ఖమ్మం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q1921496 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1921496 (translate me)
పంక్తి 60: పంక్తి 60:
[[వర్గం:ఖమ్మం జిల్లా]]
[[వర్గం:ఖమ్మం జిల్లా]]
[[వర్గం:ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు]]
[[వర్గం:ఖమ్మం జిల్లా రైల్వేస్టేషన్లు]]

[[sv:Khammam]]

06:32, 14 మార్చి 2013 నాటి కూర్పు


దస్త్రం:Kamaan bazar1.jpg
కమాన్ బజారు 2005 ఆగస్టు పద్నాలుగు ఆదివారము నాడు

ఖమ్మం భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రము .ఖమ్మం పట్టనం ఒక వ్యాపారిక మరియు ఆర్థిక కేంద్రం .

చరిత్ర

ఖమ్మం నరసింహ స్వామి గుడి

ఆంధ్రపదేశ్ లో ఖమ్మం జిల్లా ఈశాన్య ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మద్య గాను ఉత్తర అక్షాంశం 16.45’ కు 18.35’ మద్యగాను ఉండి 15,921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉన్నది. జిల్లాకు ఉత్తరమున మద్య ప్రదేశ్, చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు , తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్గోండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా వున్నాయి.


ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడినది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం,వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు.


చారిత్రక ఆధారాల ప్రకారము ఖమ్మం నిజనామము కమ్మమెట్టు" [1][2][3][4][5][6]. తరువాత ఖమ్మం మెట్టుగా పిలవబడింది.


చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో మరియు అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.

భౌగోళికము

ఖమ్మం భౌగౌళికము గా 17.25° ఉ 80.15° తూ లో ఉన్నది.దీనికి ఉత్తరం గా ఛత్తీస్ ఘర్,ఒరిస్సా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా,వరంగల్ జిల్లా దక్షిణం గా వున్నది. దీని వైశాల్యం 16,029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణము కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణము అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లా 1982 వరకు సాగు నీరు వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రి గా వుండగ సాగర్ నీరు లభించింది.

పర్యాటక కేంద్రాలు

దస్త్రం:APtown Khammam 1.JPG
ఖమ్మం పట్టణం మమత ఆసుపత్రి మార్గము
దస్త్రం:APtown Khammam 2.JPG
ఖమ్మం పట్టణం

వీథులు

  • నిజాంపేట్
  • మామిళ్ళగూడెం
  • బుర్హాన్పురం
  • వి డి ఓస్ కాలని
  • బ్యాంక్ కాలని
  • రోటరి నగర్
  • గాంధి చౌక్
  • చెరువు బజార్
  • ప్రకాశ్ నగర్
  • శ్రినివాస వగర్
  • కమాన్ బజార్
  • నెహ్రూ నగర్
  • రిక్కా బజార్
  • నయా బజార్
  • ఇందిరా నగర్
  • రాపర్తి నగర్
  • గట్టయ్య సెంటర్
  • ద్వారకా నగర్

మూలాలు

  1. A Descriptive and Historical Account of the Godavery District in the Presidencyof Madras, H. Morris, 1878, London, p. 216
  2. A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80
  3. Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D., K. R. Subramanian, p. 149
  4. A Handbook for India, Part I, Madras, John Murray, 1859, London
  5. The Geography of India, J. Burgess, 1871, London, p. 48
  6. The Church Missionary Intelligencer,Volume 2,1866, London, p. 73
"https://te.wikipedia.org/w/index.php?title=ఖమ్మం&oldid=819661" నుండి వెలికితీశారు