లినక్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎ఉచ్ఛారణ: అనవసర విషయాలని తొలగంచాను .
రంగస్థలాలు
పంక్తి 90: పంక్తి 90:
ఉదాహరనకు హైదరాబాదు లినక్స్ యూజరు గ్రూపు స్వకాగితం చూడండి. [http://groups.yahoo.com/group/ilughyd/]
ఉదాహరనకు హైదరాబాదు లినక్స్ యూజరు గ్రూపు స్వకాగితం చూడండి. [http://groups.yahoo.com/group/ilughyd/]
వాణిజ్య పంపిణీ సంస్థలకు మద్దతునకు డబ్బులు వసూలు చేయడం ద్వారా వ్యాపారం చేస్తుంటాయి. ముఖ్యముగా వీరు వాణిజ్య వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తుంటారు.
వాణిజ్య పంపిణీ సంస్థలకు మద్దతునకు డబ్బులు వసూలు చేయడం ద్వారా వ్యాపారం చేస్తుంటాయి. ముఖ్యముగా వీరు వాణిజ్య వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తుంటారు.
==రంగస్థలాలు==
లినక్స్ లో చానా రంగస్ధలాలున్నాయి . ఎవరికి నచ్చిన రంగస్ధలం వారు ఎంచుకొని వాడుకోవచ్చు .


===గ్నోమ్===
== కేడిఇ ==
గ్నోమ్ లినక్స్ లో ప్రసిద్ధిగాంచిన రంగస్ధలం
=== కేడిఇ ===
[[దస్త్రం:KDE_logo.svg | right|కేడిఇ చిహ్నం]]
[[దస్త్రం:KDE_logo.svg | right|కేడిఇ చిహ్నం]]
[[దస్త్రం:KDE_4.png|right|thumb| కేడిఇ 4.0 డెస్క్ టాప్]]
[[దస్త్రం:KDE_4.png|right|thumb| కేడిఇ 4.0 డెస్క్ టాప్]]
కే డెస్క్ టాప్ ఎన్విరోన్మెంటు కు చిన్న పేరు కేడిఇ. ఇది లినక్స్ లో వాడతారు. ఇది [[GNOME|గ్నోమ్]] కు పోటీ.
కే డెస్క్ టాప్ ఎన్విరోన్మెంటు కు చిన్న పేరు కేడిఇ. ఇది లినక్స్ లో వాడతారు. ఇది [[GNOME|గ్నోమ్]] కు పోటీ.
మన కంప్యూటర్ తెర రూపం, దానిలోని మన పనికి అవసరమైన రకరకాల అనువర్తనాల సమూహమే కేడిఇ.
మన కంప్యూటర్ తెర రూపం, దానిలోని మన పనికి అవసరమైన రకరకాల అనువర్తనాల సమూహమే కేడిఇ.
*యునిటి
* ఎక్స్ ఎఫ్ సి ఇ
* ఎల్ ఎక్స్ డి ఇ


==తెలుగు లో వాడడం==
==తెలుగు లో వాడడం==
చూడండి [[ఉబుంటు#తెలుగు రంగస్థలము]].
చూడండి [[ఉబుంటు#తెలుగు రంగస్థలము]].

14:36, 29 మార్చి 2013 నాటి కూర్పు

లినక్స్ కెర్నల్ గురించిన సమాచారం కోసం లినక్సు కెర్నలు చూడండి.
టక్స్, ఒక కార్టూను పెంగ్విను సాధారణంగా కూర్చోని ఉన్నట్లు చూపిస్తారు, ఇది లినక్స్ యొక్క ఆధికారిక చిహ్నం
యునిక్స్ సిస్టముల filiation.

లినక్స్ ఒక కంప్యూటరు ఆపరేటింగు సిస్టము మరియూ దీని కెర్నల్ ఉచిత సాఫ్ట్వేరు నకు మరియు ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు నకు ప్రసిద్దిగాంచిన ఒక ఉదాహరణ. మైక్రోసాఫ్ట్ విండోసు ఆపరేటింగు సిస్టము లేదా మ్యాక్ / మెకింటొష్ ఆపరేటింగ్ సిస్టముల వలే కాకుండా లినక్స్ సోర్సు కోడు ప్రజలకు బాహాటంగా లభించడమే కాక ఉచితంగా కూడ లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు దీనిని ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేయవచ్చు, తిరిగి పంచిపెట్టవచ్చు.

లినక్స్ నిజానికి దాని కెర్నల్ యొక్క పేరు, కానీ సామాన్యంగా యునిక్స్ వంటి ఆపరేటింగు సిస్టము అయిన లినక్స్ ఆపరేటింగు సిస్టమును మొత్తాన్ని గుర్తించడానికి వాడతారు. దీనిని కొద్దిమంది జీ యన్ యూ / లినక్స్ ఆపరేటింగు సిస్టమ్ అని పిలవాలి అని చెపుతారు. దీని గురించిన మరింత నిశిదమైన వాదనలకోసం ఇక్కడ చూడండి. ప్రారంభంలో, లినక్స్ కొద్దిమంది ఉత్సాహవంతులు అభివృద్ధి చేశారు. ఆ తరువాత ప్రముఖ కార్పొరేషన్లయిన ఐ బీ యం, హెచ్ పీ మరియు నోవెల్ వంటి సర్వర్లలో ఉపయోగించడంలో సహాయం చేసినాయి, అలాగే డెస్కుటాప్ కంప్యూటర్లలోనూ ప్రాధాన్యత పొందినది. విశ్లేషకులు దీని విజయానికి, తక్కువ ఖర్చు, పటిష్ఠమైన భద్రత, విశ్వసనీయత వంటివి కారణాలుగా చెపుతారు.

లినక్స్ మొదట ఇంటెల్ 386 మైక్రో ప్రొసెసర్ కొరకు అభివృద్ధి చేసినారు. కాని ఇప్పుడు అన్ని ప్రముఖ కంప్యూటరు ఆర్కిటెక్చరు లపై పనిచేస్తుంది. దీనిని ఎంబెడెడ్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత వీడియో రికార్డర్లు, వ్యక్తిగత కంప్యూటరులు, సూపరు కంప్యూటరు లపై ప్రతిక్షేపించినారు!

చరిత్ర

దస్త్రం:Richard Matthew Stallman.jpeg
రిచర్డు స్టాల్ మన్ , ఉచిత ఆపరేటింగు సిస్టము యొక్క ప్రాజెక్టు అయిన జీ యన్ యూ స్థాపకుడు

.

1993 వ సంవత్సరములో రిచర్డు స్టాల్‌ మన్‌ జీ యన్‌ యూ ప్రాజెక్టును స్థాపించినాడు. ఇది ఈ రోజు లినక్స్ సిస్టముకు కావలసిన అన్ని విభాగాలను చాలావరకు చేకూరుస్తుంది. జీ‌ ఎన్ ‌యూ స్థాపించినప్పుడు, దాని లక్ష్యం ఓ సంపూర్ణ యునిక్స్ వంటి ఆపరేటింగు సిస్టమును అభివృద్ధిచేయడము, అదీ పూర్తిగా ఉచిత సాఫ్ట్వేరుల సహాయముతో. 1990 వ దశకం తొలి నాళ్ళకల్లా ఈ జీ యన్‌ యూ ఒక ఆపరేటింగు సిస్టమునకు కావలసిన అన్ని విభాగాలను, లైబ్రరీలను అప్లికేషన్లను రూపొందించినది. కానీ ఒక ముఖ్యమైన విభాగమయిన దిగువ వ్యవస్థ అయిన కెర్నలు మాత్రము రూపొందింపబడలేదు. కెర్నలు కోసం ఈ జీ యన్‌ యూ ప్రాజెక్టు మొదట ట్రిక్సు కెర్నలును రూపొందించినది. ఆ తరువాత దాని అభివృద్ధిని నిలిపి జీ యన్‌ యూ హర్డ్‌ అను మరొక కెర్నలును రూపొందించడం మొదలుపెట్టినారు. థామస్‌ బుష్నెల్‌ ప్రకారం మొదట హర్డ్‌ నిర్మాణ శైలి బీ యస్‌ డీ 4.4 లైట్‌ కెర్నలును అనుసరించాలని, కానీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్కిలీ నుండి సరి అయిన సహాయం లేని కారణంగా; ప్రోగ్రామర్లు మరియు స్టాల్‌ మన్‌ మాక్‌ మిక్రో కెర్నలు నిర్మాణ శైలిని అనుసరించాలని నిర్ణయించినారు. కానీ ఈ నిర్ణయం వల్ల చాలా అనుకోని, ఊహించని ఇబ్బందులు వచ్చి హర్డ్‌ నిర్మాణం చాలా ఆలశ్యం అయినది.

లినస్ టోర్వాల్డ్సు,లినక్స్ కెర్నల్ సృష్టికర్త

ఈ లోపులో 1991లో మరొక కెర్నలు మరియూ యం దాష్‌ (mdash) "లినక్స్" మరియు యండాష్‌ అని పిలవబడినవి, ఒక ఫిన్లాండు యూనివర్సిటీ విద్యార్థి అయిన లినస్ టోర్వాల్డ్సు హెల్సింకి విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం మొదలుపెట్టినాడు. మొదట టోర్వాల్డ్సు మినిక్సును ఉపయోగించినారు. ఇది ఆండ్రూ టానెంబుం ఆపరేటింగు సిస్టము నేర్పడం కోసం వ్రాసిన ఒక యునిక్సు‌ వంటి సిస్టము. కానీ టనెంబుం ఇతరులు తన ఆపరేటింగు సిస్టమును మార్చడానికి అనుమతి ఇవ్వలేదు. దీనివల్ల టోర్వాల్డ్సు మినిక్సునకు బదులుగా మరొక ఆపరేటింగు సిస్టము రూపొందించడము మొదలుపెట్టినాడు. లినక్స్ మొదట ఐ యే 32 అసెంబ్లీ లాంగ్వేజి మరియు సి లాంగ్వేజి లో వ్రాయబడిన టెర్మినలు ఎములేటరు. దీనిని బైనరీ ఫాములోనికి కంపైలుచేయబడి ఫ్లాపీ డిస్కునుండి బూటు చేయసాగినారు, తద్వారా దీనిని ఏ ఆపరేటింగు సిస్టము తోటీ సంబంధములేకుండా ఉపయోగించడం వీలు కలిగినది. ఈ టెర్మినలు ఎమ్యులేటరు రెండు థ్రెడ్లు; ఒకటి సీరియలు పోర్టు నుండి అక్షరాలు పంపించడానికి, మరొకటి స్వీకరించడానికి ఉపయోగపడేవి. తరువాత లినక్స్ డిస్కు నుండి ఫైల్లు వ్రాయడం చదవడం చేయవలసినప్పుడు ఈ టాస్క్‌ స్విచ్చింగు టెర్మినలు ఒక సంపూర్ణ ఫైలు హాండ్లరుగా అభివృద్ధిచేయబడినది. ఆ తరువాత ఇది ఒక సంపూర్ణ ఆపరేటింగు సిస్టముగా అభివృద్ధిచేయబడినది. ఇది పోసిక్సు సిస్టముల అనుసంధానమునకు వీలుగా రూపొందించబడినది. లినక్స్ కెర్నల్ తొలి రూపాంతరం 0.01 సెప్టెంబరు 17, 1991నాడు ఇంటర్నెటులో విడుదలచేయబడినది. ఆ తరువాత రెండవ వర్షను వెంటనే అనుసరించినది[1]. ఆ తరువాత ప్రపంచం నలుమూలలనుండీ వేలాది సాఫ్ట్వేరు డవలపర్లు దీని అభివృద్ధిలో భాగస్వాములై ఒక పూర్తి ఆపరేటింగు సిస్టము రూపొందించినారు. ఎరిక్‌ యస్‌ రేమాండు యొక్క ది కాతడ్రలు అండ్‌ ది బజార్‌ లినక్స్ కెర్నల్ అభివృద్ధి విధానమును వివరిస్తుంది.


0.01 రిలీసు నాటికి, జి యన్ యు బాష్ షెల్ ను రన్ చేయడానికి లినసు చాలా వరకు పొసిక్సు సిస్టమ్ కాల్సును అనువర్తింపచేసాడు; దీని తరువాత బూట్ స్ట్రాపింగ్ చేసే పద్దతి, అభివృద్ధి చాలా వేగంగా జరిగాయి. లినక్స్ ను configure, compile, మరియు install చేయడానికి మొదట్లో మినిక్స్ తో run అయ్యే కంప్యూటరు అవసరమయ్యేది. లినక్స్ యొక్క తొలి version లను హార్డ్ డిస్క్ నుండి బూట్ చేయడానికి తప్పని సరిగా ఒక ఆపరేటింగు సిస్టము అది వరకే ఉండవలసి వచ్చేది. కాని తొందరలొనే స్వతంత్ర బూట్ లోడర్లు వచ్చాయి, వాటిలో చాలా ప్రసిద్దమయినది, లిలొ. లినక్స్ సిస్టమ్ చాలా త్వరగా functionality లో మినిక్స్ ను అధిగమించింది; టార్వోల్డ్సుమరియు ఇతర లినక్స్ కెర్నెల్ డెవలొపర్లు, ఒక సంపూర్ణమైన, fully functional, ఉచిత ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేయడానికి కెర్నెల్ ను జి యన్ యు విభాగాలతో మరియు యూసర్ స్పేస్ ప్రోగ్రామ్ లతో పని చేయించసాగారు.


ఈ రోజు కూడా టోర్వాల్డ్సు కెర్నెల్ అభివృద్ధిని నిర్దేశిస్తున్నాడు, కాని జి.యన్.యు. విభాగాల వంటి ఇతర సబ్ సిస్టం లు మాత్రం విడిగా అభివృద్ధి అవుతున్నాయి. ఒక కలగలిపిన సిస్టమ్ ను తయారు చేయాలనే ప్రయత్నము, బేసిక్ విభాగాలు, గ్రాఫికల్ ఇంటర్ ఫేస్ లు (గ్నోమ్ లేదా కేడిఇ , ఇవి ఎక్స్ విండో సిస్టమ్ పైన ఆధారపడతాయి), మరియు అప్లికేషన్ సాఫ్ట్‍వేర్ లన్నిటినీ కలపడము ప్రస్తుతము లినక్స్ డిస్ట్రిబ్యూషన్ అమ్మకందారులు / సంస్థల చేత చేయబడుతుంది.


టక్స్ అనే పెంగ్విన్ లినక్స్ యొక్క లోగో మరియు మస్కట్, ( వేరేవి ఉన్నప్పటికీ, చాలా తక్కువగా వాడబడతాయి; ఓయస్-టాన్ను చూడండి),లారీ ఎర్వింగ్ 1996 లో తయారు చేసిన బొమ్మ మీద అధారపడి తయారుచేయబడింది.

లినక్స్ అనే పేరు మొదట టార్వోల్డ్సుచేత కాక అరి లెమ్మ్కె చేత పెట్టబడింది. లెమ్మ్కె హెల్సిన్కి యూనివెర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (HUT), ఎస్పూ హెల్సిన్కి దగ్గరలో ftp.funet.fi కు అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తుండేవాడు, ఆ ftp సర్వరు ఫిన్నిష్ యూనివర్సిటీ మరియు రీసెర్చు నెట్వర్కు (FUNET)కు చెందింది, దానిలో చాలా ఆర్గనైజేషన్లు భాగంగా ఉండేవి, వాటిలో కొన్ని HUT మరియు యూనివర్సిటీ ఆఫ్ హెల్సిన్కి. అతను టార్వోల్డ్సుయొక్క ప్రాజెక్ట్ మొదట్లో డౌన్లోడ్ [2] కు ఉపయోగించిన డైరక్టరీ కి, ఆ పేరు ఉపయోగించిన వాడిలో ఒకడు. (లినక్స్ అనే పేరు లినస్ యొక్క మినిక్స్ నుండి సాధింబడింది.) ఆ తరువాత ట్రేడ్ మార్క్ చేయబడింది(కింద చూడండి).

లైసెన్సు విధానం

లినక్స్ కెర్నల్, దాని ఇతర విభాగాలలోని చాలా వరకూ జీ యన్ యూ ప్రజా లైసెన్సు (జీ పీ యల్) ద్వారా విడుదల చేయబడినాయి. జీపీయల్ ద్వారా విడుదల చేయబడిన సోర్సు కోడును ఉపయోగించుకోని అభివృద్ధిచేయబడిన ఇతర విషయములు కూడా జీపీయల్ ద్వారా మాత్రమే విడుదల చేయాలని ఈ జీపియల్ లైసెన్సు నిర్దేశిస్తుంది. ఈ జీ పీ యల్ లైసెన్సును కొన్ని సందర్బాలలో ఒకేరకంగా పంచుకొనె లైసెన్సు, కాపీ వదులు లైసెన్సు అని వ్యవహరిస్తుంటారు. 1997లో లినస్ టోర్వాల్డ్సు "జీపీయల్ లైసెన్సు ద్వారా విడుదల చేయడం నేను చేసిన ఉత్తమమైన పని " అని చెప్పినారు. కొన్ని ఇతర ఉప విభాగాలు ఇతర లైసెన్సులు వాడతాయి, అవి కూడా ఉచిత సాఫ్ట్వేరులాగానే ఉంటాయి. ఉదాహరణకు చాలా లైబ్రరీలు యల్ జీ పీ యల్ ద్వారా విడుదల చేయబడినాయి. యక్స్ విండోసు సిస్టము యమ్ ఐ టీ లైసెన్సు ను వాడుతుంది.


లినక్స్ ట్రేడుమార్కు (U.S. Reg No: 1916230 [3]), లినస్ టోర్వాల్డ్సు రిజిస్టరు చేసినారు. ప్రస్తుతం దీని ట్రేడుమార్కు యల్ యం ఐ, లినక్స్ మార్కు సంస్థ కలిగి ఉన్నది. ఈ సంస్థ ఉత్తర అమెరికా కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ ట్రేడుమార్కు రిజిస్టరు చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఉచ్ఛారణ

లినక్స్ సాధారనముగా మినిక్స్ లేదా మైనిక్సుకు ప్రాస వచ్చేటట్లు పలుకవలెను. మొదటి ఉచ్ఛారణ ఉత్తమమైనది అని అనిపించినా, వాడుకలో రెండవ ఉచ్ఛారణ బాగా ప్రాచుర్యము పొందినది. ఇంకొన్ని చిన్నచిన్న మార్పులు ఉండవచ్చును, కానీ అవి సహజముగా చాలా అరుదుగా వినిపిస్తాయి. linuxలో 'li'ను 'లి'గా పలుకుతూ 'nux'ను 'నక్స్'గా ఉచ్ఛరించవలెను. లినసు+మినక్సు=లినక్స్.

శబ్ద ఫైలులో టోర్వాల్డ్సుగారు linuxను ఏవిధముగా ఉచ్ఛరించుచున్నారో వినవచ్చును, ఇచ్చట కూడా లభ్యమగును. అయితే లినసు గారు ఫిన్‌ల్యాండుకు చెందినవారు కావడము వలన వారి ఉచ్ఛారణకు, ఆంగ్ల ఉచ్ఛారణకు కొంత తేడా తెలుయును.

లినక్స్ మరియు జీ యన్ యూ / లినక్స్

లినక్స్ అనేది ఒక కెర్నలుమాత్రమే! సాధారణంగా అన్ని డిస్ట్రిబ్యూషనులూ (రెడ్ హ్యాటు, మాండ్రాకు, డెబియన్ వంటివి) లినక్స్ కెర్నలుపై జీ యన్ యూ లైబ్రరీలు, అప్లికేషనులు కలిపి ఒక సంపూర్ణ ఆపరేటింగు సిస్టముగా మలచి అందిస్తుంటాయి. ఈ జీ యన్ యూ ప్రాజెక్టు లినక్స్ కెర్నలు కన్నా మందే పుట్టిన ఒక ఉచిత సాఫ్ట్వేరు ప్రాజెక్టు! అందుకని ఈ ఆపరేటింగు సిస్టమును "జీ యన్ యూ / లినక్స్ " ఆపరేటింగు సిస్టము అని లేదా లినక్స్ ఆధారిత జీ యన్ యూ ఆపరేటింగు సిస్టము అని పిలవాలని (అన్ని డిస్ట్రిబ్యూషన్లనూ) ఉచిత సాఫ్ట్వేరు ప్రాజెక్టు యొక్క రిచర్డు స్టాల్ మాన్ చెపుతుంటారు. కానీ లినస్ టోర్వాల్డ్స్ మాత్రం జీ యన్ యూ / లినక్స్ అని పిలవడం చాలా హాస్యాస్పదం అని అంటూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని డిస్ట్రిబ్యూషన్లు మాత్రం ముఖ్యంగా డెబియన్ వంటివి జీ యన్ యూ / లినక్స్ అని పిలుస్తూ ఉంటాయి. కానీ లినక్స్ అనేదే చాలా ప్రచారంలో ఉన్నటువంటి పేరు. ఈ పేర్లపై భేధాభిప్రాయాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరియూ చాలా వివాదంగా ఉన్నాయి।

పంపిణీ వ్యవస్థలు

లినక్స్ సాధారణంగా వినియోగదారులకు వివిధ రకాల పంపిణీల ద్వారా వస్తుంది. ఈ పంపిణీ సంస్థలు ఒక వ్యక్తి చేసేవి, కొంతమంది ఔత్సాహికులు చేసేవి, లేదా పెద్ద పెద్ద సంస్థలు చేసేవిగా ఉన్నవి. ఈ పంపిణీలో లినక్స్, అదనపు సాఫ్ట్వేరు, అప్లికేషన్లు, మరియు సిస్టముపై ప్రతిస్టించడానికి సులభ పద్దతులతో వస్తూ ఉంటాయి. ఈ పంపిణీలు చాలా కారణాలతో సృస్టించబడుతూ ఉంటాయి, ఉదాహరణకు రకరకాల భాషల వారికోసం (తెలుగు, కన్నడ వంటివి), రకరకాల కంప్యూటరు హార్డువేరు నిర్మాణశైలిలకోసం (ఇంటెలు, అథ్లాను వంటివి), రక రకాల స్థితిగతులకు (సాధారణ వినియోగదారుడు, నిజ సమయ సమస్యల కోసం) , ఎంబెడెడు సిస్టముల కోసం, ఇంకా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. ఇప్పటివరకు సుమారుగా 450పైగా లినక్స్ పంపిణీ వ్యవస్తలు కలవు[4]

ఒక సాధారణ లినక్స్ పంపిణీయందు, లినక్స్ కెర్నల్, కొన్ని జీ యన్ యూ సాఫ్ట్వేరు లైబ్రరీలు, ఉపకరణాలు, అప్లికేషనులు, కమాండు లైను యునిక్స్ షెల్, కంపైలర్లు, టెక్స్టు ఎడిటర్లు, శాస్త్రీయ ఉపకరణాలు మొదలగున్నవి కలిగి ఉంటాయి. కొన్ని రకాల లినక్స్ పంపిణీల స్క్రీను బొమ్మలు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ

అభివృద్ధి ప్రయత్నములు

లినక్స్ అనునది ముందే చెప్పుకున్నట్లు ఔత్సాహికులు, స్వఛ్చంద సేవకులు (in telugu?) కలిసి అభివృద్ధి చేసిన ఒక బృహత్ప్రయత్నం! ఈ ప్రయత్నం ఎంత పెద్దదో తెలుసుకోవడానికి జరిగిన ఈ రెండు ప్రయత్నాలను చూడండి:

మొదటిది రెడ్ హాటు లినక్స్ వారు చేసినారు. గిగా బక్ కన్నా ఎక్కువ, జీ యన్ యు / లినక్స్ సైజును అంచనా వేయడం[5], ప్రకారం ఈ పంపిణీలో మొత్తం ముప్పై మిలియను (మూడు కోట్ల) సోర్సు కోడు లైన్లు కలవు! ఇందులో కేవలం కెర్నలు నందు మాత్రమే 2.4 మిలియను (ఇరవై నాలు లక్షల) లైనుల సోర్సు కోడు కలదు. ఈ కెర్నలు సోర్సు కోడు మొత్తం సోర్సు కోడులో ఎనిమిది శాతం. ఇంత పెద్ద సోర్సుకోడును సాధారణ కంపెనీలు అభివృద్ధి చేయాలంటే కొకొమో (constructive cost model, COCOMO) ప్రకారం అంచనా వేయగా అది మొత్తం 1.08 బిలియను డాలర్లుగా (2002 మారక విలువ ప్రకారం) వచ్చినది. అనగా అది సుమారుగా ఐదువేల కోట్ల రూపాయలకు సమానం!

అదే రెండువేల సంవత్సరంలో డెబియను చేసిన అంచనా ప్రకారం సుమారుగా యాబై ఐదు మిలియను సోర్సు కోడు లైన్లు, ఖర్చు 1.9(2000 సంవత్సరపు) బిలియను డాలర్లుగా వచ్చినది.

బిట్ కీపరు అనే అప్లికేషను ద్వారా ఈ లినక్స్ కెర్నల్ సోర్సుకోడును నడిపేవారు, కానీ ఆ అప్లికేషనుతో ఉన్న సమస్యల వల్ల ఇప్పుడు గిట్ అనే అప్లికేషను ద్వారా లినసు టోర్వాల్డ్సు నేరుగా నడుపుతున్నారు!


ఉపకరణాలు

గ్నోమ్ డెస్కుటాప్

వెనకటికి, లినక్స్ వాడవలెనంటే కంప్యూటరు జ్ఞానము చాలా కావలసివచ్చేది, కానీ ప్రస్తుతం వివిధ రకాలయిన పంపిణీ సంస్థలు వచ్చి లినక్స్ వాడుకను చాలా సులభతరము చేసినాయి. కానీ చారిత్రకంగా చూస్తే విండోసు, లేదా మాక్ వినియోగదారులకంటే లినక్స్ వినియోగదారులకు సాంకేతికపరంగా అనుభవం, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, దీనికి మరొక కారణం లినక్స్ వినియోగదారులకు సిస్టము అంతరంగ విషయాలు అందుబాటులో ఉండటము అని చెప్పవచ్చు. ఈ కారణాల వల్ల కొన్నిసార్లు లినక్స్ వినియోగదారులను హాకరు లేదా గీకు అని ముద్దుగా పిలుస్తుంటారు.

ముందే చెప్పుకున్నట్లు లినక్స్ ప్రస్తుతము ఎటువంటి కష్టమైన ఆపరేటింగు సిస్టము కాదు, వివిధ రకాలయిన పంపిణీ సంస్థలు వచ్చి లినక్స్ వాడకాన్ని బహు సులభతరము చేసినాయి, ఇది ప్రస్తుతము అన్ని రకాలయిన వినియోగదారులకు అందుబాటులో ఉన్నది. ఈ మధ్య కాలంలో సర్వరు రంగంలోనూ, వెబ్ సర్వీసు రంగంలోనూ, బొమ్మలను మార్పుల చేర్పులు చేయు రంగంలోనూ, చక్కని ప్రతిభ కనపర్చినది. ఇంకా ఎక్కువమంది వినియోగదారులు గల డెస్క్టాపు రంగంవైపు వేగంగా అడుగులు వేస్తుంది.

ఉపయోగించడములో సులువు మరియు మార్కెట్లో భాగము

ఒకప్పుడు లినక్స్ కంప్యూటర్ నిపుణులు మాత్రమే ఉపయోగించగలిగినా ఇప్పటి లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్‌తో, ఎన్నో క్రొత్త అప్లికేషన్స్‌తో ఉపయోగించడానికి సులువైనవిగా మారాయి.

మార్కెట్లో లినక్స్ డెస్క్‌టాప్ భాగము చాలా వేగముగా పెరుగుతున్నది. మార్కెట్ రిసెర్చ్ కంపెని IDC ప్రకారము 2002లొ 25% సర్వర్లు మరియు 2.8% డెస్క్‌టాప్‌లు లినక్స్ మీద పనిచేస్తున్నాయి. క్నొపిక్స్ వంటి ఇతర పంపిణీ వ్యవస్థలు , సీడి నుండే సరాసరి పనిచేయగలవు. ఇవి హార్డ్ డిస్క్ డ్రైవులో ఇన్స్టాల్ చేయకుండా ర్యామ్ నుండే పనిచేయగలవు. దీనిని CD నుండి boot చేసి వాడుకొనవచ్చు. హార్డ్ డిస్క్ డ్రైవు కు ఎటువంటి మార్పు జరుగదు. అలాగే, పప్పీ వంటి మరికొన్ని చిన్న పంపిణీ వ్వవస్ధలు చాలా తక్కువ స్థలం తీసుకుంటూ హార్డ్ డిస్క్ డ్రైవు కు ఎటువంటి మార్పు జరుగకుండా ఫ్లాపీ నుండి పనిచేయగలవు.

లినక్స్ పై ప్రోగ్రామింగు

లినక్స్ నకు చాలా కంపైలర్లు లభిస్తున్నాయి.

జీ యన్ యూ కంపైలరు కలక్షను (జీ సి సి ), చాలా పంపిణీలతో వస్తుంది. జీసీసీ సీ, సీ ప్లస్ ప్లస్, జావా, మొదలగు కంప్యూటరు భాషలను కంపైలు చేయగలదు.

కంపైలర్లే కాకుండా ఇంకా చాలా ఇంటిగ్రేటడ్ ఎన్విరాన్మెంటులు కూడా కలవు. వీటిలో అజంతా, కెడెవలపు, నెట్ బీన్సు, గ్లేడు ఎక్లిప్సు, మరియూ విశ్వ విఖ్యాత విమ్ , ఈమాక్స్ లు వీటిలో కొన్ని

సహాయము, మద్దతు

సాధారణంగా సాంకేతికపరమైన మద్దతు మొత్తము కూడా వివిధ ఆన్ లైను ఫోరములు, న్యూసు గ్రూపులు, మెయిలింగు లిస్టులు ద్వారా లినక్స్ వాణిజ్య పంపిణీదారులు, లినక్స్ వినియోగదారులు అందిస్తుంటారు! మామూలుగా ఈ గ్రూపులు అన్నీ కూడా లినక్స్ యూజరు గ్రూపులు అని పిలవబడే గ్రూపులుగా ఏర్పడతాయి. వీటిని సుక్ష్మంగా LUG లగ్ అని అంటారు!

ఉదాహరనకు హైదరాబాదు లినక్స్ యూజరు గ్రూపు స్వకాగితం చూడండి. [6] వాణిజ్య పంపిణీ సంస్థలకు మద్దతునకు డబ్బులు వసూలు చేయడం ద్వారా వ్యాపారం చేస్తుంటాయి. ముఖ్యముగా వీరు వాణిజ్య వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తుంటారు.

రంగస్థలాలు

లినక్స్ లో చానా రంగస్ధలాలున్నాయి . ఎవరికి నచ్చిన రంగస్ధలం వారు ఎంచుకొని వాడుకోవచ్చు .

గ్నోమ్

గ్నోమ్ లినక్స్ లో ప్రసిద్ధిగాంచిన రంగస్ధలం

కేడిఇ

కేడిఇ చిహ్నం
కేడిఇ చిహ్నం
కేడిఇ 4.0 డెస్క్ టాప్

కే డెస్క్ టాప్ ఎన్విరోన్మెంటు కు చిన్న పేరు కేడిఇ. ఇది లినక్స్ లో వాడతారు. ఇది గ్నోమ్ కు పోటీ. మన కంప్యూటర్ తెర రూపం, దానిలోని మన పనికి అవసరమైన రకరకాల అనువర్తనాల సమూహమే కేడిఇ.

  • యునిటి
  • ఎక్స్ ఎఫ్ సి ఇ
  • ఎల్ ఎక్స్ డి ఇ


తెలుగు లో వాడడం

చూడండి ఉబుంటు#తెలుగు రంగస్థలము.

రిఫరెన్సులు

చూడండి

వికీ పుస్తకములు
వికీ పుస్తకములు
Wikibooks Guide to UNIX ఈ విషయముపై మరింత సమాచారము కలిగి ఉన్నాయి:

సార్వత్రిక

చిట్టాలు

పత్రికలు

//TODO: Add India specific magazines here....

వీడియోలు

గూగుల్ వీడియో శోధన ఉపయోగించి లినక్స్ కొరకు వెతకండి

బాహ్య లంకెలు

Linux గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

General

Distribution related

  • Distro Quiz — a test that recommends a distribution based on the answers.
  • Linux Online — distributions and FTP Sites (sortable by categories)
  • DistroWatch.com — distribution information & announcements.
  • Linux ISO — comprehensive but rather outdated site which has ISO download links for several distributions.

Criticism of Linux

  • Microsoft: Get the Facts — site that compares Windows Server software and Linux and comes up with the conclusion that Microsoft software has a lower TCO then Linux.
  • Linuxsucks.org — site written by a vertern UNIX user critical of Linux. While his web server uses Linux, and he uses Linux on a regular basis, he believes Linux to a long way from being useful on the desktop.


లినక్స్ పంపిణీలు edit

డెబియన్ | ఉబుంటు | రెడ్ హ్యాట్ లినక్స్ | ఫెడోరా | జెంటూ లినక్స్ | ఓపెన్ స్యూజ్ | సెంటాస్ | నాఁప్పిక్స్ | కుబుంటు | లినక్స్ ఫ్రమ్ స్క్రాచ్ | డామ్ స్మాల్ లినక్సు | పీసీ లినక్స్ ఓ యస్
మాండ్రివా | మెపిస్ | పప్పీ లినక్సు | స్లాక్ వేరు లినక్స్ | క్షాండ్రోస్ లినక్స్ | మరిన్ని...

"https://te.wikipedia.org/w/index.php?title=లినక్స్&oldid=824914" నుండి వెలికితీశారు