మధుమాసం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q13645807 (translate me)
పంక్తి 30: పంక్తి 30:


[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]

[[en:Madhumasam]]

20:24, 8 జూలై 2013 నాటి కూర్పు

మధుమాసం
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్రసిద్దార్థ
నిర్మాణం డి.రామానాయుడు
కథ బలభద్రపాత్రుని రమణి
తారాగణం సుమంత్,
స్నేహ,
కృష్ణుడు (నటుడు),
పార్వతి మెల్టన్,
సీమ,
నరేష్,
రావి కొండలరావు,
చలపతి రావు,
అస్మిత,
శివ పార్వతి,
దీపాంజలి
సంగీతం మణిశర్మ
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌
భాష తెలుగు

దర్శకుడు చంద్ర సిద్ధార్ధ గురించి మంచి దర్శకుడిగా చెప్పచ్చు. అతని గత సినిమాలైన అప్పుడప్పుడు, ఆ నలుగురు అతని ప్రతిభని గురించి చెపుతాయి. కుటుంబ సమేతంగా చూసే సినిమాలను అందంగా తెరకెక్కించే దర్శకుడు. ఈ సినిమాలో కూడా అదే పంథాను అనుసరించి డీసెంట్ సినిమాగా మలచాడు.

కధాగమనం

ఈ చిత్రంలో కధ మూడురకాల మనస్తత్వాల గురించీ పరిస్థితుల ప్రభావం వలన ఆమనస్తత్వాలలో కలిగే మార్పుల గురించీ ఈ చిత్రం చూపిస్తుంది. సంజయ్ (సుమంత్) పక్కా ప్రాక్టికల్ మనిషి. ప్రేమ దోమ లాంటివి లేవని నమ్మే వ్యక్తి. అతని స్నేహితురాలు మాయ (పార్వతీ మెల్టన్) ఇంకొక అడుగు ముందుకు వేసి సిగరెట్లు తాగడం, మందుకొట్టడం, నచ్చిన మగాడితో తిరగడం లాంటివి చేసే విచ్చలవిడి మనస్తత్వం కలిగిన అత్యాధునిక స్త్రీ. వీరికి పూర్తి వ్యతిరేకంగా ఉండే మనస్తత్వం గల అమ్మాయి హంస (స్నేహ). తను ఉద్యోగం చేస్తూ తండ్రిని పోషిస్తుంటుంది. ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారన్నట్టుగా, కొన్ని సంఘటనల వలన సంజయ్ ప్రేమను నమ్మే వాడుగా మారి హంసను ప్రేమించడం ప్రారంభిస్తే, అందుకు విరుద్ధంగా హంస ప్రేమ, ఆప్యాయతలు, స్వార్ధమునుండే పుడతాయని ప్రేమాభిమానాలు నమ్మని వ్యక్తిగా మారుతుంది. విచ్చలవిడిగా తిరిగే మనస్తత్వంగల మాయ ఒక పరిణితి చెందిన స్త్రీగా మారుతుంది. తననిష్టపడే యువకున్ని పెళ్ళి చేసుకొంటుంది. సంజయ్ ప్రేమించే హంస, సంజయ్ ప్రేమను సైతం నమ్మనిదిగా మారగా ఆమెలో మార్పు తీసుకొచ్చి పెళ్ళి చేసుకొంటాడు సంజయ్.

చిత్రవిశేషాలు

చాలా కాలం విరామం తరువాత రచయిత సత్యానంద్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. పాటలు అన్నీ బావున్నా థియేటర్ నుండి బయటకు వచ్చాక ఏపాటా గుర్తుండదు. సినిమాను కుటుంబసమేతంగా చూసే విధంగా తీసారు. ఎక్కడా అసభ్యత అశ్లీలం కనిపించవు. కమర్షియల్గా పెద్ద విజయం సాధించనప్పటికీ విలువలు కలిగిన సినిమాగా నిలబడింది.

"https://te.wikipedia.org/w/index.php?title=మధుమాసం&oldid=874539" నుండి వెలికితీశారు