సుభాషిత త్రిశతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
భర్తృహరి ఈ త్రిశతికి సంధాత మాత్రమే కాని రచయిత కాడని కొందరనుచున్నారు. ఈ త్రిశతి లోని శ్లోకములు పెక్కులు భాసనాటకాదులందు గాన వచ్చుచున్నవి. కావున నట్లనుట యుక్తముగా దోచుచున్నది. కొన్ని శ్లోకముల నితర గ్రంధముల నుండి సంధానించి మరికొన్నింటిని నాతడు రచియించి యీ త్రిశతిని గూర్చి యుండవచ్చును.<ref>భర్తృహరి సుభాషితములు, మొదటి ఎడిషన్ 2008, లిఖిత ప్రచురణలు, విజయవాడ-10</ref>

ఇందలి శ్లోకములన్నియు ననుభవజ్ఞానముతో చెప్పినట్లు పాఠకుల హృదయాలలోనికి సూటిగా పోయి వారిని సంస్కరించుటకు అనుకూలములై యున్నవి. నీతి శతకము కామందకీయాది నీతి గ్రంధముల సారమన దగి యున్నది. శృంగార శాతక మమరుకాది శృంగార గ్రంధములకు దీసిపోవనిది. వైరాగ్య శతకము శాంతరస జ్వాలలను గ్రక్కుచు సంసారాంధకారమున గొట్టు కాడు చుండువారికి వెలుగు నొసగుచున్నది. శృంగార రసము చిప్పిలునట్టు శృంగార శతకము రచియించినవాడే సంసారుల నందరను సన్యాసులుగా జేయజాలునంత శక్తి గల వైరాగ్య శతకమును గూడ రచించినవాడగుట యబ్బురమే యగును.!

గీ.యతి విటుఁడు కాక పోవు టె ట్లస్మదీయ
కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున
విటుఁడు యతి గాక పోరాదు వెస మదీయ
కావ్య శృంగార వర్ణనా కర్ణనమున.

అను సంకుసాల నృసింహ కవి పద్యమిప్పట్టున స్మరింప దగినదిగా నున్నది. ఇంతకును నీ త్రిశతి సంధాన గ్రంథమను వాదమొకటి కలదు గదా!

ఏ తద్గ్రంథ గౌరవమును దెలుపుట కీశ్లోకమొకటి చాలును

శ్లో. న ద్యాతం పద మీశ్వరస్య విధి వత్సంసార విచ్చిత్తయే
స్వ్ర్గ స్వారకవాట పాటనపటుర్ద ర్మో౽పి నోపార్జితః
నారీపీనపయోదరోరుయుగళీస్వాప్నే ౽ పి నాలింగితా
మాతుః కేవలమెవ యౌ వనవనచ్ఛేదే కుఠారావయమ్

==సూచికలు==
==సూచికలు==

09:18, 28 మార్చి 2013 నాటి కూర్పు

సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి. భర్తృహరి సుభాషితాలను అనువాదం చేసిన వారిలో ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి ముఖ్యులు. ఇందు ఏనుగు లక్ష్మణకవి రచించిన పద్యాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఈయన 18వ శతాబ్దికి చెందిన కవి.

సుభాషిత త్రిశతి యను పేరుగల ఈ నీతి గ్రంధమును భర్తృహరి యను పేరు గల యోగీశ్వరుడు రచించెనని ప్రతీతి కలదు. ఈ భర్తృహరి యెక్కడివాడో యెప్పటివాడో స్పష్టముగా చెప్పుట సాధ్యముకాదు. కాళిదాసు వంటి కవులను పోషించిన విక్రమార్కునకు భర్తృహరి యను సోదరుడొకడుకలడని విక్రమార్క కథలందు వినబడుచున్నది. పాణినీయ వ్యాకరణమున త్రిపాదికి వివరణమును, వాక్యపదీయము రచియించిన భర్తృహరి యొకడు కలడు. భర్తృహరి నిర్వేద నాటకమున బ్రస్తుతుండగు భర్తృహరి యొకడు కలడు. వీరందరు వేర్వేరు పురుషులో లేక యొక్కరో తెలియదు. విక్రమార్కుని సోదరుడే యీ కృతి కర్త యగునేని ఈతడు క్రీ.పూ. ప్రథమ శతాబ్దినాటివాడగును. మొదటి విక్రమార్కుని గూర్చియే పలు తగవులున్నవి. కొందరు శూద్రకునికే విద్రమార్కుడని నామాంతర మనుచున్నారు. అనిశ్చితము అయిని కవి దేశ కాలముల గూర్చి యిక చర్చ సరిపోతుంది.

భర్తృహరి ఈ త్రిశతికి సంధాత మాత్రమే కాని రచయిత కాడని కొందరనుచున్నారు. ఈ త్రిశతి లోని శ్లోకములు పెక్కులు భాసనాటకాదులందు గాన వచ్చుచున్నవి. కావున నట్లనుట యుక్తముగా దోచుచున్నది. కొన్ని శ్లోకముల నితర గ్రంధముల నుండి సంధానించి మరికొన్నింటిని నాతడు రచియించి యీ త్రిశతిని గూర్చి యుండవచ్చును.[1]

ఇందలి శ్లోకములన్నియు ననుభవజ్ఞానముతో చెప్పినట్లు పాఠకుల హృదయాలలోనికి సూటిగా పోయి వారిని సంస్కరించుటకు అనుకూలములై యున్నవి. నీతి శతకము కామందకీయాది నీతి గ్రంధముల సారమన దగి యున్నది. శృంగార శాతక మమరుకాది శృంగార గ్రంధములకు దీసిపోవనిది. వైరాగ్య శతకము శాంతరస జ్వాలలను గ్రక్కుచు సంసారాంధకారమున గొట్టు కాడు చుండువారికి వెలుగు నొసగుచున్నది. శృంగార రసము చిప్పిలునట్టు శృంగార శతకము రచియించినవాడే సంసారుల నందరను సన్యాసులుగా జేయజాలునంత శక్తి గల వైరాగ్య శతకమును గూడ రచించినవాడగుట యబ్బురమే యగును.!

గీ.యతి విటుఁడు కాక పోవు టె ట్లస్మదీయ
కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమున
విటుఁడు యతి గాక పోరాదు వెస మదీయ
కావ్య శృంగార వర్ణనా కర్ణనమున.

అను సంకుసాల నృసింహ కవి పద్యమిప్పట్టున స్మరింప దగినదిగా నున్నది. ఇంతకును నీ త్రిశతి సంధాన గ్రంథమను వాదమొకటి కలదు గదా!

ఏ తద్గ్రంథ గౌరవమును దెలుపుట కీశ్లోకమొకటి చాలును

శ్లో. న ద్యాతం పద మీశ్వరస్య విధి వత్సంసార విచ్చిత్తయే
స్వ్ర్గ స్వారకవాట పాటనపటుర్ద ర్మో౽పి నోపార్జితః
నారీపీనపయోదరోరుయుగళీస్వాప్నే ౽ పి నాలింగితా
మాతుః కేవలమెవ యౌ వనవనచ్ఛేదే కుఠారావయమ్

సూచికలు

1. భర్తృహరి సుభాషితములు, మొదటి ఎడిషన్ 2008, లిఖిత ప్రచురణలు, విజయవాడ-10