హొ చి మిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 86 interwiki links, now provided by Wikidata on d:q36014 (translate me)
+వర్గం:1890 జననాలు; +వర్గం:1969 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22: పంక్తి 22:
[[వర్గం:వియత్నాం]]
[[వర్గం:వియత్నాం]]
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
[[వర్గం:1890 జననాలు]]
[[వర్గం:1969 మరణాలు]]

13:24, 3 జూన్ 2013 నాటి కూర్పు

హొ-చి-మిన్ (Ho Chi Minh) (జననం: మే 19,1890-మరణం: సెప్టెంబరు 3,1969) వియత్నాం సామ్యవాద నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి వలస పాలన కు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. ఇతని అసలు పేరు గుయెన్ టాట్ థన్.

హొచిమిన్ (కుడి ప్రక్క) మరియు వో నిగుయెన్ గియాప్ (ఎడమ ప్రక్క)
హానోయ్ నగరంలో హొ చి మిన్ మౌసోలియమ్
హొ చి మిన్ విగ్రహం

హొ చి మిన్ మే 19, 1890న మధ్య వియత్నాం లోని కింలీన్ అనే గ్రామంలో జన్మించాడు. ఆ కాలంలో ఫ్రెంచి వారి వలస పాలనలో ఉన్న ఇండోచైనా ప్రాంతంలో వియత్నాం ఒక భాగంగా ఉండేది. సెకండరీ స్కూల్ విద్య పూర్తయిన తరువాత 1911 లో ఒక ఫ్రెంచి స్టీమర్లో వంట పని సహాయకునిగా చేరి ఆ తరువాత లండన్ మరియు పారిస్‌ లలో పనిచేశాడు.

మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత ఫ్రెంచి కమ్యూనిష్టు పార్టీ స్థాపనలో పాలు పంచుకున్నాడు. ఆ తదుపరి శిక్షణ కొరకు మాస్కో వెళ్ళాడు. ఆ తరువాత 1924 లో చైనా వెళ్ళి అక్కడ తన దేశ ప్రవాసులతో విప్లవోద్యమాన్ని నిర్మించాడు. 1930 లో ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీ ను చైనాలో స్థాపించాడు. హాంకాంగ్ లో కమ్యూనిష్టు ఇంటర్నేషనల్ ప్రతినిథిగా ఉన్న సమయంలో 1931 జూన్ నెలలో బ్రిటిష్ పోలీసులు హొ ను అరెష్టు చేసి 1933 వరకు జైలులో ఉంచారు. విడుదలైన తరువాత మరలా సోవియట్ యూనియన్ వెళ్ళి తనకు సోకిన క్షయ వ్యాధి నయమయేంతవరకూ అక్కడే ఉన్నాడు. 1938 లో మరలా చైనా వెళ్ళాడు.

1941 లో జపాన్ వియత్నాం ను ఆక్రమించినపుడు ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీ తో తిరిగి సంబంధాలు ఏర్పరచుకుని వియెత్ మిన్ అనబడే గెరిల్లా సైన్యాన్ని నిర్మించి జపాన్ సైన్యంతో పోరాడాడు. 1945 ఆగష్టులో రెండవ ప్రపంచ యుద్దం లో జపాన్ లొంగిపోయిన తరువాత వియత్ మిన్ అధికారాన్ని హస్తగతం చేసుకుని హనోయ్ రాజధానిగా హొ చి మిన్ నాయకత్వంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం ను ప్రకటించినది. ఈ యుద్ద సమయంలో పెట్టుకున్న మారుపేరే హొ చి మిన్. ప్రకాశవంతమైనవాడు (Enlightener or He who shines) అని దీని అర్థం.

ఫ్రెంచ్ వారికి వారి వలసలను వదలుకోవటం ఇష్టంలేక పోవటంతో 1946 చివరలో ఇరుసేనల మధ్యన యుద్దం ప్రారంభమైనది. 8సం.లు వియెత్ మిన్ గెరిల్లా లు ఫ్రెంచ్ దళాలతో పోరాడి చివరకు వారిని దీన్ బీన్ ఫు యుద్దంలో 1954 లో ఓడించాయి. తరువాత జెనీవా లో జరిగిన చర్చలలో దేశం విభజింపబడి ఉత్తర ప్రాంతం మాత్రమే వియత్ మిన్ ఉద్యమకారులకు ఇవ్వడం జరిగినది. ఆ విధంగా ఏర్పడిన ఉత్తర వియత్నాం లో హొ చి మిన్ సామ్యవాద సమాజాన్ని నిర్మించటానికి పూనుకున్నాడు.

1960 వ దశకం ప్రారంభంలో సైగాన్ రాజధానిగా అమెరికా సహాయంతో దక్షిణ వియత్నాం ను పరిపాలిస్తున్న కమ్యూనిష్టేతర ప్రభుత్వం మీద కమ్యూనిష్టు గెరిల్లా లు యుద్దాన్ని ప్రారభించారు. ఈ యుద్దమే చరిత్రలో వియత్నాం యుద్దం గా పిలువ బడింది. ఉభయ వియత్నాంలను ఏకీకృతం చేయ తలపేట్టిన హొ ప్రభుత్వం దక్షిణ వియత్నాంలో అచటి ప్రభుత్వ సైన్యాలమీద మరియు అమెరికా సైన్యాలమీద పోరాడుతున్న గెరిల్లాలకు సహాయంగా సైన్యాన్ని పంపినది.

హొచిమిన్ ఆరోగ్యం క్షీణించి సెప్టెంబర్ 3,1969లో మరణించాడు. ఇతని మరణానంతరం ఇతని అనుచరులు దక్షిణ వియత్నాం లోని కమ్యూనిష్టు గెరిల్లాలకు సహాయాన్ని కొనసాగించారు. హొచిమిన్ చనిపోయిన తరువాత ఆరేళ్ళకు 1975 లో దక్షిణ వియత్నాంలో కమ్యూనిష్టులు అధికారంలోకి రావడంతో ఉభయ వియత్నాంలు కలిపివేయబడి సైగాన్ పట్టణానికి హొచిమిన్ సిటీ గా నామకరణం జరిగినది.

సంతకము

"https://te.wikipedia.org/w/index.php?title=హొ_చి_మిన్&oldid=855357" నుండి వెలికితీశారు