వర్ణము(సంగీతం): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) కొత్త పేజీ: {{భారతీయ సంగీతం}} వర్ణము అభ్యాసగాన రచనలలోచాలా ముఖ్యమైన రచన. ఈ ర... |
(తేడా లేదు)
|
07:51, 7 జూన్ 2013 నాటి కూర్పు
వర్ణము అభ్యాసగాన రచనలలోచాలా ముఖ్యమైన రచన. ఈ రచన నేర్చుకొనుటకు , పరిపూర్ణ పరిపక్వముతో పాడుటయు చాల కష్టము. వర్ణమును బాగుగా నేర్చిన యెడల యితర రచనలు అతి సులభ సాధ్యము అగును. వాద్య పాఠకులు వర్ణమును పఠించి వాద్యముపై వాయించుటచే సంగీత కళను సంపూర్ణంగా వాద్య స్వాధీనము చేసుకొనవచ్చును. గాత్ర పాఠకులకు గాత్రమునందు యెటువంటి సంచారమైననూ అవలీలగా పాడుటకు వీలగును.
వర్ణమును రచించుట కష్ట సాధ్యము. కృతుల సంఖ్య కంటే వర్ణముల సంఖ్య చాలా కొద్ది. వర్ణము రచించుటకు రాగము యొక్క లక్షణములు పరిపూర్ణముగా తెలిసికొని ఆ రాగములో వర్ణమును రచింపవలయును.