అగ్ని (నిప్పు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 123 interwiki links, now provided by Wikidata on d:q3196 (translate me)
చి వర్గం:పంచ భూతములు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 65: పంక్తి 65:


[[వర్గం:రసాయన శాస్త్రము]]
[[వర్గం:రసాయన శాస్త్రము]]
[[వర్గం:పంచ భూతములు]]

14:55, 10 మే 2013 నాటి కూర్పు


దావాగ్ని లేదా అడవుల్లో వచ్చే మంటలు

అగ్ని లేదా అగ్గి (Fire) పంచభూతాలలో ఒకటి. ఉష్ణమోచక రసాయనిక చర్య ద్వారా ఒక పదార్థం దహనం చెందుతూ వేడినీ, వెలుతురునీ, అనేక ఉత్పన్నాలను ఇచ్చే ఒక ఆక్సీకరణ చర్యని "అగ్ని" అంటారు. మంట అనేది "అగ్ని"లో కంటికి కనబడే భాగం. అంటె వెలుగులీనే గాలులే "మంట"లాగ కంటికి కనిపిస్తాయి. పదార్థ ధర్మాలను బట్టీ, మాలిన్యాల సాంద్రత తదితర విషయాలను బట్టి మంటకి రంగు, అగ్ని తీవ్రత చెప్పవచ్చు. వేడి బాగా ఎక్కువైపోయినప్పుడు అందలి పదార్థం అయనీకరణం చెంది ప్లాస్మా స్థితికి కూడా చేరుకోవచ్చు.

మానవ జీవితంలో అగ్ని యొక్క స్థానం

మానవ చరిత్రలో నిప్పుని కనుగొనడం ఒక మలుపు. ఈ మలుపు మానవుణ్ణి జంతుసామ్రాజ్యపు రారాజుని చేసింది. ప్రకృతిపైన అధిపత్యానికి ప్రయత్నించేలా చేసింది. భారతదేశం, ప్రాచీన గ్రీసు వంటి బహుదేవతారాధక సమాజాలు "అగ్ని"ని దైవం అన్నాయి. అతి ప్రాచీనమని చెప్పబడుతున్న ఋగ్వేదం కూడా "అగ్ని మీళే పురోహితం" అంటూ ప్రారంభమౌతుంది. అయితే, ప్రస్తుత కాలంలో అగ్ని ఒక ఆపద లేదా ప్రమాదంలా చూడబడుతోంది.

రసాయన చర్య

అగ్ని జ్వాల ప్రారంభం కావడానికి ముఖ్యమైనవి మూడు: అగ్నిప్రేరక పదార్ధాలు, ఆక్సిజన్ మరియు కావలసినంత వేడి. దీనిని 'అగ్ని త్రిభుజం' అంటారు.

అగ్నికి సాధారణమైన కారణాలు:

అగ్ని త్రిభుజం.

అగ్ని పుట్టిన తర్వాత దానిద్వారా ఉత్పన్నమైన వేడి మూలంగా అది పరిసరాలకు వ్యాపిస్తుంది. ఇందుకు కావలసిన మూలపదార్ధము మరియు ఆక్సిజన్ తగినంతగా అందుతుండడం అవసరం.

అగ్నిని ఆర్పడానికి ఈ మూడు మూలపదార్ధాలని తొలగించడం ముఖ్యమైనది. అందరికీ తెలిసిన పద్ధతిలో అగ్ని మీద నీరు జల్లడం వల్ల అక్కడి వేడిని తగ్గించడం ముఖ్య ఉద్దేశం. కార్బన్ డై ఆక్సైడ్ వాడడం వల్ల ఆక్సిజన్ ను తొలగిస్తున్నాము.

వర్గీకరణ

అగ్ని రకాలు యూరోపియన్ / ఆస్ట్రేలియన్ వర్గీకరణ అమెరికా వర్గీకరణ
కర్రలు, గుడ్డలు, రబ్బరు, కాగితం మరియు కొన్ని రకాల ప్లాస్టిక్ వంటి ఘనపదార్ధాల వల్ల కలిగే అగ్ని. తరగతి A తరగతి A
పెట్రోలు, కిరోసిన్, కొవ్వు మరియు ప్లాస్టిక వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని. తరగతి B తరగతి B
మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్, హైడ్రోజన్ వంటి వాయు పదార్ధాల వల్ల కలిగే అగ్ని. తరగతి C
సోడియమ్, పొటాషియమ్, మెగ్నీషియమ్ వంటి ఘన లోహాల వల్ల కలిగే అగ్ని. తరగతి D తరగతి D
A, B తరగతికి చెందిన ఘన, ద్రవ పదార్ధాల వల్ల, విద్యుత్ పరికరాలు, వైర్లు మరియు ఇతర విద్యుత్వాహకాల ప్రమేయం వల్ల కలిగే అగ్ని. తరగతి E తరగతి C
వంటల్లో వాడే కొవ్వు మరియు నూనె వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని. తరగతి F తరగతి K

ఇవి కూడా చూడండి

అగ్ని దేవుడు