కీళ్ళనొప్పులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
(తేడా లేదు)

11:56, 20 ఆగస్టు 2013 నాటి కూర్పు

కీళ్ళనొప్పులు లేదా ఆర్థరైటిస్‌ మానవులలో కలుగు ఒక రకమైన వ్యాధి.

లక్షణాలు

నొప్పి ఒక జాయింటు నుంచి లేదా ఒక వేలు నుంచి ప్రారంభమైన శరీరంలోని అన్ని జాయింట్లకు విస్తరిస్తుంది. ఆర్థరైటిస్‌లో కనిపించే ప్రధాన లక్షణం జాయింటుల్లో నొప్పి. కొన్నిరకాల ఆర్థరైటిస్‌ల వల్ల అవయవాలపై ప్రభావం పడుతుంది. జాయింటుల్లో నొప్పి, వాపు, కీళ్లు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వ్యాధి అనేక రూపాల్లో రావచ్చు. అవి అస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సూడోగౌట్, సొరియాటిక్ ఆర్థరైటిస్, అకైలోజింగ్ స్పాండిలైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్.

కారణాలు

పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఏ వయసులో వారికైనా ఇది రావచ్చు. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. గాయాలు తగిలినపుడు లిగమెంట్, కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల తీవ్రమైన నొప్పి రావచ్చు. జాయింటుల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు ఆర్థరైటిస్‌కు దారితీయవచ్చు. ఆర్థరైటిస్‌కు మరో ప్రధాన కారణం స్థూలకాయం. డిస్‌లొకేషన్, సికిల్ సెల్ డిసీజ్, బోన్ ట్యూమర్స్, బ్లీడింగ్ డిజార్డర్స్ వంటివి కూడా కారణమవుతుంటాయి.

గౌట్

కీళ్లవాతం(గౌట్) రావడానికి శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం ప్రధాన కారణం. శరీర కణజాలాల్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల తీవ్రమైన కీళ్లనొప్పులు మొదలవుతాయి. ముఖ్యంగా జాయింట్స్ దగ్గర చిన్న స్పటికాల మాదిరిగా యూరిక్ యాసిడ్ పేరుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆది పేరుకుపోతుందో జాయింట్‌లో నొప్పి, వాపు ప్రారంభమవుతుంది. పెరుగుతున్న యూరిక్ యాసిడ్‌ను లెవెల్స్‌ను శరీరం బయటకు పంపించలేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. కీళ్లవాతం ప్రభావం మొదట బొటన వేలు జాయింట్‌ల్లో కనిపిస్తుంది. చీలమండలు, కీళ్లు, మణికట్లు, చేతివేళ్లు, మోచేతి ప్రాంతాల్లో కూడా ప్రభావం ఉంటుంది. జాయింటుల్లో నొప్పి, వాపు ఏర్పడుతుంది. కీళ్లవాతం బారినపడిన జాయింటుల్లో వాపు,నొప్పితో ఎర్రగా మారుతాయి.

సొరియాటిక్ ఆర్థరైటిస్

సొరియాసిస్ అనే చర్మ వ్యాధి బారినపడిన వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. తల, మోచేయి, మోకాలు, మెడ ప్రాంతాల్లో ప్యాచ్‌ల మాదిరిగా చర్మం ఎర్రగా మారుతుంది. ఇది చేతి వేళ్లు, కాలి వేళ్ల దగ్గర విస్తరించినపుడు సొరియాటిస్ ఆర్థరైటిస్ ప్రారంభమవుతుంది. రెండు చేతులు, కాళ్లలోని జాయింటులు దీని ప్రభావానికి లోనవుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగానే లక్షణాలు ఉంటాయి. చేతి వేళ్లలోనూ,కాలి వేళ్లలోనూ నొప్పి, వాపు ఉంటుంది. పాదం నొప్పిగా ఉంటుంది. కొందరిలో స్పాండిలైటిస్ డెవలప్ అయి నడుంనొప్పి మొదలవుతుంది.

రుమటాయిడ్ ఆర్ధరైటిస్

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అటో ఇమ్యూన్ వ్యాధి. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది.జాయింటుల్లో నొప్పి, వాపుతో ప్రారంభమై కార్టిలేజ్, ఎముకకు విస్తరిస్తుంది. రెండు చేతుల మణికట్టు దగ్గర నొప్పి రావచ్చు. జాయింటుల్లో నొప్పి, వాపు ఉంటుంది. మణికట్టు, మోకాలు జాయింటుల్లోనూ ప్రభావం ఉంటుంది.

అంకైలోజింగ్ స్పాండిలోసిస్

వెన్నెముకలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. క్రమంగా నొప్పి విస్తరిస్తుంటుంది. కారణం తెలియకపోయినా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది.

అస్టియోఆర్థరైటిస్

జాయింటుల్లో వచ్చే సాధారణమైన ఆర్థరైటిస్ వ్యాధి ఇది. కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల రెండు ఎముకల మధ్య రాపిడి జరిగి నొప్పి మొదలవుతుంది. నొప్పితో పాటు, కీళ్లు బిగుసుకుపోవడం, కదల్చడానికి వీలులేకపోవడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఎక్కువగా తుంటి, వెన్నెముక, పాదం, చేతుల్లోనూ, వేళ్లలోనూ, మోకాలి జాయింటుల్లోనూ ప్రభావం చూపిస్తుంది. అస్టియో ఆర్థరైటిస్ నేరుగా కీళ్లపైన ప్రభావం చూపించడం వల్ల మనిషి కదల్లేని పరిస్థితులు వస్తాయి. కీళ్లు బిగుసుకుపోవడం, మోకాళ్లపై ఒత్తిడి భరించలేకపోవడం, విపరీతమైననొప్పి, వాపు, కదల్చలేకపోవడం, నిలుచోలేకపోవడం, నడవలేకపోవడం వంటివి వ్యాధి లక్షణాలు. కాలు కదల్చినపుడు శబ్ధం వస్తుండటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.