గోల్డెన్ త్రెషోల్డ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 18: పంక్తి 18:
[[File:Golden threshold 04.jpg|thumb|గాంధీజీ గోపాల్ క్లినిక్ కు శంకుస్థపన చేసిన రాయి]]
[[File:Golden threshold 04.jpg|thumb|గాంధీజీ గోపాల్ క్లినిక్ కు శంకుస్థపన చేసిన రాయి]]
[[File:Golden threshold 05.jpg|thumb|గోపాల్ క్లినిక్]]
[[File:Golden threshold 05.jpg|thumb|గోపాల్ క్లినిక్]]

</gallery>
</gallery>



06:32, 30 మే 2013 నాటి కూర్పు

గోల్డెన్ త్రెషోల్డ్

గోల్డెన్ త్రెషోల్డ్ అనే భవనం శ్రీమతి సరోజినీ నాయుడు హైదరాబాదు నివాస గృహం. హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక బంగళాలో ఆమె తండ్రి అయిన అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నివాసముండేవారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ అప్పటి హైదరబాద్ కాలేజి(ప్రస్తుతం నిజాం కాలేజి) కి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. దీనిని సరోజినీ నాయుడు తదనంతరం ఆమె ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చి గుర్తించసాగారు. వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం మరియు జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, హైదరాబాదు లో ఈ గృహం, కేంద్ర బిందువుగా ఉండేది. ఈ విశాల ప్రాంగణం ఛటోపాధ్యాయ కుటుంబం యొక్క ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం. గోల్డెన్ త్రెషోల్డ్ లో సరోజినీ నాయుడు మాత్రమే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి నటుడు మరియు సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి మరియు నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసమున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ కూడా గోల్డెన్ త్రెషోల్డ్ కు వచ్చినట్టు, ఆ సందర్భంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు, ఒక మొక్కను నాటినట్టు ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. గాంధీజీ గారు పునాది వేసిన ఆసుపత్రిని గోపాల్ క్లినిక్ అని ఇప్పటికీ సంభోదిస్తారు. పునాది వేసిన తేది ఈ బంగాళా శిలాఫలకంపై కనిపిస్తాయి.

ప్రస్తుత చరిత్ర

గోల్డెన్ త్రెషోల్డ్ ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారి ఆధీనంలో ఉంది.[1] 1975 నవంబర్ 17న అప్పటి ప్రధాని ఇందిరాగాంధిగారు పద్మజా నాయుడు గారి ప్రోత్సాహంతో దీనిని జాతికి అంకితమిచ్చారు. హైదరాబాదు విశ్వవిద్యాలయము ఈ ప్రాంగణంలోనే ప్రారంభించబడింది. దీనిని గుర్తిస్తూ హైదరాబాదు విశ్వవిద్యాలయము వారు తదనంతరం సరోజినీ నాయుడు గారి పేరిట సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్మూనికేషన్ 1988లో గోల్డెన్ త్రెషోల్డ్లో ప్రారంభించారు.

హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు ఈ ప్రాంగణంలో ఆగష్టు 2012 నుండి ఒక థియేటర్ ఔట్రీచ్ యూనిట్‌ ని నడుపుతున్నారు.

సాక్ష్యాలు

చిత్రమాలిక