భావప్రకటన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 96 interwiki links, now provided by Wikidata on d:q11024 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q11024 (translate me)
పంక్తి 160: పంక్తి 160:


[[వర్గం:సమాచార మార్పిడి]]
[[వర్గం:సమాచార మార్పిడి]]

[[zh:通信]]

23:25, 13 మార్చి 2013 నాటి కూర్పు

Translation/Ref|en|Communication|oldid=301138599}}

సమాచారమును ఒక వనరు నుండి మరియొక దానికి బదిలీచేసే విధానాన్నిసమాచార మార్పిడి అంటారు.కనీసం ఇద్దరు కారకుల మధ్య సంజ్ఞల మాధ్యమం ద్వారా కొన్ని గుర్తులు మరియు భాషానియమాల ద్వారా ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవడాన్నే సమాచార మార్పిడి అంటారు.సమాచార మార్పిడిని సాధారాణంగా "ఆలోచనలు, అభిప్రాయాలను తెలియచేయడం లేదా పంచుకోవడంగా లేదా ప్రసంగం, వ్రాత లేదా సంజ్ఞల ద్వారా సామాచారాన్నివ్వడం" గా నిర్వచింపవచ్చు.ఆలోచనలను, భావాలను, అభిప్రాయాలను పరస్పర అంగీకారం కుదిరే ఒక ఉమ్మడి లక్ష్యం లేదా దిశ వైపుగా పురోగమించే ద్విమార్గ పద్ధతిగా సమాచార మార్పిడిని అవగాహన చేసుకొనవచ్చు[1][1]


విద్యా విభాగంగా సమాచార మార్పిడికి సుధీర్గ చరిత్ర ఉంది. [1]


అవలోకనము

సమాచార మార్పిడి విధానంలో సమాచారం కూర్చబడి ఒక వాహకం /మాధ్యమం ద్వారా పంపేవారి నుండి జాగ్రత్తగా గ్రహీతలకు అందుతుంది.అప్పుడు గ్రహీత ఆ సమాచారాన్ని సాధారణ భాషలోనికి మార్చుకొని పంపిన వారికి పునఃపుష్టిని ఇస్తాడు. సమాచారమార్పిడి జరగాలంటే అన్ని వర్గాలు పంచుకోదగిన ఒక సామాన్య సమాచార రంగాన్ని కలిగి ఉండాలి.వాక్ సంబంధసాధనాలు, మాట్లాడడం, పాటలు పాడడం మరియు కొన్ని సార్లు శబ్ద స్వరం వంటివి, మరియు అశాబ్దికవనరులు, శారీరక సాధనాలు , శరీర భాష, సంజ్ఞల భాషవంటివి, భాషానుబంధ నైపుణ్యాలు, స్పర్శ, కనుసైగ ,రాతను ఉపయోగించడం వంటివి ఉన్నాయి.


ఏ ప్రక్రియతో అయితే మనం ఒక ఉమ్మడి అవగాహన కలిగించే ప్రయత్నంలో అర్ధాన్ని ఆపాదించి అందిస్తామో ,ఆ ప్రక్రియనే సమాచార మార్పిడి అంటాము. ఈ ప్రక్రియకి వ్యక్తిగత మరియు వ్యక్తుల మధ్య , వినటం , గమనించటం , మాట్లాడటం, ప్రశ్నించడం, విశ్లేషించటం మరియు మూల్యాంకనం వంటి విస్తృతమైన అనేక రంగాల నైపుణ్యం అవసరం. సమాచారమార్పిడి ద్వారానే సహకార, సహాయాలు లభిస్తాయి.[4]


విజయవంతమైన సమాచారమార్పిడికి అనేక సాధారణ అడ్డంకులు కూడా ఉంటాయి,వాటిల్లో మొదటిది అధిక సమాచారం (ఒకే సమయంలో అనేక వార్తలు రావటం), మరియు రెండవది వార్తా సంక్లిష్టత .[5]


సమాచార పధ్ధతులు

మానవుల ముఖాముఖి సమాచార పద్ధతులలో మూడు ముఖ్య భాగములు కలవు. మొదటిది హావ భావ ప్రకటన, రెండవది శబ్ద ప్రకటన మరియు మూడవది పదప్రయోగం. పరిశోధనల ప్రకారం:[2]

  • 55% ప్రభావం శారీరక కదలికలైన-భంగిమలు, హావ భావాలు, మరియు కను సైగలచే నిర్ణయింపబడుతుంది.
  • 38% స్వరస్థాయి చేత, మరియు
  • 7% విషయము లేదా పదముల చేత సమాచార మార్పిడి ప్రక్రియ జరుగుతుంది.

మాట్లాడేవారు మరియు వినేవారిపై ఆధారపడి ఈఖచ్చితమైన ప్రభావశాతం మారినప్పటికీ, సమాచార మార్పిడి ఒకే లక్ష్యం కలిగి ఉండి అందరికీ ఒకే విధంగా ఉంటుంది.శబ్ద ధ్వని, స్వరము లేదా స్థితి, హావభావాల వంటి సంకేత పద్ధతులు లేదావ్రాత గుర్తల వంటివి ఆలోచనల లేదా భావాల సమాచార మార్పిడి చేస్తాయి. ఒక భాష అనేది గుర్తులు, ధ్వని, శబ్దాలు, హావభావాలు, లేదా వ్రాత గుర్తుల ద్వారా సమాచార మార్పిడి చేస్తే, జంతువుల సమాచార మార్పిడిని ఒక భాషగా గుర్తించవచ్చా?జంతువులకు వ్రాత పూర్వకమైన భాషలేదు, కానీ తమలో తాము సమాచార మార్పిడి చేసుకొనేందుకు భాషను ఉపయోగిస్తాయి.ఆ భావంలో, జంతువుల సమాచార మార్పిడిని ఒక ప్రత్యేక భాషగా గుర్తించవచ్చు.


గుర్తుల పద్ధతి (కొన్నిసార్లు లేక్సీమ్స్ గా పిలువబడుతుంది ) మరియు వ్యాకరణం(నియమాలు) ద్వారా అభివృద్ధి చేయబడిన గుర్తులనే మానవులు మాట్లాడే లేదా వ్రాసే భాషలుగా వివరించవచ్చు.భాషల సామాన్యగుణాలను తెలియచేయడానికి "భాష"అనే పదం వాడతారు.మానవుల బాల్యవయస్సులో భాష నేర్చకోవడం సాధారణంగా జరుగుతుంది.చాలా వరకు మానవుల భాషలు శబ్దాల అమరిక లేదా హావభావాల గుర్తులద్వారా తమ చుట్టు పక్కల వారిచే సమాచారమార్పిడి చేసుకోడానికి దోహదం చేస్తాయి.మానవులు అనేక వేలభాషలను కలిగి ఉన్నారు, మరియు ఈ భాషలు కొన్నిసామాన్య గుణాలను కలిగి ఉన్నాయి, అయితే ఈ సామాన్యగుణాలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి.


ఒక భాషకు మరియు మాండలికంకు మధ్య స్పష్టమైనరేఖ ఏదీ లేదు, కానీ భాషావేత్త అయిన మాక్స్ వీన్రిచ్ ఈ విధంగా తెలిపారు, "ఒక భాష అనేది సైన్యం మరియు నావికా దళంతో కూడిన మాండలికం".ఎస్పెరాంటో వంటి నిర్మితభాషలు, ప్రోగ్రామింగు భాషలు, మరియు అనేక గణిత సూత్రీకరణలు మానవభాషల సామాన్య గుణాలకే పరిమితం కాలేదు.


సంభాషణ లేదా శాబ్దిక సమాచారమార్పిడి

ఒక సంభాషణ అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే పరస్పర [[conversation|భాషణంసంభాషణ ]]. ఎటిమలాజికల్(పదోత్పత్తి శాస్త్రం) ప్రకారం ఈ పదం యొక్క పుట్టుక ( గ్రీక్ διά(డయా ,అనగా నుండి) + λόγος(లోగోస్, పదము, మాట) అర్ధాన్ని అనుసరించేది అనే అర్ధంలో) ప్రజలు దానిని ఏవిధంగా ఉపయోగిస్తారనే అర్దాన్నివ్వక, διά-(డయా-నుండి,) మరియు δι- (డై-, రెండు) అనే ఉపసర్గాలతో కొంత అయోమయానికి గురిచేసి సంభాషణ అనేది కేవలం రెండు పక్షాల మధ్య జరిగేదిగా ఊహించుకునేటట్లు చేస్తుంది.


అశాబ్దిక సమాచారమార్పిడి

పదములు లేని సమాచారాన్ని పంపడం లేదా అందుకోవడం అనే ప్రక్రియను అశాబ్దిక సమాచార మార్పిడిగా పేర్కొనవచ్చు.హావభావాలు, శారీరక కదలికలు లేక భంగిమలు; ముఖ వైఖరి మరియు కనుసైగలద్వారా, వస్త్ర ధారణ, కేశాలంకరణ లేదా వాస్తుకళ వంటి విషయ సమాచార మార్పిడి, లేక గుర్తులు మరియు ఇన్ఫోగ్రాఫిక్స్ గుర్తులు, ప్రవర్తనా సమాచార మార్పిడి వంటి పైవాటిని అన్నిటినీ కలిపిన విధానం ద్వారా కూడా అటువంటి సమాచార మార్పిడి చేయవచ్చు. ప్రేమ వ్యవహారాల నుండి ఉద్యోగం వరకు, ఒక వ్యక్తి యొక్క నిత్య జీవితంలో అశాబ్దిక సమాచార మార్పిడి ముఖ్యపాత్ర వహిస్తుంది.


ప్రసంగంలో అశాబ్దిక అంశాలైన స్వర నాణ్యత, భావం మరియు మాట్లాడే విధానం వంటిభాషా సంబంధ నైపుణ్యాలు, సామాన్య భాషా రూపాలైన లయ, శృతి మరియు వత్తి పలకడం వంటివి ఉన్నాయి.అదేవిధంగా, వ్రాత గ్రంధాలు కూడా అశాబ్దిక అంశాలైన వ్రాతశైలి, మాటల అమరిక, లేక అవ్యయాలను కలిగి ఉంటాయి. వ్రాయబడిన లేదా ఇతర సమాచార రూపానికి భావ పరనైన అర్ధాన్నిచ్చే గుర్తు ఎమోటికాన్ అనేది రెండు ఆంగ్ల పదాలైన ఎమోషన్(ఎమోట్) మరియు ఐకాన్ల సంయోగమైన ఒక గుర్తు లేదా గుర్తుల కూర్పు.


టెలిగ్రఫీ వంటి ఇతర సమాచార పద్ధతులు ఈవర్గానికి చెందుతాయి, వీటిలో సంకేతాలు ఒక వ్యక్తి నుండి మరొకరికి ఇతర పద్ధతులలో వ్యాప్తి చెందుతాయి.ఈ సంకేతాలు మాటల, వస్తువుల ప్రతినిధులుగా లేదా కేవలం ప్రతిక్షేపణలుగా ఉంటాయి.ప్రయోగాలద్వారా తెలిసిన దేమంటే మానవులు ఈ పద్ధతిలో ఏవిధమైన శారీరక కదలికలతో గాని, శబ్ద లేదా మాటల శ్రావ్యతతో సంబంధం లేకుండా సమాచార మార్పిడి చేయగలుగుతారు.[3]


దృశ్య సమాచార మార్పిడి

దృశ్య సమాచార మార్పిడి దాని పేరు సూచించి నట్లు గానే దృశ్య పరికరం ద్వారా సమాచార మార్పిడి. చదవగల లేదా చూడగల విధానంలో అభిప్రాయాలను మరియు సమాచారాన్ని తెలియచేయడం.ప్రాధమికంగా ఇది ద్విమితీయ ప్రతిబింబాలను కలిగి ఉంటుంది, దీనిలో : గుర్తులు, టైపోగ్రఫీ, చిత్ర లేఖనం, గ్రాఫిక్ డిజైన్, బొమ్మలు, రంగులు మరియు ఎలక్ట్రానిక్ వనరులు ఉన్నాయి. ఇది కేవలం దృష్టిమీద ఆధారపడి ఉంటుంది.ఇది దృశ్య గుణముతో చేసే సమాచార మార్పిడి.ఒక వ్యక్తికి సమాచారాన్ని అందించడానికి, తెలియ చేయడానికి, లేక సమ్మతింప చేయడానికి దృశ్యంతో కూడిన వ్రాత విధానం ఎక్కువ శక్తి వంతంగా ఉంటుందనే అభిప్రాయంతో ఇది అభివృద్ధి చెందింది.ఇది సమాచారాన్ని దృశ్యరూపంలో ప్రదర్శించే సమాచారమార్పిడి విధానం.


ఒకమంచి దృశ్యకల్పన యొక్క విలువ ఎంతకళాత్మకంగా లేక రసవంతంగా ఉందనికాక ప్రేక్షకులకు ఎంతబాగా అర్ధమైందనే దానిమీద ఆధారపడి ఉంటుంది.అందానికీ మరియు వికారానికీ విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన సూత్రాలేవీ లేవు.హావ భావాలు, దేహభాష, వీడియో మరియు టి.వి.వంటి వివిధ రకాల దృశ్య సమాచార మార్గాలు ఉన్నాయి. ఇక్కడ విషయం, బొమ్మలు, చిత్రాలు, ఫోటోలు మొదలైన వాటిని కంప్యూటర్లో అనుసంధానించడం పై దృష్టి పెట్టబడుతుంది. అసలైన సమాచారాన్ని ప్రదర్శించడమే దృశ్య సమర్పణ అని చెప్పవచ్చు.ఇటీవలి పరిశోధనలు వెబ్ డిజైన్ మరియు గ్రాఫిక్స్ ను ఉపయోగించ గలగటం పై దృష్టి పెట్టాయి.గ్రాఫిక్ డిజైనర్లు తమ వృత్తి పరంగా దృశ్య సమాచార మార్పిడిలో వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు.


ఇతర రకాల సమాచార మార్పిడి

అనేక ఇతర ప్రత్యేక రకాల సమాచార మార్పిడులకు ఉదాహరణలు:


సమాచార మార్పిడి నమూనీకరణ

సమాచార మార్పిడి యొక్క ప్రధాన దిశల ప్రణాళిక
సమాచార మార్పిడి కోడ్ ప్రణాళిక

కొన్ని ప్రధాన దిశల ద్వారా సమాచార మార్పిడిని వివరించడం జరుగుతుంది: విషయం (ఎటువంటి విషయాలు తెలియచేయ బడుతున్నాయి ), ఆధారము / ప్రసరణ కర్త / పంపేవారు / ఎన్కోడర్ (ఎవరి ద్వారా), రూపం (ఏ రూపంలో ), మార్గం (ఏ మాధ్యమం) ద్వారా , గమ్యం / గ్రహీత / లక్ష్యం/ డికోడర్ (ఎవరికి), మరియు ప్రయోజనం లేదా వాస్తవ దృష్టికోణం. ఇరువురి మధ్య సమాచార మార్పిడిలో జ్ఞానము మరియు అనుభవాలను పంచుకోవడం ,సలహాలు మరియు సూచనలు ఇచ్చుకోవడం,ప్రశ్నించుకోవడం వంటివి ఉంటాయి .ఈ చర్యలు సమాచార మార్పిడి లోని వివిధ పద్ధతులలో ఏ రుపాన్నైనా తీసుకోవచ్చు . అది ఏ రూపమనేది సమాచారం పంపేవారి నైపుణ్యంపై ఆధారపడుతుంది సమాచార విషయము మరియు రూపము రెండు కలసి గమ్యం చేరవలసిన సందేశాన్ని తయారు చేస్తాయి గమ్యం అనేది మరియొక వ్యక్తిలేదా జీవి,మరియొక వ్యవస్థ (ఒక కార్పోరేషన్ లేదా వ్యక్తుల సముదాయము లాంటిది )కావచ్చు .


మూడు అంచెల భాషాశాస్త్ర నియమాలు పాటిస్తూ సమాచార ప్రసారం జరిగే విధానాన్ని సమాచార మార్పిడిలో చూడవచ్చు.

  1. వ్యాకరణ యుక్తము (గుర్తులు మరియు చిహ్నాల వ్యావహారిక లక్షణాలు),
  2. ఆచరణాత్మకత (గుర్తులు/వ్యక్తీకరణలు మరియు వాటిని ఉపయోగించే వారి మధ్య సంబంధాల గురించి) మరియు
  3. గుర్తులు మరియు చిహ్నాల విశ్లేషణ (గుర్తులు మరియు చిహ్నాలు మరియు మరియు అవి ఏమి తెలియచేస్తాయో అధ్యయనం చేయడం).


అందువలన, సమాచార మార్పిడి అనేది ఇద్దరు కారకులు కొన్నిసామాన్య గుర్తులు మరియు భాషా శాస్త్ర నియమాలతో అభిప్రాయాలను పంచుకోవడం.ఈ సామాన్య నియమాలు కొంత అర్ధంలో వ్యక్తిగత సమాచార సాధనాలైన డైరీలు లేక స్వయం భాషణ


ఒక సాధారణ నమూనాలో, సమాచారాన్ని లేదా విషయాన్ని(ఉదా.సహజ భాషలోని వర్తమానం)ఏదో ఒక రూపంలో (వాడుక భాషలో)కర్త/పంపేవ్యక్తి/ఎన్కోడర్ నుండి ఒక గమ్యం/గ్రహీత/డికోడర్ కు పంపబడుతుంది.కొద్దిగా క్లిష్టమైన నమూనాలో పంపేవారు మరియు గ్రహీత పరస్పరం అనుసంధానించబడి ఉంటారు.ఒక ప్రత్యేక సమాచార మార్పిడి సందర్భాన్ని ప్రసంగ చర్యగా చెప్పవచ్చు.ప్రాంతీయ ఆచారాలు, సాంప్రదాయాలు, లేక లింగ భేదం వంటి వాటిపై ఆధారపడిన, పంపేవారి మరియు గ్రహీతల వ్యక్తిగత పరిమితుల వలన సందేశ విషయం యొక్క అర్ధం మారవచ్చు.ప్రసార వాహకం (ఈ సందర్భంలో గాలి) సమక్షంలో సమాచారమార్పిడి ధ్వని " వలన విషయన్ని గ్రహించి విశ్లేషించుట దోషపూరితంగా ఉండి, ప్రసంగచర్య ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు.ఎన్కోడ్-ప్రసారం-గ్రహించుట-డికోడ్ నమూనాలో ఒక సమస్య ఏమిటంటే ఎన్కోడింగ్ మరియు డికోడింగ్ విధానం వల్ల పంపేవ్యక్తి మరియు గ్రహీత ఇద్దరూ ఒకే విధమైన లేదా కనీసం పోలిక కలిగిన కోడ్ బుక్ వంటి ఒక సాధనాన్ని కలిగి ఉండాలి.ఈ కోడ్ బుక్స్ అనేవి నమూనా ద్వారా ఇవ్వబడినప్పటికీ అవి నమూనాకు ప్రాతినిధ్యం వహించక పోవడం వలన విషయ పరమైన ఇబ్బందులు వస్తాయి.


కేవలం సమాచార వివక్త మార్పిడి కాక, సహ క్రమబద్ధీకరణ సిద్ధాంతాలు సమాచార మార్పిడిని ఒక సృజనాత్మక మరియు గతిశీలక నిరంతర ప్రక్రియగా నిర్వచిస్తాయి. కెనెడియన్ మీడియా వేత్త అయిన హారొల్ద్ ఇన్నీస్ సిద్ధాంతం ప్రకారం, ప్రజలు సమాచార మార్పిడికి విభిన్న మాధ్యమాలను ఎన్నుకుంటారు మరియు వారు ఎన్నుకునే మాధ్యమం సమాజం యొక్క రూపు రేఖలను మెరుగుపరచడానికి అవకాశాలను అందించగలగాలి.(వార్క్, మక్కేంజీ 1997). దీనికి ఆయన చూపిన ప్రముఖ ఉదాహరణ ప్రాచీన ఈజిప్టు నందు ప్రజలు తమకుతాముగా మాధ్యమాలుగా నిర్మించుకున్న రాయి మరియు పాపిరస్(బెరడు నుండి తీసిన కాగితం) ఉపయోగించటాన్ని చెప్పవచ్చు. పాపిరస్ ను ఆయన 'అంతరాళ బంధనం అన్నారు. ఇది వ్రాత పూర్వకమైన ఆజ్ఞలను అంతరాళం,రాజ్యాలగుండా ప్రాసారంచేసి, సుదూర సైన్యకార్యకలాపాలకు మరియు వలసపాలనకు దారితీసింది. మరి యొకటి అయిన రాయిని 'కాల బంధనం ' గా చెప్పారు వీటితో ఆలయాలు మరియు పిరమిడ్ల నిర్మాణం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి వారి అధికారాన్ని పదిల పరచు కోవడమే కాక, ఈ మాధ్యమం ద్వారా వారు తమ సమాజం లోని సమాచార వ్యవస్థలో మార్పు తెచ్చి దానికొక ఆకారాన్ని ఇవ్వగలిగారు.(వార్క్, మకెన్జీ 1997).


కేరళ అగ్రికల్చరల్ యునివెర్సిటీ పరిధిలోని కృషి విజ్ఞాన్ కేంద్ర కన్నూర్ వారు వ్యవసాయ సమాచార మార్పిడిలో క్రియేటివ్ ఎక్స్టెన్షన్ అనే నూతన శాఖను ఆవిష్కరించింది.


మానవేతర జీవరాశుల సమాచార మార్పిడి

సమాచార మార్పిడి దాని బహుముఖాలతో మానవులకు, లేదా వారి పూర్వీకులకుమాత్రమే పరిమితం కాలేదు. జీవ రాశుల మధ్య ప్రతి సమాచార మార్పిడిని అనగా కర్త మరియు గ్రహీతలైన ఈ రెండు జీవుల మధ్య సంకేతాలప్రసారాన్ని అయినా సమాచార మార్పిడి యొక్క ఒక రూపంగా పరిగణించ వచ్చు.జంతు ప్రవర్తన అధ్యయన శాస్త్రం లో జంతువుల సమాచార మార్పిడి అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.పురాతన జీవులైన పగడాల వంటి జీవులు కూడా సమాచారమును పంచుకోగలిగేవి.[4] చాల ప్రాధమిక స్థాయిలో, ప్రాధమిక జీవులైన బాక్టీరియా వంటి వాటిలో మరియువృక్ష మరియు శిలీన్ద్రాలలో కణ సంకేతాలను, కణజాల సమాచార వ్యవస్థను, మరియు రసాయన సమాచార మార్పిడులను గమనించ వచ్చు.[5] ఈ సమాచార మార్పిడి ప్రక్రియలన్నీ గుర్తుల మాధ్యమం ద్వారా చాలా ప్రత్యేక సహకారంతో జరిగే పరస్పర చర్యలు.


జంతువుల సమాచార మార్పిడి అనేది ఒక జంతువు యొక్క ప్రవర్తన మరొక జంతువు యొక్క ప్రస్తుత లేదా భవిష్యత్ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది.బాగా అభివృద్ధి చెందిన జంతువుల సమాచార మార్పిడిని మానవ సమాచార మార్పిడిగా పరిగణించ వచ్చు.జూ సీమియోటిక్స్, జంతువుల సమాచార మార్పిడి అధ్యయనం (మానవుల సమాచార మార్పిడి అధ్యయనం అంత్రో పోసీమియోటిక్స్, కంటే భిన్నమైనది) ఎథొలజి, సాంఘిక జీవశాస్త్రం, మరియు జంతువుల జ్ఞాన శక్తి అధ్యయనాలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మానవులు, జంతువులతో ప్రత్యేకించి డాల్ఫిన్స్ మరియు సర్కస్ లో ఉపయోగించే జంతువులతో సంభాషించడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఏమైనప్పటికీ ఈ జంతువులు ప్రత్యేక సమాచార మార్పిడి పద్ధతులను నేర్చుకోవలసి ఉంటుంది. జంతు సమాచార మార్పిడి మరియు జంతు ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడం త్వరగా అభివృద్ధి చెందుతున్న రంగం, మరియు 21 వ శతాబ్దంలో ఇప్పటివరకు, ఇంతకుముందు ఉన్నటువంటి విభిన్న అంశాలకు చెందిన అవగాహనలైన వ్యక్తిగత సంకేత నామాల వాడకం, జంతువుల భావ తీవ్రతలు, జంతువుల సంస్కృతి మరియు మచ్చిక చేయడం వాటి కామ ప్రవర్తన, చాలా కాలం నుండి అవగాహన చేసుకున్నప్పటికీ ఇప్పుడు విప్లవాత్మకంగా అభివృద్ధి చెందు తున్నది.


వృక్షాలు మరియు ఫంగై

వృక్షకణాల లోపల మరియు వృక్షకణాల మధ్య, సజాతి లేదా విజాతీయ వృక్షాలమధ్య, వృక్షాలు మరియు వృక్షాలు కాని జీవ రాసుల మధ్య, ముఖ్యంగా వేరు వ్యవస్థలో వృక్షజాలాలలో సమాచార మార్పిడిని గమనించడం జరిగింది.మొక్క వేర్లు, రైజోబియా బాక్టీరియాతో మరియు ఫంగై మరియు మట్టిలోని ఇతర కీటకాలతో సమాంతర సమాచార మార్పిడిని జరుపుతాయి.ఈ విధమైన సమాంతర చిహ్న మాధ్యమచర్యలు వ్యాకరణయుక్త, ఆచరణాత్మక మరియు అర్ధ నియమాలు మొక్కలలోని వికేంద్రీకృత "నరాల వ్యవస్థ" వలన సాధ్యపడుతున్నాయి.ఆధునిక పరిశోధనల ప్రకారం మొక్క జీవ వ్యవస్థలో జేరిగే సమాచార మార్పిడి ప్రక్రియలో 99% [ఆధారం చూపాలి] న్యురాన్-సంబంధం కలిగినవే. మొక్కలు తమపై ఏవైనా శాకాహారులు దాడిచేసినపుడు తమ పరిసరాలలోని మొక్కలకు ఆవిరిద్వారా సమాచార మార్పిడిచేస్తాయి.దీనికి సమాంతరంగా అవి ఈశాకహారులను'వాలు పాఠ్యం' ఎదుర్కొనే పరాన్న జీవులను ఆకర్షించే ఇతరఆవిరులను సృష్టిస్తాయి. వొత్తిడిని ఎదుర్కొనే సందర్భాలలో మొక్కలు తమ తల్లితండ్రుల నుండి అనువంశికంగా లభించిన జన్యు కోడ్ నుండి తమ తాతల లేక ముత్తాతల వాటి వైపు మరలుతాయి.[6]


నాచు మరియు ఫలజాతుల వంటి తమ పెరుగుదల మరియు వికాస సమయాలలో సహాయాన్ని అందించు కోవడానికి మరియు వ్యవస్థీకరణకు ఫంగై సమాచార మార్పిడి చేస్తాయి.అంతేగాక ఇవి తమ సజాతీయులతో పాటు అనేక ఇతర జీవులతో, ప్రత్యేకించి బాక్టీరియా, బహుకణయుత యుకర్యోట్స్, మొక్కలు మరియు క్రిములతో పరస్పర ప్రయోజనము కొరకు సమాచార మార్పిడి చేస్తాయి.ఈ విధంగా వాడబడిన రసాయనాలు జీవ సంబంధమైనవిగా ఉంది, జీవ రాసులు ప్రత్యేక తరహాలో ప్రతిస్పందించేలా చేస్తాయి, అదేవిధమైన రసాయనాలు, జీవ సంబంధమైనవి కానపుడు, ఎటువంటి ప్రతిచర్యలను ప్రోత్సహించలేవు.దీనిని బట్టి ఫంగల్ జీవరాసులు జీవ సంబంధ సందేశం ఉన్న అణువులను, లేక అవి లేని అణువుల మధ్య తేడాను గుర్తించే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని తెలుస్తోంది.సున్నితత్వం, జత కట్టడం, పెరుగుదల , రోగాకారకత్వంవంటి ప్రవర్తన నమూనాలకు సహాయం చేయగల ఐదు విభిన్న ప్రాధమిక సంకేత అణువులను కనుగొన్నారు.. ప్రవర్తన సహకారం లేక అటువంటి ప్రక్రియలు కేవలం వ్యాఖ్యానం ద్వారానే సాధించవచ్చు: స్వీయ లేదా అస్వీయ, నిర్జీవ సూచిక, స్వజాతీయ, సంబంధిత లేక అసంబందిత జాతులనుండి జీవ సందేశం, లేక "శబ్దం", అనగా జీవ సంబంధం కాని అవే రకమైన అణువులు. [7]

ఒక విద్యావిభాగంగా సమాచారమార్పిడి

ఒక విద్యా విభాగంగా సమాచార మార్పిడి కొన్నిసార్లు కమ్యూనికాలజీగా పిలువబడుతూ, మనం సమాచార మార్పిడిచేసే అన్ని మార్గాలకు సంబంధించిన ఒక విస్తృత అధ్యయనం మరియు విజ్ఞానంగా ఉంది.[8]సమాచారమార్పిడి విధానంలో శాబ్దిక మరియు అశాబ్దిక సందేశాలు ఉంటాయి.పాఠ్య పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ప్రచురణలు, మరియు విద్యా జర్నల్స్ ద్వారా సమాచార మార్పిడి వివరించబడుచున్నది.నిరంతరం విస్తృతమవుతున్న సమాచారమార్పిడి అధ్యయనాలను పరిశోధకులు జర్నల్స్ ద్వారా తెలియచేస్తున్నారు.


కొన్ని యంత్రాలతో సహా, సమాచార మార్పిడి అనేక అంచెలలో(ఒక చర్యకైనా), అనేక రకాలలో, మరియు అనేక జీవులలో జరుగుతుంది.అన్నీ కాక పోయినా, కొన్ని అధ్యయననాలు ఒక వంతు సమాచారమార్పిడికి కేటాయించడం వలన, సమాచార మార్పిడిని గురించి మాట్లాడేటపుడు, మనం దేనిని గురించి మాట్లాడుతున్నామో ఖచ్చితంగా తెలియాలి. కొన్ని సమాచార మార్పిడి నిర్వచానాలు విస్తృతంగా ఉండి, జంతువులు తమలో తాము సమాచార మార్పిడి చేసుకోవడంతో పాటు మనుష్యులతో కూడా చేస్తాయని గుర్తిస్తాయి, కొన్ని నిర్వచనాలు సంకుచితంగా ఉండి మానవులు తమలోతాము ప్రమాణాత్మక సంకేత చర్యల ద్వారా సమాచార మార్పిడిచేస్తారని తెలియచేస్తాయి.


సూచనలు

  1. http://seaver.pepperdine.edu/communication/disciplineofcommunication.htm
  2. మేహ్రబియన్ అండ్ ఫెర్రిస్ (1967). "ఇంఫెరెంస్ అఫ్ ఆటిట్యూడ్ ఫ్రొం నోన్వేర్బల్ కమ్యూనికేషన్ ఇన్ టూ చానల్స్". In: ది జర్నల్ అఫ్ కోన్సేల్లింగ్ సైకాలజీ Vol.31, 1967, pp.248-52.
  3. వార్విక్, కె, గాస్సన్, ఎమ్, హట్, బి, గుడ్ హెవ్, ఐ, కిబర్డ్, పి, స్చుల్జ్ రిన్నె, హెచ్ అండ్ వు, ఎక్స్: “థాట్ కమ్యూనికేషన్ అండ్ కంట్రోల్: ఎ ఫస్ట్ స్టెప్ యుసింగ్ రేడియోటెలిగ్రఫీ”, ఐ ఇఇ పోసీడింగ్స్ ఆన్ కమ్యూనికేషన్స్ , 151(3), pp.185-189, 2004
  4. విట్జానీ జి, మాడల్ పి. ((2009). బయో కమ్యూనికేషన్ అఫ్ కొరల్స్. ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ ఇంటీగ్రేటివ్ బయాలజీ 5(3): 152-163.
  5. విట్జానీ జి (2008). బయో-కమ్యూనికేషన్ అఫ్ బాక్టీరియా అండ్ థెయిర్ ఎవోలుషనరీ రూట్స్ ఇన్ నేచురల్ ఎడిటింగ్ కంపిటెన్సెస్ అఫ్ వైరసెస్.ఓపెన్ ఎవల్యూషన్ జర్నల్ 2: 44-54.
  6. విట్జానీ, జి. (2006ప్లాంట్ కమ్యూనికేషన్ ఫ్రమ్ బయో సీమియాటిక్ పెర్స్పెక్టివ్. ప్లాంట్ సిగ్నలింగ్ అండ్ బిహేవియర్ 1(4): 169-178.
  7. విట్జానీ, జి. (2007అప్లైడ్ బయో సీమియాటిక్స్: ఫంగల్ కమ్యూనికేషన్. ఇన్: విట్జానీ, జి. (Ed). బయో సీమియాటిక్స్ ఇన్ ట్రాన్స్ డిసిప్లినరీ కాంటేక్స్త్స్. హెల్సింకి, ఉమ్వెబ్, pp. 295-301.
  8. http://www.communicology.org/content/communicology-lexicon-definition


ఇది కూడా చూడండి


ప్రోత్సాహక పఠనం

  • బామిస్టర్, ఆర్. ఎఫ్., & లేఅరీ, ఎం.ఆర్. (1995ది నీడ్ టు బిలాంగ్: డిసైర్ ఫర్ ఇంటర్పర్సనల్ అటాచ్మెంట్స్ అస్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ మోటివేషన్ . సైకలాజికల్ బుల్లెటిన్ 117, 497-529.
  • ఫెర్రరో, జి.(2002గ్లోబల్ బ్రైన్స్- నాలెడ్జ్ అండ్ కంపిటెన్సీస్ ఫర్ ది 21 స్ట్ సెంచరీ . చర్లోట్టే: ఇంటర్ కల్చరల్ అసోసియేట్స్, ఇంక్.
  • సేవేరిన్, వేర్నేర్ జే., టన్కర్ద్, జేమ్స్ డబ్లుయు., Jr., (1979). కమ్యూనికేషన్ థియరీస్: అరిజిన్స్, మెథడ్స్, యుసేస్ . న్యూ యార్క్: హస్తిన్గ్స్ హౌస్, ISBN 0-8013-1703-7
  • వర్క్, మక్కేంజీ 1997 ది విర్చ్యుఅల్ రిపబ్లిక్ అల్లెన్ అండ్ ఉన్విన్ St లియోనర్డ్స్ pp 22–9
  • విటజానీ, జి. (2006 ) ప్లాంట్ కమ్యూనికేషన్ ఫ్రమ్ బయోసేమియోటిక్ పెర్స్పెక్టివ్. ప్లాంట్ సిగ్నలింగ్ & బిహేవియర్ 1(4): 169-178.
  • విటజానీ, G. (2007అప్లైడ్ బయోసేమియోటిక్స్: ఫంగల్ కమ్యూనికేషన్. In: Witzany, G. (Ed.) బయో సేమియోటిక్స్ ఇన్ ట్రాన్స్ దిసిప్లినరీ కాన్టెక్స్ట్స . *హెల్సింకి. ఉమ్వేబ్, pp 295–301.
  • మోన్టన, పాట్రిక్ జే. & చర్నోవ్, బ్రూస్ హెచ్. 2008. మానేజ్మెంట్. 4 త్ ఎడ్. న్యూ యార్క్. బర్రోన్స్ ఎడ్యుకేషనల్ సిరీస్, ఇంక్. Pg 326-327.
  • ది ఐడియా అఫ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ఎర్లీ బుద్ధిజం విమల్ దిస్సనాయకే, యునివెర్సిటీ అఫ్ హవాయి అట్ మనోవ, యుఎస్ఎ , ఆన్ లైన్ టెక్స్ట్


బాహ్య లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూస:Social sciences-footer