తేనె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 37: పంక్తి 37:
* అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.
* అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.
* తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.
* తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.
* రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం,మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. మరియు గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది...
* roju udayanne spoon nimmarasam, miriyala podi, hot water lo honey mix chesi tagite Waight loss and GasTrouble gone.


== ఉపయోగాలు ==
== ఉపయోగాలు ==

12:22, 4 ఆగస్టు 2013 నాటి కూర్పు


కెమీలీయా పూలనుండి స్రవిస్తున్న మకరందం
పూలనుండి మకరందాన్ని సేకరిస్తున్న తేనెటీగ

తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్చమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటగా మధ్యాన్ని తయారుచేసిందీ తేనెతోనే. ప్లేటో, అరిస్టాటిల్, డిమొక్రటిస్... లాంటి తత్త్వవేత్తలంతా తేనె వైశిష్ట్యాన్ని తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. శుశ్రుతసంహిత తేనెను తాగేమందుగా వర్ణించింది, శ్వాసకోశవ్యాధులకు మధువును మించిన దివ్యౌషధం లేదని చెప్పింది.

పూలనుండి మకరందము

మకరందము(నెక్టార్ (Nectar)) పూలలో ఉత్పత్తి అయ్యి స్రవించే తియ్యని ద్రవము. తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి.


వృక్షాల సంతానోత్పత్తికి ప్రకృతి ఇచ్చిన వరాలలో మకరందం ఒకటి. మొక్కలలోని పూలకు మధ్యభాగంలో గ్రంధులద్వారా స్రవిస్తూ ఉంటుంది. ఈ గ్రంధులు పూల కేసరాల మొదటి భాగంలో ఉంటుంది. కీటకాలు మకరందం కోసం పూలమీద వాలినపుడు కీటకాల శరీరానికి అంటిన పుప్పొడి సంపర్కం చేందటం ద్వారా మొక్కలలో సంతానోత్పత్తి జరుగుతుంది. మకరందం సామాన్యంగా మాంసాహార కీటకాలను ఆకర్షిస్తుంది కనుక అవి మకరందాన్ని సేవిస్తూ చుట్టుపక్కన తిరుగుతున్న మొక్కలను తినే పురుగులను తింటాయి దానివలన మొక్కలు నాశకారక కీటకాలనుండి రక్షింపబడతాయి. మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనె తయారు చేస్తాయి. మకరందంలో చక్కెర పాలు ఎక్కువగా ఉంటుంది. అదీ కాక మొక్కలలోని ఔషధ గుణాలు కూడా ఉంటాయి కనుక దీనిద్వారా తయారైన తేనెలో ఔషధ గుణం కలిగి ఉంటుంది.


మకరందం నుండి తేనె

తేనె పట్టు
తేనె

అనేక రకాల చక్కెరపదార్థాల సమ్మిశ్రమమే తేనె. ఇందులో 38 శాతం ఫ్రక్టోజ్, 31 శాతం గ్లూకోజ్, ఒక శాతం సుక్రోజ్, 17 శాతం నీరు, 9 శాతం ఇతరత్రా చక్కెర పదార్థాలు, 0.17 శాతం బూడిద ఉంటాయి. కేవలం చక్కెర ద్రావణానికి అంత చిక్కదనం ఎలా వచ్చిందాని చూస్తే - కూలీ ఈగలు మకరందాన్ని గ్రోలి తేనెపట్టు దగ్గరకు తీసుకువచ్చేటప్పుడు ఆ సమయంలో వాటిల్లోని కొన్ని ఎంజైములు, అందులో కలుస్తాయి. సేకరించడం పూర్తయ్యాక ఈగలన్నీ తేనెపట్టులోకి చేరతాయి. అవి అక్కడ అనేకసార్లు రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతుంటాయి. దాంతో మకరందంలో ఉన్న నీరంతా ఆవిరైపోతుంది. ఫలితంగా చక్కెర గాఢత పెరిగి చిక్కని తేనె మాత్రం మిగులుతుంది.

తేనెటీగల రకాలు

తేనె లో నాలుగు రకాలు ఉన్నాయి - పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి, సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్ళ పై కప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోను, చీమల పుట్టల్లోను నిర్మించుకుంటాయి. కర్ర తేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్ర తేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన మూడు రకాల తేనెలు తీపిగా ఉండును. తేనె రకాల్లో పుట్ట తేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు.


తేనె గుణాలు

తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెల్లో రంగులూ రకాలూ ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు... ఇలా భిన్నవర్ణాలతోపాటు కొన్ని తేనెలు వర్ణవిహీనంగానూ ఉంటాయి. అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంటుంది. అంటే తేనె రంగు, సువాసన, రుచి... అన్నీ మధుకీటకాలు సేకరించే పూలజాతుల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు యూకలిప్టస్, నిమ్మ, నారింజ పూల నుంచి మకరందాన్ని సేకరిస్తే అది ఘాటైన వాసననీ రుచినీ కలిగి ఉంటుంది. చాలామంది వంటలో పంచదార కన్నా తేనె వాడటానికి ఇష్టపడతారు. బేకింగ్ ఉత్పత్తులో తేనె వాడటంవల్ల రుచిగా ఉండటంతోపాటు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకుతాయి.

తేనెతో వైద్యం

  • కాలిన గాయాలకీ చర్మ క్యాన్సర్లకీ పుండ్లకీ హనీ పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇది 'యాంటీ మైక్రోబియల్' ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది.
  • చెడువాసనల్నీ వాపునీ మచ్చల్నీ కూడా మటుమాయం చేస్తుంది.
  • ఎలర్జీని నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అదెలా అంటే స్థానికంగా దొరికే తేనెనే మీరు తీసుకుంటే ఆయా కాలాల్లో వచ్చే ఎలర్జీలన్నింటినీ తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఎందుకంటే ఎలర్జీలు సాధారణంగా పరాగరేణువులవల్లే వస్తాయి. తేనెటీగలు మీ చుట్టుపక్కలున్న వెుక్కల నుంచే కదా తేనెను సేకరిస్తాయి కాబట్టి ఆ పరాగరేణువులు మీ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నమాట.
  • ఊబకాయులు పరగడుపున రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా తేనెను రంగరించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • తేనెలో ఔషధగుణాలున్న నూనెలు, ఫ్లేవోనాయిడ్‌లు, టెర్పీన్లు, పాలీఫినాల్‌లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి.
  • ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు- క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయి.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండిపదార్థాలను తినడం వీలయినంతగా తగ్గించాలి. అయితే వీళ్లు అందుకు బదులుగా తేనెను తిన్నా బ్లడ్‌షుగర్ ఎంతమాత్రం పెరగదు. తేనె రక్తప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ ఇన్సులిన్ తయారీని నిరోధిస్తుంది.
  • పూర్వం మశూచికం వల్ల ఏర్పడ్డ మచ్చలు త్వరగా తగ్గేందుకు చైనీయులు తేనెనే మందుగా వాడేవారు.
  • అమృతప్రాయమైన మధువులో రవ్వంత విషమూ ఉంటుంది. మకరందంలో సహజంగా ఉంటే బ్యాక్టీరియా బాట్యులిన్ అనే టాక్సిన్‌ను విడుదల చేస్తాయి. ఈ విషం క్యాన్సర్, మల్టిపుల్‌స్ల్కిరోసిస్‌కు మంచి మందు. ఇదే విషం ఏడాదిలోపు పసిపిల్లలకు హానికరం.
  • అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.
  • తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.
  • రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం,మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. మరియు గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది...

ఉపయోగాలు

  • తేనె చాలా సులభంగా జీర్ణమై, ఇతర ఆహార పదార్థాలకంటే త్వరగా రక్తంలో కలుస్తుంది.
  • తేనె తింటే సున్నితమైన జీర్ణాశయం లోపలి పొరకు ఎలాంటి హాని కలగదు.
  • రక్తంలో కలిసిన తేనె మూత్రపిండాలు, ఇతర అంతర్భాగాలకు వినాశనకారి కాదు.
  • తేనె త్వరగా జీర్ణమై ఇతర ఆహారపదార్థాల కంటే ఎక్కువ శక్తి ఉత్పాదకతను కలిగి ఉంటుంది.

సౌందర్యపోషణకు తేనె

  • 'జుట్టుకు తేనె రాస్తే తెల్లబడుతుంది. కాబట్టి పొరబాటున కూడా రాయవద్దు...' అనేది మన పెద్దవాళ్ల హెచ్చరిక ఎంతమాత్రం నిజం కాదు, తేనెవల్ల పొడిబారిన జుట్టు మృదువుగా అవుతుంది'!
  • చర్మంలోని తేమగుణాన్ని పెంపొందించే శక్తి తేనెకు ఉంది ఉంది.
  • పొడి జుట్టుకి తేనె, మందారం కలిపి మాస్క్ వేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.
  • తేనె లిప్‌బామ్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. పగిలిన పెదాల్ని సంరక్షిస్తుంది.
  • పాలు, తేనెల మిశ్రమాన్ని లేదా సెనగపిండిలో తెల్లసొన, తేనె కలిపి చర్మానికీ ముఖానికీ పట్టిస్తే అవి కాంతిమంతంగా మెరుస్తాయి.

అవీ ఇవీ

  • సుమారు 20 వేల ఏళ్ల నుంచి మనిషి తేనెను సేకరిస్తున్నాడు.
  • ప్రపంచవ్యాప్తంగా అందరికన్నా న్యూజిలాండ్ వాసులు తేనె ప్రియులు. వీరిలో 88 శాతం మంది హనీని ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరూ ఏటా 1.95 కిలోల తేనెని తీసుకొంటారు.
  • రంగు, రుచి ఆధారంగా అమెరికాలో 300లకు పైగా తేనెరకాలు తయారవుతున్నాయి.
  • గ్రీసులో కొత్తపెళ్లికూతురు అత్తవారింట అడుగుపెట్టేటప్పుడు- చేతుల్ని తేనెలో ముంచి గోడలమీద ముద్రలు వేస్తుందట. వైవాహిక జీవితం తీయగా హాయిగా సాగిపోయేందుకే ఈ తేనెముద్రలు.
  • తేనె పంచదారకన్నా రెండురెట్లు తీపిగా ఘాటుగా ఉంటుంది. అందుకే తేనెలో ఎలాంటి బాక్టీరియా, ఫంగస్‌లాంటి సూక్ష్మజీవులు ఉండవు.
  • రోమన్లు బంగారానికి బదులుగా తేనెను ఆదాయపన్నుగా చెల్లించేవారట.
  • ఒక పౌండు తేనెకోసం తేనెటీగలు సుమారు 55 వేల మైళ్ల దూరం ప్రయాణించి 20 లక్షల పూలను సందర్శిస్తాయని తెలుసా.
  • విడిగా అమ్మే తేనెలో కొంత చక్కెరపాకాన్నీ కలుపుతుంటారు. అచ్చంగా పట్టు నుంచి తీసినదేదో తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు.

బయటి లింకులు

మూస:Link FA మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=తేనె&oldid=893722" నుండి వెలికితీశారు