కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 19: పంక్తి 19:
}}
}}


చాళుక్య చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గునూరు జిల్లా), యనమందల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండీ సుమారు 400 సంవత్సరాల పాటూ పాలించారు. కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్తుడైన హరిసీమ కృష్ణుడు స్థాపించాడు. కోట సామ్రాజ్యపు రాజులు నేడు ఆంధ్రదేశంలో ఉన్న ధనుంజయ గోత్రపు క్షత్రియులకు పూర్వీకులు. [[రాజస్థాన్]] కోట రాజులకు, వీరికి ఎటువంటి సంబంధము లేదు.
చాళుక్య చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గునూరు జిల్లా), యనమందల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండీ సుమారు 400 సంవత్సరాల పాటూ పాలించారు. వీరు చంద్రవంశంలో ధనుంజయ గోత్రానికి చెందినవారు <ref> శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము - బుద్దరాజు వరహాలరాజు, 1970<ref><ref>హిస్టరీ ఆఫ్ ఆంధ్రా కంట్రీ (క్రీస్తు శకం 1000 - 1500) - శ్రీమతి యశోదా దేవి</ref>.
కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్తుడైన హరిసీమ కృష్ణుడు స్థాపించాడు. [[రాజస్థాన్]] కోట రాజులకు, వీరికి ఎటువంటి సంబంధము లేదు.


==విశేషాలు==
==విశేషాలు==

06:44, 13 మార్చి 2013 నాటి కూర్పు

పరిచయం

ధరణి కోట వంశము

800–1200
స్థాయిసామ్రాజ్యము
రాజధానిధరణికోట (గుంటూరు)
సామాన్య భాషలుతెలుగు
మతం
జైన మతం
ప్రభుత్వంMonarchy
చరిత్ర 
• స్థాపన
800
• పతనం
1200

చాళుక్య చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని ద్రాక్షారామం (తూర్పుగోదావరి జిల్లా), త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా), తాడికొండ (గునూరు జిల్లా), యనమందల (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండీ సుమారు 400 సంవత్సరాల పాటూ పాలించారు. వీరు చంద్రవంశంలో ధనుంజయ గోత్రానికి చెందినవారు ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు.. కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్తుడైన హరిసీమ కృష్ణుడు స్థాపించాడు. రాజస్థాన్ కోట రాజులకు, వీరికి ఎటువంటి సంబంధము లేదు.

విశేషాలు

కోట రాజులు మొదట్లో జైన మతాన్ని ఆచరించినా తర్వాత కాలంలో చాళుక్యుల వలె హిందూ మతాన్ని కూడా ఆచరించారు. శైవ తత్వాన్ని కూడా ప్రోత్సహించారు. వీరికి తూర్పు చాళుక్యులతోను, సూర్యవంశీయులైన కాకతీయులతోను వివాహ సంబంధాలుండేవి. కాకతీయ గణపతి దేవుని రెండవ కుమార్తె అయిన గణపాంబను కోట బేతరాజు వివాహమాడాడు. మంగళగిరి ఆనంద కవి వ్రాసిన 'విజయనందన విలాసము' లో హరిసీమ కృష్ణుడు చంద్రవంశానికి చెందినవాడని వ్రాయబడినది [1]. క్రీస్తు శకము 1182 ప్రాంతంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయం చేయడానికి కాకతీయ రుద్రదేవరాజు కొంత సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం ధరణికోటను ముట్టడించి జయించింది. కోట దొడ్డభీమరాజు మరణించాడు. ఆనాటి నుండి కోట వంశీయులు కాకతీయులకు సామంతులయ్యారు. 1323 వ సంవత్సరంలో మహమ్మదీయుడైన ఉయిన్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించాడు. ఆ సందర్భంలో కోట వంశం కూడా రాజ్యం కోల్పోయింది. ఈ వంశం వారు చెదిరిపోయి దాట్ల, పాకలపాడు, చింతలపాడు, జంపన వంటి గ్రామాలకు వెళ్ళిపోయారు [2].

కోట సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు:

  • భీమరాజు 1 - క్రీస్తు శకం 1108-1127
  • బేతరాజు 2 - క్రీస్తు శకం 1127-1148
  • బేతరాజు 3 - క్రీస్తు శకం 1148-1156
  • భీమరాజు 2 - క్రీస్తు శకం 1156-1188
  • కేత రాజు 1 - క్రీస్తు శకం 1182-1231 - ఇతడు కాకతీయ గణపతి దేవుడి రెండవ కుమార్తె గణపాంబను వివాహమాడాడు.
  • భీమరాజు 3 - క్రీస్తు శకం 1231-1234
  • కేతరాజు 2 - క్రీస్తు శకం 1234-1240
  • గణపతిదేవ - క్రీస్తు శకం 1240-1262
  • భీమరాజు 4 - క్రీస్తు శకం 1262-1268
  • దేవరాజు - క్రీస్తు శకం 1268
  • దంతులూరి గన్నభూపాలుడు - క్రీస్తు శకం 1400.

ఇతర విషయములు

శ్రీనాధుడు తాను వ్రాసిన ధనుంజయ విజయాన్ని దంతులూరి గన్నభూపాలుడికి అంకితం చేశాడు. మహాముని కావ్య కంఠ గణపతి శాస్త్రి తన పుస్తకంలో గన్నభూపాలుడు తన కుమార్తె సురంబికను అద్దంకి, ధరణికోట, కొండవీడు ప్రాంతాలను పాలిస్తున్న అనవేమా రెడ్డికి ఇచ్చి వివాహం చేసాడని, ఇదే క్షత్రియ కులానికి మరియు రెడ్డి కులానికి మధ్య జరిగిన మొదటి వివాహమని వ్రాశాడు. సుమారు 17 వ శతాబ్దములో మంగళగిరి ఆనంద కవి తాను వ్రాసిన విజయనంద విలాసమును కోట సామ్రాజ్య వశస్తుడైన దాట్ల వెంకటకృష్ణమ రాజును కీర్తిస్తూ వ్రాశాడు [3]. ఈష్టు ఇండియా కంపెనీ వారు భారత దేశాన్ని పాలించు కాలములో కోట వంశానికి చెందిన దాట్ల, దంతులూరి, కలిదిండి, భూపతిరాజు వంటి ధనుంజయ గోత్రపు గృహనామాల జమీందారులు రెవిడి, మద్గోలు, గోలుగొండ, ఉరట్ల, దార్లపూడి , మొగల్తూరు ప్రాంతాలను పరిపాలించారు. భారత దేశం సార్వభౌమ అధికార దేశంగా అవతరించిన తర్వాత జమీందారీ వ్యవస్త అంతరించింది.

అపోహ

కోట రాజులు కమ్మ కులస్తులకు పూర్వీకులని కొంతమంది భావం. కోట అనే పదం గృహనామంగా కమ్మ కులస్తుల్లో ఉండటం వల్ల కూడా ఈ భావం ఉండవచ్చును. ఇందులో వాస్తవం లేదు. కోట వంశము వారిది ధనుంజయ గోత్రం. ఈ గోత్రం కమ్మ కులస్తుల్లో లేదు. గృహనామాలు ఉరి పేరుని బట్టి ఏర్పడతాయి కాబట్టి ఒక కులంలో ఉన్న గృహనామం మరొక కులంలో కూడా ఉండవచ్చు. కమ్మ కులస్తులు సూర్యవంశానికి గాని చంద్రవంశానికి గాని చెందినవారు కాదు.

మూలాలు

  1. విజయనందన విలాసము - రచన: మంగళగిరి ఆనందకవి, ముద్రణ: 1919, రామవిలాస ముద్రాక్షర శాల, చిత్రాడ
  2. శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము - బుద్ధరాజు వరహాలరాజు, 1970
  3. విజయనందన విలాసము - రచన: మంగళగిరి ఆనందకవి, ముద్రణ: 1919, రామవిలాస ముద్రాక్షర శాల, చిత్రాడ

ఇంకా చదవండి

లంకెలు