పిలు నూనె: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 47: | పంక్తి 47: | ||
|} |
|} |
||
'''నూనెలు(Oils) ''':సాధారణఉష్ణోగ్రత వద్ద ఇవి ద్రవరూపంలో వుంటాయి.నూనెలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం సగంకన్న ఎక్కువవుండును.ద్రవీభవణ ఉష్ణొగ్రత/స్దానం(Melting point)తక్కువగా వుండును. |
'''నూనెలు(Oils) ''':సాధారణఉష్ణోగ్రత వద్ద ఇవి ద్రవరూపంలో వుంటాయి.నూనెలలో [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం సగంకన్న ఎక్కువవుండును.ద్రవీభవణ ఉష్ణొగ్రత/స్దానం(Melting point)తక్కువగా వుండును. |
||
'''కొవ్వులు(Fats) ''':ఇవికూడా నూనెలే.కాని సంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలో సగంకన్న ఎక్కువవుంటాయి.అందుచే వీటిద్రవీభవణ స్దానం ఎక్కువగా వుండటంవలన సాధారణఉష్ణోగ్ర్తతవద్ద ఇవి ఘన,అర్దఘన రూపంలో వుండును. |
'''కొవ్వులు(Fats) ''':ఇవికూడా నూనెలే.కాని సంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలో సగంకన్న ఎక్కువవుంటాయి.అందుచే వీటిద్రవీభవణ స్దానం ఎక్కువగా వుండటంవలన సాధారణఉష్ణోగ్ర్తతవద్ద ఇవి ఘన,అర్దఘన రూపంలో వుండును. |
||
పిలు నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన లారిక్ మరియు మిరిస్టిక్,మరియు పామిటిక్ ఆమ్లాలు అధికంగా వుండును.10కార్బనులున్న కాప్రిక్ సంతృప్త కొవ్వు ఆమ్లం 2.0%లేదా అంతకన్న తక్కువ వుండును. పిలు నూనె/కొవ్వు లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు 20% వరకుండును.అందులో ఒలిక్ ఆమ్లం 18.0%వరకుండగా లినొలిక్ ఆమ్లం1.0-2.0% వరకుండును. |
|||
''' పిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం'''<ref name="pilu"/> |
''' పిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం'''<ref name="pilu"/> |
20:19, 28 అక్టోబరు 2013 నాటి కూర్పు
పిలు అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగు లో జలచెట్టు,వరగొగు అనిఆంటారు.ఈచెట్టుసాల్వడారేసికుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene); మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని టూత్బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు. పిలు/గున్నంగి/జలచెట్టు యొక్క ఆకులను,పళ్ళను,విత్తనాలను,చెట్టు బెరడును,మరియు బేరును ఆయూర్వేద మందులతయారిలో వాడెదరు[1] .
ఇతరభాషలలో ఈ చెట్టు పేరు[2][3]
- సంస్కృతం:Brihat Madhu,pilu, gudaphala(गुडफल)
- హిందీ:pilu(पिलु),मेस्वाक( meswak),jal
- తెలుగు:varagogu,జలచెట్టు,గున్నంగి
- కన్నడ:kake,Goni(గొని)
- తమిళం:kohu,ughai(యుగై)(உகா)
- గుజరాతి:khakan
- మరాఠి=khakan, पिलु( pilu )
ఉనికి
ఇండియా :పంజాబు,ఉత్తరభారతంలో పొడిఇసుకనేలల్లొ(sandy areas)పెరుగును.చవిటిభూముల్లోకుడా పెరుగును,కాని పెరుగుదల సరిగా వుండక చెట్లుగిడసబారిపోతాయి.ముఖ్యంగా గుజరాత్,రాజస్తాన్,హర్యానా తీరప్రాంతంలో,మధ్య,ఉత్తరభారతంలోని నదీలోయప్రాంతాలలో పెరుగును[2].
విదేశాలు :అరేబియన్ దీపకల్పము(Arabian peninsula)ఆఫ్రికా,పశ్చిమఆసియా,పాకిస్తాన్, మరియుశ్రీలంక ఆసియా దేశాలు[4].
సాగుకు అనువైన రాష్ట్రాలు
గుజరాత్,పంజాబ్,రాజస్తాన్ రాష్ట్రాలు.
నూనె
Salvadora oleoides చెట్టువిత్తనాలు చిన్నవిగా,గట్టిగా,చేదుగా వుండటంవలన పైపొట్టును డికార్టికెటరుయంత్రాలద్వారా తొలగించడం కష్టమైనపని.salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు,మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు.పెర్సిక(persica) విత్తనాలు తియ్యగావుండి నూనెశాతంను కూడా 39% వరకు కలిగివుండును.ఒలియొడెస్(oleodes)గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును.కాయ\పండులో గింజశాతం 44-46% వరకుండును.గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును.S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్చేయుదురు.ఏడాదికి 50వేలటన్నుల గింజలనుసేకరించి,క్రషింగ్ చేయు అవకాశం వున్నది.ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
పిలునూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం ఎక్కువగా వుండటంవలన,సాధారణ,మరియు శీతలఉష్ణొగ్రత సమాయల్లో ఈనూనెగడ్డగట్టి వుండును.అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు(Fat)అనటం సబబు.
పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్(Menzyl isoythiocynate)వుండటంవలన ఘాటైనవాసన కల్గివుండును.రుచి కూడా వికారం పుట్తించునట్లుండును.నూనె ఆకుపచ్చఛాయకలిగిన పసుపురంగులో వుండును.నూనెను రిఫైండ్చేసినప్పుడు వెగటురుచి,ఘటైనవాసన రెండు తొలగింపబడుతాయి.
పిలుగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక[5]
భౌతిక లక్షణాలు | మితి |
వక్రీభవన సూచిక 400Cవద్ద | 1.440-1.450 |
ఐయోడిన్ విలువ | 10-15 |
సపనిఫికెసను విలువ | 245-255 |
అన్సఫొనిపియబుల్ పధార్దం | 1.0-1.5% గరిష్టం |
తేమశాతం | 1.0% గరిష్టం |
ద్రవీభవణ ఉష్ణోగ్రత | 30-320C |
polenske value,Min | 10 |
నూనెలు(Oils) :సాధారణఉష్ణోగ్రత వద్ద ఇవి ద్రవరూపంలో వుంటాయి.నూనెలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం సగంకన్న ఎక్కువవుండును.ద్రవీభవణ ఉష్ణొగ్రత/స్దానం(Melting point)తక్కువగా వుండును.
కొవ్వులు(Fats) :ఇవికూడా నూనెలే.కాని సంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలో సగంకన్న ఎక్కువవుంటాయి.అందుచే వీటిద్రవీభవణ స్దానం ఎక్కువగా వుండటంవలన సాధారణఉష్ణోగ్ర్తతవద్ద ఇవి ఘన,అర్దఘన రూపంలో వుండును. పిలు నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన లారిక్ మరియు మిరిస్టిక్,మరియు పామిటిక్ ఆమ్లాలు అధికంగా వుండును.10కార్బనులున్న కాప్రిక్ సంతృప్త కొవ్వు ఆమ్లం 2.0%లేదా అంతకన్న తక్కువ వుండును. పిలు నూనె/కొవ్వు లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు 20% వరకుండును.అందులో ఒలిక్ ఆమ్లం 18.0%వరకుండగా లినొలిక్ ఆమ్లం1.0-2.0% వరకుండును.
పిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం[5]
కొవ్వు ఆమ్లాలు | శాతం |
కాప్రిక్ ఆమ్లం(C10:0) | 1.0-1.05 |
లారిక్ ఆమ్లం(C12.0) | 19.0-47.0 |
మిరిస్టిక్ ఆమ్లం(C14:0) | 28.0-55.0 |
పామిటిక్ ఆమ్లం(C16:0) | 20% వరకు |
ఒలిక్ ఆమ్లం(C18:1) | 5.5-12.0 |
లినొలిక్ ఆమ్లం(C18:2) | 0.0-1.3 |
నూనె ఉపయోగాలు
- సబ్బుల తయారిలో వినియోగిస్తారు.
- కొవ్వొత్తుల తయారిలో వినియోగిస్తారు.
- ఔషద మందుల తయారిలో వాడెదరు.
ఇవికూడా చూడండి
మూలాలు/ఆధారాలు/ఉల్లేఖన
- ↑ http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3249923/
- ↑ 2.0 2.1 SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India
- ↑ http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html
- ↑ http://www.kew.org/plants-fungi/Salvadora-persica.htm
- ↑ 5.0 5.1 http://www.crirec.com/2011/01/pilu-khakan/