చిలకా ఏతోడులేక (పాట): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Rajasekhar1961 చిలక ఏతోడులేక పేజీని చిలక ఏతోడులేక (పాట)కి తరలించారు
(తేడా లేదు)

09:13, 28 సెప్టెంబరు 2013 నాటి కూర్పు

చిలక ఏతోడులేక అనే ఈ పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించింది ఎస్. వి. కృష్ణారెడ్డి

పాట నేపథ్యం

పాటలోని సాహిత్యం

చిలక ఏతోడులేక పాటలోని దృశ్యం.

పల్లవి:

చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక

మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక

లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//

చరణం 1:

బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే

వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే

అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో

కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//

చరణం 2:

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో

మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో

ఆనందం పొంగే నీ ధనరాశితో అనాధగా మిగిలావే అమావాస్యలో

తీరా నీవు కనుతెరిచాకా తీరం కనబడదే యింకా //చిలుకా//

పురస్కారాలు

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994
  2. కళాసాగర్ అవార్డు -1994
  3. మనస్విని అవార్డు -1994

'వీడియో లింకులు

  1. [యూట్యూబ్ లో పాట వీడియో]

.