చిలకా ఏతోడులేక (పాట): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: '''చిలక ఏతోడులేక''' అనే ఈ పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని ...
 
పంక్తి 41: పంక్తి 41:
# మనస్విని అవార్డు -1994
# మనస్విని అవార్డు -1994
== ''వీడియో లింకులు''' ==
== ''''వీడియో లింకులు''' ==
# [[http://www.youtube.com/watch?v=c72whUM6H2k/ యూట్యూబ్ లో పాట వీడియో]]
# [[http://www.youtube.com/watch?v=c72whUM6H2k/ యూట్యూబ్ లో పాట వీడియో]]



19:26, 27 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

చిలక ఏతోడులేక అనే ఈ పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానంచేసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించింది ఎస్. వి. కృష్ణారెడ్డి

పాట నేపథ్యం

పాటలోని సాహిత్యం

పల్లవి:

చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక

లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//

చరణం 1:

బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే

వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే

అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో

కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//

చరణం 2:

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో

మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో

ఆనందం పొంగే నీ ధనరాశితో అనాధగా మిగిలావే అమావాస్యలో

తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా //చిలుకా//

పురస్కారాలు

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994
  2. కళాసాగర్ అవార్డు -1994
  3. మనస్విని అవార్డు -1994

'వీడియో లింకులు

  1. [యూట్యూబ్ లో పాట వీడియో]

.