ఆముదం చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:వృక్ష శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 56: పంక్తి 56:


[[వర్గం:యుఫోర్బియేసి]]
[[వర్గం:యుఫోర్బియేసి]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]

05:10, 21 మే 2013 నాటి కూర్పు

ఆముదము చెట్టు
ఆముదపు పుష్పాలు, ఫలాలు.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Subtribe:
Ricininae
Genus:
Ricinus
Species:
R. communis
Binomial name
Ricinus communis

ఆముదము ఒకరకమైన నూనె చెట్టు. ఆముదము చెట్టులలో ఎరుపు, తెలుపు, పెద్దాముదము అను మూడు రకములు కలవు. తెలుపు, ఎరుపు రంగులు గల పుష్పాలను బట్టి, పెద్దవైన ఆకులను బట్టి వీటిని గుర్తించాలి. చిన్న ఆకులు కలిగిన చిట్టాముదపు చెట్టు మిక్కిలి శ్రేష్ఠమైనది. ఆముదపు గింజల నుండి ఆముదము నూనె తయారుచేస్తారు.

ఈజిప్ట్ దేశంలో క్రీ.పూ. 4000 సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్నట్లు ఆధారాలున్నాయి. గ్రీకు ప్రయాణీకులు ఆముదపు నూనెను దీపాలు వెలిగించుకోడానికి మరియు లేపనముగా ఉపయోగించారు.

ప్రపంచ ఆముదపు గింజల ఉత్పత్తి సంవత్సరానికి ఒక మిలియను టన్నులు. వీనిలో భారతదేశం, చైనా మరియు బ్రెజిల్ ముఖ్యమైనవి.

ఆముదము చెట్టు లక్షణాలు

  • బహువార్షిక పొద.
  • 6-10 నొక్కులు గల హస్తాకార సరళ పత్రాలు. ఆకులకు పొడవైన కాడలుండును.
  • అగ్రస్థ శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు.
  • ఫలం 3 నొక్కులు గల రెగ్మా. కాయ లోపల మూడు గింజలుండును. కాయపైన మృదువైన ముండ్లుండును.

ఉపయోగాలు

  • భారతదేశంలో ఆముదము నూనె క్రీ.పూ. 2000 నుండి ఉపయోగంలో ఉంది. దీనిని దీపాలు వెలిగించడానికి, ఆయుర్వేదంలో విరేచనకారిగా ఉపయోగించారు. ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లు వ్యాధిని కొన్ని రోజులలో నయం చేస్తుందని నమ్మకం.
  • చైనా వైద్యంలో గాయాలకు కట్టిన పట్టీలలో కొన్ని తరాలనుండి ఉపయోగిస్తున్నారు.
  • దీపావళి రోజు భారతీయులు ఆముదపు కాడలకు నూనె దీపాలుగా చేసి వెలిగించడం వల్ల పరలోకాలలో పిత్రుదేవతలను ప్రార్ధిస్తారు.

వంట ఆముదము తయారుచేయు విధానము

ఆముదము గింజలను రోట్లోవేసి బాగా దంచగా అది ఒక ముద్ద లాగ తయారవుతుంది. దానిని ఒక పాత్రలోవేసి సగానికి పైగా నీరు పోసి పొయ్యి మీద పెట్టి బాగ మంట పెడతారు. అప్పుడు అందులోని ఆముదపు నూనె నీటిపై ఒక తెరలాగ తేలుతుంది. దానిని ఒక పలచటి గరిటతో తీసి చిన పాత్రలో వేస్తారు. అలా నీటి పైన తేలిన నూనెను వేరుపరుస్తూ ఉడుకుతున్న ఆముదపు పిండిని మాటిమాటికి కలుపుతూ పైకి తేలిన నూనెను తీసుకుంటారు. చివరగా నీటి పై తేలిన నూనె (ఆముదము) గరిటలోకి రాదు. అప్పుడు ఒక గుప్పెడు వెంట్రుకలు తీసుకొని నీటిపై తేలిన నూనెలో ముంచుతారు. ఆముదము మాత్రమే వెంట్రుకలకు అంటుకొని నీరు క్రిందికి జారి పోతుంది. ఆ వెంట్రుకలు ఆముదము గిన్నెలో పిండి మరలా నీటిప అద్ది అక్కడ తేలిన ఆముదాన్ని సేకరిస్తారు. ఆవిధంగా మిగిలిన ఆముదాన్ని కూడ సేకరిస్తారు. నూనె సేకరించిన పాత్రలో ఆముదము తో కలిసిన నీరు కొంత పాత్ర అడుగుకు చేరి వుంటుంది. దానిని కూడ తీసివేసి ఆముదాన్ని మాత్రమే ఒక పాత్రలో సేకరిస్తారు. ఇందులో కూడ అతి కొద్ది శాతం నీరు వుంటుంది. అది కూడ పోవడానికి ఆ ఆముదాన్ని పొయ్యిపై పెట్టి బాగ వేడి చేస్తారు. అప్పుడు అందులోని నీరు ఆవిరైపోయి శ్వచ్చమైన ఆముదము మాత్రమే మిగులుతుంది. దీనినే వంట ఆముదము అంటారు. దీనిని పిల్లలకు మందుగాను, వారితలలకు వాడుతారు. గానుగలతో తీసిన ఆముదాన్ని ఇందుకు వాడరు. ఆముదాలలో రెండు రకాలు: 1. చిట్టిఆముదాలు. 2. పెద్ద ఆముదాలు. చిట్టి ఆముదాలకు ప్రత్యేక వున్నది.


ఇవీ చూడండి

బయటి లింకులు