ధర్మరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 21 interwiki links, now provided by Wikidata on d:q983067 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q983067 (translate me)
పంక్తి 32: పంక్తి 32:


{{మహాభారతం}}
{{మహాభారతం}}

[[lt:Judhišthira]]

13:12, 10 మార్చి 2013 నాటి కూర్పు

కర్ణునితో పోరాడుతున్న ధర్మరాజు.

యుధిష్ఠరుడు లేదా ధర్మరాజు పాండవ ఆగ్రజుడు.మహాభారత ఇతిహాసములొ యమధర్మరాజు అంశ. పాండు రాజు సంతానం. కుంతి కి యమధర్మరాజు కి కలిగిన సంతానం.


తండ్రి మరణానంతరం భీష్ముడు మరియు పెదతండ్రి దృతరాష్ట్రుడు తండ్రిలేని లోటు కనిపించకుండా పాండుకుమారులను పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన దృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడు.


విద్యాభ్యాసాలు పూర్తయిన తరువాత దృతరాష్ట్రుడు తన తమ్ముని భాగమైన అర్థరాజ్యాన్ని పాండవులకు పంచియిచ్చాడు. ఆ రాజ్యానికి మొదట ఖాండవ ప్రస్థం ముఖ్య పట్టణంగా ఉండేది. శ్రీకృష్ణుని కోరిక మేరకు ఇంద్రుడు పంపిన విశ్వకర్మ ఇంద్ర ప్రస్థం అనే నూతన రాజధానిని ధర్మరాజుకు నిర్మించి యిచ్చాడు.


ధర్మరాజు తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో రాజసూయ యాగం దిగ్విజయంగా నిర్వహిస్తాడు. శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో భీముడు జరాసంధుణ్ణి సంహరిస్తాడు. శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇఛ్ఛి పూజించాడు. సభలో పెద్దలనందరినీ, శ్రీకృష్ణుడు తనను అవమానించిన చేది రాజైన శిశుపాలుని శిరస్సును సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. మయసభ విశేషాలను తిలకించడానికై విడిదిచేసిన దుర్యోధనుడు అవమానింపబడతాడు.


అసూయతో దుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పరియైన శకుని చేతిలో ధర్మరాజు వరుసగా తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు. సభలోకి రావడానికి సందేహిస్తున్న పాంచాలిని దుశ్శాసనుడు తలవెంట్రుకలు పట్టి బలవంతంగా ఈడ్చుకొని వస్తాడు. ద్రౌపది వస్త్రాన్ని అపహరించవలసిందని దురోధనుడు తమ్మున్ని అజ్ఞాపించాడు. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల ద్రౌపది కట్టుకొన్న వస్త్రం అంతులేని అక్షయ వలువలుగా మారి నిండు సభలో ఆమె గౌరవం దక్కింది. ధృతరాష్ట్రుడు కొడుకు చేసిన తప్పును గ్రహించి వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాస్య విముక్తుల్ని కావించి, వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు.


మరల దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురికి పిలుస్తాడు. ఓడినవాళ్ళు నారచీరలు ధరించి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం చెయ్యాలి. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తింపబడితే, ఆనాటి నుంచి మళ్ళీ అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో విధిపైపరీత్యం వల్ల మళ్ళా ఓడిపోతాడు. ధర్మప్రభువు ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో వుండడానికి ఇష్టంలేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం వల్ల అతడు వెంటవచ్చిన యావన్మందినీ పోషిస్తూ, అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు.


అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటాకువెళ్ళిన భీమున్ని కొండచిలువ గట్టిగా చుట్టేసింది. ధర్మరాజు తమ్మున్ని వెదుకుతూ అక్కడకు వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలిచ్చి, తమ్మున్ని విడిపించుకొని వచ్చాడు. ఆ పాము శాపం తొలగి నహుషుడు అనే మహారాజయ్యాడు.


మూలాలు

  • ధర్మరాజు: డా.కె.జె.కృష్ణమూర్తి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1990, 1999.


"https://te.wikipedia.org/w/index.php?title=ధర్మరాజు&oldid=816956" నుండి వెలికితీశారు