వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 188: పంక్తి 188:


చాలా మంది సభ్యులకు వికీమీడియా ఫౌండేషన్ CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ (A2K) ప్రోగ్రాం కి గ్రాంటు ఇచ్చినట్టు తెలిసే ఉంటుంది. ఈ గ్రాంటు భారతీయ భాషా వికీపీడియాల పరిపూర్ణ పెంపుదలకు ఉత్ప్రేరకం కావాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ గ్రాంటు భాగంగా CIS-A2K నుండి మేము ఈ సంవత్సరం ఐదు భారతీయ భాషా వికీపీడియాల పెంపుదలకై కృషి చేయడానికి నిర్ణయించుకున్నాం. మన తెలుగు వికీని ఈ జాబితాలో చేర్చాను. దీనిలో భాగంగా కొంత మంది తెవికీ సముదాయ సభ్యులతో, గత రెండు నెలలుగా, చర్చించి మరియు రచ్చబండలో జరిగిన కొన్ని చర్చల ఆధారంగా వ్యయప్రయాసలకోర్చి ఓ ప్రణాళికను రూపొందించాను. మనలో చాలా మంది చాలా కొద్ది రోజులలోనే ఉగాది నాడు కలుస్తున్నాము. దానికంటే ముందు ఈ ప్రణాళికను మీరందరూ చూడాలని సమయం చాలక మరియు మిగితా భాషా ప్రణాళికల ఒత్తిడివలన అనువదించడానికి వీలుకాక ఆంగ్లములోనే పెట్టాను. క్షమార్ధిని! మిత్రులు ఎవరైనా చొరవ తీసుకొని అనువదించగలిగితే కృతార్ధుడనై ఉంటాను. భాషా దోషాలను సద్మనస్సుతో సవరించ ప్రార్ధన. [[వికీపీడియా:CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక|CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక పేజి ఇది]]. తెవికీ మిత్రులు మీ అమూల్యమైన సూచనలు సలహాలు సూచనలు [[వికీపీడియా చర్చ:CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక|ప్రణాళిక చర్చ పేజీలో]] ఇవ్వవలసినదిగా మనవి. ధన్యవాదాలు. మిత్రులు e-mail ద్వారా పంపడానికి సౌకర్యంగా ఉంటే vishnu@cis-india.org కి మెయిల్ చేయగలరు. ఒకవేళ ఫోన్ ద్వారా చర్చించదలచితే నా మొబైల్ నంబరు +91-9845207308 [[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])15:27, 1 ఏప్రిల్ 2013 (UTC)
చాలా మంది సభ్యులకు వికీమీడియా ఫౌండేషన్ CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ (A2K) ప్రోగ్రాం కి గ్రాంటు ఇచ్చినట్టు తెలిసే ఉంటుంది. ఈ గ్రాంటు భారతీయ భాషా వికీపీడియాల పరిపూర్ణ పెంపుదలకు ఉత్ప్రేరకం కావాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ గ్రాంటు భాగంగా CIS-A2K నుండి మేము ఈ సంవత్సరం ఐదు భారతీయ భాషా వికీపీడియాల పెంపుదలకై కృషి చేయడానికి నిర్ణయించుకున్నాం. మన తెలుగు వికీని ఈ జాబితాలో చేర్చాను. దీనిలో భాగంగా కొంత మంది తెవికీ సముదాయ సభ్యులతో, గత రెండు నెలలుగా, చర్చించి మరియు రచ్చబండలో జరిగిన కొన్ని చర్చల ఆధారంగా వ్యయప్రయాసలకోర్చి ఓ ప్రణాళికను రూపొందించాను. మనలో చాలా మంది చాలా కొద్ది రోజులలోనే ఉగాది నాడు కలుస్తున్నాము. దానికంటే ముందు ఈ ప్రణాళికను మీరందరూ చూడాలని సమయం చాలక మరియు మిగితా భాషా ప్రణాళికల ఒత్తిడివలన అనువదించడానికి వీలుకాక ఆంగ్లములోనే పెట్టాను. క్షమార్ధిని! మిత్రులు ఎవరైనా చొరవ తీసుకొని అనువదించగలిగితే కృతార్ధుడనై ఉంటాను. భాషా దోషాలను సద్మనస్సుతో సవరించ ప్రార్ధన. [[వికీపీడియా:CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక|CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక పేజి ఇది]]. తెవికీ మిత్రులు మీ అమూల్యమైన సూచనలు సలహాలు సూచనలు [[వికీపీడియా చర్చ:CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక|ప్రణాళిక చర్చ పేజీలో]] ఇవ్వవలసినదిగా మనవి. ధన్యవాదాలు. మిత్రులు e-mail ద్వారా పంపడానికి సౌకర్యంగా ఉంటే vishnu@cis-india.org కి మెయిల్ చేయగలరు. ఒకవేళ ఫోన్ ద్వారా చర్చించదలచితే నా మొబైల్ నంబరు +91-9845207308 [[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])15:27, 1 ఏప్రిల్ 2013 (UTC)

:: ఈ ప్రణాళికను ఆంగ్లములో చదవడానికి [[m:India Access To Knowledge/Work plan April 2013 - June 2014/Telugu|ఇక్కడ చూడండి]] . సభ్యులు మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వవలసినదిగా ప్రార్ధన. [[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])07:25, 23 ఏప్రిల్ 2013 (UTC)


== వికీసౌర్స్‌లో ఆంధ్రులచరిత్ర ==
== వికీసౌర్స్‌లో ఆంధ్రులచరిత్ర ==

07:25, 23 ఏప్రిల్ 2013 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

<br=clear all>


వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం ప్రతిపాదన

వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం ప్రతిపాదన స్థాయిలో వుంది. సభ్యులు ఏకాభిప్రాయానికై సవరణలు చర్చాపేజీలో రాయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 17:21, 27 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పాఠకుల మొదటి పేజీలానే, వ్రాసేవాళ్ళకో మొదటి పుట కావాలి

మొదటి పుటను పూర్తిగా వికీ పాఠకుల కోసం ఆప్టిమైజ్ చేశాం కదా. కానీ వికీలో వ్రాసేవాళ్ళకోసం ఒక ప్రధాన పుట కావాలి. ఆలోచించగలరు. Chavakiran (చర్చ) 02:40, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విషయం అర్థం కాలేదు.మరింత విపులంగా చెప్పగలరాపాలగిరి (చర్చ) 02:51, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సముదాయ_పందిరి ఉంది కదా?? --వైజాసత్య (చర్చ) 04:41, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అనును. నేనుకునే దానికి అది సరిగ్గా సరిపోతుంది. మిస్సయ్యాను. Chavakiran (చర్చ) 07:52, 1 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Wikidata phase 1 (language links) live on this Wikipedia

Sorry for writing in English. I hope someone can translate this locally. If you understand German better than English you can have a look at the announcement on de:Wikipedia:Kurier.

As I annonced 2 weeks ago, Wikidata phase 1 (language links) has been deployed here today. Language links in the sidebar are coming from Wikidata in addition to the ones in the wiki text. To edit them, scroll to the bottom of the language links, and click edit. You no longer need to maintain these links by hand in the wiki text of the article.

Where can I find more information and ask questions? Editors on en:wp have created a great page with all the necessary information for editors and there is also an FAQ for this deployment. It'd be great if you could bring this to this wiki if that has not already happened. Please ask questions you might have on the FAQ’s discussion page.

I want to be kept up to date about Wikidata To stay up-to-date on everything happening around Wikidata please subscribe to the newsletter that is delivered weekly to subscribed user’s talk pages.

--Lydia Pintscher 23:11, 6 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

మొలక వ్యాసాల విస్తరణ గూర్చి

క్రొత్త మొలక వ్యాసాలు, ఏక వ్యాసాలు సృష్టించే కన్నా గతంలో గల మొలక, ఏకవాక్య వ్యాసాలను మనమందరం సమిష్టిగా వృద్ధి చేస్తే తెవికీ అందరికీ ప్రయోజన కరంగా ఉంటుందని నా అభిప్రాయం. మొలక వ్యాసాలను దాని వర్గంలో గుర్తించవచ్చు. గాని మొలక మూస లేనిఏక వాక్య వ్యాసాలను ఎవరైనా గుర్తించి ఒక పేజీలో ఉంచినట్లయితె వాటిని తెవికీ సభ్యులు నాణ్యత పెంచుటకు కృషి చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరు రోజుకు ఒక వ్యాసం అభివృద్ధి చేస్తే చాలు. తెవికీ నాణ్యత పెరుగుతుంది. ఆ వ్యాసాలు తొలగించేకన్నా వాటి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయడం అవసరమని నా భావన. వాటి చర్చకే అధిక సమయం మనం వెచ్చించామనే విషయం మరువరానిది. చంద్రకాతరావు గారి లాంటి వాళ్ళు గ్రామ వ్యాసాలు విస్తరణ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మా లాంటి వాళ్ళం ఏవైనా వ్యాసాలు అభివృద్ధి చేయగలమని నా అభిప్రాయం.

మొలకలు గల తెవికీలో
మొలకల విస్తరణ పనులు మొదలెడదామా,
మొలకలు మన మొదిలేసీ
మొలకలు తొలగించమనుట మేలవు తుందా!

—కె.వి.ఆర్

మొలకనైన నేమి మంచి విషయమైన
విస్తరించి దాని విలువ పెంచు
విషయలేమిదైన వివరింపు వ్యాసము
ఎవరికేమి ఫలము! తెవికి ధీర!

—కె.వి.ఆర్

విషయం సమగ్రంగా లేని విస్తరణ వ్యాసం కంటె మంచి విషయం గల మొలక వ్యాసాన్ని విస్తరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని నా అభిప్రాయం.(  కె. వి. రమణ. చర్చ 13:00, 8 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
మంచి సూచన. నేను ఇదివరకు బాటును ఉపయోగించి గ్రామాల పేజీలు, సినిమాల పేజీలు మినహాయించి మిగిలిన మొలకల జాబితా ఒకటి తయారుచేశాను. అది చివరిసారిగా 2010లో తాజాకరించబడింది. వికీపీడియా:మొలకల జాబితా - ఇక్కడ నుండి మనం విస్తరణ మొదలుపెట్టవచ్చు --వైజాసత్య (చర్చ) 05:40, 26 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను చాలా రోజుల నుండి కొత్త వ్యాసాలు సృష్టించడం కన్నా మొలక వ్యాసాల విస్తరణ పై దృష్టి పెట్టి విస్తరిస్తున్నాను. - -  కె.వెంకటరమణ చర్చ 05:50, 26 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పని చేయని లింకులు

తెవికీ సహాయ పేజీలోని పద్మ - వెన్నా నాగార్జున లింకు పనిచేయడం లేదు. యాహూ జియోసిటీస్ మూసివేయడం వలన ఈ లింకు కూడా తెగిపోయింది. సరిచేయ మనవి.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:07, 10 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆయన ఎం.ఐ.టీలో చదువుతున్నప్పుడు విశ్వవిద్యాలయపు వెబ్‌సైటులో పద్మను ఉంచేవారు. ఇంకా అక్కడ ఉందో లేదో తెలియదు. అయినా ఈ పద్మ వెబ్‌ పరికరాన్ని నాగార్జున గారు ఇంకా సర్వీసు చేస్తున్నారని నేననుకోను. అయినా ఒకసారి వెతికిచూస్తా --వైజాసత్య (చర్చ) 05:15, 11 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మల గురించిన సందేహం

వికీ పీడియా లో దస్తాల ఎక్కింపు గురించి ఈ క్రింది సందేహాలను నివృత్తి చేయగలరు.

  1. సినిమా వాల్‍పోస్టర్లను ఫొటో తీసినపుడు అది ఏ లైసెన్సు కిందికి వస్తుంది. ఈ దస్త్రం మరియు ఏదేని వెబ్సైటు నుంచి తీసుకున్న సినిమా ప్రచార చిత్రం ఒకే ప్రాధాన్యత కిందికి వస్తాయా? I mean will both of these fall in same category? ఇలాంటి చిత్రాలను (కెమెరా తో ఫోటో తీసిన వాల్‍పోస్టర్లు) వికీ కామన్స్ లో ఏ లైసెన్స్ తో ఎక్కించవచ్చు?
  2. కెమెరా తో ఫోటో తీసిన వాల్‍పోస్టర్లు మరియు ఇతర వెబ్సైటు నుంచి ఎక్కించిన బొమ్మలు రెండూ లభిస్తున్నపుడు, మొదటి చిత్రానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చునా? I mean, can we use the former image in the corresponding movie article?

సభ్యులు దయచేసి వివరణ ఇవ్వగలరు.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:17, 10 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కెమెరాతో ఫోటోతీసి వాడుకున్నా, ఆ అసలు పోస్టరు కున్న కాపీహక్కులు పోవు. పోస్టరుకు ఏ నియమాలు వర్తిస్తాయో, కెమెరాతో తీసిన ఫోటోకు అవే నియమాలు వర్తిస్తాయి. ఈ విధంగా ఆలోచించి చూడండి పుస్తకాన్ని జిరాక్సు తీసినంత మాత్రాన కాపీహక్కులు వర్తించవా? కాపీహక్కులు ప్రకటించేటప్పుడు ఆ కృతిని అనుమతి లేకుండా ఏ విధంగానూ నకలు తీయకూడదని ప్రకటిస్తారు. కాబట్టి పోస్టరును ఫోటో తీయటం కంటే ఏదైనా వెబ్‌సైట్లో ఆ సినిమా పోస్టరు లభిస్తే అది వాడుకోవటం శ్రేయస్కరం. ఫెయిర్ యూజ్‌కు ఎంతో కొంత వెసలుబాటు ఉంది. అనుమతి లేకుండా నకలు తియ్యటానికి అసలు వెసలుబాటే లేదాయె --వైజాసత్య (చర్చ) 05:10, 11 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు వైజా సత్య గారు.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:15, 11 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల వివరాలు తెలుగుసేత వికీసోర్స్ ప్రాజెక్టు

భారత డిజిటల్ లైబ్రరీలో 22000పైగా తెలుగు పుస్తకాలు బొమ్మ రూపంలో గ్రహణం చేయబడినవి. వాటిలో 2200 పైగా ఆర్కీవ్. ఆర్గ్ లో ఆన్లైన్ లో చదువుకొనుటకు, మరియు నకలు తెచ్చుకొనుటకు సౌకర్యవంతంగా చేర్చబడినవి. అయితే వీటి పేర్లు ఇంగ్లీషులిపిలో వుండడంతో వీటిగురించి గూగుల్ ద్వారాకూడా తెలుగులో వెతికితెలుసుకొనుటకు వీలులేదు. అందువలన ఈ వికీప్రాజెక్టు ద్వారా పుస్తకము పేరుని,రచయితపేరుని తెలుగులిపిలో వ్రాసే పని ప్రారంభించడం జరిగింది. దీనికి సహకరించవలసినదిగా కోరుచున్నాను. మరిన్ని వివరాలకు ప్రాజెక్టు పేజీ (s:Wikisource:వికీప్రాజెక్ట్/ఆర్కీవ్.ఆర్గ్ లోని తెలుగు పుస్తకాలు) చూడండి. దీనివలన తెవికీలో రచనలు చేసేవారికి వుపయోగకరమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. --అర్జున (చర్చ) 05:24, 11 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • ప్రాజెక్టు బాగుంది. ఇవి ఇంటర్నెట్ ఆర్కీవులో ఉచితంగా దొరకుతున్న పుస్తకాలు. అనువాదం జరిగిన తర్వాత ఉత్సాహం చూపిస్తున్న రచయితలు, ఆయా పుస్తకాల యొక్క మొదటి కొద్ది పేజీలలో ఆ పుస్తకానికి సంబంధించిన సమాచారం నుండి వికీపీడియాలో పుస్తక సమీక్షగా వ్యాసం చేర్చి; ఆ తర్వాత వికీసోర్సు కు లింకు ఇస్తే ఆసక్తి కలిగిన వారు దాని నకలీకరణం మీద కేంద్రీకరించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 07:09, 11 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Convert complex templates to Lua to make them faster and more powerful

(Please consider translating this message for the benefit of your fellow Wikimedians)

Greetings. As you might have seen on the Wikimedia tech blog or the tech ambassadors list, a new functionality called "Lua" is being enabled on all Wikimedia sites today. Lua is a scripting language that enables you to write faster and more powerful MediaWiki templates.

If you have questions about how to convert existing templates to Lua (or how to create new ones), we'll be holding two support sessions on IRC next week: one on Wednesday (for Oceania, Asia & America) and one on Friday (for Europe, Africa & America); see m:IRC office hours for the details. If you can't make it, you can also get help at mw:Talk:Lua scripting.

If you'd like to learn about this kind of events earlier in advance, consider becoming a Tech ambassador by subscribing to the mailing list. You will also be able to help your fellow Wikimedians have a voice in technical discussions and be notified of important decisions.

Guillaume Paumier, via the Global message delivery system. 20:25, 13 మార్చి 2013 (UTC) (wrong page? You can fix it.)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ లో ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము పాఠ్యీకరణ పూర్తి

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము (వికీసోర్స్ లో s:ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము ) దాదాపు 435 పేజీల పాఠ్యీకరణ పూర్తి అయింది. 1910లో ముద్రించబడిన ఈ పుస్తకం సులభంగా చదువుకోవటానికి, వెతకటానికి, అప్పటి పుస్తక సంబంధిత సామాజిక పరిస్థితులు అర్థం చేసుకోటానికి (చివరిలోగల ప్రకటనలు) చాలా వుపయోగపడుతుంది. ఇంకా అచ్చుదిద్దవలసినది, సమస్యాత్మకపేజీలు సరిచూడవలసిన పని వున్నది. ముందలరోజులలో సహ సభ్యుల సహకారంతో పూర్తవుతుందని ఆశిస్తాను. దాదాపు 7 నెలలుగా పాఠ్యీకరణలో ప్రముఖంగా సహకరించిన సుజాత గారికి, విక్రమ్ గారికి కృతజ్ఞతలు. దీని స్ఫూర్తితో ఇంకొన్ని పాఠ్యీకరణలు పూర్తయి వికీ ప్రాజెక్టుల అభ్యున్నతిజరగాలని ఆశిస్తున్నాను--అర్జున (చర్చ) 16:16, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునరావుగారూ ! ఇందులో మీరు కృషిచేసింది అధికం. అయినప్పటికీ మీ ప్రశంశకు ధన్యవాదాలు. కొత్తవి ప్రారంభించండి వీలైనంతగా పనిచేయడానికి ప్రయత్నిస్తాను. --t.sujatha (చర్చ) 04:56, 18 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు, సుజాత మరియు విక్రం గార్లకు ధన్యవాదాలు. ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని వివిధ వ్యాసాలుగా తెలుగు వికీపీడియాలో చేర్చితే చాలా మంచి వ్యాసాలు తెలుగు వికీపీడియాలో తయారౌతాయి. ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 06:29, 18 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • దీనిని వనరుగా కొత్తవ్యాసాలు తయారుచేయటం సులభం ఎందుకంటే దీనినుండి నకలుచేయటానికి అభ్యంతరాలు లేవు. మూలము పూర్తిగా వికీసోర్స్ లో వుందికాబట్టి యథాతథంగా వ్యాసం రాయటం అంత ఉపయోగముండదు--అర్జున (చర్చ) 09:11, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 10 మరియు 11 తేదీల్లో వికీపీడియా మహోత్సవం హైదరాబాదులో నిర్వహణ గురించి.

హైదరాబాదులో నిర్వహించబోతున్న తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కి సంబంధించి చర్చించేందుకు ముఖాముఖీ పాల్గొనాలనుకునే వారు వికీపీడియా:సమావేశం గమనించగలరు.

ఈ సందర్భంలో నేనొక పతాకసందేశాన్ని రూపొందించాను.

తెలుగు వికీపీడియా మహోత్సవము

. రహ్మానుద్దీన్ (చర్చ) 13:15, 17 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

[1] ఈ పతాకసందేశ బొమ్మ ఎలా ఉంది? రహ్మానుద్దీన్ (చర్చ) 08:12, 18 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా బాగుంది. మహోత్సవం యొక్క ప్రచారం కోసం దీన్ని విస్తృతంగా ఉపయోగించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 08:29, 19 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పతాక సందేశం బాగుంది. అర్జునరావు గారు చెప్పినట్లు వెడల్పు తగ్గిస్తే మంచిదేమో. ఇప్పుడున్న 800px నుంచి 600-700 మధ్యన ఉంచితే చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:19, 19 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పరిమాణం తగ్గించాను. --వైజాసత్య (చర్చ) 01:28, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • 20.3.2013 సమయము గం.04:26 లకు పైన నా అభిప్రాయము చివరన ఈ రోజు కొత్తగా ఒక ఆంగ్ల పదము IP 117.239.53.3, సమయము:10.07, రోజు: 6 ఏప్రిల్ 2013, బైట్లు:(+117) తోటి (బేగంబజార్, ఎ.ఎ.టవర్స్, కె.జి.ఎన్. ట్రావెల్స్ దగ్గర ప్రాంతం, లేదా BHEL-II, రామచంద్రాపురం, హైదరాబాదు) "luchaaa" [2]అని ఎవరి కోసమో పొందు పరచారు. ఇది మాత్రం ఏమీ తెలియని అనామక అమాయకులు చేసింది మాత్రం కాదు. కేవలం (ఇక్కడ) వికీలో తెలిసిన వాళ్ళు లేదా వారికి తెలిసిన ఇతర వికీలను అభిమానించే వాళ్ళు అయినా అయి ఉండవచ్చును. ఇది వ్యక్తి మనసు మీద దాడి అనుకొవచ్చా ? ఇదేమి సంప్రదాయమంటారు ? ఇలాంటి వాటి గురించి ఎక్కడయినా చర్చలు జరిగి ఉంటే తెలిసిన వాళ్ళు దయచేసి లింకులు ఇవ్వగలరు. స్పందించగలరు.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:07, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఉగాది తెలుగు వికీపీడియా సర్వసభ్య సమావేశం

ఉగాది రోజున హైదరాబాదులో జరగనున్న వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం ఆహ్వాన పత్రికలో భాగంగా వ్రాయబడుతున్న వికీపీడియా:అంతర్జాతీయ వికీపీడియా వికీపీడియా అనే వ్యాసం సభ్యులందరూ పరిశీలించండి. ఇప్పటి వరకు లభించిన సభ్యుల వివరాలు అందులో చోటు చేసుకున్నాయి. అనేక మంది వివరాలు కాని చాయా చిత్రాలు కాని ప్రస్థుతం లభ్యం కానందున చేర్చబడ లేదు. ఈ వ్యాసం ప్రింటు చేయబడడాని ఇంకా 48 గంటల సమయం ఉంది కనుక ఆసక్తి కలిగిన సభ్యులు స్పందించండి.

  • సభ్యులు తమ స్వస్థలం ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశం వంటి వివారాలు, చాయాచిత్రాలు మీ సభ్యపేజీలలో చేర్చండి.
  • కృషిచేసిన సభ్యుల ఉపశీర్షికలో మీరు అదనంగా చేర్చాలని అనుకున్న వారి వివరాలను చేర్చండి. --t.sujatha (చర్చ) 08:03, 19 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మన తెలుగు వికీ సముదాయ సభ్యులు 2013 ఏప్రిల్11 తేదీ 'విజయ' నామ ఉగాది రోజున హైదరాబాద్ లో నిర్వహించ సంకల్పించిన తెలుగు వికీపీడియా మహోత్సవం కోసం ఆహ్వానితులకు మరియు మీడియా వారికి ఆహ్వానపత్రాలతోబాటు జతపరచి పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా తయారుచేస్తున్న వికీపీడియా:అంతర్జాతీయ వికీపీడియా వ్యాసం దాదాపుగా పూర్తి అయినది. ఉగాది కార్యక్రమానికి ఇంక సమయం చాలా తక్కువగా ఉన్నందున ప్రింటింగు వేగంగా జరగాలన్న ఉద్దేశంతో 21-3-13 గురువారం రాత్రి తో వ్యాసరచన ముగిస్తున్నాము. కావున గౌరవ సభ్యులు ఈ వికీపీడియా:అంతర్జాతీయ వికీపీడియా వ్యాసాన్ని పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేయడమే కాకుండా... ఇంకా చేర్చబడని సభ్యులవివరాలు, ఫోటోలను జతపరచవలసిందిగా కోరుకుంటున్నాను. ... Malladi kameswara rao (చర్చ) 07:52, 20 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గతంలో విశేష కృషి చేసిన సభ్యుల వివరాలు

ఆర్యా..... ఆహ్వాన పత్రికలో గతంలొ విశేష కృషి చేసి .... ఏవో కారణాల వల్ల ప్రస్తుతం కనబడని వారి వివరాలు కూడ చేరిస్తే బాగుంటుందని నా అభిప్రయము. అదే విదంగా ప్రస్తుత సభ్యుల వివరాలు కొందరివి చాల క్లుప్తంగా ఒకే లైను మాత్రమే వున్నది. ఆ వివరాలు కనీసం మూడు నాలుగు లైన్లన్నా వుంటే బాగుంటుంది. దానిలో వారి చేసిన కృషి, వారికి లభించిన పథకాలు వంటి వివరాలతొ వుంటే బాగుండునేమో ఆలోచించండి. ఇది పంపిటీ చేసె పత్రము గాన.... చదివేవారికి..... కొత్తగా చేరగోరె వారికి ఉత్సాహాన్నిస్తుందని నా అభిప్రాయము. Bhaskaranaidu (చర్చ) 04:16, 21 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Bhaskaranaidu గారు, దాదాపుగా అదేవిధముగా వ్యాస కృషి జరుగుతోందని నా అభిప్రాయము. మీరు వ్యక్త పరచిన విషయములలో మన అందరి బాధ్యత కూడా ఎప్పుడూ ఉంటుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:54, 22 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్ గా గుర్తింపు

వాడుకరి:RahmanuddinBot నేను సృష్టించుకున్న బాట్. ఇది వాడి కొన్ని చిన్ని చిన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను. అధికారి/నిర్వాహక హోదా గల వారు ఈ బాట్ వాడుకరిని బాట్ గా గుర్తించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 07:20, 21 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ లో పాత పాఠ్యపు స్కాన్ లు సరిదిద్దు

నేనుఅసంపూర్తిగా వున్న పాఠ్యాల పాత స్కాన్ లకు బదులు s:మొల్ల రామాయణం (అసంపూర్తి) ( s:మొల్ల రామాయణం (రామా అండ్ కో) (పూర్తి), s:గాన విద్యా వినోదిని, s:ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం) పూర్తి స్కాన్లు చేర్చాను మరియు ఇప్పటికే జరిగిన పనిని వీలైన చోట్ల తరలించాను. ఈపై అంశాల పాఠ్యీకరణ చేసేవారు ఇక నిశ్చింతగా చేయవచ్చు.--అర్జున (చర్చ) 16:12, 22 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీలో ఉండవలసిన పేజీలు

తెవికీలో కొన్ని విక్షనరీలో ఉండవలసిన పేజీలున్నాయి. ఉదాహరణకు అనుకూలము పేజీ. వర్గం:సంస్కృత_పదజాలము లోని చాలా పదాలు కేవలం అర్ధం మాత్రమే తెలియజేస్తున్నవి. అవి విక్షనరీకి తరలించాలనుకుంటా. ఏమంటారు? --వైజాసత్య (చర్చ) 05:16, 26 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటి శబ్దార్ధ పేజీలు అనేకం ఉన్నవి.వీటిని వ్యాసంగా పరిగణించరాదు. వీటిని విక్షనరీకి తరలించటమే మంచిది. - -  కె.వెంకటరమణ చర్చ 05:31, 26 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
లేదా ఆ పదానికి సంబంధించి కొన్ని వాడుకలు, లేదా ఆ పదం పై వచ్చిన వివాదాలు మొదలగునవి చేర్చి వికీపీడియాలో కొనసాగించవచ్చు. ఉదాహరణకు మళయాళం వికీపీడియా లో సంయుక్తాక్షరాలకు, వర్ణాలకు కూడా పేజీలున్నాయి. ఔత్సాహికులకు ప్రోత్సాహమిచ్చి ఆయా వ్యాసాలు తీర్చిదిద్దాలి. రహ్మానుద్దీన్ (చర్చ) 06:06, 26 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలా చేస్తే విక్షనరీ లో గల అనేక వేల పేజీలు తెవికీ లోకి దిగుమతి అవుతాయి. అపుడు విక్షనరీ తో పని ఏముంటుంది - -  కె.వెంకటరమణ చర్చ 06:30, 26 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సంస్కృత పదజాలము వర్గాన్ని నేనే మొదలుపెట్టాను. ఆంగ్ల వికీపీడియాలొ ముఖ్యమైన సంస్కృత పదాలకు చిన్నవి మరియు పెద్దవి వ్యాసాలున్నాయి. అదే మాదిరిగా కొన్ని ముఖ్యమైన సంస్కృతం నుండి వచ్చిన తెలుగు పదాలకు వ్యాసాలు తయారుచేయడంలో తప్పులేదని పిస్తుంది. ఇది విక్షనరీకి పోటీగా కాదు. విజ్ఞలైన సభ్యులు ఆలోచించి కొన్ని సంస్కృత పదాలకు సంబంధించిన తెలుగు వ్యాసాలను ప్రయత్నించి చూడండి. అలా అవకాశం లేకపోతే అయోమయ నివృత్తి పేజీగా మార్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 11:02, 30 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీశైలి చర్చ

ఇటీవలి రచ్చబండలో వికీశైలి గురించిన చర్చను వికీపీడియా_చర్చ:ఏకవచన_ప్రయోగం కు తరలించబడింది. పాత చర్చలు కూడా అందుబాటులో వుంటాయికాబట్టి. అక్కడ సహాయంకావాలి మూస చేర్చబడింది. దయచేసి స్పందనలు అక్కడనేరాయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 06:25, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి పేజీ లో మార్పు చెయ్యడం ఎలా

మొదటి పేజీ లో మార్చి 27 (చరిత్ర లో ఈ రోజు) న జరిగిన సంఘటనలలో వయాగ్రాకు అనుమతి ఇచ్చిన సంవత్సరం 1998 అని ఉండాలి,1898 కాదు. దీనిని సరిచెయ్యడం ఎలా? కంపశాస్త్రి 16:10, 27 మార్చి 2013 (UTC) సరిచెయ్యబడింది. ధన్యవాదాలు.కంపశాస్త్రి 16:13, 27 మార్చి 2013 (UTC)

ప్రసారమాధ్యమాల్లో వికీగురించి కొత్తపేజీప్రారంభం

వికీపీడియా:ప్రసార మాధ్యమాల్లో తెలుగు వికీపీడియా లో రామోజీరావు గారు తెలుగు వెలుగు పిభ్రవరి 2013 సంచికలో తెలుగు వికీపీడియాను అభినందిస్తూ రాసిన వ్యాఖ్య చూడండి.--అర్జున (చర్చ) 09:36, 28 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాధ్ గారికి వినతి

మీడియా వారికి సౌకర్యంగా ఉండటం కోసం తెలుగు వికీపీడియా ఓపెన్ చేయగానే వచ్చే మొదటి పేజీలో మరిన్ని వివరాలకుచూడండి వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం తో బాటు వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము లింక్ కూడా వుండే విధంగా మార్పు చేయవలసిందిగా నాకోరిక. ...Malladi kameswara rao (చర్చ) 05:58, 30 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చేసాను క్రింద చూడండి.విశ్వనాధ్ (చర్చ) 07:30, 30 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. ..Malladi kameswara rao (చర్చ) 07:39, 30 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
:: ఎందుకో మళ్ళీ మొదటి పేజీలో వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము లింక్ చూపించటం లేదు. సరిచేయవలసిందిగా విజ్ఞప్తి. .....Malladi kameswara rao (చర్చ) 10:23, 30 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దారిఖర్చులు మరియు వసతి సౌకర్యం

హైదరాబాదుకు బయటనుండి వచ్చు వికీపీడియన్లకు ప్రయాణ మరియు వసతి సౌకర్యం: హైదరాబాదుకు బయటనుండి సమావేశానికి హాజరుకావాలనుకొంటున్న వికీపీడియా సభ్యులకు ప్రయాణ మరియు వసతి సౌకర్యము (ఇద్దరు లేక ఎక్కువ మంది రూము పంచుకొనే ప్రాతిపదికన) కల్పించటానికి (రైలు ఎసి టు టైర్ చార్జీలకు లోబడి అయిన ఖర్చులకు) పరిమిత నిధులు కేటాయించటమైనది. డిసెంబరు 31, 2012 నాటికి తెలుగు వికీప్రాజెక్టులు అన్నిటిలో కలిపి కనీసం 50 (ఏభై) మార్పులు చేసినవారు దీనికి అర్హులు. ఈ సౌకర్యం "ముందు వచ్చినవారికి ముందు" ప్రాతిపదికన ఇవ్వబడుతుంది. ఆసక్తిగల సభ్యులు త్వరగా ఈ పేజీలోని ' తప్పక హాజరవుతున్న సభ్యుల ' విభాగంలో మీ పేరు మరియు ఊరు నమోదు చేసుకొనమని కోరడమైనది. వికీ "సభ్యులు original టికెట్టు ఇస్తూ voucher పై సంతకం చేయవలసి వుంటుంది. ఇది CIS-A2K ఆడిటర్ వారి నిభంధన కావున సభ్యులు మన్నించాలని అభ్యర్దన.Rajasekhar1961 (చర్చ) 10:57, 30 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Script error

తెవికీలో 3500 పైగా మూసలు (లింకు) పనిచేయడం లేవు. మూస బదులు Script error అని కనిపిస్తుంది. ఎక్కడో పొరపాటు జరిగినట్లుంది. సమయాభావం వల్ల నేను కారణం తెలుసుకోలేకపోయాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:18, 31 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తేదీన మొదలుపెట్టిన కార్యక్రమంలో సభ్యులందరూ చురుకుగా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూడు వారాల్లో సుమారు 100 కొత్త వ్యాసాలు ప్రముఖ మహిళల గురించి చేర్చబడ్డాయి. సుమారు 50 పైగా వ్యాసాలు విస్తరించబడ్డాయి. వివరాలను వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం పేజీలో చూడండి. అందరం కలిసి పనిచేస్తే మొలకల వ్యాసాల్ని లేకుండా చేయలేకపోయినా చాలా వరకు తగ్గించి మంచి వ్యాసాలుగా అభివృద్ధి చేయవచ్చును. దయచేసి ఆలోచించండి.Rajasekhar1961 (చర్చ) 09:35, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమంలో పాల్గొన్నవారిలో సుల్తాన్ ఖాదర్, వెంకటరమణ, వైజాసత్యగారు ఎక్కువగా కృషిచేశారు. వీర్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.Rajasekhar1961 (చర్చ) 08:45, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సిజిజి(CGG), హైద్రాబాదులోఏప్రిల్ 9మధ్యాహ్నం వికీఅకాడమీ

సిజిజి(CGG), హైద్రాబాదు లోఏప్రిల్ 9 2013 మధ్యాహ్నం వికీపీడియా:తెవికీ అకాడమీ జరగబోతున్నది. రహ్మనుద్దీన్, విష్ణు, నేను పాల్గొంటున్నాము. ఇంకా ఇద్దరు ముగ్గురు వికీపీడియన్ల సహకారం కోరుతున్నాను.ఆసక్తిగల వారు స్పందించండి. --అర్జున (చర్చ) 12:12, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దీనిలో నాతో పాల్గొన్న రహ్మనుద్దీన్, విష్ణు మరియు పవిత్రన్ కు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 08:21, 12 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక

చాలా మంది సభ్యులకు వికీమీడియా ఫౌండేషన్ CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ (A2K) ప్రోగ్రాం కి గ్రాంటు ఇచ్చినట్టు తెలిసే ఉంటుంది. ఈ గ్రాంటు భారతీయ భాషా వికీపీడియాల పరిపూర్ణ పెంపుదలకు ఉత్ప్రేరకం కావాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ గ్రాంటు భాగంగా CIS-A2K నుండి మేము ఈ సంవత్సరం ఐదు భారతీయ భాషా వికీపీడియాల పెంపుదలకై కృషి చేయడానికి నిర్ణయించుకున్నాం. మన తెలుగు వికీని ఈ జాబితాలో చేర్చాను. దీనిలో భాగంగా కొంత మంది తెవికీ సముదాయ సభ్యులతో, గత రెండు నెలలుగా, చర్చించి మరియు రచ్చబండలో జరిగిన కొన్ని చర్చల ఆధారంగా వ్యయప్రయాసలకోర్చి ఓ ప్రణాళికను రూపొందించాను. మనలో చాలా మంది చాలా కొద్ది రోజులలోనే ఉగాది నాడు కలుస్తున్నాము. దానికంటే ముందు ఈ ప్రణాళికను మీరందరూ చూడాలని సమయం చాలక మరియు మిగితా భాషా ప్రణాళికల ఒత్తిడివలన అనువదించడానికి వీలుకాక ఆంగ్లములోనే పెట్టాను. క్షమార్ధిని! మిత్రులు ఎవరైనా చొరవ తీసుకొని అనువదించగలిగితే కృతార్ధుడనై ఉంటాను. భాషా దోషాలను సద్మనస్సుతో సవరించ ప్రార్ధన. CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక పేజి ఇది. తెవికీ మిత్రులు మీ అమూల్యమైన సూచనలు సలహాలు సూచనలు ప్రణాళిక చర్చ పేజీలో ఇవ్వవలసినదిగా మనవి. ధన్యవాదాలు. మిత్రులు e-mail ద్వారా పంపడానికి సౌకర్యంగా ఉంటే vishnu@cis-india.org కి మెయిల్ చేయగలరు. ఒకవేళ ఫోన్ ద్వారా చర్చించదలచితే నా మొబైల్ నంబరు +91-9845207308 విష్ణు (చర్చ)15:27, 1 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రణాళికను ఆంగ్లములో చదవడానికి ఇక్కడ చూడండి . సభ్యులు మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వవలసినదిగా ప్రార్ధన. విష్ణు (చర్చ)07:25, 23 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసౌర్స్‌లో ఆంధ్రులచరిత్ర

అర్జునరావు గారి కృషి కారణంగా తెలుగు వికీసౌర్స్‌లో చేరిన ఆంధ్రులచరిత్ర అనే అద్భుతమైన పుస్తకం లోని వ్యాసాలు చక్కగా ఆడియో ద్వారా వినాలంటే ఈ కింది లింకు చూడండి. [[3]]

  • ధన్యవాదాలు. మంచి లింకుతెలిపారు. ఇవి ఆంధ్రులచరిత్ర గురించి ఇతరులు వ్రాసిన వ్యాసాలు వాటి ధ్వనిముద్రణులండీ. సరియైన లింకు అన్నట్టు. చిలుకూరి వీరభద్రరావు గారి ఆంధ్రులచరిత్ర వికీసోర్స్ లో పాఠ్యీకరణం చేసినందును ఇపుడు కంప్యూటర్ గొంతు ద్వారా ధ్వనిముద్రణం సులభం.--అర్జున (చర్చ) 14:58, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగా ఇవి మనం పాఠ్యీకరణ చేసినవి అనుకున్నాను. అయినప్పటికీ ఇవి వినడానికి చాలాబాగున్నాయి.--t.sujatha (చర్చ) 15:05, 2 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాలలో తోడ్పాటు

సెన్సస్ శోధకం వద్ద 2011 సెన్సస్ ప్రకారం వెతికి ప్రతి గ్రామంలో గల మొత్త జనాభా, ఇళ్ళ సంఖ్య, పురుషుల, స్త్రీల జనాభా వివరాలు పొందవచ్చు. మిత్రులు రాజశేఖర్ గారు సమాచారాన్ని సమగ్రంగా అందించే లోపు గొల్లపల్లె (బీ.కొత్తకోట) వ్యాసంలో చేర్చిన విధంగా జనాభాను చేర్చితే, కొంత సమాచారం ప్రతి గ్రామ వ్యాసంలో కొంత సమాచారం చేరుతుంది. నేను నాకు వీలయినంతలో కృష్ణా జిల్లా గ్రామాలను పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాను. రహ్మానుద్దీన్ (చర్చ) 13:50, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

household కి గడపలు అని వాడుతున్నాను. అందువలన మరో లైను చేరుతుంది. రహ్మానుద్దీన్ (చర్చ) 13:54, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
జనాభా గణాంకలకు సంవత్సరం చాలా ముఖ్యం. అది కూడా చేర్చండి.Rajasekhar1961 (చర్చ) 14:03, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సంవత్సరం చేర్చని చోట చేరుస్తున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 14:29, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
household అంటే కుటుంబము, ఇల్లు, సంసారము, స్వంత ఇల్లు, ఇంటిజనము, యజమాని ఇలా అనేక అర్థాలు వస్తాయి కనుక ఈ సెన్సస్ శోధకంవిషయములో ఏ అర్థములో వాడారో గమనించ గలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:09, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
household అనేది ఇక్కడ జనాభా లెక్కల అధికారి సందర్శించిన ఇళ్ళ వివరాలు. కానీ ఒకే ఇంట్లో రెండు గడపలు ఉంటే, రెంటినీ వేరు వేరుగా లెక్క వేస్తారు. ఇది నా అనుకోలు. రహ్మానుద్దీన్ (చర్చ) 14:29, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]



మొదటగా మండల పేజీలు పూరిస్తున్నాను. ఆపై ప్రత్యేక గ్రామ పేజీలో రాస్తాను. రహ్మానుద్దీన్ (చర్చ) 15:27, 4 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వంపై చర్చ

నిర్వాహకత్వంపై కాలపరిమితుల గురించి చర్చించడం ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటగా నా అభిప్రాయాలు.

  • నిర్వాహకత్వం ఒక పదవి కానీ, హోదా కానీ కాదు. వికీలో పదవులూ నిర్వహించే వాళ్లుంటారు. వాళ్ళని స్టీవార్డులంటారు. పదవి ఎందుకాదంటే దాని వళ్ళ ప్రత్యేక అధికారాలు ఏమీరావు. నిర్వాహకుల అభిప్రాయాలకుగానీ, ఓటుకు గానీ ప్రత్యేకమైన బలమేమీ ఉండదు. హోదా ఎందుకు కాదంటే అది వాడుకరి యొక్క కృషికి గుర్తింపుగా ఇచ్చేది కాదు. అలా అయితే రహంతుల్లా గారిలాంటి చాలామంది సభ్యులు నిర్వాహకులుగా ఉండేవారు. నిర్వహణా వ్యవహారాలలో పాల్గొనే వారికి, పాల్గొనాలని ఉత్సాహపడేవారికి నిర్వాహకత్వం ఇస్తారు.
  • ఒక వికీలో ఇంత మందే నిర్వాహకులుండాలని ఏమీ నియమం లేదు. వికీలో అవసరాన్ని బట్టి లేదా సభ్యులు అభ్యర్ధన ప్రకారం కొత్త నిర్వాహకులని చేరుస్తారు. అయితే నిర్వాహకత్వ అభ్యర్ధనకు సముదాయం యొక్క మద్దతు ఉండాలి. అలాంటి మద్దతు లేకపోతే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. మరింత అనుభవం గడిస్తే మద్దతు వచ్చే అవకాశం ఉంది.
  • సభ్యులను నిర్వాహకులు చేసే వీలు అధికారులకు ఉంది. తెవికీలో ప్రస్తుతం నలుగురు అధికారులున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ కనీసం ఒక్క అధికారి అయినా క్రియాశీలకంగా ఉండేలా చూసుకోవటం తెవికీకి శ్రేయస్కరం. అధికారులను చాలా ఆచితూచి ఎంచుకోవాలి. తెలుగు విక్షనరీలో కూడా ఒక అధికారి ఉండాలి. నేను సుజాత గారిని తెలుగు విక్షనరీలో అధికారిగా ప్రతిపాదించాలని అనుకుంటున్నాను. మన సొంత అధికారి ఉంటే మన సముదాయపు అవసరాలకు అనుగుణంగా నిర్వాహకులను తయారుచేసుకోవచ్చు. మన సముదాయం గురించి తెలియని బయటివాళ్ళని అభ్యర్ధించవలసిన అవసరం రాదు.
  • నిర్వాహకత్వంపై కాలపరిమితులు అనేది ఆంగ్లవికీ లాంటి పెద్దవికీ వాళ్ళ సముదాయపు అవసరాల దృష్ట్యా చేసుకున్న నియమం. అని మనం పాటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న నిర్వాహకులలో క్రియాశీలకంగా లేనివాళ్ళ నిర్వాహకత్వం తీసివేయటం ఒక క్షణంలోపని కానీ దాని వళ్ల మనకు ఒరిగే లాభం సున్నా. కానీ అలాగే ఉంచేస్తే వాళ్ళు ఎప్పుడు తిరిగివచ్చినా, ఇదివరకే నిర్వాహకత్వంలో అనుభవముంది కాబట్టి వెనువెంటనే అవసరమైతే నిర్వాహణలో పాల్గొనే వీలుంది. ఉదాహరణకు (నేను, వీవెన్, చావా కిరణ్). మేం ముగ్గురం కొన్ని కొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి మార్పులు చెయ్యలేదు.

--వైజాసత్య (చర్చ) 10:00, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పేరులో ఉన్న పెద్దల స్పందనలు ఇంతవరకు ఇక్కడ పొందు పరచక పోవడము మనలోని అనైక్యతా లేదా అనైతికతా అనే సందేహము సభ్యులకు కలగనీయ వద్దని, స్పందించమని నా సలహా మరియు సూచన. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:09, 5 ఏప్రిల్ 2013 (UTC)::[ప్రత్యుత్తరం]
తెలుగు విక్షనరికి అధికారిగా శ్రీమతి సుజాతగారిని ప్రతిపాదించాలనుకోవటం సంతోషం.ప్రస్తుతం తెలుగు విక్షనరిలో సభ్యులసంఖ్య, రచనలసంఖ్య తక్కువగా వున్నది. విక్షనరిలో రచనలను ప్రోత్యాయించవలసిన అవసరము న్నది.జె.వి.కె.ప్రసాదు గారు కూడా నిర్వహాకభాద్యతలు స్వీకరించటానికి ఉత్సహము కనపరచుచున్నారు. వీరిద్దరు విక్షనరీలో చాలా రచనలు చేసారు. కావున వీరిద్దరిని విక్షనరీలో నియమించటం అవసరమను కుంటున్నాను. పాలగిరి (చర్చ) 13:05, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు ఇది చాలా చక్కని ప్రతిపాదన. ఈ చర్చలో మిగతా భారతీయ భాషా వికీల అనుభవాలు కూడా పరిగణలోకి తీసుకోవడం ఉచితమేమో. ఉదా: తమిళ వికీలో ప్రతి సంవత్సరం కొందరు కొత్త చురుకైన సభ్యులను నిర్వాహకులుగా ట్రైన్ చేయడం సినియర్ నిర్వాహకులు ఒక బాధ్యతగా తీసుకున్నారు. దీని వళ్ళ క్రియాశీలక సభ్యులకూ ఓక ప్రోత్సాహంగా కూడా ఉంటుంది అనేది వారి ఆలోచన.-- విష్ణు (చర్చ)
ఇదొక మంచి ఆలోచన ఈమధ్య తెలుగు వికీపీడియాకు ఉన్నతమైన వ్యాసాలను అందించడమే కాకుండా, నిర్వహణలోను, సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి జరిగే చర్చలలోను చురుకుగ పాల్గొంటున్న పాలగిరి మరియు వెంకటరమణ గార్లము నిర్వహకులుగా చేయుట మనందరి బాధ్యత.Rajasekhar1961 (చర్చ) 16:05, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్య గారు స్పష్టమైన శీర్షిక పెట్టినా కూడా కొన్ని స్పందనలు దానికి తగ్గట్టుగా లేవు.దీనికి అనుబంధమైన కొందరు సభ్యుల గురించి అభిప్రాయాలు వున్నాయి. ఈ విషయమై నా అభిప్రాయమేమంటే, తెలుగు వికీ స్థితిని అంచనా వేయటానికి వికీలో కీలకమైనవి గణాంకాలు. అందులో నిర్వాహకుల సంఖ్య, ఆ వికీకి ఒక ముఖ్యమైన గణాంకం. ఇది ఎక్కువగా వుంటే ఆ వికీ చక్కగా నిర్వహించబడుతుందని అనుకుంటారు. కొత్తవారిని నిర్వాహకులుగా ఎంపిక చేయటానికి ఇతరులు వుత్సాహం చూపించరు కూడా, వోటు చేయడంలో ఇదే వాదన ఒక్కోసారి కన్పిస్తుంది. వికీ లో ముఖ్యమైన నిర్వాహక పనులు చేయడానికి, శీర్షికలు నిర్వహించడానికి, వివాదా పరిష్కారానికి, వికీ అభివృద్ధికి సంబంధించిన చర్చలలో పాల్గొననపుడు, కొత్త సభ్యులు ఆ నిర్వాహకుల పేజీలలో అభ్యర్థించడం, లేక వారికి వికీ ద్వారా మెయిల్ పంపించడం జరిగి వారు స్పందించకపోతే బాధపడి, నిరుత్సాహం కలగటం నా అనుభవం. ఏళ్లతరబడి క్రియాశీలంగా లేని వారిని నిర్వాహకులుగా కొనసాగించడం అంత ఉపయోగంలేదు. ఒక వేళ వారు క్రియాశీలమైతే, మరల నిర్వాహక హోదా ఇవ్వటానికి సులభమైన నియమాలు పెట్టుకోవచ్చు. నిర్వాహకుల జాబితాలో వారి నిర్వాహకత్వ ప్రారంభం ముగింపు వివరాలు పొందుపరుస్తాము కాబట్టి వారికి తగినైన గుర్తింపు ఇవ్వగలుగుతాము. ఆంగ్ల వికీలో ఒక సంవత్సరం(?) క్రియాశీలంగా లేకపోతే నిర్వహకత్వ హోదా తొలగించాలి అన్న నియమాన్ని కాల వ్యవధిని మన తెవికీ కి తగ్గట్టుగా మార్చుకొని అమలు చేయడం మంచిది.--అర్జున (చర్చ) 00:05, 11 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ విషయంలో నేను వైజా సత్యగారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నను. నిర్వాకత్వం, అధికారం సభ్యులకు నిరంతరంగా ఉంటేనే అందరికీ సులువు. కొంతకాలం వ్యక్తి గత కారణం వలన

క్రియాశీలకంగా పనిచేయకుండా తిరిగి రావాలనుకున్న వారు క్రియాశీలకంగా పని చేసే అవకాశం ఉన్నది. ప్రతి విషయానికి అందరూ స్పదించ వలసిన అవసరం లేదు. ఏదైనా ప్రత్యేకంగా చెప్పలకున్నప్పుడు స్పందిస్తే చాలు. స్పందించని వారు వ్యతిరేకం అనుకోవలసిన అవసరం లేదు. నిర్వహకత్వం, అధికారం వంటివి శాశ్వతంగా ఉండాలన్నదానిని నేను స్పష్టంగా సమర్ధిస్తాను. అప్పుడే వారి సేవలను గౌరవించిన వారం ఔతాం. --t.sujatha (చర్చ) 15:54, 22 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • కొన్ని వికీలలో కొంతకాలంపాటు అచేతనంగా ఉంటే నిర్వాహక హోదా నుంచి తొలిగించుటకు నిబంధనలున్నట్లు ఎప్పుడో చూసినట్లు గుర్తు కాని మనం మాత్రం స్వచ్ఛందంగా వదులుకుంటే తప్ప నిర్వాహక హోదా నుంచి ఇదివరకు తెవికీ అభివృద్ధికి కృషిచేసినవారిని తప్పించకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:41, 22 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వెన్న నాగార్జున గారి తెలుగు వికీ మహోత్సవం గురించి సుజాతగారితో స్పందన

Nagarjuna Venna

Sujatha garu - just saw this email and I also saw that Arjun emailed me. I will try and coordinate with him.

Regards, Nagarjuna

చాలా సంతోషించ వలసిన విషయము మన అందరకు అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:33, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా సంతోషంగా ఉన్నది. వారిని మన సమావేశాల కోసం రికార్డు చేసిన సందేశాన్ని పంపమని కోరండి.Rajasekhar1961 (చర్చ) 08:27, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Wikidata phase 2 (infoboxes) coming to this Wikipedia

Sorry for writing in English. I hope someone can translate this. If you understand German better than English you can have a look at the announcement on de:Wikipedia:Kurier.

A while ago the first phase of Wikidata was enabled on this Wikipedia. This means you are getting the language links in each article from Wikidata. It is soon time to enable the second phase of Wikidata (infoboxes) here. We have already done this on the [first 11 Wikipedias] (it, he, hu, ru, tr, uk, uz, hr, bs, sr, sh) and things are looking good. The next step is English Wikipedia. This is planned for April 8. If everything works out fine we will deploy on all remaining Wikipedias on April 10. I will update this part of the FAQ if there are any issues forcing us to change this date. I will also sent another note to this village pump once the deployment is finished.

What will happen once we have phase 2 enabled here? Once it is enabled in a few days you will be able to make use of the structured data that is available on Wikidata in your articles/infoboxes. It includes things like the symbol for a chemical element, the ISBN for a book or the top level domain of a country. (None of this will happen automatically. Someone will have to change the article or infobox template for this to happen!)

How will this work? There are two ways to access the data:

  • Use a parser function like {{#property:p169}} in the wiki text of the article on Yahoo!. This will return “Marissa Mayer” as she is the chief executive officer of the company.
  • For more complicated things you can use Lua. The documentation for this is here.

We are working on expanding the parser function so you can for example use {{#property:chief executive officer}} instead of {{#property:p169}}. The complete plan for this is here.

Where can I test this? You can already test it on test2.

Where can I find more information and ask questions? We have collected the main questions in an FAQ for this deployment. Please ask questions you might have on the FAQ’s discussion page.

I want to be kept up to date about Wikidata To stay up-to-date on everything happening around Wikidata please subscribe to the newsletter that is delivered weekly to subscribed user’s talk pages.

--Lydia Pintscher 17:12, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Distributed via Global message delivery. (Wrong page? Fix here.)

వాడుకరులు

ఈ క్రింద సూచించిన వికీపీడీయా లోని "పేర్ల" గురించిన వివరణాత్మకమైన (మొత్తము వారి విధి విధానాలు, ..అన్నీ) మొత్తము సమాచారము తెలుగులో లభించు చోటు తెలిసిన వారు తెలియజేయగలరు లేదా స్పందించ గలరు.

  1. సభ్యులు
  2. బాట్‌లు
  3. నిర్వాహకులు
  4. అధికారులు
  5. స్టీవార్డులు
  6. ఖాతా తయారీదార్లు
  7. దిగుమతిదార్లు
  8. ట్రాన్స్ వికీ దిగుమతిదారులు
  9. ఐపీ నిరోధపు మినహాయింపులు
  10. పరాకు అధికారులు
  11. చెక్‌యూజర్లు
  12. నిర్ధారిత వాడుకరులు

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:08, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు, వాడుకరుల చిట్టా కోసం మీరిక్కడ చూడవచ్చు. ఏ రకం వాడుకరుల జాబితా కావాలో అన్నది మీరు డ్రాప్ డౌను ద్వారా తెలుసుకోవచ్చును. కానీ నా పరిశీలనలో మీకు కేవలం సభ్యులందరూ, బాట్‍లు, నిర్వాహకులు, అధికారులు జాబితాలు మాత్రమే సభ్యులను చూపిస్తున్నాయి. మిగితా హోదాలు ఉన్నపటికీ, అవి కూర్పబడలేదు లేదా అధికారులు ఆ పేజీని ఇంకా సృష్టించలేదు/దాచి ఉంచారు. రహ్మానుద్దీన్ (చర్చ) 18:16, 11 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మార్పులూ, చేర్పులూ, క్రితం నెలలో చేసిన ఎడిట్ల సంఖ్యతో చురుకుగా పనిచేసే వారి జాబితా మీకు http://stats.wikimedia.org/EN/TablesWikipediaTE.htm వద్ద లభ్యం కానీ, ఇది ప్రస్తుతం ఫిబ్రవరీ వరకున్న సమాచారం చూపుతోంది. తాజా సమాచారం కోసం టూల్‍సర్వర్ ఖాతా ఉన్న వాడుకరులు తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 18:19, 11 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సిధ్ధాంతం - వాదం

భౌతిక శాస్త్ర వివిధ గ్రంధాలలో Geo centric theory, Heleo centric theory లకు "భూ కేంద్రక సిద్ధాంతం" మరియు "సూర్య కేంద్రక సిద్ధాంతం" అని ఉన్నది. శాస్త్రి గారు భౌతిక శాస్త్ర పారిభాషిక పద కోశమునందు సిద్ధాంతము కు బదులుగా "వాదము" అని మార్చారు. అలాగే చాలా వ్యాసాలలో (ఐన్ స్టీన్) సిద్ధాంతం నకు బదులు వాదం అని మారుస్తున్నారు. సిద్ధాంతం మరియు వాదం అనే పదాలను ఉపయోగించడంలో గల భేదాలను తెలియ జేయండి. ఏ పదమైనా ఉపయోగించవచ్చా!-- కె.వెంకటరమణ చర్చ 01:20, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శాస్త్రమునకు సంబందించినది సిద్ధాంతం అని, వాడుకలో వచ్చే పదం వాదం, రెండు తెలుగు పదాలకు అర్థములు వేరు వేరు అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:13, 12 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సిద్ధాంతానికి వాదానికి ఖచ్చితమైన సరిహద్దు లేదు కాని రెండింటికీ మధ్య అర్థంలో తేడా మాత్రం ఉంది. సిద్ధాంతానికి మూలం శాస్త్రీయత అయితే వాదం అనేది తార్కికంపై ఆధారపడి ఉంటుంది. అంటే శాస్త్రీయంగా నిరూపించగలిగే దేనినైననూ సిద్ధాంతంగా పేర్కొనవచ్చు. దానిని ఏ కాలంలోనైనా, ఎవరు చేసిననూ, ఎక్కడ చేసిననూ ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. వాదానికి శాస్త్రీయంగా నిరూపించలేము. అదేసమయంలో ఒకే అంశంపై అనేక వాదాలుండవచ్చు. అది వారివారి తార్కిక (లాజిక్) దృష్టిపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా చూస్తే భూకేంద్ర సిద్ధాంతం అనేది వాదం కిందికే తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక శాస్త్రంలో శాస్త్రీయంగా నిరూపించలేని వాటన్నింటినీ సిద్ధాంతాలనే అంటున్నారు! సిద్ధాంతం అన్నప్పుడు సాధారంగా మార్పు చెందరాదు కాని కాలం గడిచేకొద్దీ ఒకే అంశంపై కొత్త కొత్త సిద్ధాంతాలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో సరైన సమాధానం ఇవ్వడం కొంత ఇబ్బందే. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:33, 13 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013విజయవంతచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 ఆలోచనని ప్రతిపాదించి సభ్యుల మద్దతు కూడగట్టిన మల్లాది కామేశ్వరరావు గారికి, దీనిని నిర్వహించడంలో ముఖ్యపాత్రవహించిన రాజశేఖర్, రహ్మనుద్దీన్, తదితర కార్యనిర్వాహక సభ్యులకు, వీడియో సందేశాలు పంపిన వెన్న నాగార్జున గారికి,సందేశాలు పంపించిన తోటి సభ్యులకు, సర్వసభ్యసమావేశంలో అమెరికానుండి వీడియా సమావేశం ద్వారా పాల్గొన్న రవి వైజాసత్యకు, పాల్గొన్న సభ్యులందరికి, సహకారం అందజేసిన సిఐఎస్-ఎ2కే , వికీమీడియా, ధియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారి పెద్ది రామారావు వారి సిబ్బందికి, ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి హాజరైన ప్రముఖులందరికి, మీడియాకు , సమావేశం విజయవంతం చేసినందుకు తోడ్పడ్డ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమ మనందరిలో వికీపీడియా స్ఫూర్తిని మరింత పెంచి, తెవికీ అభివృద్ధికి సహాయపడుతుందని నేను విశ్వసిస్తాను. --అర్జున (చర్చ) 08:33, 12 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • వికీపీడియాలో చేరి తక్కువకాలం అయ్యినప్పటికి చురుకుగా వికీపిడియా చర్చలలో పాల్గొంటూ,తెలుగు వికీపీడియా మహోత్సవంను ఉగాది పర్వదినాన నిర్వహించాలను మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన మల్లాదిగార్కికి , సహాకారంగా ఉత్సహంగా ముందుకు వచ్చిఅయనకు అన్నిరకాలమద్ధతుఇస్తూ, ఈ ఉత్సవాన్ని విజయవంతంచేయుటకు కృషిచేసిన డా.రాజశేఖరు,రహ్మనుద్దీన్,ప్రణయరాజ్, అర్జున్ గార్లకు,మరియు తెలుగు వికీపీడియామహోత్సవం మిగతా కార్యవర్గసభ్యులకు ధన్యవాదాలు.అలాగే పాల్కొని కార్యక్రమమును విజయవంతంచేసిన నిర్వహాకులకు,సహాసభ్యులకు, సహకారం అందజేసిన సిఐఎస్-ఎ2కే , వికీమీడియా, ధియేటర్ ఔట్రీచ్ యూనిట్ అధికారి పెద్ది రామారావు వారి సిబ్బందికి, ఆహ్వానాన్ని మన్నించి సమావేశానికి హాజరైన ప్రముఖులందరికి, మీడియాకు , సమావేశం విజయవంతం చేసినందుకు తోడ్పడ్డ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు.
  • అయితే ఈ సమావేశానికి చదువరి,చావాకిరణ్,సి.చంద్రకాంతారావు గార్లు రాకపోవడం,కొంతలోటు.వికీపీడియాకై వారుచేసిన కృషి తక్కువేమికాదు.వారుచేసినకృషివలనే మనం నేడు మనం ఈ మహోత్సం చేసుకొనే స్థాయికి ఎదిగినది.వారు తప్పక హజరవుతారని,వాళ్ల అనుభవాలను మాలాంటి క్రొత్త సభ్యులకు చెప్పి,తమ అమూల్యమైన సలహాలనిస్తారని ఆశించాము.వారు ఏక్షణమైనరావచ్చునని,ఆశగా ఎదురుచూసాము. వారిని ప్రత్యక్షంగా చూచి,మాట్లాడలనే మాకోరిక తిరకపోవడంకొంచెము నిరాశజనకమైనప్పటికీ,వీరందురు పెద్ద మనస్సుచేసుకొని మళ్లి తెలుగు వికీపీడియా అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటూ, తమవంతుసహకారం మళ్లి అందించాలని నా వ్యక్తిగతంగా,వికీపీడియా క్రియాశీలక సభ్యులందరి తరుపున అర్థిసున్నాను.పాలగిరి (చర్చ) 13:49, 12 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]


వాడుకరుల పేజీలలో వారి ఇతర సైట్ల, బ్లాగుల వివరాలు

(1) వాడుకరుల పేజీలలో వారి ఇతర సైట్ల వివరాలు ఉండకూడదు అని చాలా మంది భావన. కొంతమంది అనుసరిస్తున్నారు. మరికొంతమందికి అనుకూలంగా ఉండి, వారి బ్లాగుల వివరాలు, ఇతర సైట్ల లింకులు, మరి ఇతరమైనవి చాలా ఉన్నాయి. వీటి శుద్ధి కార్యక్రమము కూడా ఉన్నది. శుద్ధి కార్యక్రమములో పాలు పంచుకునే వారికి అటువంటివి తొలగించేందుకు నా వంతు సహాకారము చేస్తాను. దయచేసి సభ్యులు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:07, 16 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జునగారు, మీ వాడుకరి పేజీలో ఉన్న బ్లాగుల వివరము, ట్విట్టర్ లింకు, మరి ఇతర లింకుల విషయములు తదితర వికీపీడియాకు సంబంధము లేనివి వెంటనే తొలగించుకోండి. నా లాంటి వారు ఆ పని చేస్తే మీ మనసుకు కష్టం కలగవచ్చు. నేను నిన్న నా దాంట్లో మీలాగానే సైట్ల గురించి పెట్టాను. అవి వెంటనే తొలగించారు. మీరు అధికారి కనుక సరి దారి చూపించండి అందరికి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:06, 17 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది తు.చ. తప్పకుండా పాటించవలసిన నియమేమీ కాదు. ఇది ఎక్కడినుండి వచ్చిందో అర్ధం చేసుకోని వర్తించాలి. వికీపీడియా వ్యాపార ప్రకటనా స్థలం కాదు అనే నియమం నుండి పరోక్షంగా వచ్చింది. మీ వాడుకరి పేజీని కేవలం వ్యక్తిగత వ్యాపారాన్ని ప్రకటించుకొనే బ్రోచర్లా తయారుచేస్తే సభ్యులు అభ్యంతర పెట్టవచ్చు కానీ బ్లాగు లింకులు, ట్విట్టరు లింకులు ఇలాంటివి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఈ విషయంతో పీపకాయల రాజు గురించి గుర్తుకు వచ్చింది. తెవికీలో పీపకాయల రాజు గారని ఒక వాడుకరి ఉండేవారు. ఆయన ఎప్పుడు ఇక్కడ దర్శనమిచ్చినా కేవలం ఆయన వాడుకరి పేజీ మాత్రమే దిద్దుకొని వెళ్ళేవారు :-) --వైజాసత్య (చర్చ) 08:43, 20 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, ఈ సందర్భములో తెలియజేయునది ఏమనగా, మనము వికీపీడియా గురించి అనేక సైట్లలో ప్రచారం చేస్తున్నాము. కానీ ఇక్కడ అటువంటి ప్రచారములకు వికీ విరుద్ధము. కానీ మనము ఏ ఏ సైట్లలో (అనగా బ్లాగులు, ట్విట్టర్, పేస్‌బుక్, ఆర్కుట్, ఇతర సైట్లు) వికీపీడియా గురించి ఏ ఏ విధములుగా ప్రచారము చేస్తున్నామో తెలిపే లింకులు ఆయా సభ్య పేజీలలో మాత్రమే పొందు పరచుకుంటుంటే, అవి కూడా [4]తొలగిస్తున్నారు. ఇది ఏంత వరకు సబబు, న్యాయము అంటారు ? నాకు సమాధానము ఈ రోజు వరకు (ఇప్పటి మీ సమాధానము కాదు) రాకపోయే సరికి నేనే అర్జున గారి బ్లాగు, ట్విట్టర్ వివరములు తొలగించాను. ఇప్పుడు మీ సమాధానమునకు చర్చలు ఏమైనా సాగుతాయేమో తదుపరి కొంత కాలము వేచి చూద్దాము. చివరకు అందరూ ఒక నిర్ణయానికి వస్తే మంచిది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:59, 20 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

(2) సభ్యులు,ఈ మార్పు (సమయము: 20:33, ఏప్రిల్ 16, 2013‎ ) అర్థము [5]తెలిసిన వారు తెలియపరచగలరు. ఇందులో అర్జున గారి పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియ లేదు. ఒకవేళ సుజాత గారు, అర్జున గారి సలహా, సంప్రదింపులతో నా వివరాలు తొలగించారని అనుకోవాలా ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:14, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాదుగారూ ! ఈ విషయం ఇప్పుడే గమనిస్తున్నాను. సభ్యుల పేజీలో మార్పులు తొలగింపులు వంటివి నేను చేయను. అర్జునరావుగారూ ! అలాంటి సలహలు ఇవ్వరు. ఇతరుల సలహా మీద నేను ఇలాంటివి ఎందుకు చేస్తాను ? నేను " టచ్ స్క్రీన్ " లో పని చేస్తున్నందు వలన ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చు. మీ పేజీలో మీ బ్లాగులు, ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు ఇతర లింకులు పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు తిరిగి నిరభ్యంతరంగా పెట్టొకోవచ్చు. --t.sujatha (చర్చ) 04:10, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • మార్పులు చేసినప్పుడు వికీపీడియా చరిత్రలో కనబడిన సందేశం అంత వివరణాత్మకమైనది కావడం వలన ప్రసాద్ గారు పొరబడినట్లున్నారు. సుజాత గారు తెలిపినట్లు ఏదో పొరబాటు జరిగిందేమో? ఆ సందేశానికి మెరుగైన అనువాదం చేస్తే మంచిది.--అర్జున (చర్చ) 05:27, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావుగారు చెప్పినట్లు ఈ సందేశంలో మార్పులు జరగాలి. లేకుంటే ఇదేదో తీవ్రమైన చర్చనీయాంశలా కనిపించే అవకాశం ఉన్నది. --t.sujatha (చర్చ) 14:08, 22 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఆ సందేశం గురించి: పేజీలో మార్పులను తిప్పికొట్టేప్పుడు (అంటే revert చేసేప్పుడు) చివరిసారి ఎవరి మార్పు అయితే మంచిదో/సరైనదో ఎంచుకొని ఆపై జరిగిన మార్పులు రద్దుచేయవచ్చు. ఆ సందర్భంలో చివరి కూర్పు ఎవరిదో అక్కడివరకూ పేజీ స్థితిని తీసుకువెళ్ళారు అని దాని అర్థం. అయితే, ఈ సందేశం ట్రాన్స్‌లేట్‌వికీలో మెరుగుపరచబడింది. కానీ ఆ మార్పు తెవికీలో ఇప్పటికే అనువాదం ఉండటం వల్ల ప్రతిఫలించలేదు. ఇప్పుడు నేను తెవికీలోని అనువాదాన్ని తొలగించాను. కనుక ఇకనుండి తెవికీలో మెరుగైన సందేశం కనిపిస్తుంది. ఇదీ ప్రస్తుత సందేశం: ఫలానావాడుకరి (చర్చ) చేసిన మార్పులను ఫలానా2వాడుకరి యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. దీనికి మరింత మెరుగైన అనువాదాన్ని ఇక్కడ సూచించవచ్చు. — వీవెన్ (చర్చ) 14:41, 22 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి పుట వారి ఇష్టాఇష్టాలకే వదిలెయ్యటం బాగుంటుంది. Chavakiran (చర్చ) 03:53, 23 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

క్రియాశీల వాడుకరుల బాజితా

ఈ మధ్యన ప్రత్యేక పేజీలలో ఉండే క్రియాశీల వాడుకరుల బాజితా అనేది ఇటు వికీపీడియాలోను అటు విక్షనరీలోనూ తొలగించారు. కారణము తెలియదు. గమనించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:19, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ జాబితాను మీడియావికీ (వికీలు నడిచే సాఫ్ట్‌వేర్ ఉపకరణం) లోనే తొలగించారు. ఈ భోగట్టాను చూపించే క్వెరీలు నెమ్మదిగా పనిచేస్తున్నాయన్నది కారణం. ఆ చర్చను ఇక్కడ చూడవచ్చు. ఈ జాబితాను తిరిగి పునఃస్థాపించాలన్న అభ్యర్థననూ నిరాకరించారు. భవిష్యత్తులో ఈ సౌలభ్యం పొడగింత (ఎక్స్‌టెన్షన్) రూపంలోనో లేదా ఏ వికీకి ఆ వికీకి ప్రత్యేకంగానో అందుబాటులోనికి వచ్చే అవకాశం ఉంది. — వీవెన్ (చర్చ) 15:16, 22 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న అక్షరాలు

గత వారం రోజులుగా నా సిస్టంలో తెవికీ అక్షరాలు చాలా చిన్నవిగా కనిపిస్తున్నవి.టైపు చేయుటకు ఇబ్బందిగా వున్నది. విక్షనరీలో అక్షరపరిమాణం మాములుగానే వుంది.పరిష్కారంఏవ్వరైన సూచించగలరు.పాలగిరి (చర్చ) 12:21, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు Ctrl అనే బటన్ పట్టుకునే, పైన ఉన్న + గుర్తును ఒకటి లేదా రెండు సార్లు నొక్కండి. అక్షరాలు పెద్దవి అవుతాయి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 17:30, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సలహా కు ధన్యవాదాలు.పాలగిరి (చర్చ) 21:59, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
స్వాగతము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:11, 22 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]