చతుర్యుగాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక కధ
పంక్తి 25: పంక్తి 25:
*ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య
*ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య
*కలి యుగాది - భాద్రపద బహుళ త్రయోదశి
*కలి యుగాది - భాద్రపద బహుళ త్రయోదశి

==యుగాల మధ్య జరిగిన ఒక కధ==

[[మహాభాగవతం]] ఏకాదశ స్కంధము నుండి [http://www.indiaheritage.org/rendez/article1.htm#image1]:


ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - శుర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు [[కృష్ణావతారము|శ్రీకృష్ణభగవానుని]] అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న [[బలరామావతారము|బలరామునితో]] వివాహం జరిపించు అని చెప్పాడు.

(ఒక మహాయుగమ = బ్రహ్మకు 43.2 సెకనులు)



==బయటి లింకులు ==
==బయటి లింకులు ==

08:01, 22 మార్చి 2007 నాటి కూర్పు

హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగము గా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి.


దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును

  • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
  • కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)

మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.


కృతయుగంలో ధర్మం నాలుగు పాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.


యుగాదులు

  • కృత యుగాది - కార్తీక శుక్ల నవమి
  • త్రేతా యుగాది - వైశాఖ శుక్ల తృతీయ
  • ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య
  • కలి యుగాది - భాద్రపద బహుళ త్రయోదశి

యుగాల మధ్య జరిగిన ఒక కధ

మహాభాగవతం ఏకాదశ స్కంధము నుండి [1]:


ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - శుర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు.

(ఒక మహాయుగమ = బ్రహ్మకు 43.2 సెకనులు)


బయటి లింకులు

ఇవి కూడా చూడండి