బరువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 81 interwiki links, now provided by Wikidata on d:q25288 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q25288 (translate me)
పంక్తి 103: పంక్తి 103:
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]


[[si:බර]]
[[vi:Tương tác hấp dẫn#Trọng lực]]
[[vi:Tương tác hấp dẫn#Trọng lực]]

20:28, 12 మార్చి 2013 నాటి కూర్పు

A spring scale measures the weight of an object

బరువు లేదా భారము (ఆంగ్లం Weight) ఒక రకమైన కొలమానము. భౌతిక శాస్త్రం ప్రకారం, ఒక వస్తువు పై గల గురుత్వాకర్షణ బలమును "భారము" లేదా "బరువు"అందురు. వస్తువు బరువు దాని ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణం ల లబ్దానికి సమానము. 'm' ద్రవ్యరాశి గాను, 'g' గురుత్వ త్వరణం గల వస్తువుకు కలిగే భారం W=mg అవుతుంది. ఇది ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఒక కిలోగ్రాం ద్రవ్యరాశి గల వస్తువు భారం భూమిపై సాధారణంగా 9.8 న్యూటన్లు ఉంటుంది. భారం అనగా వస్తువుపై గల గురుత్వాకర్షణ బలం కావున దీని ప్రమాణాలు బలం ప్రమాణాలతో సమానంగా ఉంటుంది. భారమునకు దిశ ఉంటుంది కావున భారం సదిశ రాశి

సూత్రము,ప్రమాణాలు

సూత్రము

,

m అనగా వస్తువు ద్రవ్యరాశి మరియు g అనగా గురుత్వ త్వరణం ప్రమాణాలు

  • సి.జి.యస్ పద్ధతిలో "డైన్" లేదా " గ్రాం భారం"
  • ఎస్.ఐ పద్ధతిలో " న్యూటన్" లేదా "కిలో గ్రాం భారం"

కొలిచే పరికరము

  • స్ప్రింగు త్రాసు)

భూమిపై వివిధ ప్రాంతములలో ఒక కిలో గ్రాము ద్రవ్యరాశి గల వస్తువు భారం

వివిధ ప్రాంతములలో వస్తువు భారం
భూమద్య రేఖ సిడ్నీ అబెర్దీన్ ఉత్తర ధృవం
గురుత్వ త్వరణం 9.7803 మీ/సె2 9.7968 మీ/సె2 9.8168 మీ/సె2 9.8322 మీ/సె2
వస్తువు భారం 9.7803 న్యూటన్లు 9.7968 న్యూటన్లు 9.8168 న్యూటన్లు 9.8322 న్యూటన్లు

ఎత్తుకు పోయినపుడు,లోతుకు వెళ్ళినపుడు వస్తువు భారం

భూమిపైనుందడి ఎత్తుకు పోయినపుడు గురుత్వ త్వరణం తగ్గును. కనుక పైకి పోవుకొలది వస్తువు భారం తగ్గును. భూమి వ్యాసార్థం (సుమారు 6400 కి.మీ) లో సగం దూరం (సుమారు 3200 కి.మీ.) పైకి పోయినపుడు గురుత్వ త్వరణం శూన్యమై వస్తువు భారం శూన్యమవుతుంది. లోతునకు పోవునపుడు గురుత్వ త్వరణం తగ్గును కావున వస్తువు భారం క్రమంగా తగ్గుతుంది. భూ కేంద్రం వద్ద గురుత్వ త్వరణం శూన్యం కావున అచట వస్తువు భారం శూన్యమవుతుంది.

చంద్రునిపై

భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె2 ఉండును. చంద్రుని పై గురుత్వ త్వరణం 1.67 మీ/సె2 ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణంలో 1/6 వంతు ఉండును. కనుక చంద్రునుపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారంలో 1/6 వంతు ఉండును. ఉదా: ఒక వ్యక్తి బరువు భూమిపై 60 కి.గ్రాం. లు అయిన అదె వ్యక్తి బరువు చంద్రునిపై 10 కి.గ్రా. ఉండును.

సూర్యునిపై

భూమిపై గురుత్వ త్వరణం 9.8 మీ/సె2 ఉండును. సూర్యుని పై గురుత్వ త్వరణం 274.1 మీ/సె2 ఉండును. ఈ విలువ భూ గురుత్వ త్వరణం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును. కనుక సూర్యునిపై వస్తువు భారం భూమిపై వస్తుపు భారం కన్నా 28 రెట్లు ఎక్కువ ఉండును.

ఇతర గ్రహములపై

గ్రహం పేరు భూమిపై గురుత్వ త్వరణంకన్నా ఎన్ని రెట్లు
గురుత్వ త్వరణం
గ్రహం పై గురుత్వ త్వరణం వస్తువు భారం(Kg.wt)
బుధుడు 0.3770 3.703 377 gmwt
శుక్రుడు 0.9032 8.872 903.2 gmwt
భూమి 1 9.8226 1 kgwt
అంగారకుడు 0.3895 3.728 389.5 gmwt
బృహస్పతి 2.640 25.93 2.64 kgwt
శని 1.139 11.19 1.139 kgwt
యూరేనస్ 0.917 9.01 917 gmwt
నెప్ట్యూన్ 1.148 11.28 1.148 kgwt

కొలిచే సాధనాలు

భారమును కొలిచెందుకు స్ప్రింగ్ త్రాసు ను ఉపయోగిస్తారు. ఈ త్రాసు హుక్ సూత్రము పై ఆధారపడి పనిచేస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=బరువు&oldid=818724" నుండి వెలికితీశారు