మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 23: పంక్తి 23:
[[వర్గం:తెలుగు కధా రచయితలు]]
[[వర్గం:తెలుగు కధా రచయితలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు]]

16:34, 2 జూన్ 2013 నాటి కూర్పు

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖులు, ఇటీవలివారు. వీరి నివాసం రాజమండ్రి. ఈయన రచనల్లో ముఖ్యమైనది ఆంధ్ర పురాణం. ఈ కృతికిగానూ వీరికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి

ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితులైన మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారు 20వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ఉద్భవించిన మహాకవి. శాస్ర్తీగారి పేరు తలచగానే మన స్మృతి పథంలో మెదిలేవి వారి మూడు రచనలు. అందులో ఒకటి ఆంధ్ర పురాణము, రెండవది ఆంధ్ర రచయితలు, మూడవది ఆంధ్రి మాసపత్రిక. ఇవి త్రివేణి సంగమంవలె భావిస్తాయి.

ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి. శాస్ర్తీగారు ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి ఒంగళి-కాటూరి కవుల ‘‘సౌందరనందము’’ దుర్భాక రాజశేఖర శతావధానిగారి ‘‘రాణా ప్రతాప సింహచరిత్ర’’, శతావధాని గడియారం వేంకట శేషశాస్ర్తీ గారి ‘‘శ్రీ శివభారతము’’, తుమ్మల సీతారామమూర్తి గారి ‘‘బాపూజీ ఆత్మకథ’’ అనేవి. శాస్ర్తీగారు రచించిన ‘‘ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైన సాహిత్య సౌరభంతో గుబాళించే రసవత్తర కావ్యం.

‘‘ఆంధ్ర రచయితలు’’ శాస్ర్తీగారి ప్రసిద్ధ రచనలో ఒకటి. ఇందులో నీతి చంత్రిక, బాల వ్యాకరణం రచించిన చిన్నయసూరి నుండి తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి వరకు నూరుగురి మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం. 2012 డిసెంబరులో ఈ గ్రంథాన్ని శాస్ర్తీగారి కుమారులు ‘‘మధునామూర్తి’’ గారు సవరణలు చేసి నూతనంగా పదముగ్గురు రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలలోను, మరల హైదరాబాదులోను ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశారు. సాహిత్య మాసపత్రికలలో మేల్తరమైనది, అందలి ప్రతి వ్యాసానికి, కవితలకు శాస్ర్తీగారు పుటకు దిగువ ‘‘పాద గమనికలు’’ వ్రాసేవారు. ఈ పాద గమనికలలో వ్యాసంకాని, కవిత కాని బాగుగా ఉంటే వానిని శ్లాఘించే వారు, లేకపోతే ఎంతటి మహాకవి రచయైన శాస్ర్తీగారి విమర్శకు లోనుకావలసిందే. ఇది 36 నెలలు 1939 నుండి 1941 వరకు నడచి నిలుపుదల చేయబడింది. ఇందులో ఆనాడు లబ్ధ ప్రతిష్ఠులైన పండితులు, కవులు, రచయితలనేకుల రచనలు ముద్రింపబడ్డాయి.

శాస్ర్తీగారు రచించి ప్రచురించిన ఖండకావ్యాలు - (1) తోరణములు (2) శ్రీ ఖండములు (3) చైత్రరథం (4) కేళాకుళి అనునవి ఉన్నాయి. శాస్ర్తీ పిన్ననాటనే అంటే 10 సంవత్సరాల వయస్సులో పద్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. 1938లో వారి తొలి ఖండ కావ్యం ‘తోరణము’ వెలువడింది. దానికి విశ్వనాథ సత్యనారాయణగారు పీఠిక వ్రాస్తూ శాస్ర్తీగారు మహాకవి యయ్యే సూచనలు ఈ పద్యంలో గోచరిస్తున్నాయని ఈ దిగువ పద్యం ఉదాహరించారు.

తే॥ నొడువ జాలని యిడుమల గుడిచి బడలి
చిక్కి జీర్ణించి నిజదేశ సేవ చేసి
తుదకు స్మరణీయులైన యాంధ్రుల దలంప
గాజు కన్నైన నొక యశ్రుకణము రాల్చు’’

శాస్ర్తీగారు నవలలు, కథలు, చరిత్రలు, నాటకానువాదాలు, వ్యాసాలు మొదలైన సాహిత్య శాఖలలో రచనలు సాగించారు. బోధి వృక్షము - బుద్ధుని చరిత్ర ఇతివృతంగా వ్రాయబడిన నవల. కళ్యాణతార మరియొక నవల. ఇందు శ్రీకృష్ణదేవరాలు కొండపల్లి ముట్టడిని గూర్చిన ఇతివృత్తమున్నది. శాస్ర్తీగారు ‘‘పతంజలి చరిత్ర’’ ‘‘్ధన్వంతరి చరిత్ర’’ ‘‘చరిత్ర ధన్యులు’’ అను శీర్షికన శాలివాహనుడు, మాధవ వర్మ, గొంకరాజు, అన్నమయ్య’’ల జీవితాలను చిత్రించారు. ‘‘షడ్దర్శన సంగ్రహం’’ వారి రచనలో నొకటి.

యితర లింకులు