:Estados Unidos iti Amerika]]
[[io:Usa]]
[[is:Bandaríkin]]
[[it:Stati Uniti d'America]]
[[iu:ᐊᒥᐊᓕᑲ]]
[[ja:アメリカ合衆国]]
[[jbo:mergu'e]]
[[jv:Amérika Sarékat]]
[[ka:ამერიკის შეერთებული შტატები]]
[[kaa:Amerika Qurama Shtatları]]
[[kab:Iwunak Yedduklen]]
[[kbd:Америкэ Штат Зэгуэт]]
[[ki:United States]]
[[kk:Америка Құрама Штаттары]]
[[kl:Naalagaaffeqatigiit]]
[[km:សហរដ្ឋអាមេរិក]]
[[ko:미국]]
[[koi:Америкаись Ӧтлаасьӧм Штаттэз]]
[[krc:Американы Бирлешген Штатлары]]
[[ksh:Vereenichde Staate van Amerika]]
[[ku:Dewletên Yekbûyî yên Amerîkayê]]
[[kv:Америкаса Ӧтувтчӧм Штатъяс]]
[[kw:Statys Unys]]
[[ky:Америка Кошмо Штаттары]]
[[la:Civitates Foederatae Americae]]
[[lad:Estatos Unitos d'Amerika]]
[[lb:Vereenegt Staate vun Amerika]]
[[lbe:Американал ЦачӀунхьу Штатру]]
[[lez:Америкадин Садхьанвай Штатар]]
[[lg:Amereka]]
[[li:Vereinegde State van Amerika]]
[[li:Vereinegde State van Amerika]]
[[lij:Stati Unïi d'America]]
[[lmo:Stat Ünì d'America]]
[[ln:Lisangá lya Ameríka]]
[[lt:Jungtinės Amerikos Valstijos]]
[[ltg:Amerikys Saškierstuos Vaļsteibys]]
[[lv:Amerikas Savienotās Valstis]]
[[map-bms:Amerika Serikat]]
[[mdf:Америконь Соткс]]
[[mg:Etazonia]]
[[mhr:АУШ]]
[[mi:Hononga-o-Amerika]]
[[min:Amerika Serikat]]
[[min:Amerika Serikat]]
[[mk:Соединети Американски Држави]]
[[mn:Америкийн Нэгдсэн Улс]]
[[mr:अमेरिकेची संयुक्त संस्थाने]]
[[mrj:Америкын Ушымы Штатвлӓжӹ]]
[[ms:Amerika Syarikat]]
[[mt:Stati Uniti tal-Amerika]]
[[mwl:Stados Ounidos de la América]]
[[my:အမေရိကန်ပြည်ထောင်စု]]
[[myv:Американь Вейтьсэндявкс Штаттнэ]]
[[mzn:متحده ایالات آمریکا]]
[[na:Eben Merika]]
[[nah:Tlacetilīlli Tlahtohcāyōtl Ixachitlān]]
[[nap:State Aunite d'Amereca]]
[[nds:USA]]
[[nds-nl:Verienigde Staoten van Amerika]]
[[ne:संयुक्त राज्य अमेरिका]]
[[new:अमेरिका]]
[[nl:Verenigde Staten]]
[[nn:USA]]
[[no:USA]]
[[nov:Unionati States de Amerika]]
[[nrm:Êtats Unnis d'Améthique]]
[[nso:United States of America]]
[[nv:Wááshindoon Bikéyah Ałhidadiidzooígíí]]
[[oc:Estats Units d'America]]
[[om:USA]]
[[or:ଯୁକ୍ତରାଷ୍ଟ୍ର ଆମେରିକା]]
[[os:Америкæйы Иугонд Штаттæ]]
[[pa:ਸੰਯੁਕਤ ਰਾਜ ਅਮਰੀਕਾ]]
[[pag:Estados Unidos]]
[[pam:Estados Unidos]]
[[pap:Estadonan Uni di Merka]]
[[pcd:États-Unis Anmérikes]]
[[pdc:Amerikaa]]
[[pfl:Verainischde Schdaade vun Ameriga]]
[[pih:Yunitid Staits]]
[[pl:Stany Zjednoczone]]
[[pms:Stat Unì d'América]]
[[pnb:امریکہ]]
[[ps:د امریکا متحده ایالات]]
[[pt:Estados Unidos]]
[[qu:Hukllachasqa Amirika Suyukuna]]
[[rm:Stadis Unids]]
[[rn:Leta z’Unze Ubumwe za Amerika]]
[[ro:Statele Unite ale Americii]]
[[roa-rup:Vãsãliili Diadunu ali Americhia]]
[[roa-tara:Statère Aunìte d'Americhe]]
[[ru:Соединённые Штаты Америки]]
[[rue:Споєны Штаты Америцькы]]
[[rw:Leta Zunze Ubumwe z’Amerika]]
[[sa:संयुक्तानि राज्यानि]]
[[sah:Америка Холбоһуктаах Штааттара]]
[[sc:Istados Unidos de Amèrica]]
[[scn:Stati Uniti]]
[[sco:Unitit States]]
[[sd:آمريڪا]]
[[se:Amerihká ovttastuvvan stáhtat]]
[[sg:ÂKödörö-ôko tî Amerîka]]
[[sh:Sjedinjene Američke Države]]
[[si:ඇමරිකානු එක්සත් ජනපදය]]
[[simple:United States]]
[[sk:Spojené štáty]]
[[sl:Združene države Amerike]]
[[sm:Iunaite Sitete o Amerika]]
[[sn:United States of America]]
[[so:Mareykanka]]
[[sq:Shtetet e Bashkuara të Amerikës]]
[[sr:Сједињене Америчке Државе]]
[[srn:Kondre Makandrameki]]
[[ss:IMelika (live)]]
[[stq:Fereende Stoaten fon Amerikoa]]
[[su:Amérika Sarikat]]
[[sv:USA]]
[[sw:Marekani]]
[[szl:Zjednoczůne Sztaty]]
[[tet:Estadu Naklibur Sira Amérika Nian]]
[[tg:Иёлоти Муттаҳидаи Амрико]]
[[th:สหรัฐอเมริกา]]
[[tk:Amerikanyň Birleşen Ştatlary]]
[[tl:Estados Unidos]]
[[tn:USA]]
[[tpi:Ol Yunaitet Stet]]
[[tr:Amerika Birleşik Devletleri]]
[[ts:United States]]
[[tt:Америка Кушма Штатлары]]
[[tw:USA]]
[[ty:Fenua Marite]]
[[udm:Америкалэн Огазеяськем Штатъёсыз]]
[[ug:ئامېرىكا قوشما شىتاتلىرى]]
[[uk:Сполучені Штати Америки]]
[[ur:ریاستہائے متحدہ امریکہ]]
[[uz:Amerika Qoʻshma Shtatlari]]
[[vec:Stati Unii de ła Mèrica]]
[[vep:Amerikan Ühtenzoittud Valdkundad]]
[[vi:Hoa Kỳ]]
[[vls:Verênigde Stoaten van Amerika]]
[[vo:Lamerikän]]
[[wa:Estats Unis]]
[[war:Estados Unidos]]
[[wo:Diiwaan yu Bennoo]]
[[wuu:美国]]
[[xal:Америкин Ниицәтә Орн Нутгуд]]
[[xh:IYunayithedi Steyitsi]]
[[xmf:ამერიკაშ აკოართაფილი შტატეფი]]
[[yi:פאראייניקטע שטאטן פון אמעריקע]]
[[yo:Àwọn Ìpínlẹ̀ Aṣọ̀kan Amẹ́ríkà]]
[[za:Meijgoz]]
[[zea:Vereênigde Staeten]]
[[zh:美国]]
[[zh-classical:美國]]
[[zh-min-nan:Bí-kok]]
[[zh-yue:美國]]
[[zu:IMelika]]

22:52, 8 మార్చి 2013 నాటి కూర్పు

ప్రవేశిక

"అమేరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు అమెరికా (అయోమయ నివృత్తి) చూడండి.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Flag of అమెరికా అమెరికా యొక్క Great Seal
నినాదం
In God We Trust  (official)
[E Pluribus Unum] Error: {{Lang}}: text has italic markup (help)  (From Many, One; Latin, traditional)
జాతీయగీతం
"The Star-Spangled Banner"
అమెరికా యొక్క స్థానం
అమెరికా యొక్క స్థానం
రాజధానివాషింగ్టన్ డి.సి.
38°53′N 77°02′W / 38.883°N 77.033°W / 38.883; -77.033
అతి పెద్ద నగరం న్యూయార్క్
జాతీయ భాష కేంద్ర స్థాయిలో అధికారిక భాష ఏదీ లేదు (28 రాష్ట్రాలలో ఆంగ్లం అధికారిక భాష)
ప్రజానామము American
ప్రభుత్వం కేంద్రీకృత అధ్యక్ష తరహా రాజ్యాంగబద్ధ సమాఖ్య
 -  అధ్యక్షుడు బారక్ ఒబామా (డెమొక్రాట్)
 -  ఉపాధ్యక్షుడు రిఛర్డ్ 'డిక్' చెనీ (డెమొక్రాట్)
 -  స్పీకరు నాన్సీ పెలోసీ (డెమొక్రాట్)
 -  ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్
స్వాతంత్ర్యం (గ్రేట్ బ్రిటన్ నుండి)
 -  ప్రకటన జులై 4 1776 
 -  గుర్తింపు సెప్టెంబరు 3 1783 
 -  జలాలు (%) 6.76
జనాభా
 -  2000 జన గణన 281,421,906[1] 
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $14.046 trillion[2] (1st)
 -  తలసరి $45,968 (4th)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $14.306 trillion[2] (1st)
 -  తలసరి $46,820 (12th)
జినీ? (2006) 47.0[3] 
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) 0.951 (high[4]) (12th)
కరెన్సీ United States dollar ($) (USD "$")
కాలాంశం (UTC-5 to -10)
 -  వేసవి (DST)  (UTC-4 to -10)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .us .gov .mil .edu
కాలింగ్ కోడ్ +1

అమెరికా సంయుక్త రాష్ట్రాలు లేదా అమెరికా ఉత్తర అమెరికా ఖండములోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలతో భూసరిహద్దు మరియు అలాస్కా వద్ద రష్యాతో సముద్ర సరిహద్దు కలదు. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డి.సి.. ఉత్తర దిశలో కెనడా దేశం, తూర్పు దిశలో అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ దిశలో మెక్సికో మరియు పడమట పసిఫిక్ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున అట్లాంటా రాష్ట్రం ఉంది దీనికి పడమరలొ బెర్లింగ్ స్ట్రైట్ ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ రాష్ట్ర ద్వీపసమాహారం పసిఫిక్ సముద్ర మధ్యలో ఉంది. ఈ దేశం ఆధీనంలో పసిఫిక్, మరియు కరేబియన్ సముద్ర మద్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు (9.83 మిలియన్ కి.మీ2) వైశాల్యం మరియు 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం మరియు జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకున్న దేశంగానే కాక అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు కలిగి ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము (చైనా వైశాల్యము లెక్కపెట్టడములో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టి అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచములో అత్యధిక జనాభా కలిగిన మూడవ దేశము.


ప్రస్తుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పిలువబడుతున్న నేలపై 15,000 సంవత్సరాల నుండి ఆసియా నుండి వలస వచ్చిన పాలెయోఇండియన్లు ఆదివాసీ ప్రజలు నివాసము ఏర్పరుచుకొన్నారు. అప్పటి నుండి స్థనిక అమెరికన్ సంతతి వారు అధికంగా క్షీణిస్తూ వచ్చింది. యురేపియన్ల వలసలు కొనసాగుతున్న సమయంలో యురేపియన్లతో ఒప్పందాలు జరిగే సమయంలో ప్రబలిన అంటు వ్యాధులు ఈ క్షీణతకు ఒక కారణం. స్వయంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న 13 బ్రిటిష్ వలసదారుల కాలనీలతో ఆరంభం అయింది. జూలై 4, 1776 కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయాధికారం మరియు సామ్రాజ్య విస్తరణ సూచిస్తూ స్వాతంత్రాన్ని ప్రకటించారు. అమెరికన్ తిరుగుబాటు రాష్ట్రాలు అమెరికన్ స్వాతంత్రోద్యమం పేరిట బ్రిటిష్ సాంరాజ్యం మీద విజయం సాధించారు. ఇది మొదటి కాలనీయుల స్వాతంత్ర యుద్ధంగా గుర్తింపు పొందింది. ప్రస్థుత అమెరికా సంయుక్త రాష్ట్రాలుసెప్టెంబర్ 17, 1787 న రూపు దిద్దుకుంది. తరువతి సంవత్సరం బలమైన కేంద్రప్రభుత్వం కలిగిన ప్రత్యేక రిపబ్లిక్ గా ఆమోదం పొందింది. తరువత 1791న ప్రాథమిక పౌర హక్కులు మరియు స్వేచ్ఛలు గురించి అనేక హామీలు ఇస్తూ ప్రజలకు 10 రాజ్యాంగ సవరణలతో హక్కుల చట్టం అమలైంది.

19వ శతాబ్ధంలో ఉత్తర అమెరికా విస్తరణ చేపడుతూ బలమైన కార్యచరణ మొదలు పెట్టింది. ఫ్రాంస్ నుండి లూసియానా ప్రాంతం స్పెయిన్ నుండి ఫ్లోరిడా ప్రాంతం కోరుతూ స్థానిక జాతులను వేరు ప్రదేశాలకు తరలించింది. యుద్ధం ద్వారా సగం మెక్సికోను స్వాధీనం చేసుకుని 1845లొ రిపబ్లిక్ ఆఫ్ టెక్సాసును తనతో ఐక్యం చేసుకుంది. 1867లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేసింది. ఆరంభకాల సామ్రాజ్య విస్తరణలో భాగంగా దక్షిణప్రాంతపు వ్యవసాయ బానిసలు- ఉత్తర ప్రాంతపు ఉత్తర ప్రాంతంలో ఉన్న ఫ్రీ సాయిల్ పారిశ్రామికుల ప్రతినిధుల మధ్య చెలరేగిన వివాదాలు అమెరికన్ ప్రజోద్యమానికి దారితీసాయి. ఉత్త్ర ప్రాంతీయుల విజయంతో యూనియన్ తిరిగి స్థాపించబడి అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యంగ సవరణలో 13వ దిద్దుబాటుకు దారితీసాయి. పీఠభూమి ఇండియన్ల యుద్ధం మిగిలిన స్థానిక జాతులను తిరిగి పరిమిత ప్రదేశాలకు తీసుకు వచ్చింది. తరువాత కాంగ్రషన్ నిర్ణయంతో హవాయి రిపబ్లిక్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో ఐక్యం అయింది. స్పానిష్ అమెరికన్ యుద్ధానంతరం జరిగిన ఒప్పందం ప్యూర్టో రికో మరియు గ్యూం ఒదులు కోవడంతీఓ ముగిసింది. 19వ శతాబ్ధపు చివరికి అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ ఆదాయం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది.

స్పానిష్ అమెరికన్ యుద్ధం మరియు మొదటి ప్రపంచ యుద్ధం దేశ ఆర్ధిక శక్తి మరియు అంతర్జాతీగా సైనిక శక్తిని వెలుగులోకి తీసుకు వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవతరించాయి. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మరియు అణుశక్తిని కలిగి ఉన్న మొదటి దేశంగా గుర్తింపును పొందింది. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా అవతరించడానికి సోవియట్ యూనియన్ తో జరిగిన అస్పష్టమైన యుద్ధంలో చివరకు సోవియట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఏకైక శక్తివంతమైన దేశంగా అంగీకరిస్తూ పోటీ నుండి వైదొలగింది. షుమారు $15.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల జిడిపి అభివృద్ధితో తో యు.ఎస్ ఆర్ధిక సంపద ప్రపంచంలో బృహత్తర జాతీయ సంపదగా గుర్తింపు పొందింది. దేశం అంతర్జాతీయ జిడిపి మరియు కొనుగోలు శక్తిలో 19% కలిగి ఉంది. తలసరి ఆదాయంలో అంతర్జాతీయంగా 6% స్థానంలో ఉంది. దేశాదాయంలో 41% తన అంతర్జాతీయ సైనిక ఖర్చు పెడుతుంది. అమెరికన్ సైనిక శక్తి ఆర్ధికపరంగా, రాజకీయంగాపరంగా మరియు సంస్కృతిక్ పరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉంది.

19వ మరియు 20వ శతాబ్దములలో అమెరికా యొక్క సైనిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాభవము క్రమక్రమముగా పెరిగినది. ప్రచ్చన్న యుద్ధం చివర సోవియట్ సమాఖ్య పతనముతో అమెరికా నేటి ప్రపంచములో ఏకైక అగ్రరాజ్యముగా అవతరించినది. నేడు ప్రపంచ వ్యవహారాలలో అమెరికా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది.

నామకరణం

క్రీ. శ. 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది. తరువాత జర్మన్ కార్టోగ్రాఫర్ మార్ట్ వాల్డ్‍సీ ముల్లర్ తన భౌగోళిక చిత్ర పటంలో దీనికి అమెరికా అనే పేరును ప్రతిపాదిస్తూ ప్రపంచపటాన్ని అందించాడు. జులై 4, 1776న ఈ పదాన్ని మొదటి సారి అధికారికంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటన లో వాడటం జరిగింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే పేరు నవంబరు 15, 1777 నుండీ అమల్లోకి వచ్చింది. దైనందిన వ్యవహారాల్లో ఈ దేశాన్ని యు. ఎస్. ఎ., యు. ఎస్., అమెరికా, స్టేట్స్, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. జూలై నాలుగు వివరణలో 13 రాష్ట్రాల స్వాతంత్ర ప్రకటనలో ఈ పేరును యుక్తమైన రీతిగా యునైటెడ్ స్టేట్స్ గా ప్రకటించబడింది. అమెరికా ఖండాన్ని కనుగొన్న యూరోపియన్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ పేరు మీదుగా గతంలో కొలంబియా అనే పేరు కూడా కొంత కాలం వాడుకలో ఉంది (ప్రస్తుతం ఈ పేరుతో దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశాన్ని పిలుస్తున్నారు)

1777, నవంబర్ 15, జరిగిన రెండవ ఖండాతంత కాంగ్రెస్ మహాసభ కాన్ఫెడరేషన్ యొక్క వ్యాసాల నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్న పదాన్ని దత్తత తీసుకుంది. 1778 న ఫ్రాంకో-అమెరికన్ ఒప్పందం ఈ దేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ అమెరికా గా పేర్కొన్నది. 1778 జూలై 11 నుండి పరస్పర చెల్లింపు రసీదులలో యునటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (అమెరికా సంయుక్త రాష్ట్రం)గా పేర్కొనబడింది. సాధారణంగా పిలవబడే దీని లఘునామం యునటెడ్ స్టేట్స్. యు.ఎస్, యు.ఎస్.ఎ మరియు అమెరికా అనేవి ఇతర లఘు నామాలు. 1700 ల నుండి సామాన్యులు యు ఎస్ ఆఫ్ ఎ అని అంతర్జాతీయంగా స్టేట్స్ అని అంటారు. కొలంబియా అని సాహిత్యంలో, పద్యాలలో పాటల్లో వాడుతుంటారు. ఇది క్రిస్టోబర్ కొంలంబస్ నుండి వచ్చింది. ఈ పేరు కొలంబియా జిల్లాకు పెట్టబడింది.

అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రజలను స్థిరంగా అమెరికన్ అంటారు. అధికారంగా సంయుక్తరాష్ట్రాలు(యునైటెడ్ స్టేట్స్) అంటున్నా అమెరికా మరియు యు.ఎస్ అని సాధారణంగా అంటుంటారు(యు.ఎస్ ఫోర్స్, అంరికన్ విలువలు ). ఆంగ్లంలో యునైటెడ్ లేకుండా అమెరికా అని అరుదుగా అంటూ ఉంటారు.

1865 నుండి యునైటెడ్ స్టేట్స్ 13వ రాజ్యాంగ సవరణ తరువాత యునైటెడ్ స్టేట్స్ అనే పదాన్ని సంయుక్తరాష్ట్రాలు అనేవి అని బహువచనంగా వాడుతుంటారు. ప్రజోద్యమం తరువాత నుండి ఇప్పటి వరకు వీటిని ఏక వచన రూపంలో వ్యవహరిస్తున్నారు.

చరిత్ర

స్థానిక అమెరికనులు, ఐరోపా వలసదారులు

హిమ యుగం ముందు ఇప్పటి అలాస్కా ప్రాంతం అసియా ఖండంలోని సైబీరియా తో కలుపుతూ సుమారు 1,000 మైళ్లు (1,600 కి.మీ.) పొడవైన భూమార్గం ఉండేది. దీన్ని బేరింగ్ వంతెన గా పిలుస్తారు. ఈ మార్గం గుండా సుమారు 25,000 సంవత్సరాల క్రితం ఆసియా వాసులు చిన్న చిన్న సముదాయాలుగా అమెరికా ఖండానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో స్థిర పడి సమాజాలుగా రూపొందారు. వీరు క్రమంగా వ్యవసాయం, కట్టడాల నిర్మాణం వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. హిమ యుగాంతాన (దాదాపు 11,000 సంవత్సరాల క్రితం) బేరింగ్ వంతెన సముద్రంలో మునిగిపోవటంతో వీరికి ఆసియా ఖండంతో సంబంధాలు తెగిపోయాయి. తిరిగి ఐరోపాకు చెందిన స్పానిష్ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ 1493, నవంబరు 19న పసిఫిక్ మహా సముద్రంలోని ప్యూర్టో రికో దీవిలో అడుగు పెట్టే వరకూ వీరినీ, వారితో పాటు రెండు అమెరికా ఖండాల ఉనికినీ మిగతా ప్రపంచం మర్చిపోయింది. ఈ కొత్త ప్రపంచానికి క్రమంగా అమెరికా ఖండం అనే పేరు స్థిర పడింది. అనాదిగా అక్కడ స్థిర పడిన ఆసియా సంతతి తెగల వారిని దేశీయ అమెరికన్లు (నేటివ్ అమెరికన్స్) గా పిలవనారంభించారు. ఐరోపావాసుల రాక మొదలయిన కొద్ది కాలానికే వారితో పాటు అమెరికాలో ప్రవేశించిన అంటువ్యాధుల తాకిడికి దేశీయ అమెరికన్లలో చాలా శాతం అంతరించిపోయారు.

యు.ఎస్ మూలవాసులని 4000 వేల సంవత్సరాలు మరియు 12 వేల సంవత్సరాల మద్యకాలంలో ఆసియా నుండి వలస వెళ్ళిన అలాస్కా వాసులని విశ్వసించబడుతున్నారు. కొలంబియన్ ముందు మిసిసిపి సంస్కృతి గా చెప్పబడుతున్న వీరు నాణ్యమైన వ్యవసాయం మరియు గొప్ప నిర్మాణాలు మరియు చిన్న చిన్న సమాజాలు అభివృద్ధి చేసారు. తరువాత యురేపియన్ వలసల కారణంగా దిగుమతి అయిన చిన్న అమ్మవారు వంటి అంటు వ్యాధులు ప్రబలిన కారణంగా మిలియన్ల కొలది యు.ఎస్ మూలవాసులు మరణించారు. ప్రస్థుతం యు.ఎస్ ప్రధాన భూమిగా వ్యవహరిస్తున్న ప్రదేశం ఒకప్పుడు యు.ఎస్ మూలవాసుల భూమిగా ఉండేది.

1492 లో స్పెయిన్ సాంరాజ్య ఒప్పందంతో క్రిస్టోఫర్ కొలంబస్ పలు కరేబియన్ ద్వీపాలను కనుగిని ఈ యు.ఎస్ మూలవాసుల వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏప్రెల్ 2, 1513, తారీఖున స్పానిష్ వీరుడైన జువాన్ పోన్స్ డె లియోన్ తాను లా ఫ్లోరిడా గా పేర్కొన్న ఈ ప్రాంతంలో ఒప్పంద పత్రాల ఆధారంతో ప్రస్థుత యు.ఎస్ ప్రధాన భూమిలో అడుగు పెట్టిన మొదటిన యురేపియన్ అయ్యాడు. తరువాత ప్రస్థుత సంయుక్త రాష్ట్రాల నైరుతి భాగంలో స్పెయిన్ ఒప్పందాల పరంపర ఆరంభం అయింది. ఫ్రెంచి ఉన్ని వ్యాపారులు న్యూ ఫ్రాంస్ పెద్ద పెద్ద సరసుల చుట్టూ స్థావరాలను ఏర్పరచుకున్నారు. చివరకు ఫ్రెంచ్ మెక్సికన్ ఖాంతం దుగువ భాగం లోని ఉత్తర అమెరికాలో అధికభాగం తమ ఆధీనంలోకి తీసుకువచ్చారు. 1607లో మొదటి ఆంగ్లేయ ఒప్పంద స్థావరాలు ప్రస్థుత జేంస్ టన్లో ఉన్న వర్జీనియా కాలనీ పేరుతో ఆవిర్భవించాయి. తరువాత 1620 పిలిగ్రింస్ మరియు ప్లే మౌత్ కాలనూలు స్థాపించారు. ఈ వలసల ప్రవాహ ఫలితంగా 1628 లో మసాచుసెట్స్ బే కాలనీ ఓడను అద్దెకు తీసుకున్నారు. 1610 తరువాత అమెరికన్ ఉద్యమ సమయంలో 50,000 మంది దోషులు బ్రిటన్ అమెరికన్ కాలనీలకు తరలించబడ్డారు. 1614 లో హడ్‍సన్ నదీ ప్రాంతాలలో న్యూ అమ్‍స్టర్‍డాం మరియు మాన్ హట్టన్ తో చేర్చి డచ్ వారు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.

1674 డచ్ వారి అమెరికన్ భూములను ఆంగ్లేయులకు వదిలారు. న్యూనెదర్లాండ్ రాష్గ్ట్ర భాగానికి న్యూయార్క్ అని నామకరణం చేసారు. కొత్తగా వచ్చి చేరిన వలసదారులలో మూడింట రెండు వంతుల వారు 1630-1680 మద్య కాలంలో ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతమైన వర్జీనియాకు వచ్చి చేరిన ఒప్పంద కూలీలే. 18వ శతాబ్ధానికి పలు ప్రాంతాలలో ఆఫ్రికన్ బానిసలు ఒప్పంద కూలీలకు ప్రధానవనరు అయ్యారు. 1729 నాటికి కరోలినా విభాగాలు మరియు 1732 నాటికి జార్జియా కాననీలు 13 బ్రిటిష్ కాలనీలు కలసి అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా స్థాపించబడింది. పురాతన ఆంగ్లేయుల హక్కుల పట్ల వృద్ధి చెందుతున్న భక్తి మరియు స్వతంత్ర ప్రభుత్వ లక్ష్యంతో అన్ని ప్రాటీయ ప్రభుత్వాలు స్వేచ్చాయుతమైన ఎన్నికలను నిర్వహించి రిపబ్లికన్ పార్టీని ఉతేజకరంగా బలపరచాయి. ఆఫ్రికన్ బానిస వ్యాపారం అంతా చట్టబద్ధం చేయబడింది. జననాల శాతం అధికమై మరణాల శాతం క్షీణిస్తూ వలసలను క్రమబద్ధం చేస్తూ దేశంలోని జనసంఖ్య విపరీతంగా వృద్ధి చెందింది. 1730-1740 మద్య కాలంలో తలెత్తిన క్రైస్తవ మత పునరుద్ధణోద్యమం ప్రజలలోని మతతత్వానికి మరియు మత స్వాత్యంత్రాన్ని నిద్రలేపింది. ఫ్రెంచ్ మరియు ఇండియన్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలు ఫ్రెంచ్ నుండి కెనడాను కైవశం చేసుకుంది. అయినప్పటికీ ఫ్రాంకోఫోన్ జనం రాజకీయంగా దక్షిణ కాలనీలకు అతీతంగా ఏకాంతంగా నిలిచింది. 13 బ్రిటిష్ కాలనీల నుండి వెలుపలకు పంతబడిన స్థానిక అమెరికన్లను మినహాయించి 13 బ్రిటిష్ కాలనీల జనసంఖ్య 1770 నాటికి 2.6 మిలియన్లకు చేరుకుంది. అమెరికన్లలో బ్రిటిష్ వారు మూడింట ఒక వంతులు, బానిసలుగా తీసుకురాబడిన ఆఫ్రికన్ అమెరికన్లు ఐదింట ఒక వంతు ఉన్నారు. బ్ర్తిష్ పన్ను విధానాలను అనుసరించి అమెరికన్ కాలనీ వాసులకు గ్రేట్ బ్రిటన్ రాజ్యాంగంలో పాల్గొనే హక్కు ఉండదు.

స్వాతంత్రం మరియు విస్తరణ

1760-1770 మద్య అమెరికమన్ కాలనీలు మరియు బ్రిటిష్ మద్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ తిరుగుబాటు యుద్ధానికి దారి తీసి 1775 నుండి 1781 వరకు యుద్ధం కొనసాగింది. జూన్ 14, 1775 న ది కాంటినెంటల్ కాంగ్రెస్ ఫిలడెల్ఫియాలో సమావేశం అయి జార్జి వాషింగ్టన్ అదేశంతో కాంటినెంటల్ ఆర్మీ పేరుతో సైన్యాన్ని స్థాపించారు. 1776 లో ప్రతి మనిషీ సమానంగా రూపొందించబడ్డాడు అలాగే రద్దు చేయలేని ప్రత్యేకంమైన హక్కులతో అనే తోమస్ జెఫర్సన్ నినాదంతో కాంగ్రెస్ స్వాతంత్రాన్ని ప్రకటించింది. ఆ రోజును ప్రస్తుతం అమెరికన్ స్వాతంత్ర దినంగా కొనియాడుతుంది. 1777 నుండి ఆర్టికల్స్ ఆఫ్ కాంఫిడరేషన్ చేత స్థాపించబడిన బలహీన మైన కాంఫిడరల్ ప్రభుత్వం 1789 వరకు కొనసాగింది.

ఫ్రెంచ్ మరియు స్పెయిన్ సహాయంతో అమెరికన్ సైనికులు బ్రిటిష్ ను ఓడించిన తరువాత గ్రేట్ బ్రిటన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్రం మరియు మిసిసిపి నది పడమట దిశ వరకు ఉన్న అమెరికన్ స్వయం ప్రతిపత్తిని గుర్తించింది. 1787 లో రాజ్యాంగ సమావేశాలు జరిపిపన్నులను విధించ కలిగిన బలమైన ఫెడరల్ ప్రభుత్వ స్థాపన చేయాలని కోరుకున్నారు. తరువాత 1788 లో సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ఏర్పడి అలాగే 1789లో రిపబ్లికన్ మొదటి సెనేటర్, ప్రతినిధుల భవనం మరియు ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ కార్యాలయం రూపుదిద్దుకుంది. 1791లో హక్కుల చట్టం, అసహ్యకరమైన వ్యక్తి స్వతంత్ర నిషేధం మరియు చట్ట బద్ధమైన రక్షణ హామీ వంటివి స్వీకరించబడ్డాయి.

బానిసత్వం పత్ల విధానాలలో మార్పు వచ్చింది. రాజ్యాంగంలోని ఒక చట్టం అట్లాంటిక్ బానిస చట్టానికి 1808 వరకు మాత్రమే రక్షణ కలిగించింది. 1780-1804 ల మధ్య కాలంలో ఉత్తర రాష్ట్రాలు దక్షిణ ప్రాంతాన్ని విచిత్ర విధానాల రక్షకులుగా విడిచి పెట్టి బానిస వ్యాపారాన్ని రద్దు చేసింది. 1800 లలో ఆరంభమైన రెండవ చైతన్యం బానిసత్వ వ్యాపార రద్దు, తేదీ వారీగా భూముల కొనుగోలు వంటి వివిధ సాంఘిక సంస్కరణలకు దారితీసింది.

పడమటి దిశగా రాజ్య విస్తరణలో అమెరికన్లు వెలిబుచ్చిన ఆత్రత పలు ఇండియన్ యుద్ధాల పరంపరకు దారి తీసింది. 1803 లో ప్రెసిడెంట జెఫర్సన్ నాయకత్వంలో ఫ్రెంచ్ అక్రమిత భూమి అయిన ల్యూసియానా కొనుగోలు చేయడంతో దేశ విస్తీర్ణం రెండితలుగా పెరిగింది. 1812 లో అనేక ఫిర్యాదులు బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించడం యు.ఎస్ జాతీయతను బలపరిచింది. యు.ఎస్ సైన్యం ఫ్లోరిడా మీద జరిపిన వరుస దాడిల కారణంగా 1819లో స్పెయిన్ మరియు ఇతర అఖాతం అక్రమిత ప్రదేశాల స్వంతదారులు సముద్రతీర ప్రాంతాలను వదిలి వెళ్ళేలా చేసాయి. 1845 లో టెక్సాస్ సంయుక్తరాష్ట్రాలతో ఐక్యం అయింది. 1846 లో బ్రిటన్ తో జరిగిన ఒరెగాన్ ఒప్పందం ప్రస్థుత వాయవ్య అమెరికా యు.ఎస్ ఆధీనంలోకి రావడానికి దారి తీసింది. మెక్సికన్ అమెరికన్ యుద్ధంలొ యు.ఎస్ విజయం 1848లో కాలిఫోర్నియా మరియు ప్రస్థుత మరింత వాయవ్య అమెరికా యు.ఎస్ ఆధీనంలోకి రావడానికి కారణం అయింది. 1848-1849 మద్య జరిగిన కలిఫోర్నియా గోల్డ్ రష్ (కలిఫోర్నియా బంగారు అంవేషణ) మరింత పడమర దిశ వలసలకు ప్రోత్సాహం అందించింది. కొత్త రైల్వే మార్గాలు స్థిరనివాసుల పునరావాసం మరియు స్థానిక అమెరికన్లతో సంఘర్షణలకు దారి తీసింది. 50 సంవత్సరాల కాలం 40 మిలియన్లకు పైగా అమెరికన్ బర్రెలు లేక దున్న పోతులు తోలు మరియు మాంసం కొరకు వధించబడిన తరువాత రైలు మార్గాల విస్తరణ సులువు చేసింది. స్థానిక ఇండియన్ల ప్రధాన వనరు అయిన బర్రెల మందలు కోల్పోవడంతో ఇండియన్ల అస్థిత్వానికి మరియు అనేక స్థానిక సంస్కృతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

అంతర్యుద్ధం మరియు పరిశ్రమీకరణ

స్వతంత్ర రాష్ట్రాలు మరియు బానిసల మద్య ఉన్న ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఫెడరల్ ప్రభుత్వం మద్య సంబందాలు వివాదాలను శిఖరాగ్రానికి చేర్చింది. 1860 నాటికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడూ తీవ్ర బానిసత్వ వ్యతిరేకి అయిన అబ్రహాం లింకన్ ప్రెసిడేంట్ గా ఎన్నుకొనబడ్డాడు. ఆయన పదవీ స్వీకరం చేసే లోపల ఏడు బానిసత్వ ఆదరణ రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న చట్టవ్యతిరేక కార్యక్రమానను వ్యతిరేకిస్తూ వేర్పాటు తీర్మానం అలాగే కాంఫిడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపుదిద్దే తీర్మానం చేసాయి. ఫోర్ట్ సంటర్ మీద కాంఫిడరేట్ దాడితో అంతర్యుద్ధం ఆరంభం అయింది. అంతే కాక మరి నాలుగు రాష్ట్రాలు కాంఫిడరసీ తో చేతులు కలిపాయి. 1863 లో కాంఫిడరసీ లోని బానిసలకు విముక్తి చేస్తూ ఇస్తూ లింకన్ ప్రకటన జారీ చేసాడు. 1865 లో యూనియన్ విజయం తరువాత యు.ఎస్ రాజ్యాంగం మూడు సవరణలను చేసి బానిసలుగా ఉన్న షుమారు నాలుగు మిలియన్లు ఉన్న ఆఫ్రికన్ అమెరికన్లకు విడుల ఇవ్వడానికి నిశ్చయించుకుని వారిని పౌరులుగా చేసి వారికి ఓటు హక్కును ఇచ్చింది. యుద్ధం మరియు దాని స్పష్టత ఫెడరల్ ను తగినంత శక్తివంతం చేసింది. అమెరికన్ చరిత్రలో ఈ యుద్ధ ఫలితంగా 620,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం వలన ఈ యుద్ధం మరణాత్మమైన సంఘర్షణగా మిగిలి పోయింది.

యుద్ధానంతరం అబ్రహాం లింకన్ కాల్పులకు గురి అయిన తరువాత దక్షిణ రాష్ట్రాలను తిరిగి సమైఖ్యం లక్ష్యంగా కొత్తగా విముక్తి పొందిన బానిసల హక్కులకు హామీ ఇస్తూ రిపబ్లికన్ విధానాల పునర్నిర్మాణానికి పూనుకుంది. 1876 అద్యక్ష ఎన్నిక తరువాత తలెత్తిన వివాదాలకు 1877 నాటి రాజీతో తరువాత ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు జిం క్రో లాస్ పునర్నిర్మాణం చేయడంతో ముగింపుకు వచ్చింది. ఉత్తర భూములు నగరాలుగా రూపుదిద్దుకోవడంతో దక్షిణ ప్రాంతాల నుండి క్రమపచ లేని సరికొత్త వలసల ప్రవాహానికి దారి తీసింది. తూర్పున ఉన్న యూరప్ దేశాన్ని పారిశ్రామికీకరణ చేయడాన్ని వేగవంతం చేసింది. 1929 వరకు కూలీలను అందిస్తూ అమెరికన్ సంస్కృతిని మారుస్తూ వలసదారుల అల కొనసాగింది. వేగవంతమైన ఆర్ధికాభివృద్ధి ప్రజోపయోగ నిర్మాణాల(ఇంఫ్రాస్టక్చర్) అభివృద్ధికి దారి తీసింది. 1867 లో రష్యా నుండి అలాస్కాను కొనుగోలు చేయడంతో దేశ విస్తరణ పూర్తి అయింది. 1890 లో జరిగిన ది వూండెడ్ నీ మాస్‍క్రీ నరమేధం ఇండియన్లతో జరిగిన ప్రధాన సైనిక యుద్ధంగా మిగిలిపోయింది. పసిఫిక్ రాజ్యం హవాయి దేశీయమైన రాజరికం 1893 లో అమెరికన్ వాసుల నాయకత్వంలో జరిగిన ఆకస్మిక తిరుగుబాటుతో త్రోసివేయబడింది. 1998 లో యునైటెడ్ స్టేట్స్ తమ పక్కన ఉన్న సముద్ర ద్వీపాలను (ఆర్చియోపిలాగో) ను తమతో ఐఖ్యం చేసుకుంది. స్పానిష్ -అమెరికన్ యుద్ధ విజయం అదే సంవత్సరంలో సంయుక్త రాష్ట్రాల శక్తిని ప్రపంచానికి తెలియజేయడమే కాక ప్యూర్టో రికో, గ్వాం మరియు ఫిలిప్పైన్ అనుసంధానానికి దారి తీసింది. తరువాత 50 సంవత్సరాలకు ఫిలిప్పైన్స్ స్వతంత్రం పొందింది. ప్యూర్టో రికో, గ్వాం మాత్రం అమెరికన్ యూనియన్ ప్రదేశంగా మిగిలి పోయింది.

మొదటి ప్రపంచ యుద్ధం అణిచివేత మరియు రెండవ ప్రపంచ యుద్ధం

1914 లో మొదటి ప్రపంచ యుద్ధం తలెత్తిన తరువాత సంయుక్తరాష్ట్రాలు తటస్తంగా మిగిలి పోయింది. బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారి పట్ల అనేక మంది అమెరికన్లు సానుభూతి వ్యక్తం చేసారు. అయినప్పటికీ అనేక మంది మద్యలో తలదూర్చడాన్ని వ్యతిరేకించారు. 1917 నాటికి సంయుక్తరాష్ట్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. అమెరికన్ విదేశీ సైన్యాలు కేంద్ర శక్తికి వ్యతిరేకంగా తిరగడానికి సహకరించాయి. యుద్ధానంతరం సెనేట్ ఐఖ్య రాజ్య సమితిని స్థాపించిన ర్సైల్లెస్ ఒడంబడికని దృవీకరించ లేదు. దేశం ఏకపక్ష విధానాలను, ఒంటరి పరిమితులను అనుసరించారు. 1920లో స్త్రీల హక్కుల ఉద్యమం విజయం సాధించి స్త్రీల ఓటు హక్కును ప్రతిపాదిస్తూ రాజ్యాంగ సవరణలకు దారితీసింది. గొప్ప వత్తిడికి కారణమైనరోరింగ్ ట్వెంటీస్ గర్జన 1929 వాల్ స్ట్రీట్ కుప్పకూలడంతో ముగింపుకు వచ్చింది. 1932లో ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ ప్రెసిడెంట్‍గా ఎన్నిక అయిన తరువాత సంఘ రక్షణ విధానంతో కూడిన ఆర్ధిక రంగంలో ప్రభుత్వం జోక్యం చేయడానికి అవసరమైన వరుస విధానాలకు సంబంధించిన కొత్త ప్రతిపాదనకు స్పందించాడు. మద్య భూములలో రేగిన దుమ్ము కారణంగా 1930 నాటికి అనేక వ్యవసాయ సమూహాలను పేదరికంలో ముంచెత్తి అలాగే పదమటి వైపు వలసల అల లేవడానికి ప్రోత్సాహాన్ని అందించాడు.

1939 సెప్టెంబర్ లో జర్మనీ పోలెండ్ మీద దండెత్తే వరకు సంయుక్త రాష్ట్రాలు రెండవ ప్రపంచ యుద్ధంలో తటస్తంగానే ఉండి పోయింది. తరువాత 1941 నుండి సహాయ దేశాలకు కావలసిన వస్తువులను ఋణంగాను- అద్దెకు ఇచ్చే ప్రణాళిక ద్వారా అందిస్తూ యుద్ధకార్యంలో పాలు పంచుకుంది. 1941 డిసెంబర్ 7 న జపాన్ సాంరాజ్యం పీర్ల్ హార్బర్ వద్ద హటాత్తుగా దాడి చేసిన తరువాత సంయుక్తరాష్ట్రాలు సహాయ దేశాలతో అలీన దేశాలకు వ్యతిరేకంగా చేతులు కలిపి అలాగే వేలకొలది జపానీ అమెరికన్లను ఖైదు చేసింది. యుద్ధంలో పాలగొనడం పెట్టుబడులను మరియు పారిశ్రామిక శక్తికి ప్రోత్సాహం అందించింది. ప్రధాన యోధుల మధ్య సంయుక్తరాష్ట్రాలు మాత్రమే సంపన్న దేశం అయింది. నిజంగా యుద్ధ కారణంగా పేదరికంలో మునిగిపోయినన మిగిలిన దేశాల మద్య సంయుక్తరాష్ట్రాలు అందుకోలేనంత సంపన్న దేశమైంది. బ్రెట్టన్ వుడ్స్ మరియు యాల్టా వద్ద జరిగిన సహాయదేశాల సమావేశాలు అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ వ్యవహారాలకు సంయుక్తరాష్ట్రాలు మరియు సోవియట్ యూనియన్ దేశాలను కేంద్రంగా చేసి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాయి. యూరప్ విజయం తరువాత 1945 శాన్ ఫ్రాంసిస్కోలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో సంయుక్తరాష్ట్రాలు సమర్పించిన శాసనపత్రం యుద్ధానంతరం కార్యరూపం దాల్చింది. యుద్ధంలో జపాన్ దేశ నగరాలైన హిరోషిమా మరియు నాగసాకీల మీద అణుబాంబు ప్రయోగం చేసిన తరువాత సంయుక్తరాష్ట్రాలు మొదటి అణుబాంబులను అభివృద్ధిన దేశంగా వెలుగులోకి వచ్చింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ సెప్టెంబర్ 2వ తారీఖున జపాన్ లొంగి పోయింది.

పరోక్ష యుద్ధం మరియు అసమ్మతి రాజకీయాలు

రెండవ ప్రపంచ యుద్ధానంతర పరోక్ష యుద్ధం సమయంలో సంయుక్త రాష్ట్రాలు మరియు సోవియట్ యూనియన్ ఆధిఖ్యత కోసం పోటీ పడుతూ పరుగులు తీసాయి. సోవియట్ యూనియన్ నాటో ద్వారా యూరప్ సైనిక చర్య మరియు వార్సా సంఘటన ఆధిఖ్యత చూపింది. యుద్ధాలకు ప్రతినిధిత్వం వహిస్తూ అలాగే శక్తివంతమైన అణు బాంబులను అభివృద్ధి చేస్తూ పోటీ పడ్డాయి అయినప్పటికీ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయడాన్ని తప్పిస్తూ వచ్చాయి. యు.ఎస్ తరచుగా సోవియట్ యూనియన్ చేత పోషించబడుతున్నాయని భావించిన వామపక్ష ఉద్యమాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. 1950–53 లలో జరిగిన కొరియన్ యుద్ధంలో అమెరికన్ సైన్యాలు కమ్యూనిస్ట్ చైనా మరియు ఉత్తర కొరియాలతో పోరాడాయి. సెనేటర్ నామమాత్ర కమ్యునిస్ట్ వ్యతిరేక ద్యమనాయకుడుగా ఉన్న కాలంలో ఐక్యరాజ్య సమితి- అమెరికన్ ఏక్టివిటీస్ కమిటీ వామపక్ష విధానాల మీద వరుసగా పరిశోధనలను నిర్వహించారు.

1961లో సోవియట్ మొదటి మానవ చోదిత వ్యోమనౌకను రోదసీకి పంపిన తరువాత అద్యక్షుడు ఫె.ఎఫ్. కెనడీ పిలుపుతో ప్రేరింపబడిన సంయుక్త రాష్ట్రాలు 1969 నాటికి మానవుడిని మొట్టమొదటి సారిగా చంద్రమండలం మీద నిలబెట్టారు. క్యూబాలో సోవియట్ సైన్యాల మీద అణుబాంబు విషయంలో కెనడీ కూడా వత్తిడిని ఎదుర్కొన్నాడు. రోసా పార్క్, మార్టిన్ లూథర్ కింగ్, ఆఫ్రికన్ అమెరికన్ల పౌర హక్కుల కొరకు చేపట్టిన అహింసా యుద్ధం వృద్ధి చెందింది. తరువాత 1963లో కెనడీ కాల్చి చంపబడ్డాడు. అలాగే 1964 లో పౌర హక్కుల చట్టం, 1965లో ఓటు హక్కు ప్రెసిడెంట్ లిండన్.బి. జాన్‍సన్ ఆధ్వర్యంలో జారీచేయబడ్డాయి. వైద్యరక్షణ మరియు వైద్యసహాయం చట్టం మీద కూడా ఆయన సంతకం చేసాడు. జాన్‍సన్ ఆయన తరుత అధ్యక్షుడైన నిక్సన్ ఆగ్నేయాసియా లోని విజయవంతం కాని వియత్నాం యుద్ధానికి ప్రాతినిధ్యం వహించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సాంస్కృతిక వ్యతిరేక కారులు, నల్ల జాతీయులు మరియు స్త్రీ విమోచనోద్యమ కారుల సహకారంతో చెలరేగిన ఉద్యమం తీవ్ర రూపందాల్చింది. రాజకీయ, సాంఘిక మరియు ఆర్ధిక హక్కులను కోరుతూ బెట్టీ ఫ్రైడెన్, గ్లోరియా స్టెనెం మరియు ఇతరుల నాయకత్వంలో స్త్రీ విమోచనోద్యమం కొనసాగింది.

వాటర్ గేట్ కుంభ కోణం ఫలితంగా మహాభియోగంలో భాగం కావడం న్యానిర్ణేతల న్యాయనిర్ణయాన్ని అడ్డగించడాన్ని మరియు అధికారాన్ని దుర్వినియోగ పరచడం వంటి వాటిని తప్పించడానికి 1974లో నిక్సన్ తిరిగి అద్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసాడు. రెండవ సారి పదవీ ప్రమాణం చేసిన అద్యక్షులలో ఈయన ప్రధముడు. జిమ్మీ కార్టర్ నిర్వహణలో 1970 చివరలొ దేశం ద్రవ్యోల్బణం మరియు ఇరాన్ ఆశ్రితుల గండాలను ఎదుర్కొన్నది. 1980లో రొనాల్డ్ రీగన్ అద్యక్షుడిగా ఎన్నిక చేయబడిన సమయంలో అమెరికన్ రాజకీయలలో కారణంగా పన్ను విదింపులో మరియు ముఖ్యమైన వాటికి ఖర్చు చేయడం వంటి విషయాలలో మార్పుల వచ్చాయి. ఆయన రెండవ సారి పదవి వహించిన కాలంలో ఇరాన్-కాంట్రా కుంభకోణం అలాగే సోవియట్ యూనియన్‍తో దౌత్య సంబంధాల వంటివి జరిగాయి. సోవియట్ కుప్ప కూలిన ఫలితంగా పరోక్ష యుద్ధం వెలుగులోకి వచ్చింది.

సమకాలీన శకం

ఐఖ్యరజ్య సమితి ఆమొదంతో జరిగిన అరేబియన్ గల్ఫ్(అరేబియన్ అఖాతం) అధ్యక్షుడు యుద్ధంలో జార్జ్ బుష్ నాయకత్వంలో సంయుక్తరాష్ట్రాలు ప్రధానపాత్ర వహించింది. 1991 నుండి 2001 వరకు యు.ఎస్ చరిత్రలో సుదీర్ఘ ఆర్ధిక విస్తరణ జరిగింది. 1998లో బిల్ క్లింటన్ ప్రభుత్వ నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న సివిల్ కేసు మరియు అక్రమసంబంధ కేసు క్లింటన్ మోసం అనె అపవదుకు గురి చేసింది. అయినప్పట్కీ అతడు కార్యలంలో కొనసాగాడు. 2000 అమెరికా చరిత్రలోనే మొదటి సారిగా అద్యక్షఎన్నికలలో తలెత్తిన సమస్యను ఉన్నత యు.ఎస్ న్యాయస్థానం తీర్పు ద్వారా పరిష్కరించబడింది. జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ తనయుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అద్యక్షుడు అయ్యాడు.

2001, సెప్టెంబర్ 11 న అల్ఖైదా తీవ్రవాదులు న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (ప్రపంచ వాణిజ్య కేంద్రం) మరియు వాషింగ్టన్, డి.సి. సమీపంలో ఉన్న పెంటగన్, డి.సి నరమేధంలో షుమారు 3000 మంది ప్రజలు మరణించారు. ఫలితంగా బుష్ ప్రభుత్వం భీతితో అంతర్జాతీయ యుద్ధం ఆరంభించి ఆఫ్ఘనిస్తాన్ మీద దండెత్తి తలిబాన్ ప్రభుత్వాన్ని గద్దె దించి అల్ఖైదా శిక్షణా శిబిరాలను వైదొలగించింది. తాలిబాన్ తిరుగుబాటుదారులు గొరిల్లా యుద్ధం కొనసాగించారు. 2020లో బుష్ ప్రభుత్వం ఇరాక్ రాజ్యాంగ మార్పులను తీసుకురావచ్చిన వత్తిడి వివాదాలకు దారి తీసింది. 2003లో యు.ఎస్ నడిపించిన సైన్యాలు ఇరాక్ మీద దాడి చేసి సదాం హుస్సేనును తరిమి కొట్టింది. 2005 కేథరినా సుడిగాలి మెక్సికన్ అఖాతంలో కఠినమైన వినాశనాన్ని సృష్టించి న్యూ ఆర్లాండ్‍ను తీవ్రంగా నాశనం చేసి అమెరికన్ చరిత్రలో గుర్తించతగిన విషాదంగా మిగిలి పోయింది. 2008లో అంతర్జాతీయ ఆర్ధిక తిరోగమనం మద్య మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అద్యక్షుడైన బరాక్ ఒబామా అద్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. రెండు సంవత్సరాల అనంతరం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ మరియు ఆర్ధిక విధానాల సంస్కరణ అమలులోకి వచ్చాయి. 2011 లో అమెరికన్ త్రిదళ సేన(నేవీ సీల్స్) పాకిస్థాన్ మీద దాడి చేసి అల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాదెన్ ను హతమార్చింది. 2011 డిసెంబర్ తేదీన మిగిలిన యు.ఎస్ దళాలను వెనుకకు మరలించడంతో ఇరాక్ యుద్ధం ముగింపుకు వచ్చింది.

భౌగోళికం మరియు పర్యావరణం

అమెరికా భౌగోళిక పటం
అమెరికాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం

అమెరికా సంయుక్త రాష్ట్రాలు దాదాపు పశ్చిమార్ధగోళం మొత్తం విస్తరించి ఉన్నాయి. అలాస్కా తప్ప మిగతా అమెరికా భూభాగం పడమట పసిఫిక్ మహాసముద్రం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, ఆగ్నేయాన మెక్సికో అగాధం, ఉత్తరాన కెనడా మరియు దక్షిణాన మెక్సికో దేశాల నడుమ విస్తిరించి ఉంది. భౌగోళికంగా అలాస్కా అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోనూ పెద్దది. కెనడా దేశం ఈ రాష్ట్రాన్ని మిగతా అమెరికా భూభాగంనుండి విడదీస్తుంది. అలాస్కా అమెరికాకి నైరుతి దిశగా ఆవల ఉంది. దీనికి ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. భూవైశాల్యం పరంగా అమెరికా ప్రపంచంలో మూడవ పెద్ద దేశం (మొదటి రెండూ: రష్యా, చైనా). పసిఫిక్ మహా సముద్రం లోని కొన్ని చిన్న చిన్న ద్వీప సముదాయాలు కూడా అమెరికా కిందకు వస్తాయి (ఉదా: ప్యూర్టో రికో, గువామ్)

అట్లాంటిక్ తీరప్రాంతం ఆకులు రాల్చే చెట్లతో నిండిన దట్టమైన అడవులు గల పైడ్ మాంట్ పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది. అపలచియాన్ పర్వతాలు తూర్పు తీరాన్ని ఘనమైన సరస్సులు, విస్తారమైన గడ్డిభూములతో నిండిన మధ్య పడమటి ప్రాంతం నుండి విడదీస్తుంది. మిసిసిపి-మిస్సోరి నది అమెరికా దేశానికి సరిగా మధ్యలో ఉత్తరం నుండి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ఇది ప్రపంచంలోని నాలుగవ అతి పెద్ద నదీ పరివాహక ప్రాంతం. రాకీ పర్వత శ్రేణులు ఉత్తర దక్షిణ దిశల్లో విస్తరించి ఉంటాయి. వీటికి తూర్పుగా ఉన్న సారవంతమైన స్టెప్పీ భూములు పడమటి వైపుకు వ్యాపించి ఉంటాయి. రాకీ పర్వతాలకు పడమటి దిశలో మొహావే ఎడారి ఉంటుంది. సియెరా నెవెడా పర్వత శ్రేణి రాకీ పర్వతాలకు సమాంతరంగా, పసిఫిక్ మహా సముద్రానికి సమీపంలో విస్తరించి ఉంటుంది.

అలాస్కాలోని మెకిన్లీ పర్వతం 20,320 అడుగుల/6,194 మీటర్ల ఎత్తుతో అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. అమెరికా అధీనంలో ఉన్న అనేక ద్వీపాల్లో అగ్ని పర్వతాలు అతి సాధారణం. హవాయి రాష్ట్రం మొత్తం అగ్ని పర్వతాలతో నిండిన చిన్న చిన్న దీవుల సముదాయం. ఎల్లో స్టోన్ జాతీయ పార్కు లోని మహాగ్నిపర్వతం ఉత్తర అమెరికా ఖండం అంతటికీ పెద్దదైన అగ్ని పర్వతం.

వాతావరణం

అతి పెద్ద భూవైశాల్యం, వివిధ రకాల భౌగోళిక విశేషాల వల్ల అమెరికాలో ఎన్నో రకాల వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. చాలా ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. హవాయి, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అలాస్కాలో ధృవ వాతావరణం ఉంటుంది. నైరుతి వైపు ఎక్కువగా ఎడారి వాతావరణం, కాలిఫోర్నియా తీర ప్రాంతంలో మధ్యధరా ప్రాంతంలోలాంటి ఉష్ణోగ్రతలు కనిపిస్తాయి. మెక్సికో అగాధ సమీప ప్రాంతాల్లో తుఫానులు, గాలివానల తాకిడి ఎక్కువ. మధ్య పడమటి భాగంలో ప్రచండమైన సుడిగాలులు తరచూ సంభవిస్తుంటాయి.

ప్రజాజీవన విశేషాలు

  • అమెరికాలో ప్రతి కుటుంబానికి సగటున ఒక కారు ఉంది.
  • 7.75కోట్ల కుక్కల్ని పెంచుకుంటున్న కుటుంబాలు 39శాతం ఉన్నాయి.కోటిన్నర కుటుంబాలు వివిధ రకాల పక్షుల్ని; 9.36కోట్ల కుటుంబాలు పిల్లుల్ని; 1.33 కోట్ల కుటుంబాలు అశ్వజాతుల్ని పెంచుతున్నాయి.4500కోట్ల డాలర్ల మేర కుక్కల వ్యాపారం జరుగుతుంది.ఈ మొత్తం 114దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కన్నా ఎక్కువ.
  • ప్రపంచ దేశాల రక్షణ వ్యయాల్లో అమెరికా వాటా 44శాతం
  • 25 శాతం ఆఫ్రికన్‌ అమెరికన్లు నిరుపేదలు.ఇళ్లులేనివారి సంఖ్య 6.64లక్షలు.9.5శాతం నిరుద్యోగ రేటు ఉంది.
  • 60శాతం అమెరికన్లు వాయు కాలుష్యంలో జీవిస్తున్నారు.

అమెరికా లో 10 పెద్ద నగరాలు

  1. న్యూయార్క్
  2. లాస్ ఏంజిల్స్
  3. చికాగో
  4. హ్యూస్టన్
  5. ఫిలడెల్ఫియా,పెన్సిల్వేనియా
  6. ఫీనిక్స్ నగరం
  7. శాన్ అంటోనియో
  8. శాన్ డియాగో
  9. డల్లాస్
  10. డెట్రాయిట్
  11. సెయింట్ లూయిస్

సంయుక్త రాష్ట్రాల జాబితా

అంతర్జాతీయంగా ఉన్న స్థానం

సంస్థ నిజనిర్దారణ చేసి సేకరించిన సమాచారం స్థానం
యునైటెడ్ నేషన్స్ అభివృద్ది కార్యక్రమం మానవ అభివృద్ది సూచిక [5] 177లో 12 స్థానం[6]
(1-వ స్థానం ఉత్తమం)
ది ఎకనోమిస్ట్ ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేదానికి సిధ్ధంగా ఉన్న దేశాలు 70లో1 స్థానం[7]
(1-వ స్థానం ఉత్తమం)
ది ఎకనోమిస్ట్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ 48లో1 వ స్థానం[8]
(1-వ స్థానం ఉత్తమం)
ది ఎకనోమిస్ట్ అధిక కొనుగోలు శక్తి 70లో5 వ స్థానం[9]
(1-వ స్థానం ఉత్తమం)
ఎటి కీర్నరీ/విదేశీ వ్యవహారాల పత్రిక [ అంతర్జాతీయకరణ సూచిక 2006] లో స్థానం
ఐ ఎం డి ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాల పోటీ సూచిక పుస్తకం 10 లో స్థానం
ది ఎకనోమిస్ట్ ప్రపంచ మానవ జీవన ప్రమాణాల సూచిక 48 లో 41 వ స్థానం[10]
(1-స్థానం ఉత్తమం)
యేల్ యూనివర్సిటి/కొలంబియా యూనివర్సిటి వాతావరణ రక్షిత సూచిక, 2005 (pdf) లో వ స్థానం
ఎల్లలు లేని పాత్రికేయులు పత్రికా స్వేచ్చ సూచిక 2006 169లో48 వ స్థానం[11]
(1-వస్థానం ఉత్తమం)
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ దేశాలలో అవినీతి సూచిక - 2007 158లో17 స్థానం[12]
(1-వ స్థానం ఉత్తమం)
హేరిటేజి ఫౌండేషన్/ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్థిక స్వేచ్చ సూచిక,2007 162లో-5 వ స్థానం[13]
1-వ స్థానం ఉత్తమం
ది ఎకనోమిస్ట్ ప్రపంచ శాంతి సూచిక[14] 144 లో వ స్థానం 97
(1-వ స్థానం ఉత్తమం)
విడుదల కొరకు నిధులు /ForeignPolicy.com విఫల దేశాల సూచిక,2007 177 లో160 వ స్థానం[15]
(1-వ స్థానం అద్వాన్నం)[16]

ప్రధాన వ్యక్తులు

మూలాలు,వనరులు,సమాచార సేకరణ

  1. "Population Finder: United States". U.S. Census Bureau. Retrieved 2007-12-20.
  2. 2.0 2.1 "Report for Selected Countries and Subjects (30 advanced economies; 6 subjects)". World Economic Outlook Database. International Monetary Fund. October 2007. Retrieved 2008-02-05.
  3. DeNavas-Walt, Carmen, Bernadette D. Proctor, and Jessica Smith (August 2007). "Income, Poverty, and Health Insurance Coverage in the United States: 2006" (PDF). U.S. Census Bureau. Retrieved 2008-02-05.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  4. "The Human Development Index—Going Beyond Income". Human Development Report 2007. United Nations Development Program. Retrieved 2007-11-27.
  5. "Human Development Index". Retrieved 2008-07-10.
  6. "2007/2008 Human Development Index rankings". Retrieved 2008-07-10.
  7. "E-readiness ranking". Retrieved 2008-07-10.
  8. "Biggest economies". Retrieved 2008-07-10.
  9. "Highest purchasing power". Retrieved 2008-07-10.
  10. "Highest life expectancy". Retrieved 2008-07-10.
  11. "ప్రపంచ పత్రికా స్వేచ్చ సూచిక 2007". Retrieved 2008-07-10.
  12. "Corruption Perceptions Index 2007". Retrieved 2008-07-10.
  13. "Index of Economics freedom 2008". Retrieved 2008-07-10.
  14. All information in the table of rankings from: Both are linked from: Vision of Humanity (2008). "EIU Reports - Documents - Global Peace Index". Retrieved 2008-06-17.
  15. "Failed States Index Scores 2007". Retrieved 2008-07-10.
  16. larger number indicates sustainability

బయటి లింకులు

United States గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వం
గణాంకాలు
చరిత్ర
దేశ పటాలు
ఇతరాలు


ఇతర వివరాలు

మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA