పువ్వుల సూరిబాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7262552 (translate me)
పంక్తి 43: పంక్తి 43:
[[వర్గం:1915 జననాలు]]
[[వర్గం:1915 జననాలు]]
[[వర్గం:1968 మరణాలు]]
[[వర్గం:1968 మరణాలు]]

[[en:Puvvula Suri Babu]]

17:29, 15 మార్చి 2013 నాటి కూర్పు

పి.సూరిబాబు లేదా పువ్వుల సూరిబాబు (ఆంగ్లం: Puvvula Suri Babu) (ఫిబ్రవరి 22, 1915 - ఫిబ్రవరి 12, 1968) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త.

తొలి రోజులు

వీరు ఫిబ్రవరి 22, 1915 సంవత్సరంలో గుడివాడ తాలూకా బొమ్మలూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో గద్వాల పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించి తిరిగివచ్చారు.

ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య "బాలమిత్ర సభ" పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో కొప్పరపు సుబ్బారావు గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు. ఆనాటి నాటక సమాజాల వారు సూరిబాబు కోసం పోటీపడేవారు.

నాటక సమాజం

సూరిబాబు 1931 సంవత్సరంలో బాలకృష్ణ నాటక సమాజాన్ని గుడివాడలో స్థాపించి భక్త విజయం, మాయా మధుసూదన నాటకాలను పెద్ద ఎత్తున ప్రదర్శించారు. నష్టాలతో సమాజం మూతపడింది. 1936లో తెనాలి చేరి సత్యనారాయణ నాట్యమండలి పేరుతో నాటకాలను ప్రదర్శించారు.

1944 సంవత్సరంలో నటీమణి రాజరాజేశ్వరిని వివాహం చేసుకొని ఆమె పేరుమీద రాజరాజేశ్వరి నాట్యమండలిని స్థాపించి కొప్పరపు సుబ్బారావు గారితో "తారా శశాంకం" నాటకాన్ని వ్రాయించి తానే దర్శకత్వం వహించి చనిపోయేవరకు 15 వందలకు పైగా నాటకాలు ఆంధ్రదేశమంతా ప్రదర్శించారు. ఇది కాక భూకైలాస్, కురుక్షేత్రం, విప్రనారాయణ, తులాభారం మొదలైన పౌరాణిక నాటకాలను భారతదేశమంతా ప్రదర్శించి అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించారు.

వీరు చాలా విభిన్నమైన పాత్రలను పోషించారు. వాటిలో నారదుడు, కంసుడు, ధర్మరాజు, విప్రనారాయణ, బిల్వమంగళుడు, భవానీశంకరుడు, రాజరాజు, సుబుద్ధి, రామదాసు, చినరంగారావు, ధర్మారాయుడు మొదలైనవి ముఖ్యమైనవి. ఎన్ని నాటకాలాడినా, ఆయన గాత్రం కంచు గంటలా మారుమ్రోగేది. మైక్ లేకపోయినా ఒక ఫర్లాంగు దూరం వరకు పద్య పఠనము, వాచిన విధానము క్లియర్ గా వినపడేవి. పద్యాన్ని భావయుక్తంగా విరిచి పాడడంతో ప్రేక్షకులను అవలీలగా ఆకట్టుకొనేవారు.

1946లో మైసూరు మహారాజావారి దర్బారులో వీరి నాటకాలను ప్రదర్శించి సన్మానం పొందారు. 1957లో తెనాలిలో సూరిబాబుకి గజారోహణం, గండపెండేరం మొదలైన సన్మానాలు జరిపి కళావిశారద, గాన గంధర్వ మొదలైన బిరుదులు అందుకున్నారు.

భారతదేశమంతా అపార ఆదరాభిమానాలను సంపాదించిన సూరిబాబు ఫిబ్రవరి 12, 1968 న స్వర్గస్తులైనారు.

సినీ ప్రస్థానం

మూలాలు

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • నటరత్నాలు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, రెండవ ముద్రణ, 2002, పేజీలు: 138-41.

బయటి లింకులు