మాటలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26: పంక్తి 26:
==మూలాలు==
==మూలాలు==
* వాగ్వైభవము, డా. సంధ్యావందనం లక్ష్మీదేవి, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి, పేజీలు 110-14.
* వాగ్వైభవము, డా. సంధ్యావందనం లక్ష్మీదేవి, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి, పేజీలు 110-14.


[[వర్గం:మానవుల భావవ్యక్తీకరణ విధానాలు]]
[[వర్గం:జంతువులు]]
[[వర్గం:మానవులు]]

04:33, 19 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

అన్ని భాషలలో మన మాట్లాడే విషయాన్ని మాటలు, పలుకు లేదా వాక్కు అంటారు.


"సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్" - మనుస్మృతి

అనగా ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో కాఠిన్యముండడమే కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు కారణమవుతుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.


మాటలలో రకాలు

  • మంచి మాటలు
  • చెడు మాటలు : చెడు వాక్కులు నాలుగు విధాలుగా ఉంటాయి.
    • పారుష్యం అనగా కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు.
    • అనృతం అనగా అసత్యం చెప్పడం. దీనివలన ఆత్మ, మనస్సు కలుషితమవుతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో సమానమని వేదోక్తి.
    • పైశున్యం అనగా చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి ఇతరుల నుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి ఉంటుంది. వీరు సాంఘిక జీవనం కోల్పోతారు.
    • అసందర్భ ప్రలాపం : పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచితూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా వ్యర్ధంగా మాట్లాడకూడదు. ఇడతెగకుండ మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపెడుతుంది.

ప్రసిద్ధ వ్యక్తుల విచిత్రమాటలు

  • సరస్వతీదేవి భారతదేశానికి ఇచ్చిన గొప్పవరం ఆంగ్లభాష - రాజాజీ.
  • నేపాల్ భారతదేశంలో ఒక భాగం -మాధురీ దీక్షిత్
  • ఎయిడ్స్ కూడా జలుబులాంటిదే - కాజోల్
  • ఇండియాలో ఎవరికీ శీలంలేదు - సుస్మితాసేన్
  • ప్రపంచంలో దరిద్రం పోవాలంటే ప్రకృతి విపత్తులురావాలి - శిల్పా శెట్టి
  • పెళ్ళి అంటే జీవితఖైదు - శత్రుగ్న సిన్హా

మూలాలు

  • వాగ్వైభవము, డా. సంధ్యావందనం లక్ష్మీదేవి, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి, పేజీలు 110-14.
"https://te.wikipedia.org/w/index.php?title=మాటలు&oldid=832984" నుండి వెలికితీశారు