వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 336: పంక్తి 336:
:::రవి వైజాసత్య గారి బొమ్మతో సంచిక వెలువడటం హర్షణీయం. ఆయన సేవలకు ఇలాటివి ఎన్నో కావాలి. ఆయన బొమ్మ ప్రచురణకుగాను రవి గారి అనుమతి కొరకు అభ్యర్ధిస్తున్నాను..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 06:24, 16 నవంబర్ 2013 (UTC)
:::రవి వైజాసత్య గారి బొమ్మతో సంచిక వెలువడటం హర్షణీయం. ఆయన సేవలకు ఇలాటివి ఎన్నో కావాలి. ఆయన బొమ్మ ప్రచురణకుగాను రవి గారి అనుమతి కొరకు అభ్యర్ధిస్తున్నాను..[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 06:24, 16 నవంబర్ 2013 (UTC)
::వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
::వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
:::: అర్జునరావు గారు, రాజశేఖర్ గారు, సుజాతగారు, వైజాసత్యగారు, కాసుబాబు గార్ల పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను. (మరెందరో మహానుభావులను నేనెరుగక ప్రతిపాదించలేకపోయాను. క్షమించగలరు)
రాజశేఖర్ గారు చెప్పినట్లు, కొద్దిగా ప్రైజ్ మనీ కూడా ఉంటే బాగుంటుంది. నిర్ణయించే మొత్తంలొ పదవవంతు (అంటే, లక్ష రూపాయలకు గాను, 10,000/-) నేను స్పాన్సర్ చేయదలచాను.

13:31, 16 నవంబరు 2013 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..



<br=clear all>


వర్గాల నిర్వహణ

వాడుకరి:YVSREDDY వర్గాల నిర్వహణ పెద్ద పెట్టున చేస్తున్నందులకు వారికి ధన్యవాదాలు. ఈ దిశలో తోడ్పాటుగా వికీపీడియా:వర్గాల చర్చలు మనమందరము వాడవలసి వుంది. ఇప్పటికే చర్చలు మొదలైనవి కాబట్టి క్రియాశీల సభ్యులందరూ తమ స్పందనలు ప్రతిపాదనలపై వ్యాఖ్యానించవలసిందిగా మరియు ఈ పేజీని వీక్షణ జాబితా లో చేర్చుకుని గమనించవలసిందిగా కోరుతున్నాను. --అర్జున (చర్చ) 15:53, 16 అక్టోబర్ 2013 (UTC)

వికీపీడియా:వర్గాల చర్చలు#Category:జీవిస్తున్న ప్రజలు to Category:సజీవ వ్యక్తులు చర్చలో ఇప్పటివరకు ఆరుగురు స్పందించారు. రేపటి రోజున చర్చలో పాల్గొనని నిర్వాహకుడు/అధికారి చర్చా ఫలితాన్ని నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను.--అర్జున (చర్చ) 04:45, 23 అక్టోబర్ 2013 (UTC)

ఎక్కించే దస్త్రాలకు సరిపోయే లెసెన్స్ లను తాజాపరచుట

మన తెలుగులో లైసెన్స్ వివరాల చివరి మార్పు దాదాపు ఐదు సంవత్సరాల క్రితం జరిగింది. కామన్స్ లో ప్రముఖంగా వాడే CC-BY-SA 3.0 ప్రస్తుతము లేదు. CC-BY 3.0 మాత్రమే వుంది. దానిని చేర్చుటకు మరల ఆంగ్లంలో చేర్చిన మరిన్ని వివరాలు చేర్చవలసివుంది. మీడియావికీ_చర్చ:Licenses#లైసెన్స్ వివరాలు తాజాపరచుట వద్ద మీ అభిప్రాయాలు తెలియచేయండి.--అర్జున (చర్చ) 05:01, 18 అక్టోబర్ 2013 (UTC)

పేజి పేరు మార్పులు

పేజీ పేరు మార్చవలసిన పద్ధతులు తెలియజేయండి. వికీపీడియా:శైలి నుంచి

  • ము తో అంతమయ్యే పదాల విషయంలో ము స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ప్రపంచము, అంధకారము, అనికాక ప్రపంచం, అంధకారం అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి.
పై వాక్యాన్ని బట్టి "ప్రపంచము" అనే పదాన్ని "ప్రపంచం" అని పేజీ పేరుగా ఉపయోగించాలా లేక పేజీలోని సమాచారంలోనా?
  • పొడి అక్షరాలు రాసేటపుడు ఇలా రాయాలి:
ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)
పై వాక్యాన్ని బట్టి అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకుండా పేజీ పేరులో ఉపయోగించాలా లేక పేజీలోని సమాచారంలోనా?
YVSREDDY గారి సందేహాన్ని చర్చకు పెట్టినందులకు ధన్యవాదాలు. వ్యాసం పేర్లు, వర్గాల పేర్లు విధానాలు వున్నాయి. శైలి నియమాలు అంత ఖచ్చితంగా పాటించి వుండకపోవొచ్చు. ఉదా:వర్గాలపేర్లు ఏకవచనంలో వుండాలని వుంది. మనం చాలా వర్గాలలో బహువచనంలో వుండటం చూడవచ్చు. వీటిలో కొన్నిటిలో దోషాలు వుండవచ్చు. మామూలుగా శైలి సూచనలు ప్రత్యేక సందర్భాలకు ప్రత్యేక పద్ధతులు లేని చోట్ల వర్తిస్తాయి. దీనిపై దృష్టిపెట్టే ఇద్దరు ముగ్గురు వికీపీడియన్లుంటే మన వ్యాసాల నాణ్యత మెరుగుపరచవచ్చు. ఇదేవిషయమై తెవికీ మహోత్సవంలో ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ ఎడిటర్ జగన్ వ్యాఖ్యానించారు కాబట్టి తెవికీలో నాణ్యత మెరుగుపరచటానికి ఇదిప్రాధాన్యకరమైన విషయం. ప్రతీ తెలుగుపత్రికకి శైలి పుస్తకం వుంటుంది. వాటిని వాడుకొని చర్చించి మనం వికీశైలిని మెరుగుపరచుకోవాలి మరియు వున్న నియమాలకు అనుగుణంగా మార్పులు చేయాలి. --అర్జున (చర్చ) 11:55, 18 అక్టోబర్ 2013 (UTC)
నలుపు మరియు తెలుపు గురించి చర్చ:నలుపు-తెలుపు ఛాయాచిత్రకళ లో రాశాను. --అర్జున (చర్చ) 12:02, 18 అక్టోబర్ 2013 (UTC)
చక్కని చర్చ ప్రారంభించారు. ప్రపంచం అన్నది అన్ని చోట్ల (వ్యాసంలోనూ, వ్యాసం పేర్లలోనూ). కానీ "నా ప్రపంచము" అనే ఒక పుస్తకం గురించిన వ్యాసం వ్రాస్తున్నారనుకొండి. దానికి "నా ప్రపంచం" అన్న పేరు పెట్టకూడదు. అలాగే పొడి అక్షరాల మధ్యన చుక్క విషయంలో కూడాను. ఆంగ్లంలో నిర్ధిష్టమైన style guides ఉంటాయి. వాళ్ళ శైలిలో N. T. Rama Rao అని వ్రాయాలి. కానీ ఈ విరామ చిహ్నాలనేవి మనం ఇటీవల అరువు తెచ్చుకున్న సాంప్రదాయం. పుల్‌స్టాప్ పెట్టడమే మనకు విరామమైతే మళ్ళీ ఖాళీ అక్కరలేదని అభిప్రాయం. అసలు పొడి అక్షరాలే మన భాషకు మరోవింత సంకర సాంప్రదాయం. నిజానికి తెలుగు పొడి అక్షరాల్లో నం.తా.రామారావు అని వ్రాయాలి లేకపోతే పాత సినిమాల టైటిల్లలో ఉపయోగించినట్టు N. T. రామారావు అని వ్రాయాలి. కానీ ఏదో సంకర పద్ధతి వలన ఎన్.టి.రామారావు అని వ్రాసే వింత పద్ధతి స్థిరపడింది. చాలా విషయాల్లో తెలుగు భాషకు ఒక ప్రామాణికమైన శైలి మాన్యువల్ అంటూ లేదు. తెవికీ, వికీ పరిధిని దాటి వ్యవహరించాలని నేను భావించే విషయాల్లో ఇది ఒకటి. సాధారణంగా వికీ పదాలను సృష్టించడం కానీ, భాషను ప్రభావితం చేయడంకానీ చేయకూడదు. కానీ మనకు తప్పేట్టు లేదు. --వైజాసత్య (చర్చ) 08:58, 20 అక్టోబర్ 2013 (UTC)
"పుల్‌స్టాప్ పెట్టడమే మనకు విరామమైతే మళ్ళీ ఖాళీ అక్కరలేదని అభిప్రాయం"కు నేనూ మద్దతు పలుకుతాను. కొన్నాళ్ళ క్రితం పాలమూరులో ఇదే విషయమై కొందరిమధ్య చర్చ జరిగింది. విరామంచిహ్నం తర్వాత ఖాళీ అనేది వాక్యం చివరన మాత్రమే పెట్టాలనీ, అలా ఖాళీ ఉన్నప్పుడు ఉచ్ఛారించేటప్పుడు కొద్దిగా ఆగాలని భాషావేత్తలు అభిప్రాయపడ్డారు. కాని ఆంగ్లంలో మాత్రం N. T. అంటూ ఖాళీలతో వ్రాస్తూ ఆగకుండా ఉచ్ఛారిస్తున్నాం. ఆంగ్లబాష నియమాలు మనకెందుకుకాని, అక్కడి పద్దతి చూసి తెలుగులో కూడా పేర్లలో విరామచిహ్నం అనంతరం ఖాళీ ఉండాలని తెవికీలో ఇదివరకు ఒక సభ్యుడు ప్రతిపాదించాడు. కాని తెలుగులో దీనికి సంబంధించి ఏమైనా నిర్దిష్ట పద్దతులున్నాయా అనేది తెలియదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 10:19, 20 అక్టోబర్ 2013 (UTC)

వర్గీకరణలు

ఈ మధ్య బాటు చేయవలసిన పనులు తెవికీలో వేల సంఖ్యలో జరుగుతున్నవి. ఈ దిద్దుబాట్లు సునాయాసంగా చేయవచ్చునని ఏదైనా వ్యాసం వ్రాసినా, శుద్ధి చేసినా ఎంతో శ్రమపడవలసి వస్తుందని సదరు సభ్యుల మనోగతం అయినట్లుంది! తెవికీ లో దిద్దిబాట్లు సంఖ్య తో సభ్యుల ర్యాంకులు నిర్ణయించుట వల్ల కొందరు సభ్యులు గణనీయంగా సులువుగా ఉండే దిద్దుబాట్లు (అలాగని సహేతుకమైన చిన్న దిద్దుబాట్లు అనికాదు) అధికంగా చేయుచున్నారని విశదమవుతున్నది. బాటు చేయవలసిన ఒకే విధమైన సునాయాస దిద్దుబాట్లపై శ్రద్ధ అధికంగా కనబరచుట జరుగుతున్నది. ఈ మధ్య కొత్త వ్యాసాలు గానీ మొలక దాటిన వ్యాసాలు గానీ అధిక శాతం తెవికీ కి రావడం లేదు. కాపీ వ్యాసాలు , మొలకలు మరియు బాటుచేయవలసిన సునాయాస పనులు అధికంగా చేరుతున్నాయి. విశేష వ్యాసాలు రావటం లేదు. ఒక వ్యాసం వ్రాయాలన్నా, అనువాదం చేయాలన్నా ఎంతో శ్రమపడవలసి వస్తుంది. అంత శ్రమపడి కొందరు సభ్యులు కృషిచేస్తే కొందరు సులువుగా కష్టపడకుండా సునాయాసంగా బాటుచేయవలసిన పనులు చేసి దిద్దిబాట్లు సంఖ్యను పెంచుకొనుట కొరకు చేయుట శోచనీయం. యిలా చేయడం వల్ల కష్టపడి వ్యాసాలు వ్రాసేవారు అనాశక్తత చూపించే అవకాశం అధికంగా ఉన్నది.

వర్గాల విషయానికొస్తే "1520 జననాలు" "1520 మరణాలు" వర్గాలను "1520" వర్గంలో ఉంచారు. "1520" వర్గాన్ని "1520లు" లో ఉంచారు. బాగుంది. కానీ మరల వేల సంఖ్యలో ఉన్న "1520 జననాలు" "1520 మరణాలు" వంటి జనన మరణ వర్గాలను "1520లు" వంటి వర్గాలో చేర్చడంలో అర్థం ఏముంది? ఈ విషయాన్ని రెడ్డిగారికి విన్నవిస్తే వారు " "1520 జననాలు" "1520 మరణాలు" వర్గాలను "1520" వర్గంలో ఉంచినా, "1520" వర్గాన్ని "1520లు" లో ఉంచినా, "1520లు" వర్గంలో "1520 జననాలు" "1520 మరణాలు" ప్రత్యేకంగా కనిపించవు, అందువలన ఇవి ప్రత్యేకంగా కనిపించేందుకు "1520 జననాలు" "1520 మరణాలు" వంటి జనన మరణ వర్గాలను 1520లు వంటి వర్గాలలో చేర్చడమే అర్థం." అని సమాధానమిచ్చారు. ఉపవర్గంలో ఉన్న విషయాలను మనకు కనబడకుండా ఉన్నాయని మరల వర్గాలలో చేర్చితే వర్గీకరణ అనిపించుకుంటుందా? మరల రెడ్డిగారు "1030 మరణాలు" "1030 జననాలు" వంటి వర్గాలను యిదివరకు "1030" లో ఉంచినప్పటికీ మరల యిపుడు వాటిని "1030లు మరణాలు" అనే కొత్తవర్గాలను సృష్టించి వాటిలో చేర్చుటకు సన్నద్ధులయ్యారు. యిలా జనన మరణ వర్గాలకే కొన్ని వేల వర్గాలను సృష్టించుటకు ఉపక్రమించుట సరియైనదేనా? విజ్ఞులు ఆలోచించ మనవి.----K.Venkataramana (talk) 05:59, 22 అక్టోబర్ 2013 (UTC)

రెడ్డిగారు చేస్తున్న పని వృధాప్రయాస తప్ప మరేమీ కాదు. వారికి ఎన్నివిధాల చెబుతున్నా సమస్యను అర్ధం చేసుకొవడం లేదు. ఈ దశాబ్దాల జనన మరణ వర్గాలు అనవసం అని నా అభిప్రాయం. రెడ్డిగారు దీన్ని తప్పుగా భావించకుండా ఇక్కడితో ఆపి; చేసిన మార్పుల్ని తొలగించడం మంచిది.Rajasekhar1961 (చర్చ) 06:09, 22 అక్టోబర్ 2013 (UTC)
ఈ సమస్య ఉత్పన్నమవడానికి కారణం ప్రోత్సాహం. మీ దిద్దుబాటులు వేలు దాటాయి కనుక పతకం అందుకొమ్మనో, అభినందనలు అందుకొమ్మనో సభ్యులు ప్రోత్సహించినంతకాలం అది అలా జరుగుతూనే ఉంటుంది. వారిపై నిర్వహణపరంగా చర్యలు తీసుకోవాలనుకున్నా వారిని సమర్ధించే గుంపులు వెలుగుచూసే అవకాశం ఉన్నది (కొండకచో ఎదురుదాడి కూడా జరగవచ్చు). రెడ్డిగారు చాలా సమయం కేటాయించి తెవికీలో ఉత్సాహంగా కృషిచేస్తున్నారు కనుక ఆయన మార్పులను స్వాగతించడం మంచిది...విశ్వనాధ్ (చర్చ) 07:38, 22 అక్టోబర్ 2013 (UTC)
రమణ గారూ, మీ ప్రతిపాదనలు సమంజసంగానే ఉన్నాయి. దాదాపు నెలరోజుల నుంచి ఇలాంటి దిద్దుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వారిపై నిర్వహణాపరమైన చర్యలు ప్రజాస్వామ్యయుతంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు ఈ సభ్యునిపైనే కొందరు తీసుకున్న అప్రజాస్వామ్య మరియు ఏకపక్ష చర్యలవల్ల విమర్శలు వచ్చాయి. తెవికీలో ఏ చర్య తీసుకోవాలన్ననూ నియమాలు లేదా ప్రజాస్వామ్యపద్దతిలో క్రమానుగతంగా చర్యలు తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు. ఇదివరకే ఆ సభ్యునికి దిద్దుబాట్ల ఇబ్బందుల గురించి తెలియజేశారు కాబట్టి ఇక హెచ్చరిక పంపండి, అలాంటి హెచ్చరికనూ పట్టింకోనప్పుడూ మరో రెండుసార్లు అవకాశం ఇచ్చి చివరకు నిషేధం ఎందుకు విధించరాదో అని తెలుపుతూ హెచ్చరించండి. అప్పుడూ ఆ సభ్యునిలో ఎలాంటి మార్పులు లేనప్పుడు ఇతర సభ్యుల సహకారంతో పరిమితకాలపు నిషేధం విధించవచ్చు. ఆ నిషేధం అనంతరం కూడా ధోరణి మార్చుకోనప్పుడు నిషేధం కాలపరిమితి పెంచవచ్చు. చర్చ జరిగే సమయంలో మాత్రం దిద్దుబాట్లు నిబంధనలకు విరుద్ధంగా లేదా దుశ్చర్యలు అనిపిస్తే తప్ప మీరు నిర్వాహకహోదాను దుర్వినియోగపర్చకండి (అంటే దిద్దుబాట్లు వెనక్కి చేయడం, వ్యాసాలు/వర్గాలు తొలిగించడం, సభ్యునిపై చర్చలు తీసుకోవడం లాంటివి). మరోమార్గం ఏమిటంటే సభ్యునిపై తగు చర్యలకై రచ్చబండలోనే ప్రతిపాదించవచ్చు. సభ్యుల నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:02, 22 అక్టోబర్ 2013 (UTC)
ఈ సభ్యునిపై ఏకపక్ష చర్యలు కాని అప్రజాస్వామ్యపద్దతిలో కాని తీసుకొనబడలేదు. సభ్యుని వ్యాసాలను విలీనం చేసిన క్రమంలో, తొలగించిన వ్యాసాలను మళ్ళీ మళ్ళీ సృష్టించడం వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకొని ఏకవచన ప్రయోగం చేయడం వలన వచ్చిన పరిణామాల ద్వారా వచ్చినవి. ఇదే సభ్యుని గురించి చాలా విషయాలలో చర్చనడిచినా ఇప్పటికీ దేని విషయంలోనూ క్లారిటీ లేకపోవుటకు కారణం ఆ యొక్క ప్రహసనం మాత్రమే. కనుక చర్యలు తీసుకొనే ఆలోచన కంటే కొంత సమయం వేచి చూడడం, నచ్చచెప్పే ప్రయత్నం చేయడం వలన ఉత్సాహం కలిగిన సభ్యుని నుంచి మంచి వ్యాసాలు, దిద్దుబాట్లు వచ్చే అవకాశం ఉన్నది...విశ్వనాధ్ (చర్చ) 14:13, 22 అక్టోబర్ 2013 (UTC)

తెవికీ నిర్వహణ బ్లాగు

తెలుగు వికీపీడియాకు సంబంధించి కొత్తవారిచే రచనలు చేయించడం, వర్గాలు- లింకులు- బొమ్మలు- మూలాలు- మూసలు తదితరాలు ఉపయోగించడం, నిర్వహణ స్థాయిని మెరుగుపర్చడం, సభ్యుల సందేహాలు ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకొని కొత్తకొత్త విషయాలను వివరించడం, తెవికీ సభ్యులకే కాకుండా తెలుగుబ్లాగు లోకానికికూడా తెవికీ గురించి పరిచయం చేసి వారిని ఈవైపు దృష్టిసారించేటట్లు చేయడం, తెవికీని ప్రచారం చేయడం, తెవికీలో వ్రాయడం వల్ల వచ్చే ప్రయోజనాలను కొత్తవారికి వివరించడం ... ఇలా ఒకటేమిటి, బహుళప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బ్లాగు ప్రారంభించాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెవికీ నిర్వహణ బ్లాగును ఒక చిన్న సమాచారంతో ఈ రోజు ప్రారంభించానని చెప్పుటకు సంతోషిస్తున్నాను. మరికొన్ని రోజులలో దీన్ని మరింతగా విస్తరించి అందరికీ అన్ని విషయాలలో ప్రయోజనం కలుగునట్లు చేయడమే కాకుండా ఒక్కో సభ్యునిపై కూడా విశ్లేషణాత్మక సమాచారం, నెలవారీగా తెవికీ అభివృద్ధిపై వ్యాసాలు, నిర్వహణపై కూడా పరిశీలనాత్మక సమాచారం చేర్చుటకు నా వంతుగా ప్రయత్నిస్తాను. ఇలా చేయడం వల్ల తెవికీని గుణాత్మకంగానూ మెరుగుపర్చడానికి పరోక్షంగా తోడ్పడినట్లవుతుందని భావిస్తున్నాను. తెవికీ అభివృద్ధికి నిజమైన కృషిచేసేవారిని ప్రాత్సాహంచడం, అలాంటివారికి ప్రచారం ద్వారా పేరు వచ్చేటట్లు చేయడం కూడా నా లక్ష్యంలో భాగము. ఈబ్లాగును పలు అగ్రిగేటర్లలో చేర్చడం వల్ల ప్రచారం మరింత సులువవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:38, 22 అక్టోబర్ 2013 (UTC)

  • అభినందనలు..... చంద్రకాంతరావు గారూ... మంచి విషయాన్ని సరైన సమయంలో ప్రారంభించారు... అభినందనలు అందుకోండి. అహ్మద్ నిసార్ (చర్చ) 03:48, 23 అక్టోబర్ 2013 (UTC)
  • శుభాకాంక్షలు జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:59, 23 అక్టోబర్ 2013 (UTC)
  • అభినందనలు--K.Venkataramana (talk) 04:08, 23 అక్టోబర్ 2013 (UTC)
  • చాలా బాగుంది.సభ్యులకు చాలా ఉపకరమైన సమాచారం అందించె ప్రయత్నం.అబినందనాలు.పాలగిరి (చర్చ) 04:11, 23 అక్టోబర్ 2013 (UTC)
  • చంద్రకాంతరావుగారూ ! బ్లాగు చాలా బాగుంది. అనుభవం ఉన్న వికీపీడియన్లకు కూడా ఇది ఉపకరిస్తుంది. ఇలాంటి వివరణలు వికీపీడియాను చక్కగా అవగాహన చేసుకున్న మీలాంటి వారే ఇవ్వగలరు. ఈ బ్లాగు వలన మరిన్ని ఉపయోగాలు ఉంటాయి. తెవికీ ప్రచారానికి, కొత్తవారికి తెవికీ గురించిన అవగాహన కలిగించడానికి ఈ బ్లాగు ఉపకరించగలదు. ఇలాంటి బ్లాగును ప్రారంభించినందుకు ధన్యవాదాలు. తెవికీలో చురుకుగా పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. సహసభ్యులకు మీ సహకారం అందిస్తూ తెవికీలో నిరంతరంగా పాల్గొంటారని ఆశిస్తున్నాను. --t.sujatha (చర్చ) 04:29, 23 అక్టోబర్ 2013 (UTC)
  • సభ్యుడు:C.Chandra Kanth Rao గారు తెవికీకైప్రత్యేకించి బ్లాగు ప్రారంభించినందులకు సంతోషం. ప్రస్తుతం వికీపీడియా:తెవికీ వార్త లేని లోటు తీర్చడంతోపాటు, మీ బ్లాగు అభివృద్ధిచెందుతూ తెవికీఅభివృద్ధికి సహకరిస్తుందని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 04:37, 23 అక్టోబర్ 2013 (UTC)
  • చాలా మంచి ఆలోచన. ఇందులో కూడా మనమందరం వికీపీడియన్లు కాని బ్లాగర్లను ప్రోత్సహించడానికి తెవికీలోని మంచి వ్యాసాల గురించి మన ప్రాజెక్టుల గురించి తెలియజేయవచ్చును.Rajasekhar1961 (చర్చ) 05:05, 23 అక్టోబర్ 2013 (UTC)
  • వికీలో బ్లాగర్లకృషి నెమ్మదించిన తరుణంలో తెలుగు బ్లాగర్లను కలుపుకునేటందుకు మంచి ఆలోచన, చంద్రకాంతరావుగార్కి అభినందనలు..విశ్వనాధ్ (చర్చ) 05:36, 23 అక్టోబర్ 2013 (UTC)
స్పందించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు. తెవికీ ప్రారంభమై పది సంవత్సరాలు కావస్తున్ననూ పట్టుమని పదిమంది చురుకైన సభ్యులు కూడా లేకపోవడం, ఉన్న చురుకైన సభ్యుల మధ్యన ఏమిచేయాలన్ననూ సరైన సహకారం అందకపోవడం, ఏ నిర్ణయం తీసుకోవాలన్ననూ పూర్తిఫలితం ఇవ్వకపోవడం, చర్చలు ఎన్ని జరిగిననూ తుదినిర్ణయానికి అవకాశం లేకపోవడం, కొందరు సభ్యులకు నియమాలపై పూర్తిపట్టు లేకపోవడం, "స్వేచ్ఛా" విజ్ఞానసర్వస్వం అంటే ప్రతి ఒక్కరు ఏమైనా దిద్దుబాట్లు చేయవచ్చనే "స్వేచ్ఛ" ఉన్నట్లుగా కొందరు ఆలోచించడం తదితర కారణాలతో, తెవికీని ప్రస్తుతమున్న "దశ" నుంచి బయటపడేటట్లు చేయడమే కాకుండా కొత్తవారికి తెవికీ రచనాతీర్థం పుచ్చుకొనేటట్లు చేయడం గురించి ఆలోచించి ఈ దిశగా చేయబోయే ఒక చిన్న ప్రయత్నమే ఈ బ్లాగు ఆవిష్కరణ. ఇదివరకు ఇలా బ్లాగులు ప్రారంభించినవారు ఉండవచ్చు కాని ఈ బ్లాగులో మాత్రం ఏదో రెండువ్యాసాలు వ్రాసి మూతపడేటట్లు చేయడం మాత్రం నా ఉద్దేశ్యం కాదు. సాధ్యమైనంతవరకు తెవికీకి సమాంతరంగా ఉంటూ తెవికీ బయటా సభ్యులను ఆకర్షించడం, ఇక్కడి వ్యాసాలు, కృషిచేసే సభ్యుల గురించి తెలుగువారికి తెలియపర్చడం దీని లక్ష్యంగా పెట్టుకున్నాను. తెవికీలో ఎన్ని వ్యాసాలున్ననూ, మనం ఎంత కృషిచేస్తున్ననూ అది పదిమందికి ప్రయోజనం కలిగించాలంటే బలమైన తెలుగు బ్లాగులోకానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనాఉంది. అసలు తెలుగు వికీపీడియా అంటే చూడడం మాత్రమే అనుకుంటారు చాలా మంది. రోజూ ఎందరెందరో సభ్యత్వం తీసుకుంటున్ననూ ఒక్క దిద్దుబాట్లు కూడా చేయకపోవడానికి కారణం ఏమిటి? దీనిపైనా పరిశోధన చేయాలి, వారిచే దిద్దుబాట్లు చేయించాలి. పూర్తి లక్ష్యం నెరవేరడానికి కొంత సమయం పట్టవచ్చు, వెనువెంటనే ఫలితాల గురించి ఆశపడక లక్ష్యమే మనల్ని వెదుక్కుంటూ వచ్చేవరకు మన పని మనం చేద్దాం. ఈవిషయంలో సభ్యుల సలహాలు, సూచనలకు తప్పకుండా విలువ ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:39, 23 అక్టోబర్ 2013 (UTC)
వాడుకరి:C.Chandra Kanth Rao గారు ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఉడతాభక్తిగా, మీరు వ్రాసిన బ్లాగులను తెవికీ ఫేస్ బుక్ గుంపు మరియు ట్విటర్ ద్వారా వీలయినంత ఎక్కువమందికి తెలియజేయడానికి నా వంతు ప్రయత్నిస్తాను.--విష్ణు (చర్చ)18:43, 24 అక్టోబర్ 2013 (UTC)
అవునండి విష్ణుగారు, తెవికీలో రచనలు చేయడం కంటే ఈ పని కష్టమైనదే. ఎంత ఆలోచించి వ్రాసిననూ పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. మూలాల పాఠం చూసి శ్రీరామమూర్తిగారు ఇప్పుడు మూలాలను సరిగ్గా చేర్చుతున్నందుకు సంతోషమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:56, 25 అక్టోబర్ 2013 (UTC)
శెభాష్, చక్కని ప్రయత్నం. శెభాష్ అని చప్పట్లు కొట్టే బొమ్మ ఏదైనా వికీలో కనిపిస్తుందేమోనని చూశా, కానీ సరైనవి కనిపించలేదు --వైజాసత్య (చర్చ) 05:45, 27 అక్టోబర్ 2013 (UTC)
వైజాసత్యగారి వ్యాఖ్యకు కృతజ్ఞతలు. అలాగే విష్ణుగారు ఫేస్‌బుక్‌ ద్వారా బ్లాగును పరిచయం చేసినందుకు (ఎక్కడ అనేది తెలియదు కాని ఫేస్‌బుక్ నుంచి హిట్లు మాత్రం వస్తున్నాయి) ధన్యవాదాలు. ఫేస్‌బుక్‌లో నేను తెవికీ పేజీని కూడా ప్రారంభించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:11, 27 అక్టోబర్ 2013 (UTC)
ఇప్పటికే ఫేస్‌బుక్‌లో తెలుగు వికీ పేరుతో తెవికీ పేజీ ఉన్నది. దీనితో రెండు అవుతాయి..(https://www.facebook.com/groups/560945180622204/)...విశ్వనాధ్ (చర్చ) 03:37, 29 అక్టోబర్ 2013 (UTC)
నాకు దాని గురించి ముందే తెలియదు. అయినా సరే అది గ్రూపు, ఇది పేజీ. రెండూ సందర్భానుసారంగా ప్రచారానికి పనికివస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:48, 29 అక్టోబర్ 2013 (UTC)
నాకు తెలిసి తొలి పేస్బుక్ పేజీ ని 2012 లక్ష్యాలలో భాగంగా (మొదటి పోస్ట్ ఫిభ్రవరి 6, 2012 ప్రారంభించాము. అంతకు ముందు సంవత్సరంలోతొలి ఫేస్బుక్ గ్రూప్ (మొదటి పోస్ట్ అక్టోబర్ 22, 2010) వాడాము. వీటిని స్వాగత మూసలద్వారా తెలియచేశాము. నా అనుభవంలో సోషల్ మీడియా తెవికీ ప్రాచుర్యాన్ని పెంచడానికి అంత ఉపయోగపడలేదు. ప్రస్తుత ప్రయత్నాలు ఫలించాలని కోరిక--అర్జున (చర్చ) 05:07, 31 అక్టోబర్ 2013 (UTC)

ఐ.పి.నెంబరు తో ఇబ్బంది.

నా కంప్యూటరు సిస్టంలో BSNl Local area connection status నా ఐ.పి.నెంబరు 192.168.1.2 గా చూపిస్తున్నది.తెవికిలో ఈ రోజు నేను లాగిన్ అవ్వకుండ ఎంట్రి అయ్యి దిద్దుబాటుచేసి చూస్తే నా ఐ.పి.నెంబరును 117.200.27.128 గా చూపిస్తున్నది.ఇంకను పాత ఐ.పి.నే ఎందుకు చూపిస్తున్నది.దీని వలన ఈ సంవత్సరం రెండుసార్లు ఇబ్బంది పడ్డాను.కారణం వేరే ఎవ్వరో అజ్ఞాతసభ్యుడు 117 నెం మీ దుశ్చర్యలు చేయ్యగా,దానిని వికిమెట వాళ్ళు బ్లాక్ చేసిన, నా ఎడిట్ పేజిబ్లాకు కూడా అవ్వుతున్నది.మళ్ళి నేను వారి దృష్టికి తీసికెళ్ళడం,వాళ్ళు మీఅకౌంటుకాదండి,ఐ.పి.ని బ్లాకు చేశామంటుమళ్ళి పునరుద్దరించడం జరిగినది.ఈ ఐ.పి.గోలకు శాశ్విత పరిష్కరం ఎవ్వరైన చెప్పగలరా?పాలగిరి (చర్చ) 04:25, 24 అక్టోబర్ 2013 (UTC)

  • మీ దగ్గరున్న బిఎస్ఎన్ఎల్ రూటర్ మీ కంప్యూటరుకు స్థానికంగా కేటాయించే ఐపి మీరు చెప్పిన మొదటిది. ఇది సాధారణంగా మారదు. మీరు అంతర్జాలంలో వాడేటప్పుడు మీ బిఎస్ఎన్ఎల్ ఒకతాత్కాలిక ఐపిని కేటాయిస్తుంది. అదే రెండవది. బిఎస్ఎన్ఎల్ కి కేటాయించబడిన సమూహ IP లలో ఏదో ఒకటి మీకు కేటాయించబడుతుంది. సాధారణంగా IP నిరోధాలు అనామక ఎడిటర్లకు మాత్రమే వర్తిస్తాయి. మీకు ఇబ్బంది కలుగుతుంటే ఏ వికీనుండి నిరోధం చేశారో ఆ వికీలోనే శాశ్వత పరిష్కారం కొరకు ప్రయత్నించండి--అర్జున (చర్చ) 06:58, 24 అక్టోబర్ 2013 (UTC)
  • ఐ.పి.నెంబరుతో బ్లాక్ ఛేసినప్పుడు,ఆ ఐ.పి నెంబరుతో నిషేధం నేను ఎడిట్ చెయ్యటానికి ప్రయత్నంచేసినప్పుడు కన్పిసున్నది.నిషెధపుటలోసంప్రదించమని వున్నవ్యక్తితో ,నిషేధ పుటద్వారా మాత్రమే వ్రాతమూలకంగా వారిని సంప్రదించటం జరుగుతున్నది.నిషేధం తొలగించినతరువాత పుటతొలగింపటం వలన నేను చేసిన సంప్రదింపు వివరాలు కూడా తొలగిపోతున్నాయి.నా చర్చపుటలో నమోదు కావటంలేదు.అందులో ఆవ్యక్తి వివరాలు తెలియటంలేదు మరల సంప్రదించుటకై.పాలగిరి (చర్చ) 07:46, 24 అక్టోబర్ 2013 (UTC)
  • ఆంగ్ల వికీ లో తెలిపినట్లు మీరు నిరోధం సడలింపుకై ప్రయత్నించవచ్చు. లేక మీరు నిర్వాహకునిగా మారితే సమస్య తొలగిపోవొచ్చు. --అర్జున (చర్చ) 07:56, 24 అక్టోబర్ 2013 (UTC)

2013 మూడవ త్రైమాసికంలో తెలుగు వికీ మార్పులు ఆంగ్లేతర భారతీయభాషలన్నిటిలో ప్రధమ స్ధానంలో

దేశాలవారీగా మార్పుల గణాంకాల లింకు ప్రకారం తెలుగువికీమార్పులు (7.4%)తో గణనీయంగా పెరిగి మొట్టమొదటిసారిగా 2013మూడవ త్రైమాసికంలో భారతీయభాషలలో అగ్రస్థానంలోకి వచ్చాయి. పూర్తి వివరాలు విశ్లేషించడానికి సెప్టెంబరు గణాంకాలు ఇంకా అందుబాటు లోకి రాకపోయినా, ఇప్పటి వరకు నేను గమనించిన మార్పులను బట్టి ఈ కృషికి రాజశేఖర్ గారి నేతృత్వములో చేపట్టిన ప్రాజెక్టులు, సహకరించి విస్తారంగా కృషిచేసిన సహ సభ్యులు భాస్కర్నాయుడు, వెంకటరమణ, ప్రణయరాజ్, విష్ణు ఇంతేగాక గ్రామాలవ్యాసాలలో విశేషంగా కృషిచేసిన శ్రీరామమూర్తి, వికీని శుద్ధిచేయటానికి విశేషంగా కృషి చేసిన వెంకటరమణ, వైవిఎస్ రెడ్డి, వికీసోర్స్ లో జానపదకళారూపాలు ప్రాజెక్టుని నిర్వహించిన భాస్కరనాయుడు, భాగవతం ప్రాజెక్టుకి కృషి చేసిన రాజశేఖర్ గారు, వీటితో పాటు కొత్తగా చేరిన సభ్యులకు సూచనలు అందజేసిన అనుభవజ్ఞులైన సభ్యుల వైజాసత్య, చంద్రకాంతరావు, సుజాత మరియు సిఐఎస్-ఎ2 కె ప్రాజెక్టు తరపున సహాయమందించడమే కాకుండా సహసభ్యునిగా వికీఅభివృద్ధికి కృషి చేస్తున్న విష్ణులతో పాటు వికీ అభివృద్ధికి మనందరి కృషి చాలావరకు కారణమనుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా కృషిచేసిన వారి పేర్లేవైనా పేర్కొనకుండినట్లయితే క్షమించండి మరియు స్పందన ద్వారా తెలియచేయండి. అందరికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 09:53, 24 అక్టోబర్ 2013 (UTC)

  • ఈ రికార్డుకి కారణభూతులైన అందరికీ ధన్యవాదాలు! అలాగే గత ఐదు నెలలో, ప్రతి నెలా 25, 100, 250 మరియు 1000 దిద్దుబాట్లు చేసిన సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెవికీ పుట్టినప్పటినుండి చూస్తే కూడా మనకు ఇలాంటి రికార్డ్ కనిపించదు . దిద్దుబాట్లే కాకుండా, నన్ను చాలా సంతోషపెట్టిన విషయం ఎమిటంటే మనలో కొందరు ప్రాజెక్టులలో సమిష్టిగా కృషి చేసాము. ఇక ముందు కూడా ఇలాగే మనం సమిష్టిగా కలిసి తెలుగు వికీని ముందుకు తీసుకువెలుదాం. రానున్న తెవికీ 10వ వార్షికోత్సవ సంబరాలలో అందరం కలుద్దాం, తెవికీ పురోగతిని మరింత వేగవంతం చేద్దాం. అర్జున గారు, ఈ మంచి వార్తను పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ... --విష్ణు (చర్చ)12:16, 24 అక్టోబర్ 2013 (UTC)
  • ఇది తెలుగు వికీపీడియాలో కృషిచేస్తున్న మనందరిదీ. ఇది మనం గర్వించదగ్గ విషయం. ఇంతవరకు పది సంవత్సరాలలో మనం మొదటిసారిగా ఈ స్థాయికి ఎదిగాము. గణాంకాలను చూచి మనకు తెలియజేసిన అర్జునరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మనవి ఒకటి వున్నది. ఈ ప్రగతిని ప్రతి త్రైమాసికంలో నిలుపుకోవాలంటే మనం కలిసి పనిచేయాలని మాత్రమే నేను చెప్పదలచుకున్నాను. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకొంటూ సమస్యలను అధిగమిస్తూ ముందుకు పోతూ వుంటే ఇలా ప్రతిసారి మనం మొదటిపంక్తిలో వుంటాము.Rajasekhar1961 (చర్చ) 12:23, 24 అక్టోబర్ 2013 (UTC)
  • ఈ విషయం చాలా సంతోషం కలిగించింది. ఇందులో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు. 100 ఎడిట్ల కన్నా ఎక్కువ చేసే వారి సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఆంగ్లంతో సరిసమానంగా మార్పులు జరిగే రోజు కోసం ఎదురుచూస్తాను. మరో వారం రోజులలో సెప్టెంబర్ గణాంకాలు మన వద్ద అందుబాటులో ఉండవచ్చు. సభ్యులందరికీ శుభాకాంక్షలు. రహ్మానుద్దీన్ (చర్చ) 12:28, 24 అక్టోబర్ 2013 (UTC)
  • తెవికీని అభివృద్ధి పథంలో నడిపి అందరూ గర్వించదగ్గ స్థాయికి తీసుకు వెళ్ళీన వారందరికీ ధన్యవాదాలు. ఈ ప్రగతి మనందరి సమిష్టి కృషి వల్ల సాధ్యమైంది. ప్రాజెక్టులను సమిష్టిగా సమన్వయంతో నిర్వహించి సభ్యులకు ప్రోత్సహించి వాటి అభివృద్ధికి కారణమైన రాజశేఖర్ మరియు విష్ణు లకు ధన్యవాదాలు. గ్రామ వ్యాసాలను విశేషంగా తీర్చిదిద్దుతున్న శ్రీరామమూర్తి గారికి, అక్షర దోషాలను సరిచేస్తూ శుద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్న కంపశాస్త్రి గారికి, విశేష వ్యాసాలు అందించిన సుజాత గార్కి ధన్యవాదాలు. అవిరళంగా కృషిచేస్తూ ఉన్న తెవికీ సభ్యులందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా యిదే నమన్వయంతో సమిష్టి కృషితో తెవికీని భారతీయ భాషలలో అత్యున్నత స్థాయిలో నిరంతరం నిలపడానికి మనందరం కృషిచేయాలి.----K.Venkataramana (talk) 13:13, 24 అక్టోబర్ 2013 (UTC)
  • ఇది నిజంగా మంచి విషయం. తెవికీని శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న సభ్యులందరికీ అభినందనలు. ఈ కృషి ఇలానే కొనసాగించి ఎప్పుడూ అదేస్థాయిలో వికీని నిలబెట్టాలి..విశ్వనాధ్ (చర్చ) 13:57, 24 అక్టోబర్ 2013 (UTC)
  • తెవికీ దిద్దుబాట్ల పురోగతి బాగుండటం శుభసూచకం. గతంతో పోలిస్తే దిద్దుబాట్ల సంఖ్య పెరగడం వాస్తవమే కాని నా పరిశీలన ప్రకారం చెప్పాలంటే పైన చెప్పిన 7.4% మార్పులు దిద్దుబాట్ల మార్పుల వృద్ధికాదు. ఈ శాతం భారతీయ భాషలలో అగ్రస్థానంలో ఉన్ననూ మన కన్నా తమిళవికీ వారు దిద్దుబాట్ల వృద్ధిలో ముందంజలో ఉన్నారు కాని వీక్షకుల సంఖ్య అక్కడ అధికంగా ఉండుట వల్ల వారి శాతం తగ్గింది. 3వ త్రైమాసికంలో మనవీక్షకులు 8 వేలు ఉండగా, తమిళవికీ వీక్షకులు 21.9 వేలున్నారు. త్రైమాసికంలోని తొలి రెండుమాసాలలో మన దిద్దుబాట్లు 13.6 వేలుండగా, తమిళవికీ దిద్దుబాట్లు 29 వేలున్నాయి. మరి ఆ 7.4% ఎలా వచ్చిందీ అంటే - అది దేశం మొత్తంలో వీక్షకుల సంఖ్యకు, దేశం మొత్తంలో జరిగిన దిద్దిబాట్ల సంఖ్యకు నిష్పత్తి మాత్రమే. ఆ 7.4% అనేది దేశంలోని అన్ని వికీల నిషత్తిలో మన వాటా మాత్రమే కాని పెరుగుదల శాతం కాదు. అలా అయితే ఆంగ్లవికీ 75%పైగా పెరుగుదల సాధించడం అసంభవమే కదా! (ఏదేని త్రైమాసికానికి సంబంధించి అన్ని వికీల మొత్తం చూడండి 100% ఖచ్చితంగా సరిపోతుంది, అంటే దేశంలో అన్ని వికీలు కలిపి వృద్ధి ప్రతి త్రైమాసికానికి రెట్టింపు అవుతుందని కాదు కదా!) హిందీ వికీలో దిద్దుబాట్లు దాదాపు మనకు సమానంగా ఉన్ననూ వీక్షకుల సంఖ్య మనకన్నా 4 రెట్లకు పైగా అధికంగా ఉండటంతో మనతోపోలిస్తే వారి వాటా 4వ వంతే ఉంది. మనకు కనీసం ఈ వాటా అయినా పెరిగినందుకు సంతోషమే. నిజమైన పెరుగుదలకు కూడా కృషిచేద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:39, 24 అక్టోబర్ 2013 (UTC)
  • నేను మరల ఒకసారి పరిశీలించాను. నేనిచ్చిన పేజీ మార్పుల విభజన చూపెట్టుతుంది. దానిలో వేరే లింకు ద్వారా పేజీ వీక్షణల విభజన కూడాచూడవచ్చు. మూడు నెలలలో భారతదేశం నుండి జరిగిన మార్పులన్నిటిలో ఏ భాషలో ఎన్ని మార్పులు జరిగినవనేదానిని మొత్తముమార్పులతో భాగించితే వచ్చే దానినేశాతంగా చూపెట్టటము జరిగింది. ఇది ఇంతకు ముందలి త్రైమాసికంలో 4.8% గా నమోదైంది. అందువలన మనం ఎక్కువమార్పులు జరిగితే దీనిలో వృద్ధికనబడుతుంది లేక ఇతర భాషలలో ఏవిధంగానైన మార్పులు తగ్గితే మనం మొదటి స్థానానికి చేరవచ్చు. ఇతర భాషల మార్పులు లో భారీ తేడాలు రావటానికి కారణాలు నాకు తెలిసి గత త్రైమాసికంలో జరగలేదు. బహుశా తమిళ వికీదశాబ్ది ఉత్సవాలు తప్ప. అందుకని మన భాషలో జరిగిన మార్పులే దీనికి కారణమని అనుకుంటున్నాను. దీనితో పాటు వీక్షక అభ్యర్ధనలను కూడా దేశాల వారీగా వాటిలో భాషల విభజన ప్రకారం చూస్తే తెలుగు 0.2 శాతం గానమోదైంది. మన వైజాసత్య గారి అలాగే కిరణ్మయి గారి మార్పులు దీనిలోలెక్కకు రాలేదు. వారు అమెరికాలో వుంటున్నారు కాబట్టి. ఈ గణాంకాలకి ఆపేజీలో తెలిపినట్లు పరిమితులుంటాయి. అలాగే నేను మరల పరిశీలించినపుడు ఇవి వికీపీడియాకి మాత్రమే అని తెలిసింది. మరిన్ని వివరాలు సెప్టెంబరు గణాంకాలు తెలిసినప్పుడు తెలియవచ్చు. చంద్రకాంతరావుగారు చెప్పినట్లు మరి ఇతర నివేదికల మార్పులు పరిశీలించినపుడు ఐదారుగురు బలమైన ఎడిటర్లు వలన ఈ మార్పు జరిగిందని భావిస్తాను. దీనిని నిలబెట్టుకోవడం చాలాకష్టం. వికీపరిచయం తెలుగువారికి ఎక్కువగా కలిగినప్పుడు 5 కన్నా ఎక్కువ మార్పులు చేసేవారు గణనీయంగా పెరిగినప్పుడే మన తెవికీ అభివృద్ధిపధంలో పడిందనుకోవాలి. గత నాలుగైదుసంవత్సరాలుగా నేను కాని, సభ్యుడు:C.Chandra Kanth Rao గారు కాని అప్పుడప్పుడు గణాంకాల విశ్లేషణ చేస్తున్నాము. ఆసక్తిగల సభ్యులు మరింత మంది దీనిపై దృష్టిపెట్టాలి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ప్రాజెక్టు చేసినప్పుడు స్పష్టమైన గణాంకాలతో విశ్లేషణ చేయడం జరిగింది. వాటిని పొందడానికి తగిన మైఎస్క్యూఎల్ స్క్రిప్ట్ కూడా సంబంధిత చర్చాపేజీలో రాయడం జరిగింది. ఎవరైనా ముందుకు వస్తే నాకు తెలిసినది పంచుకోగలను. ఈ పైన చెప్పినవాటిని ఇతరులుకూడా పరిశీలించి ధృవీకరించమని మనవి. --అర్జున (చర్చ) 15:52, 24 అక్టోబర్ 2013 (UTC)
  • ఇది తెవికీ పీడియన్లు అనందించవలసిన విషయం. ఈ ఉత్సాహంతో మనమందరం కలిసికట్టుగా పనిచేసి అన్ని విషయాలలో మొదటి స్థానానికి వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ విషయం మనకందరికీ అందించి మనలో సరికొత్త ఉత్సాహం నింపిన అర్జునరావుగారికి ధన్యవాదాలు. తెవికీ సభ్యుడుగా విష్ణువర్ధన్ గారు అందిస్తున్న సహకారం ఈ అభివృద్ధికి మరింత కారణం. అలాగే వర్గాలలో అత్యధిక మార్పులు చేసిన ఉత్సాహవంతుడైన వైవి.ఎస్ రెడ్డి గారు , తెలుగు ప్రముఖుల ప్రణాళికను చేపట్టిన రాజసేఖర్ గారూ, భాస్కరనాయుడు గారు, యువ వికీపీడియన్లు ఉత్సాహవంతులు అయిన రహ్మానుద్దీన్, ప్రణయరాజ్ మరియు విశ్వనాథ్ గార్లు, స్వల్పకాలంలో అత్యధిక వ్యాసాలు మరియు వ్యాసేతర సేవలు అందించిన వెంకట రమణగారూ , పాలగిరిగారు ఈ ముందడుగుకు కారణం అని భావిస్తున్నాను. ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్న తెవికీ సభ్యులందరికీ ఈ అభివృద్ధికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలిసి నడుస్తాం మరింత అభివృద్ధి సాధిస్తాం. --t.sujatha (చర్చ) 18:25, 24 అక్టోబర్ 2013 (UTC)
  • తెలుగులో వ్యాసాలు వ్రాయడం మొదలుపెట్టాక, కొన్ని కారణాల వల్ల అనుకున్నట్టు చేయలేకపోయాను. చరిత్ర పుస్తకాల నుంచి, వైజ్ఞానిక విషయాలు అనువదించడం సరి అంటే, నేను ఆ పనిలో నిమగ్నమవుతాను. కిరణ్మయీ (చర్చ) 22:42, 24 అక్టోబర్ 2013 (UTC)
  • సభ్యులకు ఏవిషయంలో ఆసక్తి వుంటే ఆ విషయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించవచ్చు. కాని నాణ్యత మెరుగయ్యేదెప్పుడంటే నలుగురు కలసి ఒక ప్రాజెక్టును చేపట్టినియతకాలవ్యవధిలో పనిచేయడమే. నా అనుభవాలు ఉపయోగపడవచ్చు. ప్రాజెక్టుల పేజీలో ప్రతిపాదనచేసి ఇంకో ముగ్గురు చేరితే పని మొదలు పెడితే మంచిది. --అర్జున (చర్చ) 03:27, 25 అక్టోబర్ 2013 (UTC)
  • Dear colleagues of the Telugu Wikipedia: congratulations from all of us at the Wikimedia Foundation on this inspiring growth! Keep up the good work, and may you continue to find joy and fulfillment in creating and sharing free knowledge. Ijon (చర్చ) 16:26, 25 అక్టోబర్ 2013 (UTC)
P.S. I have not been able to send you this message in Telugu, but it may interest you to know I have been working on translating Telugu literature into Hebrew on my home Wikipedia (as a volunteer, at night). Ijon (చర్చ) 16:26, 25 అక్టోబర్ 2013 (UTC)
  • Thanks Ijon for your wishes and also for your work on Hebrew wp related to Telugu literature.--అర్జున (చర్చ) 03:51, 26 అక్టోబర్ 2013 (UTC)
  • Ijon thanks for the wishes :) Now I understand why you keep asking questions on Telugu literature!! I have started translating Culture of Israel, from Hebrew wp into Telugu. Still a long way to go. I am sure my Telugu friends here will take up translating the rest of the two articles from Hebrew wp nominated here. --విష్ణు (చర్చ)

సముచిత వినియోగానికి తెవికీలో విధాన నిర్ణయం

ఇటీవల బొమ్మల నకలుహక్కులపైశ్రద్ద పెట్టడం అందరూ గమనించారనుకుంటున్నాను. సముచిత వినియోగ సూత్రాలప్రకారం మార్చదగ్గవీలున్న బొమ్మలను ఆంగ్లవికీలో తొలగించటానికి నిర్ణయించారు (Wikipedia:CSD#Files#Invalid fair-use claim). వికీఫౌండేషన్ ఉచిత వినియోగానికి, వ్యాస అవసరానికంటే ప్రాముఖ్యతనిచ్చింది.(https://wikimediafoundation.org/wiki/Resolution:Licensing_policy) అయితే స్వేచ్ఛాబొమ్మ అందుబాటులో లేనప్పుడు నకలుహక్కుల బొమ్మను చేర్చితే తొలగించాలా లేదా అనే దానిని సంబంధిత వికీప్రాజెక్టుయొక్క నిర్ణయానికి వదిలేసింది. ఉదాహరణకు మనం జీవించివున్న కళాకారుని బొమ్మ సముచిత వినియోగమని తెవికీలో చేర్చితే అది మార్చవీలున్న బొమ్మ క్రింద వస్తుంది. చారిత్రాత్మక బొమ్మలు మార్చవీలుకాని వర్గంలో వస్తాయి. మరిన్ని వివరాలకు Wikipedia:Non-free content review, కనుక మనం తెవికీలో దీనిపై స్పష్టమైన విధానాన్ని నిర్ణయించుకోవాలి. నాకు తెలిసినంత వరకు లాభనష్టాలు వివరిస్తాను. వీటిపై చర్చించి విస్తృతఏకాభిప్రాయానికి ప్రయత్నిద్దాము.

మార్చవీలున్న బొమ్మలు తొలగించితే లాభనష్టాలు క్రిందవివరిస్తాను.
  • లాభాలు
  1. అవసరమైన బొమ్మలు పొందడానికి ప్రయత్నాలు జరుగుతాయి
  2. వికీబొమ్మలుఎక్కువగా వినియోగంలోకి వస్తాయి
  3. మనం విధానం ఆంగ్లవిధానంతో సమానమై, ఆంగ్లంలో వినియోగించే ఉపకరణాలు, విధానాలు సులభంగా వాడుకోవచ్చు.
  • నష్టాలు
  1. మన వ్యాసాలకు అవసరమయ్యే బొమ్మలు కోల్పోతాము. (ఇలాంటివి ఎన్ని వున్నవివిశ్లేషించవలసివుంది, దాదాపు 30 శాతం బొమ్మలు (2000పైగా) ఉచితంకాని మీడియాగావున్నవి. వీటిలో ముఖ్యంగా జీవించివున్న వ్యక్తులు బొమ్మలే ఈ విధానానికి ప్రధానమవుతాయి. ఇతర బొమ్మలు మనం వెతికితే ఫ్లికర్లో ఉచితంగా దొరకవచ్చు. మనము సమీక్షచేస్తేనే ఎన్ని బొమ్మలు కోల్పోతాము అని తెలుస్తుంది).

ఇంకేదైనా సందేహాలుంటే అడగండి మరియు చర్చలో పాల్గొనండి--అర్జున (చర్చ) 11:15, 24 అక్టోబర్ 2013 (UTC)

  • ఇతర వ్యాఖ్యలు
  1. భారతదేశంలో తయారవుతున్న ఫోటోలు, సమాచారంపై కాపీహక్కులు నిర్ధారించడం చాలా దుర్లభమైన పని. స్పష్టమైన విధానమంటూ లేదు. ఉదాహరణకి ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉన్న సమాచారం ప్రజలకు సార్వజనీకంగా చెందుతుందా లేదా అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరింత కఠినమైన వికీనియమాల వల్ల చాలా ఫోటోలను కోల్పోతాం. సముచిత వినియోగానికి అ.సం.రా కాపీహక్కుల చట్టం క్రింద చక్కని పరిరక్షణ ఉన్నది. కాబట్టి బొమ్మల సముచిత వినియోగం చట్టరీత్యా నేరం కాదు. ఆంగ్ల వికీ నియమాలు అతిజాగ్రత్తతో చేసినవి. ప్రస్తుతానికి మనం అంత కఠినమైన నియమాలు అమలుపరచటం మంచిది కాదు. ఈ పనిలోనే ఉండగా భారతీయ కాపీహక్కుల చట్టాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకొనేందుకు ప్రయత్నిస్తాను (భారతీయ ఆంగ్లం అర్ధం చేసుకోటం అంత సులభం కాదు సుమీ, బ్రిటన్లో కూడా ప్రస్తుతం ఉపయోగించని పరమ పురాతన భాషలో వ్రాస్తారు మరి).--వైజాసత్య (చర్చ) 02:25, 25 అక్టోబర్ 2013 (UTC)
వ్యాఖ్య వెనక్కి తీసుకోవాలేమో :-) http://copyright.gov.in అనే సులభమైన వెబ్సైట్ ఉంది --వైజాసత్య (చర్చ) 02:32, 25 అక్టోబర్ 2013 (UTC)
  1. ఫ్లికర్లో ఉన్న భారతీయ ఫోటోగ్రఫర్లను కొన్ని ఫోటోలు ఉచిత లైసెన్సులతో విడుదల చేసేందుకు ప్రోత్సహించడం చక్కని ఆలోచన. చాలా మంది అడగ్గానే చక్కగా సహకరిస్తారు --వైజాసత్య (చర్చ) 02:25, 25 అక్టోబర్ 2013 (UTC)
  2. భారతీయ కాపీహక్కుల చట్టం గురించి చదివిన తర్వాత తెలసిన విషయాలు 1) సినిమాలు, ఫోటోలు తదితరాలు తొలిసారి ప్రచురించబడిన 60 ఏళ్ళకు పబ్లిక్ డొమైన్లోకి వస్తాయి. పుస్తకాలు, చిత్రలేఖనాలు వగైరా కర్త మరణించిన అరవై ఏళ్ళకి గానీ ఉచితమవవు. 2) ప్రభుత్వం తయారుచేసిన వాటికి కాపీహక్కులు ప్రభుత్వానికి చెందుతాయి ప్రజలకు కాదు. 3) సముచిత వినియోగం లాంటి వెసలుబాట్లు ఉన్నాయి. 4) వార్తలపై కాపీహక్కులు లేవు, కానీ వాటిని అందించే విధంపై కాపీహక్కులున్నవి 5)అనుమతి లేకుండా అనువదించకూడదు. అనువాదానికి కూడా మూలానికి ఉన్న కాపీహక్కులు వర్తిస్తాయి. --వైజాసత్య (చర్చ) 03:04, 25 అక్టోబర్ 2013 (UTC)
  • వైజాసత్య గారి స్పందనకి ధన్యవాదాలు. నకలు హక్కుల చట్టం లో క్లుప్తంగా తెలుగులో సమాచారం వుంది. సంబంధిత ఆంగ్లవికీలో మరింత సమాచారందొరకుతుంది.--అర్జున (చర్చ) 03:21, 25 అక్టోబర్ 2013 (UTC)
  • కాపీహక్కులపై ఇప్పుడే ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నించక మరికొంతకాలం వేచిచూడడం మంచిది. ప్రస్తుతం కాపీహక్కులపై అవగాహన ఉన్న సభ్యులు తక్కువగా ఉన్నారు. ఈ విషయంలో ఏదైనా ప్రతిపాదించినచో సరైన నిర్ణయం వెలువడుతుందన్న నమ్మకం ఉండదు. వెలువడిన నిర్ణయం తెవికీకి నష్టం కలిగించే అవకాశమూ ఉండవచ్చు. కాబట్టి కాపీహక్కులపై అవసరమైనచోట మరిన్ని చర్చలు జరుపుతూ సభ్యులకు ఈ విషయంలో అవగాహన కల్పించడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:57, 25 అక్టోబర్ 2013 (UTC)
  • సభ్యుడు:C.Chandra Kanth Rao గారి స్పందనకు ధన్యవాదాలు. వికీ దశాబ్దికి సిడి విడుదల కావాలంటే వీటిపై త్వరగా స్పష్టత ఏర్పడడం మంచిది. నాకు తెలిసి వికీలో విషయాలు బొమ్మలు అమెరికా చట్టాలకు అలాగే ఇవి వాడే ప్రజల యొక్క దేశాల చట్టాలకు అనుగుణంగా మరియు వికీమీడియా ఫౌండేషన్ విధాలకు లోబడి వుండాలి. అందువలన విధానాలలో స్పష్టత కావలసింది ఒక్క సముచిత వినియోగంలో మార్చదగ్గవీలున్న వాటిగురించే. ఇది అర్ధం చేసుకోటానికి అంత క్లిష్టమనుకోను. సందేహాలుంటే త్వరగా స్పష్టత కొరకు రచ్చబండలోకాని ప్రత్యేకంగా వెబ్ ఛాట్ లో కాని పాల్గొనగలను. తీర్మానంపై స్పష్టత వచ్చిన తరువాత అవసరమైతే వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం రెండు వారాలు వుంటుంది. మీ దృష్టిలో ఎంత సమయం కావాలో తెలిపితే దానిపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. అన్నట్లు ఈ విధానానికి దాదాపుఇప్పటికే ఐదేళ్ల పైగా ఆలస్యమైంది. ఫౌండేషన్ గట్టి చర్యలు తీసుకోకపోవడంతో మన వికీలలో ఇబ్బంది పడకుండా వున్నాము. నకలుహక్కులకు సంబంధించి సమస్య తెలిసినతరువాత ఎంత వేగంగా వీలయితే అంత త్వరగా చర్యలు తీసుకోవడం మంచిది --అర్జున (చర్చ) 10:13, 26 అక్టోబర్ 2013 (UTC)
  • వికీపీడియాకు చాల ముఖ్యమైన ఈ విషయంపై ఇద్దరే ఇప్పటికి స్పందించారు. సంబంధించిన కొత్త ఫైల్ అప్లోడ్ ప్రతిపాదన పై ఇద్దరుమరియ ఇంపోర్ట్అప్లోడ్ హక్కు ప్రతిపాదన పై ఒకరు స్పందించారు. సహ సభ్యులుకూడా రెండు మూడు రోజూలలో స్పందించమని మనవి. దీనిగురించి నేను ఇప్పటికే కనీసం రెండు మూడు రోజులు వెచ్చించి కొత్త ఫైల్ అప్లోడ్ గురించి కృషి చేశాను. దీనిపై త్వరలో నిర్ణయం చేయగలిగితే ఈ పనిని వేగవంతం చేయటానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 04:42, 31 అక్టోబర్ 2013 (UTC)
  • ఇప్పటివరకు వాడుతున్న వివరము ఆంగ్ల వికీనే పోలివుంది. జీవించివున్న వ్యక్తుల ఛాయాచిత్రములు సదుపయోగం (సముచితవినియోగం) క్రిందఎక్కించవద్దు అని స్పష్టంగా వున్నందున కొత్తగా నిర్ణయం చేయనవసరం లేదనుకుంటాను. ఆంగ్లవికీ నియమాలను అనుసరిస్తే మనకు సంబంధించిన కృతులను ఆంగ్లం లో మరియు తెలుగులో ఏకరీతిన వాడుకొనటం వీలవుతుంది. ఏమైనా అభ్యంతరాలుంటే ఒక వారంలో (14 నవంబర్ 2013 లోగా)తెలియచేయండి. --అర్జున (చర్చ) 03:54, 7 నవంబర్ 2013 (UTC)
  • అభ్యంతరాలేవి రానందున తెవికీలో సముచిత వినియోగం విధానం, ఆంగ్ల వికీపీడియాలో విధానమే నని నిర్ధారించబడినది.--అర్జున (చర్చ) 01:20, 15 నవంబర్ 2013 (UTC)

జీరంగి / కీచురాయి

జీరంగి అనే కీటకాన్ని గురించి కొంత వ్రాశాను. కీచురాయి అనే కీటకము పై కొంత సమాచారము తెవికిలో వున్నది. అక్కడ ఆ కీటకము బొమ్మను బట్టి చూస్తే జీరంగికి కొంత పోలికలున్నాయి.. కనుక జీరంగి ..... కీచు రాయి అనే ఈ రెండు కీటకాలు ఒకటే ననే అనుమానమున్నది. దానిని జీరంగి అని పిలిచే ప్రాంతంలో దానికి కీచురాయి అనే పేరు వాడుకలో వున్నట్లు లేదు. ఈ రెండు ఒకటే అయితే విలీనము చేయ వచ్చునేమో పరిశీలించ వచ్చును. Bhaskaranaidu (చర్చ) 05:41, 25 అక్టోబర్ 2013 (UTC)

వ్యాస చర్చా విషయాలు వాటి చర్చా పేజీలో రాసి అందరి దృష్టికి తేవాలంటే {{సహాయం కావాలి}} మూస చేర్చమని మనవి. నేను పై వ్యాఖ్యను అక్కడ చేరుస్తాను. దీనిపై ఇక చర్చ చర్చ:జీరంగి లో చేయండి. --అర్జున (చర్చ) 06:24, 25 అక్టోబర్ 2013 (UTC)

గణాంకాలు

నేను వ్రాస్తున్న గ్రామగణాంకాలకు అవసరమైన సమాచారం [1] ఈ ప్రభుత్వ వెబ్ సైట్ నుండి తీసుకుంటున్నను. ఇందులో 2011 గణాంకాలని ఉన్నది. అయినప్పటికీ 2011 గణాంకాలు ఇంకా అప్‌లోడ్ చేయలేదని 2001 గణాంకాలని చంద్రకాంతరావు గారు సూచించిన తరువాత ఇప్పుడు 2001 అని వ్రాస్తున్నాను. ఇప్పటి వరకూ వ్రాసిన గణాంకాలను బాటు ద్వారా సరిచేయవచ్చు కనుక బాటు గురించి తెలిసిన సభ్యులు సరి చేయవలసిందిగా కోరుతున్నాను. --శ్రీరామమూర్తి (చర్చ) 13:17, 25 అక్టోబర్ 2013 (UTC)

అవును, పై లింకులో ఉన్న గ్రామజనాభా వివరాలు 2001 నాటివే. గ్రామాలకు సంబంధించి 2011 జనాభా వివరాలు ఇంకనూ అంతర్జాలంలో పెట్టలేరు కాని గణాంక విభాగంలో జిల్లాలవారీగా గ్రామాలకు చెందిన జనాభా వివరాలు ఉన్న సీడిలు లభ్యమౌతాయి. వీటి ప్రకారం 2011 వివరాలు కూడా చేర్చవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:03, 25 అక్టోబర్ 2013 (UTC)
మీకు 2011 గణాంక వివరాలు అందుబాటులో ఉంటే, వాటిని నాకందివ్వగలిగితే నేను బాటు ద్వారా వివరాలను చేర్చగలను. --వైజాసత్య (చర్చ) 05:43, 27 అక్టోబర్ 2013 (UTC)
గ్రామాలకు సంబంధించిన 2011 సంవత్సరపు జనాభా వివరాలను అందించగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:00, 27 అక్టోబర్ 2013 (UTC)
2011 గణాంకాలను గ్రామాల పేజీలలో చేరిస్తే మంచి పురోగతి సాధించినట్లే. వైజాసత్య లాంటి వారు ఇలాంటి బృహత్కారానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. ధన్యవాదాలండి.Rajasekhar1961 (చర్చ) 17:20, 27 అక్టోబర్ 2013 (UTC)
వైజాసత్య గారూ, 2011 జనాభా వివరాలకు సంబంధించి పాలమూరు జిల్లాకు చెందిన (64 మండలాల గ్రామాలు) ఎక్సెల్ ఫైలు మీకు మెయిల్ చేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:21, 30 అక్టోబర్ 2013 (UTC)

సరికొత్త లోగో

తెవికీలో సరికొత్త లోగో సచేతనమయింది. రామరాజ ఖతిలో ఉన్న ఈ లోగో ఇంతకు ముందు ఉన్న అన్ని తెలుగు వికీపీడియా లోగోలనూ తిరిగిరాస్తుంది. లోగో ప్రతిపాదన లో సహాయం అందించిన వారందరికీ ధన్యవాదాలు(అర్జున , విశ్వనాధ్.బి.కె. మరియు ఇతరులు). రహ్మానుద్దీన్ (చర్చ) 07:36, 26 అక్టోబర్ 2013 (UTC)

మొదటిపేజీలోని లోగోలో నాకు ఒక లోపము కనిపిస్తున్నది. వికీఎపీడియా కంటే స్వేచ్చా విజ్నాన సర్వస్వం ముందుకు ఉన్నది. రెండూ సమానంగా లేవు. ఇల కేవలం నాకేనా లేక అందరికీ అలానే కనిపిస్తున్నదా?దీనితో సరిపోల్చిచూడండి.
లోగో ప్రతిపాదన 3
...విశ్వనాధ్ (చర్చ) 15:45, 5 నవంబర్ 2013 (UTC)
.విశ్వనాధ్ గారి సందేహం నిజమే. ప్రక్కచూపిన బొమ్మకు ప్రస్తుత లోగోకు తేడావున్నది. రహ్మానుద్దీన్ గారు ఒక సారి తనిఖీ చేసి ధృవీకరించితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 04:18, 7 నవంబర్ 2013 (UTC)

కనిపించుట లేదు

నూజెళ్ళ (కృష్ణా జిల్లా) అనే పుట నాకు ఇక్కడ దొరుకుట లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:11, 27 అక్టోబర్ 2013 (UTC)

నూజెళ్ళ (కృష్ణా జిల్లా) అనే గ్రామము పేజీ ఉందా ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 18:52, 27 అక్టోబర్ 2013 (UTC)
ఇది గుడివాడ మండలంలో ఉండాలి, కాని లేదు. బహుశా అది రెవెన్యూ గ్రామం కాకపోవచ్చు. నా వద్ద ఉన్న సమాచారంలో కూడా ఈ గ్రామం పేరు లేదు. రెవెన్యూ గ్రామం కాకున్ననూ మీ వద్ద ఈ గ్రామ సమాచారం ఉంటే పేజీ సృష్టించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:04, 27 అక్టోబర్ 2013 (UTC)

ఫైల్ అప్లోడ్ విజర్డ్ వాడుకకు ప్రతిపాదన

వికీపీడియా:రచ్చబండ_(ప్రతిపాదనలు)#కొత్త ఫైల్ అప్లోడ్ విజర్డ్ తెలుగులో వాడుట లో స్పందించండి. --అర్జున (చర్చ) 07:46, 28 అక్టోబర్ 2013 (UTC)

రహ్మానుద్దీన్ , విశ్వనాధ్ స్పందనలకు ధన్యవాదాలు. మిగతా సహ సభ్యులు త్వరలో స్పందిస్తే ఈ విషయంపై ముందుకి వెళ్లడానికి వీలుంటుంది--అర్జున (చర్చ) 04:29, 31 అక్టోబర్ 2013 (UTC)

Short-term Assignment at CIS-A2K

తెవికీ మిత్రులకు, CIS-A2K తో ఒక స్వల్పకాలిక ప్రాజెక్టులో పని చేయటానికి అవకాశం. ఈ అవకాశం వికీపీడియానులకు మాత్రమే ఈ నోటిస్ చూడండి.--విష్ణు (చర్చ)08:09, 28 అక్టోబర్ 2013 (UTC)

రెండు సరిక్రొత్త వాడుకరి పెట్టెలు

ఆంగ్ల వాడుకరి పెట్టెలని అనువదించి, ఈ సరిక్రొత్త వాడుకరి పెట్టెలని తయారు చేశాను.

ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి.
ఈ వాడుకరి కొండారెడ్డి బురుజు పై నుండి కర్నూలు పట్టణాన్ని చూసి ఆనందించారు.
- శశి (చర్చ) 09:18, 29 అక్టోబర్ 2013 (UTC)
శశి కి ధన్యవాదాలు. ఛాయాచిత్రాలు చేర్చిన వారి చర్చాపేజీలలో తెలియచేస్తే మంచిది. తెవికీలో ఛాయచిత్రకళపై ఆసక్తిగలవారు ఛాయాచిత్రపోటీలు నిర్వహించటానికి అలాగే ఇప్పటికే వున్న ఛాయాచిత్రాల నకలుహక్కుల సమీక్షకి ముందుకు వస్తే తెవికీ నాణ్యత పెంచడానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 03:24, 31 అక్టోబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా బ్రోషర్ ముద్రణ

వికీమీడియా ఇండియా చాప్టర్ మిగులు బడ్జెట్ లో కొంత భాగం ముద్రణలకై కేటాయించబడింది. ఈ సందర్భంలో తెలుగు వికీపీడియా పై ఒక పేజీని రూపొందించాను. https://docs.google.com/document/d/134v_ou7Wya_7D3I4ONh1fJVgrIvQlhkNdEp9t2ZMmlo/edit?usp=sharing దీనిని సమీక్షించి, మీ సలహాలను ఇక్కడ పొందుపరచగలరు. దయచేసి నేరుగా మార్పులు చేయవద్దు. సమీక్షకు ఆఖరి తేదీ 31 అక్టోబర్, 2013 అర్ధరాత్రి(భారత కాలమానానుసారం). అనంతరం ముద్రణకు తగిన ఖతిని అమర్చి, పీడీఎఫ్ ను కామన్స్ లో చేర్చి ఇక్కడ లంకె ఉంచుతాను. రహ్మానుద్దీన్ (చర్చ) 17:40, 29 అక్టోబర్ 2013 (UTC)

  • రహ్మానుద్దీన్ చొరవ అభినందనీయం. అయితే ఇంతకు ముందల కలిసినప్పుడు అనుకున్న వికీపీడియాకి స్వాగతం పుస్తకానికి మీరు ప్రతిపాదించినదానికి భారీగా తేడావుండడంతో ఇది అంత ఉపయోగమనిపించుటలేదు. నా దృక్పధంలో తెవికీ ప్రచారానికి కావలసినవి వాటి ప్రస్తుత స్థితి తెలియచేస్తాను.
అ) తెలుగు వికీ ఒకటుందని, దానిలో తెలుగు టైపు చేయొచ్చని తెలిపే కరపత్రం:వికీపీడియా:తెవికీ అకాడమీ లో చూపించిన కరపత్రం నేను ఇంతకు ముందు సమావేశాలకు వుపయోగించి నకలుహక్కుల గురించి కరపత్రం జిరాక్స్ తీసినా కూడా ఉపయోగపడేటట్లు మెరుగు చేశాను.
ఆ) వికీమీడియా భారతదేశం లో తెలుగు ప్రత్యేక అసక్తి జట్టు గురించిమరియు తెలుగు వికీ ప్రాజెక్టుల గురించి తెలిపే కరపత్రం: మొదటి ఆంగ్ల నమూనా ఆధారంగా తెలుగు వికీలసమాచారం, ఇటీవలి ఛాయచిత్రాలు చేర్చి తయారు చేయాలి.
ఇ) వికీపీడియాకి స్వాగతం: ఆంగ్ల పుస్తకం . ఇది వికీగురించి సులభంగా తెలుసుకోవటానికి స్వయం శిక్షణకు అనువుగా అనుభవజ్ఞులు తయారు చేసిన పుస్తకం. దీనిని చాల దేశాల చాప్టర్లు, భాషా సముదాయాలు తమ అవసరాలకు తగ్గట్లుగా మార్చి ప్రచురించాయి ( యుకె ఆంగ్ల రూపం) దీనిని తెలుగు లోకి అనువదించి, బొమ్మలను భారతీయసంస్కృతికి అనువుగా మార్చి ముద్రిస్తే బాగా వుపయోగంగా వుంటుంది. నేను దీని అనువాదానికి వికీసోర్స్ లో పుస్తకాన్ని ఆంగ్ల మూలంతో ప్రారంభించాను. దీనితో మీరు జతచేసిన వికీకోడ్ల వివరణ పట్టిక ఆంగ్ల మూలం ఆంగ్లములోని పుస్తకానికి అదనపుపేజీగా ప్రచురించారు. ఆసక్తి గలవారందరు దీనిలో పాలుపంచుకోమని కోరుతున్నాను. ఇక చివరిగా తెవికీ లో ఏదైనా స్పందనలు ఆశించేటప్పుడు కనీసం ఒక వారం గడువీయడం సంప్రదాయం. అది పాటించమనికోరుతున్నాను. --అర్జున (చర్చ) 04:02, 31 అక్టోబర్ 2013 (UTC)
  • ఇది మనం ప్రింట్ చేసుకునేది కాదు. ఇది చాప్టర్ మిగులు డబ్బులతో చేస్తున్నది. ఇంకా 16 పేజీల పుస్తకం కన్నా, రెండు-నాలుగు పేజీల కరపత్రం రూపొందించడమే ఉత్తమమని అభిప్రాయం కూడా, పోయిన సారి చర్చలలో వచ్చింది. అందువలన మీరు రూపొందించిన పీడీఎఫ్ నే వాడుదాం, లేదా మీరే మరో పత్రాన్ని రూపొందించగలరు. వారం రోజుల గడువు సంగతి నేనెక్కించిన దస్త్రాన్ని మీరు డిలీట్ చేసినపుడు గుర్తుకురాలేదా? సౌమ్యన్ నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు, ఆ వ్యవధిలోనే రూపొందించి పంచుకున్నాను. రేపటికి సౌమ్యన్ కు పంపించాల్సి ఉంది. రహ్మానుద్దీన్ (చర్చ) 07:20, 31 అక్టోబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ గారి స్పందనకు ధన్యవాదాలు. వారు పేర్కొన చర్చలగురించి నాకు తెలియదు కనుక సందర్భం అర్ధంచేసుకోవటంలో కొంత అవగాహనలోపం వున్నట్లుంది. చాప్టర్ కి ఇటువంటి ప్రచార సామాగ్రి తయారు చేయలన్న ఊహ చాలా రోజులనుండి వుంది. నాకు తెలిసి ప్రస్తుతం అంత డబ్బుసమస్య లేదు. అందుకని మనం ఫలితం మెరుగుగా వుండేటట్లు కరపత్రాలు, పుస్తకాలు రూపుదిద్దితే ఏమైనా బడ్జెట్ పరిమితులుంటే దాని ప్రకారం ఏవి ఎంతమేరకు ముద్రించాలో నిర్ణయించుకోవచ్చు. మీరు తయారుచేసిన దానిని వికీసోర్స్ లో చేర్చి స్వల్పంగా మార్పులు చేశాను. సహ సభ్యులు ఈ కరపత్రాలు, పుస్తకాల అనువాదం మరియు సమీక్షలో పాల్గొనమని మనవి .--అర్జున (చర్చ) 06:20, 1 నవంబర్ 2013 (UTC)
  • అర్జునరావుగారూ ! తప్పకుండా కొనసాగిస్తాం. సమిష్ఠికృషిలో నాకు వీలైనంతగా సహకరిస్తాను. --t.sujatha (చర్చ) 03:27, 2 నవంబర్ 2013 (UTC)
  • అనువాదంలో పాలుపంచుకున్న అందరికి ధన్యవాదాలు. వికీపీడియా స్వయంశిక్షణ అనువాదం పూర్తయింది. అనువాదం సమీక్షించి మెరుగుకి సంబంధిత పుట చర్చాపేజీలలో సలహాలు చేర్చండి. --అర్జున (చర్చ) 06:12, 9 నవంబర్ 2013 (UTC)

సెప్టెంబరులో 2013 తెవికీ అభివృధ్ధి

సెప్టెంబరు 2013 మాసం తెవికీ గణాంకాల చిద్విశ్లేషన - మిత్రుల కోసం.

  • క్రితం నెలకంటే దిద్దుబాట్లలో 55% వృద్ధి.
  • 48 మంది చురుకైన ఎడిటర్లు. ఇది తెవికీ చరిత్రలోనే 2nd highest రికార్డ్. దాదాపు 5 1/2 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2008 లో 102 చురుకైన ఎడిటర్ల సంఖ్య మొదటి స్థానంలో కొనసాగుతుంది.
  • అతి చురుకైన వాడుకరుల సంఖ్య పరంగా, మొట్టమొదటి సారిగా వ్యాసాలలో 3 సభ్యులు 1000 కంటే ఎక్కువ దిద్దుబాట్లు మరియు 1 సభ్యుడు 2500 పై చిలుకు దిద్దుబాట్లతో ఒక చారిత్రాత్మకమైన రికార్డు నెలకొల్పారు.
  • వ్యాసాల పరంగా రోజుకు సగటుగా 18 కొత్త వ్యాసాల ఈ మాసంలో తెవికీలో చేరుకున్నాయి.
ఈ గణాంకాలు మన తెవికీ 10వ వార్షికోత్సవాన్ని స్వాగతిస్తూ వచ్చిన శుభసూచకాలు. అక్టోబరులో 50 చురుకైన ఎడిటర్ల మైలురాయి దాటి చక్కని వ్యాసాలతో మరిన్ని ప్రాజెక్టులలో సమిష్టి కృషితో తెవికీ ముందుకు దూసుకుపోతుందని ఆశిస్తూ... గణాంకాల వనరుకై ఇక్కడ చూడండి.

--విష్ణు (చర్చ)09:10, 30 అక్టోబర్ 2013 (UTC)

సెప్టెంబరు 2013 మాసపు తెవికీ గణాంకాలపై విశ్లేషణ కొరకు ఇక్కడ చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:46, 30 అక్టోబర్ 2013 (UTC)

తెలుగు పుస్తకాల యూనీకోడీకరణ సింపోజియం లో నా ప్రదర్శన

తెలుగు పుస్తకాల యూనీకోడీకరణ సింపోజియం లో నా ప్రదర్శనకు నేను వాడిన స్లయిడ్స్ ఇక్కడ చూడగలరు.

వికీసోర్స్ - తెలుగు పుస్తకాల యూనీకోడీకరణకు ఉత్తమ మార్గం

రహ్మానుద్దీన్ (చర్చ) 21:25, 30 అక్టోబర్ 2013 (UTC)

బాగుంది. తెవికీసోర్స్ బొమ్మలేమి కనబడలేదు, ప్రత్యక్ష ప్రదర్శనఏమైనా ఇచ్చారా? సమావేశ నిర్ణయాలేమైనా వుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 03:26, 31 అక్టోబర్ 2013 (UTC)
తెరపట్టులు పెద్దవిగా చేసి చూపేందుకు వీలుంటుందని, స్లైడుల్లో చేర్చకుండా విడిగా చూపించాను. అవి బ్లాగుపోస్టులో జోడించాను. కెవలం చర్చ మాత్రమే జరిగింది. telugupustakam.org అనే జాలగూడులో స్వేచ్ఛా నకలుహక్కులతో పుస్తకాలను ఉంచుతామని ఒక తీర్మానం చేసారు, తెలుగు కార్పస్(కోటి మాటల కోట) రూపొందించేందుకు తీర్మానం చేసారు. టీటీడీ, ప్రభాకర శాస్త్రి గారి, మరియు కొన్ని వర్సిటీల పుస్తకాలు త్వరలో స్వేచ్ఛా నకలుహక్కులతో వెలువడే మార్గం సుగమమయింది. రహ్మానుద్దీన్ (చర్చ) 07:40, 31 అక్టోబర్ 2013 (UTC)
రహ్మానుద్దీన్ స్పందనకు ధన్యవాదాలు. మీ బ్లాగ్ పోస్ట్ కూడా చాలా ఉపయోగంగావుంది.--అర్జున (చర్చ) 06:23, 1 నవంబర్ 2013 (UTC)

అర్జునకు ఇంపోర్ట్అప్లోడ్ హక్కు కొరకు

వికీపీడియా:రచ్చబండ_(ప్రతిపాదనలు)#అర్జునకు ఇంపోర్ట్అప్లోడ్ హక్కు కొరకు లో ఇప్పటికే స్పందించిన K.Venkataramana కు ధన్యవాదాలు. సహ సభ్యులు 4 నవంబర్ లో స్పందించమని మనవి. --అర్జున (చర్చ) 04:32, 31 అక్టోబర్ 2013 (UTC)

బొమ్మల నకలహక్కుల విషయమై

ఇది గమనించి ఇందులో ఏమయినా సందేహాలుంటే తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 09:10, 31 అక్టోబర్ 2013 (UTC)

  • ఈ సమాచారం బాగుంది. తెలుగు లోకి అనువదించి తెవికీలో చేరిస్తే సరిపోతుంది.Rajasekhar1961 (చర్చ) 10:47, 31 అక్టోబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ గారి అనువాదం బాగుంది,ఇది కూడా తెవికీ ప్రచారానికి ఉపయోగపడేది. క్రితం వ్యాఖ్యంలోని మూడింటితోపాటు, దీనిని కూడా ముద్రించేందుకు చర్యలు తీసుకుంటే మంచిది.--అర్జున (చర్చ) 03:06, 2 నవంబర్ 2013 (UTC)

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి సంస్కృతి.

వికీపీడియనులందరికీ దీపావళి శుభాకాంక్షలు, దీవాలి ఈద్ ముబారక్. అహ్మద్ నిసార్ (చర్చ) 11:06, 2 నవంబర్ 2013 (UTC)

గ్రామాల గణాంకాలు - సంబంధిత మూస

గ్రామాల ప్రాజెక్టు రెండవ విడతగా గణాంకాలు, మూసలు చేర్చే ప్రయత్నం ప్రారంభించబోతున్నాను. చంద్రకాంతరావు గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 2011 గణాంకాలు నాకందించారు. వీటి ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లాతో పని ప్రారంభిస్తాను. గ్రామాల వ్యాసాలకు సమాచారపెట్టెలు తయారుచేసేందుకు అనువుగా భారతీయ స్థల సమాచారపెట్టెలో కొన్ని మార్పులు చేస్తున్నాయి. గ్రామాల మూస మొదటి ప్రతి ఇక్కడ ఉన్నది. దీన్ని చూచి మీ సూచనలు, సలహాలు, మార్పులు చేర్చులు సూచించగలరు. --వైజాసత్య (చర్చ) 08:18, 3 నవంబర్ 2013 (UTC)

బాటు గణాంకాల ఆధారంగా ఒకటి లేదా రెండు గణాంకాలు పొదిగిన వాక్యాలతో వ్యాసంలో గణాంకాలు అనే విభాగాన్ని కూడా సృష్టిస్తుంది. ఆంగ్ల వికీలో చాలా ఏళ్ళక్రితం రాం‌బాట్ చేసిన పనిలాంటిదన్నమాట. అప్పట్లో అదో పెద్ద దుమారం లేపింది :-) --వైజాసత్య (చర్చ) 08:22, 3 నవంబర్ 2013 (UTC)
వైజాసత్య గారూ, గ్రామాలలో కూడా సమాచార పెట్టె పెట్టాలనుకోవడం చాలా బాగుంటుంది. అయితే గ్రామాలను సూచించడానికి ఆంధ్రప్రదేశ్ పటం కాకుండా ఆయా జిల్లాల పటాలు పెట్టడం బాగుంటుందని నా అభిప్రాయం. నా బ్లాగులో వలె మండల పటంలో గ్రామాలు సూచిస్తే పాఠకులకు మరింత సహాయకారిగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక మండలంలోని గ్రామ స్థానపు స్వల్పతేడాను గుర్తించజాలము. అదే విధంగా వ్యాస సమాచారంలో మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి చాలా మండలాలలో గణాంకాల విభాగం ఉంది. మరో కొత్త విభాగం కాకుండా అందులోనే 2001 జనాభా వివరాల క్రిందుగా చేర్చేటట్లు బాటు తయారు చేయండి. ఒక గ్రామానికి సంబంధించి గణాంకాలు చేర్చితే నేను పరిశీలించగలను. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:36, 3 నవంబర్ 2013 (UTC)
వైజాసత్య గారు ధన్యవాదాలు. ఎప్పటి నుండో మన ఆలోచనల్లోని కలని మీరు నిజం చేయబోతున్నారు. మూసలో2011 గణాంకాలు చేర్చితే సరిపోతుంది. కానీ 2001 గణాంకాలు ఉన్న గ్రామాలకు అది వ్యాసంలో గణాంకాలు అనే విభాగాన్ని సృష్టించి గణాంక వివరాలు కూడా తెలియజేస్తుంది అన్నారు. బాగుంది. భవిష్యత్తులో మరొక దశాబ్దపు జనాభా గణాంకాలు దొరికితే వాటిని కూడా అక్కడ పొందుపరిచేటట్లు ఉంటే బాగుంటుంది. చంద్రకాంతరావు గారు చెప్పినట్లు గ్రామ పేజీ మూసలో ఆంధ్ర ప్రదేశ్ పటం కాకుండా ఆయా జిల్లాల పటాలు వాడుకొని అక్షాంశ రేఖాంశాల మూలంగా ఆ పటంలో నిర్ధిష్టమైన గ్రామాన్ని గుర్తిస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 12:02, 3 నవంబర్ 2013 (UTC)
గ్రామాలకు మండలాల పటం, పట్టణాలకు మరియు నగరాలకు జిల్లాల పటం మహానగరాలకు ఆంధ్ర ప్రదేశ్ పటం చేర్చితేనే బావుంటుంది అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:15, 3 నవంబర్ 2013 (UTC)
మూస చర్చా పేజీలో నా స్పందన తెలిపాను. మండల పటంలో గ్రామ స్థానం చూపెట్టటంబాగుంటుంది. దీనికి ఈక్విరెక్టాంగులర్ ప్రొజెక్షన్ గల మండల పటాలు అందుబాటులో వుంటే ప్రతి ఒక్క గ్రామాన్ని సులభంగా వేరే పొరగా చూపెట్టవచ్చు. పటముల నాణ్యతను పెంచడానికి ప్రస్తుతం వికీమాప్స్ అట్లాస్ గ్రాంటు అప్లికేషన్ ప్రతిపాదించబడింది. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు చూడండి. --అర్జున (చర్చ) 04:36, 4 నవంబర్ 2013 (UTC)
మీరందరూ అభిలషిస్తున్నట్టే నాకూ వీలైతే మండలాల పటాలు చూపాలని ఉంది కానీ అవి తయారుచేయటం అంత సులభమైన పని కాదు. పైగా జీ.ఐ.ఎస్ పరిజ్ఞానమున్న సభ్యులెవరూ తెవికీలో లేనట్టున్నారు. ఆంగ్ల వికీలో కొన్నేళ్ళ క్రితం అరుణ్ ప్లేన్‌మాడ్ ను ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటాలు చేయమని అడిగాను. కానీ అది చాలా శ్రమతో కూడుకున్న పని అని ఆయన నిరాకరించారు. చూస్తుంటే వికీమాప్స్ అట్లాస్ గ్రాంటు ద్వారా జిల్లాల స్థాయి పటాలు 2014 చివరి లోపల సమకూర్చే ప్రతిపాదన ఉన్నట్టుంది. ఇక మండలాల స్థాయి ఫోటోలుపటాలు మనలో ఎవరైనా బాగా శ్రమదానం చేస్తే కానీ తయారవవు. ప్రభుత్వ సంస్థల (జిల్లా కార్యాలయాల్లాంటివి కాకుండా జి.ఐ.ఎస్ బాగా తెలిసినవి) మద్దతు తీసుకొంటే పని సులభంగా జరిగిపోవచ్చు?? ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పటమే ఉంటుంది. కానీ ఆయా జిల్లాల పటాలు లభ్యమవగానే వాటికి మారుస్తాయి. ఈ పటం కూడా ఆయా గ్రామాల యొక్క అక్షాంశరేఖాంశాలుంటేనే మూస ఆ పటాన్ని చూపుతుంది --వైజాసత్య (చర్చ) 05:22, 4 నవంబర్ 2013 (UTC)
నేను మండలాలలో గ్రామస్థానాన్ని సూచించే బొమ్మలు తయారుచేయగలను. ఇదివరకు తాండూరు, గండీడ్, యాలాల తదితర మండలాలకు సంబంధించిన గ్రామాలలో పటాలు తయారుచేసి అతికించాను కూడా. అయితే ఆ తర్వాత సెలవులోకి వెళ్ళడంతో ఆ పని అర్థాంతరంగా ఆగిపోయింది. ఉదా: గండీడ్ మండలంలోని సల్కర్‌పేట్ గ్రామం, దస్త్రం:Agganur, Yalal Mandal.PNG చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:49, 4 నవంబర్ 2013 (UTC)
చంద్రకాంత రావు గారూ, మీరు చేసిన పద్ధతిలో అయితే ప్రతి గ్రామానికి ఒక బొమ్మ చేయవలసి వస్తుంది. అదే ఈ స్థానసూచిక పటాలుంటే, ఒక్కో మండలానికి ఒకే పటముంటుంది కానీ అక్షాంశరేఖాంశాల ఆధారంగా మండల పటంపై ఆటోమేట్టిగ్గా గ్రామం యొక్క స్థానాన్ని సూచిస్తాయి. కాస్త సమయం పట్టినా, ఈ స్థానసూచిక పటాలను తయారుచేసే పద్ధతిని నేర్చుకొని మనం మండలాల పటాలను తయారుచేసుకోవటం మంచిది. ఒకసారి ఈ మూల పటాలను చేసుకొంటే ఇంక మనకు కావలసిన విధంగా అనేక రకాల పటాలను తయారుచేసుకొనే వీలుంటుంది. పైగా ఆంగ్ల వికీలో పటాలను తయారుచేసే విధానంపై శిక్షణ కూడా ఇస్తున్నట్టున్నారు. --వైజాసత్య (చర్చ) 09:08, 4 నవంబర్ 2013 (UTC)
నిజమే మీరు చెపింది సరైనదే. మండలపటం తయారైతే ప్రతి గ్రామానికి ఒక పటం తయారుచేయడం కష్టమేమీ కాదు (చుక్క పెట్టి పేరువ్రాయడమే) కాని వేల పటాలను అప్లోడ్ చేయవలసివస్తుంది. మీరు చెప్పినట్లు అక్షాంశ-రేఖాంశాల ఆధారంగా పనిచేసే జిల్లా పటాన్ని తయారుచేయడానికి ప్రయత్నిస్తాను. సమాచారపెట్టెలో సర్పంచి వివరణ ఇవ్వడం బాగుంది. 2006, 2013 సర్పంచి వివరాలు కూడా నావద్ద ఉన్నాయి (నోట్స్ రూపంలో). అలాగే గ్రామ వైశాల్యము కూడా పెట్టెలో చేర్చవచ్చు. అడవులు, పంటలు, వార్డుల సంఖ్య వివరాలు కూడా చేర్చడానికి సమాచారపెట్టెలో స్థానం కల్పిస్తే బాగుంటుంది. గ్రామవ్యాసాలలో సమాచారం వృద్ధిచెందితే తెవికీకి మంచిపేరు వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:13, 4 నవంబర్ 2013 (UTC)
మీరు తయారుచేసిన సమాచారపెట్టె ప్రయోగాత్మకంగా కోకట్ గ్రామంలో వాడిచూశాను. గ్రామస్థానం అసలు కంటె కొద్దిగా పశ్చిమానికి చూపిస్తుంది. సర్పంచి పేరుకు లింకును తొలిగించిననూ లింకు వస్తోంది. సర్పంచి పేర్లకు లింకులు అవసరమైతేనే ఇచ్చేటట్లుగా చేయండి. లేనిచో ఎర్రలింకులు ఏర్పడటం లేదా వేరే వ్యాసాలకు దారితీయడం జరుగవచ్చు (కోకట్ వ్యాసంలో విజయలక్ష్మి పేరు విజయలక్ష్మి దేవతకు దారితీసింది). సి. చంద్ర కాంత రావు- చర్చ 13:19, 4 నవంబర్ 2013 (UTC)
మీరు సూచించినట్టుగా సర్పంచి పేరుకు లింకును తొలగించాను. గ్రామస్థానం పశ్చిమంగా కనిపిస్తుందంటే అక్షాంశ రేఖాంశాలైనా తప్పుండాలి లేదా ఈ సూచికాబిందువు చాలా బొద్దుగా ఉండటం వళ్ళ అలా కనిపిస్తూ అయినా ఉండాలి. జిల్లా/మండల స్థాయి పటాలుంటే మరింత ఖచ్చితంగా గ్రామాన్ని పటంపై చూపించవచ్చు. అడవులు, పంటలు, వార్డుల సంఖ్యల వివరాలు చేర్చటానికి తగిన మార్పులు త్వరలోనే చేస్తాను --వైజాసత్య (చర్చ) 05:24, 6 నవంబర్ 2013 (UTC)

వాడుకరి మూసలు

వాడుకరి పెట్టెలు వాడుకరి ఔన్నత్యాన్ని ప్రతిబించేటట్లు ఉండాలి. ఈ మధ్య కొన్ని పెట్టెలు నిజ జీవితంలొ చేసే ప్రతి కృత్యానికి తయారుచేయటం వలన వారికి తెలియజేయుటకు అలా చేశాను. క్షమించండి.

ఇలా ఐపీ అడ్రస్ తో వ్రాయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. 106తో ప్రారంభమయ్యే ఐపీ అడ్రస్ తెవికీలో చురుకైన సభ్యులలో ఇద్దరికి వస్తుంది. రెండో వ్యక్తి ఎవరనేది నాకు తెలుసు. రోజూ అన్ని రచనలు పరిశీలించే వారికి ఇది తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. చెప్పేది ధైర్యంగా సభ్యనామంతోనే చెప్పడం మంచి పద్దతి. పొరపాటున లాగిన్ కాకుండా ఐపీ అడ్రస్‌తో వ్రాయడం వేరు, ఉద్దేశ్యపూర్వకంగా వ్రాయడం వేరు. 10 మాసాల క్రితం రచ్చబండలో కూడా ఈ సభ్యుడే 106తో ప్రారంభమయ్యే ఐపీ అడ్రస్‌తో దిద్దుబాట్లు చేసిన సంగతి విదితమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:03, 1 నవంబర్ 2013 (UTC)
ఏ దుశ్చర్య చేయకపోయినా తెవికీపై గౌరవం కొద్దీ క్షమాపణ అడిగినపుడు మధ్యలోనికి వచ్చి ఆరా తీయటం ఎంతవరకు సబబు? అజ్ఞాత సభ్యులు చర్చించరాదా?106.207.16.102 11:41, 2 నవంబర్ 2013 (UTC)
మీ ప్రైవసీని గౌరవిస్తాను, మీరు చెప్పదలచుకున్నది నాకు అర్ధం అయ్యింది. అందుకనే మీ ప్రతిస్పందనా మూసలు చూడగానే నాకో పది నిమిషాల పాటు కళ్ళలో నీళ్లొచ్చేంతగా నవ్వొచ్చింది. ధన్యవాదాలు. అజ్ఞాతసభ్యులకూ చర్చించే హక్కు భేషుగ్గా ఉన్నది. ఇక ఈ నిత్యకృత్యాలకు సంబంధించిన పెట్టెల విషయానికొస్తే ఒక సభ్యుడు ముచ్చట పడ్డాడు సరదాగా వదిలెయ్యండి. అలాంటి వాడుకరి మూసలు తయారుచేసుకోవటం వికీనియమాల ఉల్లంఘణ ఏమాత్రం కాదు. కాకపోతే అవసరమా? అన్న ప్రశ్నను మాత్రం మనం వేసుకోవచ్చు. ఆ సభ్యుడికి అవసరమనిపించింది. అసభ్యత, అశ్లీలం లేనంత వరకు నాకేం అభ్యంతరం లేదు. --వైజాసత్య (చర్చ) 22:25, 2 నవంబర్ 2013 (UTC)
మరికొంత వివరణ ఇవ్వాలనిపించింది. వాడుకరి మూసలు పచ్చబొట్లలాంటివి. కొందరికి అవి ససేమిరా ఇష్టమిండదు, మరికొందరికవి వ్యసనం; పర్సనాలిటీ ఎక్స్‌ప్రెషన్ (వ్యక్తిత్వ ప్రదర్శన). ఇవి వాడుకరి పేజీల్లోనే వాడతారు కాబట్టి పెద్దగా నియంత్రించే అవసరం లేదు. ఇక అజ్ఞాతత్వం గురించి - సాధారణంగా లాగిన్ ఉన్నవారు ఉద్దేశ్యపూర్వకంగా అజ్ఞాతులుగా వ్యాఖ్యలు చేయటం సముదాయం హర్షించదు. కానీ మీ concern కూడా నాకర్ధం అయ్యింది. మీరు విమర్శిస్తే ఆ తర్వాత ఆ సభ్యునితో కలిసి సరిగా పనిచేయలేకపోవచ్చని మీకనిపించి ఉండవచ్చు. అది కొంచెం కష్టమైనా, మనం ఒక పద్ధతిని, ఆలోచనను, ఒక దిద్దుబాటును విమర్శిస్తున్నాం కానీ వ్యక్తులను విమర్శించడం లేదని అందరూ అర్ధం చేసుకోవాలి. ఇక్కడ చర్చలూ, విమర్శలూ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వ్యక్తిగత విమర్శలు, దూషణలను మాత్రం వికీ సహించదు. --వైజాసత్య (చర్చ) 22:44, 2 నవంబర్ 2013 (UTC)
లెస్స పరికితిరి. మీ పేరు "Why? जा...సత్య" లోనే మూడు భాషలతో కూడిన తాత్విక సందేశం ఉంది. "అనవసర విషయాలెందుకు?సత్యాన్వేషణ కోసం వెళ్ళండి" అని. సత్యానికి కట్టుబడే వారికి అంతిమ విజయం ప్రాప్తించినప్పటికీ హరిశ్చంద్రునిలా కొన్ని కష్టాలు తప్పవు. నేటి సమాజంలో "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ ,నబ్రూయాత్ సత్య మప్రియం..." అనేది సరిపోతుంది. అంటే అప్రియమైన సత్యం కంటే ప్రియమైన అసత్యం ఎదుటి వ్యక్తికి ఆనందాన్నిస్తుంది. అందువల్ల సత్యాన్ని నేరుగా చెప్పి సభ్యుల మనోభావాలను గాయపర్చరాదని పరోక్షంగా రెండు మూసలు తయారుచేసి యివికూడా మూసలేనా? అన్నట్లు సందేవశాన్నిచ్చాను. ఏమీ అనుకోవద్దు.223.177.7.130 01:43, 3 నవంబర్ 2013 (UTC)
ఐపీ అడ్రస్‌తో వ్రాయడం తప్పేమీ కాదు, చేసింది దుశ్చర్య కాదు కాని దాదాపు అదే ఐపీ ఉన్న తోటి సభ్యులకు మాత్రం ఇది ఖచ్చితంగా ఇబ్బందిగా మారుతుంది. దాదాపు ఐదున్నర సంవత్సరాల క్రితం ఇలా ఐపీ అడ్రస్ మరియు మారుపేర్లతో ప్రారంభమైన చిన్న ఉదంతం చివరకి తెవికీలో ఎంత దుమారం లేపిందో అప్పటివాళ్ళకే తెలుసు. ఈ చర్యలతో ఏ మాత్రం సంబంధం లేకున్నా దేవా అనే సాంకేతికంగా నిపుణత ఉన్న సభ్యుడిని మనం కోల్పోవడానికి సరిగ్గా ఇలాంటి చర్యే కారణమైంది. ఎవరో చేసిన తప్పుకు దేవాగారు నిర్వాహకహోదానే వదులుకున్నారు. ఇప్పుడు ఈ 106తో ప్రారంభమయ్యే ఐపీ నాకూ వస్తుంది కాబట్టి నేను అభ్యంతరపర్చాను. ఆ సభ్యులతో కలిసి పనిచేయలేకపోతామని భావించి అందరూ ఇలా ఐపీ తో చెప్పడం ప్రారంభిస్తే తెవికీలో కొత్త దుస్సంప్రదాయానికి దారితీసినట్లవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 05:51, 3 నవంబర్ 2013 (UTC)
మీకు 106 ఐ.పి సంఖ్య కలదని ఆ సంఖ్య గల వేలాది మంది సభ్యులు చేసే చర్చలకు మీరెలా బాద్యులవుతారు? లాగిన్ ఐన వారందరూ జ్ఞాత సభ్యులేనా?ఈ చర్చను నేను ముగించినప్పటికీ ఇంకా చర్చను రచ్చ చేస్తున్నారు.నేనేమి చేస్తే మీరు శాంతిస్తారు? 223.177.68.193 06:59, 3 నవంబర్ 2013 (UTC)
నేను అశాంతిగా ఏమీలేను. ఏదేని విషయం సభ్యుల దృష్టికి తేవడానికి చర్చలలో మన అభిప్రాయాలు చెప్పడం అవసరమే. పైన ఈ రోజు నేను చెప్పిన విషయాలు ఏ ఒకరికో కాకుండా తెవికీ సమాజానికి ఉద్దేశించి చెప్పాను. రచ్చకు చర్చకు తేడా తెలుసుకోకపోవడం శోచనీయం సి. చంద్ర కాంత రావు- చర్చ 07:05, 3 నవంబర్ 2013 (UTC)

నాస్పందన

చర్చ చేయటానికి రచ్చబండ వేదిక ఉంది. నేను ఈ సభ్యుని పేజీలో చర్చ ప్రారంభించలేధు.వివరణ మాత్రమే ఇచ్చాను. ఈ పేజీలో చంద్రకాంతరావు గారి జోక్యం అనవసరం. ఆయన హుందాగా వ్యవహరించాలి. 106.206.177.180
ఇది నా చర్చా పేజీ అయినా, ఇక్కడి చర్చలోనే ఇతరులు పాల్గొనకూడదన్న నియమేమీ లేదు. ఇదివరకు జరిగిన కొన్ని సంఘటనలవల్ల చంద్రకాంతరావు గారు అప్రమత్తతో వ్యవహించారని అనుకొంటాను. ఇందులో ఇక చర్చించవలసినదేమీ లేనట్టు నాకు తోచింది. ఏదేమైనా చర్చను రచ్చబండకు తరలిస్తున్నాను. కావలంటే ఇక అక్కడ కొనసాగించగలరు. --వైజాసత్య (చర్చ) 08:34, 3 నవంబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా - లోకజ్ఞాన సమాచారము

తెవికీ లో లోకజ్ఞాన సమాచారము (జనరల్ నాలెడ్జ్ బిట్స్) చేర్చుటకు విభాగాలవారీగా (కరెంట్ అఫైర్స్. జనరల్ సైన్స్, క్రీడలు, సినిమా, వగైరా) అవకాశము ఉన్నదా? విద్యా ఉపాధి ప్రాజెక్టులో అవకాశము ఉన్నదనుకుంటాను. దయచేసి ఎలా చేర్చాలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:58, 5 నవంబర్ 2013 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారి సందేహానికి నా స్పందన ఏమిటంటే, వికీపీడియా విజ్ఞానసర్వస్వం కాబట్టి ఏది కావాలనుకున్నా దీనిలో దొరకాలి.అయితే జనరల్ నాలెడ్జి బిట్స్ గా అందించటానికి వికీపీడియా:చరిత్రలో ఈ రోజు శీర్షిక లేక క్యాలెండర్ ప్రకారం సంబంధిత రోజు (ఉదా:) లాంటివి ఉపయోగపడతాయి. విద్య,ఉపాధి ప్రాజెక్టులో సంబంధించిన విజ్ఞానసర్వస్వ వ్యాసాలను అభివృద్ధి చేయటమే బాగుంటుంది. అంతేకాక బిట్ బ్యాంకు చేయటానికి విపీడియా సాఫ్ట్వేర్ అయిన మీడియావికీ అమరిక అంత అనువైనది కాదు. చంద్రకాంత రావు గారు బిట్ బ్యాంక్ దిశగా చాలాకృషి చేశారు. వారి సలహాలు కూడా ఉపయోగపడవచ్చు.--అర్జున (చర్చ) 08:33, 6 నవంబర్ 2013 (UTC)
తెవికీలో జికె బిట్స్ చేర్చడానికి అవకాశం లేదనుకుంటాను. విజ్ఞానసర్వస్వములో వ్యాసాలు మాత్రమే ఉండాలి కదా! అయితే పట్టికలకు, కేలండర్ వ్యాసాలకు మాత్రం మినహాయింపు ఉంది. నా ఆసక్తికొద్ది ప్రారంభంలో నేను భారతదేశం - మొట్టమొదటి వ్యక్తులు వ్యాసం (!) ప్రారంభించి ఇలాంటి వ్యాసాలకు ఇక్కడ స్థానం లేదని మానుకున్నాను. వికీకి అనుబంధంగా బిట్స్ కొరకు మరో కొత్త ప్రాజెక్టు వస్తే చెప్పలేము కాని అంతవరకు అర్జునరావు గారు చెప్పినట్లు విజ్ఞానసర్వస్వ వ్యాసాలను అభివృద్ధి చేయటమే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:51, 6 నవంబర్ 2013 (UTC)
"మీకు తెలుసా?" శీర్షికను మరియు ఆ శీర్షిక భండారాన్ని మనం జనరల్ నాలెడ్జి బిట్స్‌గా పాఠకులకు ఉపయోగపడేటట్లుగా చేయవచ్చు. ఉదా:కు ఇది చూడండి సి. చంద్ర కాంత రావు- చర్చ 15:00, 6 నవంబర్ 2013 (UTC)
ధన్యవాదాలండీ అర్జునరావుగారూ, చంద్రకాంతరావు గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:41, 11 నవంబర్ 2013 (UTC)

CIS-A2K Grant Report September 2012-June 2013

(Apologies for writing in English. You are welcome to translate this message)

Greetings! As many of you know that the Wikimedia Foundation approved a 22 month grant to the CIS-A2K. The aim of the grant is to support the growth of Wikimedia movement in India.
Please find the Grant Report for the first 10 months period here.
CIS-A2K will be happy to receive your feedback. Please let us know if you have any suggestions, questions and concerns about the report and our work. We would be glad to have this feedback here.
We are thankful to the Wikimedia community in India, Wikimedia India Chapter and the Wikimedia Foundation for actively engaging with our work. We will continue to work upon our deficiencies, failures and successes. Thanks! --Hindustanilanguage (చర్చ) 06:46, 6 నవంబర్ 2013 (UTC)

కొత్త ఫైల్ అప్లోడ్ విజర్డ్ పరీక్ష

ఫైల్ ఎక్కింపు విజర్డు పనిచేస్తున్నది. దీనిని పరీక్షించి మీ అనుభవాలు, దోషాలు దాని చర్చా పేజీలో ఒకవారంలోగా తెలపండి. దోషాలు తొలగించి ముందు ముందు దీనిని ప్రక్కపట్టీనుండి వాడేటట్లుగా చేయటానికి సహకరించండి. --అర్జున (చర్చ) 13:36, 6 నవంబర్ 2013 (UTC)

పరీక్ష పూర్తయినందున ప్రక్క పట్టీలో చేతనం చేయడానికి బగ్ నివేదించడమైనది.--అర్జున (చర్చ) 00:47, 14 నవంబర్ 2013 (UTC)

తెలుగు పుస్తకాల యూనీకోడీకరణ సింపోజియం పరిణామాలు

తెలుగు పుస్తకాల యూనీకోడీకరణ సింపోజియం లో నా ప్రదర్శనను చూసి వికీపీడియా గురించి మరింత తెలుసుకునేందుకు ఐఐఐటీ-ఆర్జీయూకేటీ ఉపకులపతి రాజకుమార్ గారు నన్ను వారి కచేరీకి ఆహ్వానించారు. వారికి యూనికోడ్ మీద ఉన్న కొన్ని సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఆపైన నూజివీడులోని క్యాంపస్ లో వికీఅకాడెమీ కోసం నేను అభ్యర్థన చేసాను. దానికి సానుకూల స్పందన వచ్చింది. తెలుగు విభాగానికి ఇంచార్జి కుసుమా రెడ్డి గారిని ఈ విషయమై సంప్రదించమన్నారు. నిన్ననే ఆవిడను కలవటం జరిగింది. వారు వికీఅకాడెమీతో పాటుగా తెలుగు యూనికోడ్ పైన విద్యార్థులకు ఒక శిక్షణ లాంటిది ఇవ్వమన్నారు. దీనికి నేను ఇక్కడ చర్చించాక జవాబు ఇస్తానని చెప్పాను. అలానే వాళ్ళు యూనికోడ్ వాడకం మీద కొన్ని పాఠ్యాంశాలు రూపొందించి ఇవ్వమని కూడా అడిగారు. మరొక ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, డీఎల్ఐలో ఉన్న పుస్తకాలన్నీ అధిక శ్రమతో తిరిగి పీడీఎఫ్ లు గా మార్చే బదులు ఐఐఐటీలో స్కాన్ చేసిన పుస్తకాలన్నీ నేరుగా ఇస్తామనీ, వికీసోర్స్ లో జరుగుతున్న సమిష్టి కృషిలో పాలు పంచుకుంటామని కుసుమా రెడ్డి గారు తెలిపారు. అర్జున, వీవెన్, విష్ణు, రవి వైజాసత్య, చంద్రకాంత రావ్, రాజశేఖర్, పాలగిరి, సుజాత , విశ్వనాధ్, జేవీఆర్కే ప్రసాద్, మరియు ఇతర అనుభవజ్ఞులు ఈ విషయమై ఎలా ముందుకు సాగవచ్చో మీ ఆలోచనలు పంచుకోగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 05:57, 7 నవంబర్ 2013 (UTC)

చాలా ప్రగతి సాధించారు. ధన్యవాదాలు. మన దశమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని రూపొందించడానికి మార్గం సుగమం అయింది. డి.ఎల్.ఐ లోని పుస్తకాల సాఫ్ట్ కాపీ మనకి ఇస్తే మనం అప్లోడ్ చేయాలా లేదా వారినే నేరుగా అప్లోడ్ చేయమంటే బాగుంటుందా చూడండి. వారే గనుక నేరుగా అప్లోడ్ చేస్తామంటే మనం వారిలో కొందరు విద్యార్ధులకు గాని, స్టాఫ్ కిగాని అప్లోడ్ చేసే పద్ధతి ని నేర్పించవచ్చును. వారితో టచ్ లో వుండి అవన్ని వికీసోర్సులో చేరినట్లు చూడాలి.Rajasekhar1961 (చర్చ) 07:35, 7 నవంబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ సంతోషకరమైన వార్త చెప్పారు. ధన్యావాదాలు. తెలుగు వికీలో పనిచేయడమే యూనికోడ్ లో పనిచేయడం. మొదట తెలుగు వికీ అవగాహన సదస్సు నిర్వహించి తదుపరి స్పందనను బట్టి ముందు కార్యక్రమము ఖరారు చేసుకోవచ్చు. ఇది సాంకేతిక విద్యాసంస్థకాబట్టి తెలుగు వికీకి అవసరమైన రకరకాల ప్రోగ్రాములను (Wikipedia:Twinkle, గణాంకాలు, విశ్లేషణ ప్రోగ్రాములు లాంటివి) వారి విద్యార్ధులతో చేయిస్తే విద్యార్ధుల నైపుణ్యము పెరగటంతోపాటు మన తెవికీ అభివృద్ధికి చాలా ఉపయోగంగా వుంటుంది.--అర్జున (చర్చ) 09:28, 7 నవంబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ గారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల వ్యక్తిగతంగానే కాకుండా తెవికీకి కూడా మంచి పేరు వస్తుంది. తెలుగు యూనికోడ్‌పై శిక్షణ ఇవ్వడం వల్ల అంతర్జాలంలో తెలుగులో పనిచేయాలనే ఆసక్తి ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే తెలుగు యూనికోడ్‌పై వివరణలు, అభిప్రాయాలు వ్రాయడం అదో పుస్తకం అవుతుంది. యూనికోడ్ అనేది కేవలం తెలుగుకు మాత్రమే కాకుండా చాలా భాషలకు వర్తిస్తుంది. అసలు యూనికోడ్ అంటే ఏమిటి? దాని అవసరం ఏమిటి? యూనికోడ్ ప్రవేశపెట్టడానికి ముందు పరిస్థితి ఏమిటి? ఎప్పుడు ప్రారంభమైంది? దాని వల్ల లాభాలేమిటి? లోపాలేమిటి? తెలుగు యూనికోడ్‌కు-ఇతర తెలుగు ఫాంట్లకు తేడా ఏమిటి? ఇంకనూ చేయాల్సిన మార్పులేమిటి? తదితరాలు శిక్షణలో చెప్పవచ్చు. తెలుగు యూనికోడ్ అంటే కేవలం తెవికీకి మాత్రమే కాదు, బ్లాగులు, వెబ్‌సైట్లు తదితర అంతర్జాల అవసరాలకూ కాదు, ఇంకనూ దీని విస్తృతి చాలాచాలా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా 4వ ప్రపంచ తెలుగుమహాసభల అనంతరం యూనికోడ్ ఉపయోగం బాగా పెరిగింది. విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలలో కూడా యూనికోడ్ వాడకం ఊపందుకుంటున్న వేళ విద్యార్థులకు ఈ విషయంలో అవగాహన కల్పించే అవకాశం రావడం సంతోషకరం. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:10, 7 నవంబర్ 2013 (UTC)
  • తెలుగు యూనికోడ్ అంటే కేవలం ఖతులకు పరిమితం కాదు. సాంకేతికంగా తెలుగులో చేయాల్సినదేదయినా, అది మాట నుండి పాఠ్యం(speech to text), పాఠ్యం నుండి మాట(text to speech), మొ॥ చేయటానికి తెలుగు యూనికోడ్ మాత్రమే ప్రత్యామ్నాయాలు లేని వనరు. చాలా భాషలు కాదు-ప్రపంచ భాషలన్నీను! ప్రభుత్వ కార్యాలయాల్లో యూనికోడ్ ఉపయోగం పెరిగింది అని చెప్పలేము. ఈ మధ్య నేను వెళ్ళిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా లీప్ ఆఫీస్ లాంటి ఉపకరణాలే వాడుకలో ఉన్నవి. ఖతులను ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన సిలికానాంధ్ర లేక సమాచార సాంకేతిక శాఖ ఆ ఖతులని ఇప్పటి వరకూ వారు వాడే ముద్రణలలో ఎక్కడా వాడటం లేదు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:21, 7 నవంబర్ 2013 (UTC)
  • తెలుగు యూనికోడ్ అనేది ఫాంట్లకే పరిమితం కాదు కాని యూనికోడ్ కంటే ముందే "మాట-పాఠ్య-మాట"లు బదలాయించడం జరిగేది, ఇది కొంత క్లిష్టమైనదే కాకుండా ఒక భాష నుంచి మరో భాషకు మాత్రం బదలాయింపు అవకాశం లేకుండేది. అయితే ప్రస్తుతం యూనికోడ్ అనేది ప్రపంచంలోని అన్ని భాషలలో లేదు, అసలు చాలా భాషలకు లిపులు కూడా లేవు, కాకుంటే దాదాపు అన్ని ప్రధాన భాషలలో యూనికోడ్ ఉన్నట్లు చెప్పవచ్చు. (మనదేశంలో 1600 పైగా భాషలుంటే అందులో యూనికోడ్ ఉన్న భాషలు సుమారు ఒక్క శాతమే) ప్రభుత్వ కార్యాలయాలలో యూనికోడ్ వినియోగం నేను ప్రత్యక్షంగా పరిశీలించిన విషయమే తెలిపాను (విధినిర్వహణలో భాగంగా నేను రోజూ అనేక ప్రభుత్వ కార్యాలయాలకు నిధుల తనిఖీకై వెళుతుంటాను). సి. చంద్ర కాంత రావు- చర్చ 16:30, 8 నవంబర్ 2013 (UTC)
  • చంద్రకాంత రావు గారు, మీరు చెప్పిన దానికి ఒక చిన్న సవరణ, యూనికోడ్ భాషలకు కాదు -లిపులకు. భారతదేశంలో లిపిగా గుర్తించబడినవన్నీ యూనికోడ్ లో ఉన్నవి (ధ్వనుల సమానత వలన దగ్గరిగా ఉన్న లిపిలోకి రాత మారి, ఆ లిపినే ఈ భాషకు ఆపాదించుకుంటున్నయి), మాట-పాఠ్యం-మాట అనేది ఉన్నది ఆస్కీ ఆధారిత భాషలకి, అవి యూనికోడ్ లో అంతర్భాగాలు. మన దేశంలో 1800 భాషలున్నవా లేక 1800 లిపులున్నవా? తెలియచేయగలరు. యూనికోడ్ ఈ మధ్య రాలేదు, 95 కు ముందునుండే ఉంది. 95 లో జావా వాడకం ఎక్కువవటం వలన మరింత ప్రాచుర్యం పొందింది. రహ్మానుద్దీన్ (చర్చ) 16:45, 8 నవంబర్ 2013 (UTC)
  • యూనికోడ్ అనేది లిపికే కాని భాషకు కాదు కదా! మీరు "చాలా భాషలు కాదు-ప్రపంచ భాషలన్నీను!" అంటే అన్ని భాషలకు లేదన్నాను. దాదాపు అన్ని లిపులకు ఉన్నాయంటే నేనూ ఒప్పుకుంటాను. దేశంలో 1600పైగా ఉన్నవి భాషలే అని పైన స్పష్టంగానే చెప్పాను కదా! సి. చంద్ర కాంత రావు- చర్చ 16:54, 8 నవంబర్ 2013 (UTC)
  • మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో చూసిన మార్పు చాలా ఆనందదాయకం.ఇవిఅంతర్గతాలవటం వలన నా దృషికి రాకపోయి ఉండవచ్చు. కానీ నేను పరిశీలించిన కొన్ని విషయాలౌ మీతో పంచుకుంటున్నాను:

1. తెలుగు యూనివర్సిటీ కంపారిటివ్ స్టడీస్ విభాగం (ప్రముఖ భాషావేత్త మృణాళిని గారి కచేరీ) లో ఇంకా లీప్ ఆఫీస్ వాడటం, యూనికోడ్ వాడకంపై వారికొక వివరణ ఇస్తే, దానిని వారు సరిగా పట్టించుకోకపోవడం! తెలుగు వర్సిటీ ప్రచురణలు మరియు అమ్మకాల విభాగం వారి యూనికోడ్ కై పూర్తి విముఖత.
2. హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రెరీ, చిక్కడ్ పల్లి వారిని తెలుగు యూనికోడ్ విషయమై సంప్రదిస్తే విముఖత.
3. సెంట్రల్ యూనివర్సిటీలో ఈనాటికీ ఏమయినా తెలుగు విషయం రాయాలంటే కాంపోజింగ్ కి అను వాడకం.
4. రేషన్ కార్డుల పంపిణీ, మరియు వోటర్ గుర్తింపు కార్డ్ పంపిణీకి తెలుగు యూనికోడ్ వాడకపోవటం.
5. ఆధార్ గుర్తింపు కార్డుల లో కూడా పూర్తి స్థాయి యూనికోడ్ వాడకపోవటం.
6. మేము యూనికోడ్ మాత్రమే వాదుతున్నాం అని చెబుతున్న కొన్ని సంస్థలు, (వార్తా సంస్థలు కావచ్చు. ప్రచురణవి కావచ్చు) అను లో టైపు చేసుకొని యూనికోడ్ కి మార్చే సాధనాలను వాడి, వచ్చిన యూనికోడ్ పాఠ్యం సరి చూసుకోకుండా ప్రచురించి వేయడం. రహ్మానుద్దీన్ (చర్చ) 16:56, 8 నవంబర్ 2013 (UTC)

  • మీరు సంస్థలను పరిశీలించారు, నేను ప్రభుత్వ కార్యాలయాలు పరిశీలించాను. వీటిలోనూ ప్రాంతాలను బట్టి తేడాలుండవచ్చు. మీరు పైన తెలిపిన సంస్థలలో యూనికోడ్ పట్టించుకోవడం లేదనే విషయం ఇక్కడ పరిశీలించిననూ నిజమే కావచ్చు. దానికి చాలా కారణాలుండవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలలో (ఇక్కడి సంగతి మాత్రమే) మాత్రం గత డిసెంబరు నుంచి ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలని ఆదేశాలు జారీచేసి, ప్రతి కార్యాలయంలో యూనికోడ్ సాఫ్ట్‌వేర్ కూడా అందించారు, కంప్యూటర్ వాడేవారికి శిక్షణకూడా ఇచ్చారు. రాష్ట్ర ఆడిటు శాఖ వెబ్‌సైట్‌లో కూడా సాఫ్ట్‌వేరు ఉంచారు. అన్ని నివేదికలు (పాతవికూడా) ఖచ్చితంగా యూనికోడ్‌లోనే సమర్పించి వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఇలాంటి విషయాలను పరిశీలించడానికి నేను కూడా పాలమూరు విశ్వవిద్యాలయం సంప్రదించాలనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:24, 8 నవంబర్ 2013 (UTC)
చాలా బాగుంది. మీరు చక్కని బాటలు వేస్తున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకునే దిశగా కొన్ని ప్రశ్నలు - డీ.ఎల్.ఐ పుస్తకాలు డిజేవియూ పద్ధతిలో?? ఉన్నాయి కదా వాటినీ నేరుగా పీడిఎఫ్ చేసే సాఫ్టువేరు ఏమీ లేదా? యూనీకోడ్ విశిష్టత, సౌలభ్యం తదితర అంశాలు వివరిస్తూ కొంత సమాచారం జతచేసుకోండి. రచ్చబండ, తెలుగు బ్లాగు, తెలుగు యూనీకోడ్ మొదలైన గూగుల్ గుంపుల్లో మీకు కావలసిన సమాచారం లభిస్తుంది. తెలుగు వికీ వారికి సాధనాస్థలంలాగా ఉపయోగపడుతుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ యుగంలో ప్రభుత్వరంగ సంస్థలు ఇంకా యూనీకోడు వాడకం గురించి మొరాయించడం శోచనీయం. మనం సాంకేతికతను ఎత్తిచూపకుండా ఉపయోగ్యతను బాగా ఎత్తిచూపాలనుకుంటా. అనూఫాంటులోనో, లీప్ లోనో ట్వీట్ చెయ్యగలరా? మనం యువత నుండి మొదలుపెడితే ఆ పైన వాళ్ళు దిగిరావటానికి అట్టేకాలం పట్టదు --వైజాసత్య (చర్చ) 03:29, 9 నవంబర్ 2013 (UTC)

నిర్వాహకత్వాన్ని అస్పృశ్యం చెయ్యొద్దు ప్లీజ్

ఇటీవల నిర్వాహకులను దెప్పిపొడవటం, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించటం చూస్తున్నాను. నిర్వహణ సరిగా జరగటం లేదు, తగినంతమంది నిర్వాహకులు లేరు అని చంద్రకాంతరావుగారిలాంటి వాళ్లు ఘోషిస్తున్న తరుణంలో నిర్వాహకులపై ఇలాంటి ఆరోపణలు చేయటం శుభసూచకం కాదు. నిర్వాహకులు తప్పులు చేయరు అని కాదు. నిర్వాహకులు కూడా సభ్యులే అని మరవరాదు. నిర్వాహకులు చేసే పనులని నిర్వాహకత్వ అధికారమధాంధకార దర్పణంలోని చూడొద్దు. అసలు ఒక సభ్యుడు నిర్వాహకుడవటంవలన ఆ సభ్యుని అభిప్రాయాలకు గానీ, ఆలోచనలకు గానీ ప్రత్యేకత ఇవ్వబడదు. నిర్వాహకులకు ఒక వ్యాసాన్ని తొలగించే వీలువంటి కొన్ని అదనపు సదుపాయాలుంటాయి. అంత మాత్రంచేత నిర్వాహకుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఉదాహరణకు ఒక వ్యాసం యొక్క తొలగింపుకు సముదాయం అంగీకరించకపోతే నిర్వాహకుడు తొలగించగలిగే సదుపాయమున్నా, ఏమీ చెయ్యలేరు. నిర్వాహకుల మొదటి కర్తవ్యం సముదాయం కోరిన పనులు చెయ్యటం. ఒక సభ్యుడు నిర్వాహకుడవగానే తనకు సభ్యునిగా ఉన్న హక్కులను కోల్పోడు. నిర్వాహకుడు కేవలం నిర్వాహకహోదాలో తీసుకునే నిర్ణయాలేవీ లేవు. నిర్వాహకులు సముదాయపు నిర్ణయాలను అమలుపరిచేందుకే ఉంటారు, నిర్ణయాలు తీసుకునేందుకు కాదు. మరో మాటలో చెప్పాలంటే సాధారణ సభ్యుడు నిర్ణయించలేని విషయాలంటూ వికీలో ఏమీ లేవు. కేవలం నిర్వాహకులు మాత్రమే నిర్ణయించే విషయాలు ఏమీ లేవు. అంతగా మీకు నిర్వాహకత్వం ఏదో ఒక హోదాగా అనిపించి, నిర్వాహకులకేవో ప్రత్యేకమైన శక్తులున్నాయనిపిస్తే తప్పకుండా నిర్వాహకత్వపు బాధ్యతలు స్వీకరించి చూడండి. అందుకు అందరూ సదా ఆహ్వానితులు. దయచేసి నిర్వాహకత్యం మాకొద్దు బాబోయ్ అనేట్టు చేయవద్దు ప్లీజ్. నేను అధికార హోదా తొలగించుకున్నది. వికీని ప్రభావితం చేయటానికి అధికారే కానవసరం లేదనే సందేశం ఇవ్వటానికే కానీ, అధికారం "భారం" అయ్యి మాత్రం కాదు. (అయినా అందులో అధికారం ఏమీ లేదు). సముదాయం ఫలానా సభ్యున్ని నిర్వాహకుడో, అధికారో చేయాలని నిర్ణయిస్తే అధికారి ఆ ఆజ్ఞను అమలుపరచగలడు. అదే అధికారులకున్న పెద్ద "అధికారం". కొంత మంది సభ్యులు సముదాయాన్ని ప్రభావితం చేయగలుగుతున్నారంటే అది నిర్వాహకుడవటం వల్లనో, అధికారి అవటం వల్లనో వచ్చిన అధికారమో, హోదానో, హక్కో కాదు. సంవత్సరాల తరబడి తెలుగు వికీ శ్రేయస్సు కోరి ఇతర సభ్యులతో కలిసిమెలిసి పనిచేసి నలుగురి నుండి సంపాదించుకున్న అనుభవంతో కూడిన గౌరవమే కానీ లాంఛనప్రాయంగా వచ్చిన మరే అధికారం కాదు. --వైజాసత్య (చర్చ) 03:04, 9 నవంబర్ 2013 (UTC)

  • వికీపీడియాలో నిర్వాహకులచిహ్నం
    వైజాసత్య గారు చెప్పినదాన్ని ఒక్క చూపులో చెప్పే ఆంగ్ల వికీలో వాడుతున్న బొమ్మని తెలుగులోఇక్కడ చూపెట్టటంతో పాటు సంబంధిత పేజీలో చేర్చాను. అయితే అనుభవం ఎక్కువగా వున్నవారు, వికీపీడియాపై ఆకర్షణ ఎక్కువగావున్నవారు, ఎక్కువగా పనిచేసేవా‌‌‌‌‌ళ్లు నిర్వాహకునిగా లేక సభ్యునిగా చొరవతో కొన్ని పనులు చేసినప్పుడు అవి నచ్చనపుడు సౌహార్ద్ర వాతావరణంలోవారి దృష్టికి తీసుకువెళ్లితే తగిన పరిష్కారము దొరకటం సులభమవుతుంది. అలాగే ఒక నిర్వాహకుని చర్యలు సభ్యులకు ఇబ్బందిగా మారితే ఆ నిర్వాహకుని తప్పుకోమని కోరవచ్చు. వీటన్నిటికి తెవికీలో తగిన విధానాలు చేయటం కష్టంకాబట్టి (చాలా తక్కువ మంది పాల్గొంటున్నారు కాబట్టి) ఆంగ్ల వికీ విధానాలనే (మనకు ఇబ్బంది కలిగి మన స్వంతంగా విధానాలు ఏర్పాటుచేసుకొనేవరకు) వాడడం మంచిదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 03:55, 9 నవంబర్ 2013 (UTC)
  • పాలగిరి-రమణ గార్ల విషయం చాలా చిన్నది. అయితే ఇద్దరి వద్దా తమ పేరే సరైనదనే ఆధారం ఉంది కాబట్టి చర్చ కొనసాగింది. ఇందులో నిర్వహణకు సంబంధించి ఎలాంటి లోపం లేదు. వ్యాసంపేరును తరలించిన పిదప ఏర్పడిన దారిమార్పు పేజీలో పాలగిరి గారు పేజీ ఖాళీచేసి సమాచారం చేర్చారు. ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది. వ్యాసచరితం బాగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. వ్యాసాన్ని మళ్ళీ పాతపేరుకు తరలిస్తే సరిపోయేది. (ఇలా చేయాలంటే ముందు పాతపేరు ఉన్న పేజీ తొలిగించాలి, ఇది మాత్రం నిర్వాహకులకే సాధ్యం). పాలగిరి గారు అలా చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు కూడా, కాని పాత పేజీ తొలిగించనిదే ఆ పేరుకు తరలించడానికి వీలుకాదు. పాలగిరి గారు దారిమార్పు పేజీలో సమాచారం చేర్చడం వల్ల ఈ వ్యాసం ఇప్పుడు రమణగారే ప్రారంభించినట్లు, ఓలియిక్ ఆమ్లం పేజీని పాలగిరి గారు ప్రారంభించినట్లు ఉంది (ఏదేని వ్యాసాన్ని తరలించిననూ చరితం మొత్తం కొత్త పేరు వ్యాసానికే తరలుతుంది. దారిమార్పు పేజీ మాత్రం తరలించిన వారిపేరిట ఏర్పడుతుంది. ఆ దారిమార్పు పేజీలోనే పాలగిరి గారు సమాచారం చేర్చినట్టు చరితం ప్రకారం తెలుస్తుంది) పాలగిరిగారు నిర్వహణపై విరుచుకుపడడానికి కారణం ఇలా వ్యాస ప్రారంభకుల పేర్లను నిర్వాహకులు తమపేరిట చేర్చుకునే అవకాశం ఉన్నదనే అనుమానం మాత్రమే కావచ్చు. ఇక నిర్వహణ గురించి చెప్పాలంటే నేను ఇదివరకే చెప్పినట్లు నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ఎంత పటిష్టంగా, ఆలోచించి చేసిననూ నిర్వాహకులను నిరంకుశులుగా పేర్కొన్న విషయం ఇదివరకు నాకూ అనుభవమైంది. ఇలాంటి కారణాల వల్లే నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదేమో! "అడ్డదిడ్దమైన రచనలను చేసె వారిని నిర్వహకులు ఏమి అనరు,ఏమి చెయ్యరు. ఏమి చెయ్యలేరు." అని పాలగిరి గారు చెప్పిన విషయాన్ని మాత్రం మనం ఆలోచించాలి. ఇటీవలి కాలంలో మనం ఎన్ని చర్చలు జరిపినా ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు కాని "గంటల తరబడి నిద్రలేకుండా రచనలు చేసే వారికి" మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం పాలగిరి గారి మాటల్లో వ్యక్తమైంది. చర్చలు జరపడంలో తప్పులేదు కాని వ్యవస్థపై నిందలువేయడం/తప్పుపట్టడం మాత్రం చేయకుంటే బాగుండేది. ఇక్కడ మనం కృషిచేసేది వ్యవస్థ కోసం మరియు పాఠకుల కోసం అనేది దృష్టిలో ఉంచుకొని తెవికీ అభివృద్ధికి పాలగిరిగారు తెవికీలో రచనలు కొనసాగిస్తారనే భావిస్తున్నాను. అలాగే వైజాసత్య గారు చెప్పినట్లు తెవికీలో ఎవరైనా చేర్చిన సమాచారాన్ని మరెవరైనా మార్చవచ్చు (నిబంధనలకు లోబడి) దీనిపై అభ్యంతరాలుంటే చర్చాపేజీలో తప్పకుండా తెలుపవచ్చు. మరోవిషయం ఏమిటంటే ఏదేని వ్యాసం యొక్క పేరు మార్చాలన్ననూ ఆ వ్యాసం యొక్క రచయితను మాత్రమే కాకుండా సభ్యుల మెజారిటీ నిర్ణయమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. అంటే ఇక్కడ ఏ వ్యాసమైనా, ఎవరు ప్రారంభించినా, ఎవరు పొడిగించినా లేదా ఏ ఒక్కరి వల్లే అభివృద్ధిచెందిననూ దానిపై అధికారం మాత్రం అందరికీ ఉంటుదన్నమాట. ఈ విషయాలన్నీ మనం స్పష్టంగా సభ్యులకు తెలుసుకొనే అవకాశం ఇచ్చినప్పుడు ఇలాంటి వాదవివాదాలు చాలా వరకు తగ్గుతాయి అదే సమయంలో నిర్వహణ చేసేవారి ఇబ్బందులూ తగ్గుతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:08, 9 నవంబర్ 2013 (UTC)
  • వెంకటరమణ గారు చర్చాపేజీలో చర్చించకుండా తరలించడం తప్పు అయింది, దానికి ఆయన క్షమించమని అడిగారు. అయినా పేరు గురించిన వివాదం పూర్తి కాలేదు. వారివురూ పేరు విషయంలో రాజీ పడేదానికి మనం ఏమైనా సూచనలు ఇవ్వగలిగితే బావుంటుంది, తద్వారా పాలగిరి గారిని సంతృప్తి పరచగలమేమో.(నేను ఇక్కడ ప్రొనోసేషన్ లింక్ ఇస్తున్నా, [2],
    ఒలిక్ ఆమ్లం
    ..విశ్వనాధ్ (చర్చ) 06:16, 10 నవంబర్ 2013 (UTC)
చక్కగా పరిస్థితిని విశ్లేషించిన చంద్రకాంతుల వారికి ధన్యవాదాలు. విశ్వనాథ్ గారూ, ఆ వ్యాసాన్ని రమణ గారు దారిమార్పు చేసినప్పుడు అందులో పెద్ద విషయమేమీ లేదండి. అందుకే వారికి చర్చించవలసిన అవసరం కనిపించకపోయి ఉండవచ్చు. ఇక అసలు విషయానికొస్తే రెండూ సరిగానే తోస్తున్నాయి. అరువు పదాల ఉఛ్ఛారణలో ఇలాంటి తారతమ్యాలు ఉండటం సహజమే. ఏదో ఒక దాన్ని దారిమార్పు గాను, ఒకదాన్ని ప్రధానవ్యాసంగాను చేస్తే సరిపోతుంది. ఇదివరకు ఈఫిల్ టవర్ విషయంలో ఇలాంటి చర్చ ఒకటి జరిగింది. వేమూరి వారు ప్రపంచంలో చాలామందికి ఐఫిల్ టవర్ గా పరిచయమన్నారు. ఆంధ్రులు మాకు ఈఫిల్ టవర్ గానే తెలుసన్నారు. ఫ్రెంచి వాళ్ళు తూరా దె ఎఫెల్ అన్నారు :-) --వైజాసత్య (చర్చ) 08:13, 10 నవంబర్ 2013 (UTC)
నా Palagiri/sand Box లో 11,798 బైట్ల వ్యాసం వ్రాసి,దానిని ప్రధాన వ్యాస పుటకు తరలించాను, నా palagiri/sand Box కూర్పుల చరితం చూడండి.పాలగిరి (చర్చ) 09:11, 10 నవంబర్ 2013 (UTC)
అంతకు ముందు రోజు ఇలాగే ప్రొపెన్(propene)అనే శీర్షికతో నేను వ్రాసిన వ్యాసాన్ని ఫ్రొపేను గా వ్యాసంలోని పేరుతో సహా మార్చారు.అదికుడా 20కిలో బైట్ల వ్యాసం,రెండో రోజు ఈ వ్యాసం.వరుసగా రెండు వ్యాసాలను మార్చితే కోపం రావడం తప్పని నేననుకోలేదు.అందుకే అలా స్పందించా.పాలగిరి (చర్చ) 09:31, 10 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారి శాండ్ బాక్స్ చరిత్ర చూస్తే వారి మార్పులు చూడవచ్చు. ఆ వ్యాసాన్ని తరలించక మీరు సమాచారాన్ని నకలు చేసి అతికించేసరికి మీ కృషి వ్యాస పేరుబరిలో ఒక్క మార్పుగా నమోదయింది. మీ మార్పులు లెక్క వ్యాసేతరములలో అలానే వుంటుంది. ఇకముందు వాడుకరి పేరుబరినుండి వ్యాసం పేరుబరికి తరలించి చూడండి అప్పుడు చరిత్రకూడా పూర్తిగా కనబడుతుందనుకుంటా.--అర్జున (చర్చ) 09:42, 10 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారు నవంబరు 6న సమయం 20:13కు శాండ్‌బాక్స్ నుంచి 11798 బైట్ల సమాచారం కట్ చేసి ఒలిక్ ఆమ్లం పేజీ సృష్టించి అందులో అతికించారు. పాలగిరి గారు 18 దిద్దుబాట్ల ద్వారా వ్యాస పరిమాణాన్ని 21996 బైట్లకు చేర్చిన పిదప నవంబరు 7న సమయం 2:50న రమణగారు ఓలియిక్ ఆమ్లంకు తరలించారు. పాలగిరి గారు అదేరోజు సమయం 3:55న వ్యాసాన్ని ఓలిక్ ఆమ్లంకు తరలించారు. అదే రోజు సమయం 4:33కి సమాచారం మొత్తం తొలిగించి ఒలిక్ ఆమ్లంలో అతికించారు. వాస్తవానికి ఇది దారిమార్పు పేజీ కావడంతో చరితం మొత్తం తారుమారు అయింది. ఇప్పుడు నేను చరితాన్ని అసలు పేజీకి తీసుకువచ్చి ఒలిక్ ఆమ్లం పేజీని పాలగిరి గారే ప్రారంభించినట్లు చేశాను (చూడండి). కాని సమాచారం మాత్రం ఓలిక్ ఆమ్లం పేజీలో ఉంది. అదికూడా నేనే చేస్తే అన్ని బైట్ల సమాచారం నేనే చేర్చినట్లు నా పేరిట వస్తుంది కాబట్టి వదిలివేశాను. ఆ పని పాలగిరి గారే చేయాలి. వ్యాసం పేరును మళ్ళీ తరలించిననూ ఇప్పుడు సమస్య ఉండదు. చరితం మొత్తం కొత్త పేరుకే బదిలీ అవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:09, 10 నవంబర్ 2013 (UTC)
చరితం వచ్చింది కాబట్టి వెనక్కి వెళ్ళి ఒలిక్ వ్యాస పాతకూర్పులను కూడా పునఃస్థాపితం చేసే అవకాశం ఉంది కాని ఇక్కడి నుంచి కట్ పేస్ట్ చేసిన పిదప వేరే పేజీలో చేసిన మార్పులు ఇందులో చేరవు కాబట్టి అక్కడి వ్యాసాన్నే పాలగిరి గారి ద్వారానే అతికించడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:29, 10 నవంబర్ 2013 (UTC)
పాలగిరి గారు ఒలిక్ ఆమ్లంలో సమాచారం కూడా చేర్చారు కాబట్టి ఇప్పుడు ఒలిక్ ఆమ్లం వ్యాస చరితం సమస్య తొలిగిపోయింది. ఓలిక్ ఆమ్లం, ఓలియిక్ ఆమ్లం పేజీలు దారిమార్పులుగా ఉన్నాయి. కాబట్టి వ్యాసాలలో ఎవరి ఒక్క దిద్దుబాటుకు కూడా భంగం కలగలేదు. చరితం సమస్య సుఖాంతమైంది ఇక వ్యాసం పేరుపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే మాత్రం ఆ వ్యాస చర్చాపేజీలో కొనసాగించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:00, 10 నవంబర్ 2013 (UTC)

సమస్యను మంచిగా పరిష్కరించారు. చంద్ర కాంత రావు గారికి అభినందనలు...విశ్వనాధ్ (చర్చ) 06:35, 11 నవంబర్ 2013 (UTC)

పాలగిరి గారూ, ప్రొపెన్ వ్యాసాన్ని తరలించినప్పుడు మీకు అభ్యంతరం ఉంటే దాని చర్చా పేజీలో వ్రాయవలసినది. మీరు ఊరకుంటే మీకా మార్పు అంగీకారమే అని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే, వికీలో ప్రతి మార్పును ఇతరల అనుమతి తీసుకొని చెయ్యటం అసాధ్యం. ఇరవై కేబీలున్న వ్యాసాన్ని దారిమార్పు చెయ్యకూడదని ఎమీలేదు. మీరు వికీలో పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాస్తూ చక్కని కృషి చేస్తున్నారు. విషయంపై చర్చించకుండా, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని మాత్రమే ఎత్తిచూపాను. అయినా మీరు ఇసుకపెట్టెలో వ్రాసి ఎందుకు తరలిస్తున్నారు? అలా తరలించవలసిన అవసరం ఉండకూడదు. పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాయటమంటే ఒకేసారి ఇరవై కేబీలు వ్రాయటం కాదు. ఒక వ్యాసాన్ని మొదలుపెట్టి అంచలంచెలుగా సమగ్రంగా తీర్చిదిద్దటం. ఎదైనా మార్పు సరైనది కాదనిపిస్తే తప్పకుండా దాన్ని చర్చించండి. విమర్శనాత్మక దృష్టిలేకపోతే వికీ తప్పులతడకైపోతుంది. అదే పద్ధతిన ఎవరు వ్రాసిన వ్యాసాన్నైనా ఇతరులు దిద్దేందుకు జంకకూడదు. ఈ ప్రక్రియలో వాగ్వివాదాలు మామూలే, కాకపోతే విమర్శలు వ్యక్తిగతం కాకుండా, అవతలి వాళ్ళు మనలాగే వికీ శ్రేయస్సు కొరకై కృషిచేస్తున్నారని ఆలోచించాలి --వైజాసత్య (చర్చ) 07:18, 15 నవంబర్ 2013 (UTC)

తెలుగు వికీపీడియా స్వయం శిక్షణ కొత్త సంచిక కొరకు వికీపీడియన్ ఫోటో ఎంపిక

వికీపీడియా:రచ్చబండ#తెలుగు వికీపీడియా బ్రోషర్ ముద్రణ లో చర్చించినట్లు, కొత్త సంచిక తయారీలో వికీపీడియన్ ఛాయాచిత్రం వాడబోతున్నారు. ఆంగ్లానికి ఎడ్రియేన్ వాడెవిట్జ్ ఎంపిక చేశారు. ఛాయాచిత్రనిపుణుడు తీసిన ఇంకొన్ని చిత్రాలు సూచించారు కాని వాటిలో తెలుగు వారు లేరు. మన తెలుగు పుస్తకంకొరకు ఏ వికీపీడియన్ ఫొటో ఎంపికచేస్తే బాగుంటుందో ఇప్పటికే వికీలో వున్న ఉదాహరణ ఫోటో లింకును ఒక వారంలోగా (20 నవంబర్ 2013 లోగా)సూచించండి మరియు చర్చించండి. (పూర్తి సందర్భం కొరకు చూడండి. సరియైన నాణ్యత గల ఫోటో లేకపోతే వృత్తి నిపుణుడైన ఛాయచిత్రకారుడుతో తగిన ఫోటో తీయించి పంపవచ్చు కూడా.--అర్జున (చర్చ) 04:53, 13 నవంబర్ 2013 (UTC)

నా ఫోటో పెట్టడానికి పెద్దలు ప్రయత్నిస్తే నాకు అభ్యంతరము లేదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:24, 13 నవంబర్ 2013 (UTC)
జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి స్పందనకు ధన్యవాదాలు. అనుమతికూడా ముఖ్యమైనదే. కాని ఎంపికకు కొలబద్దగా వుండవలసినవేమిటన్నవికూడా చర్చించి, అలాగే ప్రతిపాదనలు చేసేటప్పుడు స్వంతపేరుని ప్రతిపాదించడంతో పాటు, ఇతరుల పేర్లను కూడా ప్రతిపాదించి, అలా ప్రతిపాదించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా పేర్కొంటే ఈ చర్చను అర్ధవంతంగా చేయటానికి వీలుంటుంది. --అర్జున (చర్చ) 06:25, 13 నవంబర్ 2013 (UTC)

అర్జున గారు, చర్చకు విషయము వస్తుందని ముందుగా వ్రాశాను. తదుపరి,

  • ముందు ఫోటోల ప్రదర్శనకు అభ్యంతరము లేని ఆశించే వారి జాబితా తయారు చేసుకోవాలి. వారి వారి అనుమతి తప్పనిసరి.
  • తెలుగు పుస్తకం కొరకు మొత్తం తెలుగు వారే ఉండాలి.
  • ఫోటోలు యొక్క పరిమాణము, ప్రమాణములు పొందు పరచాలి
  • ప్రతి అభ్యంతరము వాడుకరికి వెనువెంటనే తెలియజేస్తూ, తగిన సమయము ఇస్తూ, గడువు తేదీ ప్రకటించాలి.
  • ఏ వికీపీడియన్ ఛాయాచిత్రం అయినా ఖాయం అయిన తదుపరి సభ్యులకు తెలియజేస్తే మంచిది.
  • ఫోటోల ప్రదర్శన తదుపరి ఆ ఫోటోలను ఏవిధంగా నయిననూ దుర్వినియోగ పరచినట్లయిన వికీపీడియాకు ఎటువంటి బాధ్యత ఉండదు.
  • వికీపీడియన్ ఛాయాచిత్రం ఎంపికలో వారివారి కృషి, సేవలు, వరిశ్టులు, ఇలా అనేక అంశలు పరిగణనలోనికి తీసుకోవాలి.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారి సూచనలకుధన్యవాదాలు. అన్ని తెలుగు వికీప్రాజెక్టులు, కామన్స్ లకు ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్లో ని కృషిని పరిగణించితే బాగుంటుంది. ఇక అనుమతి ముందు తీసుకోవాలా లేక పొట్టిఎంపిక జాబితా చేసిన తరువాత తీసుకోవాల అనికూడా ఆలోచించవచ్చు. ఫోటోలు నాణ్యతగా వుండాలి. అవసరమైతే ప్రత్యేకించి ఛాయాచిత్రనిపుణుడిచే తీయించాలి. వీటికి ఏమైనా ధనం అవసరమైతే తగిన రసీదుతీసుకొని ఆసభ్యునికి చెల్లించవచ్చు. --అర్జున (చర్చ) 07:07, 13 నవంబర్ 2013 (UTC)
బ్రోచర్ రెండు పేజీలుగా ఉన్నది. బొమ్మ ఎక్కడ ఉపయోగిస్తారు అనేది తెలుపగలరా?. .విశ్వనాధ్ (చర్చ) 07:28, 13 నవంబర్ 2013 (UTC)
నేనంటున్నది వికీపీడియా స్వయంశిక్షణ పుస్తకం గురించి. కొత్త సంచిక చిత్తుప్రతి పేజీ చూడండి. ఇది 16 పేజీలుమించి వుంటుంది.--అర్జున (చర్చ) 07:43, 13 నవంబర్ 2013 (UTC)
విధానం

2011లోవిశిష్ట వికీమీడియన్ గుర్తింపు విధానం దీనికి అవలంబించవచ్చేమో పరిశీలించి సూచనలు చేయండి. దేనికైనా కనీసం ముగ్గురు సభ్యుల ఎంపిక మండలిని నిర్ణయిస్తే ఎంపిక సమర్ధవంతంగా చేయటం వీలవుతుంది. --అర్జున (చర్చ) 08:26, 13 నవంబర్ 2013 (UTC)

బావుంటుంది కాని అందరూ తమ బొమ్మ పెట్టడానికి ఇష్టపడనప్పుడు. ఇష్టపడిన వారి బొమ్మలు పెట్టడం ఉత్తమం. ఎక్కువమంది ముందుకు వస్తే మీరన్న పద్దతిలో ఎక్కువగా కృషి చేస్తున్న వారిలో నుండి ఎన్నుకోవడం చేయవచ్చును...విశ్వనాధ్ (చర్చ) 10:35, 13 నవంబర్ 2013 (UTC)
మనము దీనిని పదిమందికి విశిష్ట గుర్తింపు కు ఎంపిక చేయడానికి విస్తరించవచ్చు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ఇప్పటివరకు పనిచేసిన దాదాపు 600 మందిలో 10మందిని గుర్తించలేకపోతే అర్ధ రహితం అనుకుంటాను. అప్పుడు ఆ పది మందిలో ఎవరో ఒకరు తమ ఫోటో వాడుకకు అనుమతి ఇస్తారనుకుంటాను. ఈ న్యాయ నిర్ణేతల మండలిలో సభ్యత్వాని కి ప్రతిపాదనలు కావాలి. ఇప్పటికే గుర్తింపువున్న వారు మరియు /లేక తెవికీలో చాలాకాలం పనిచేసిన వారు ముందుకు వస్తే బాగుంటుంది. (అంటే దీని పర్యవసానం ఈ న్యాయనిర్ణేతల మండలి లోనిముగ్గురు సభ్యులు ఈ కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు మరియు గుర్తింపుకి సభ్యులను ప్రతిపాదించడానికి వీలుండదు.) నా వరకు నేను స్వచ్ఛందంగా ఈ మండలి సభ్యత్వానికి ప్రతిపాదన చేస్తున్నాను. అభ్యంతరాలేవైనా తెలపండి. మీరు కూడా దీనిలో వుండవలసిన సభ్యులపేర్లను స్వచ్ఛందంగా స్వంత ప్రతిపాదనను లేక వేరే వాళ్లను ప్రతిపాదించవచ్చు. ఎక్కువ ప్రతిపాదనలుంటే అభ్యంతరాలేవైనా పరిశీలించి ముగ్గురిని ఎంపికచేసుకోవచ్చు. --అర్జున (చర్చ) 23:51, 13 నవంబర్ 2013 (UTC)
అర్జునరావుగారి ప్రతిపాదనలలు సమంజసంగా ఉన్నాయి. 10 సంవత్సరాల వికీపీడియా చరిత్రలో 10 మందిని గుర్తించడం సులువే. న్యాయనిర్ణేతల మండలిలో అర్జునరావుగారు ఉండడానికి అనుమతించడం ముదావహం. --t.sujatha (చర్చ) 05:47, 14 నవంబర్ 2013 (UTC)
అర్జునరావుగారితో పాటు మరికొందరు రాజశేఖర్, చంద్రకాంతరావు, లాంటి సీనియర్ సభ్యులు కొందరు కూడా ఉంటే బావుంటుది, నా వ్యక్తిగత చిత్రం ఉపయోగించడానికి నేను కూడా ముందుకు వస్తున్నను.....విశ్వనాధ్ (చర్చ) 12:48, 14 నవంబర్ 2013 (UTC)
ఈ భారత దేశంలో అన్ని విభాగాలలో ఉన్నట్ట్లే, మన తెలుగు వికీపీడియాలో కూడా ఆస్థాన వాడుకరులు సంఖ్య బాగానే ఉన్నారు. వారినే ఒక జాబితా తయారు చేస్తే, అందులోనే వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు పొందు పరుచుతారు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా తేలిక. తదుపరి, ఆశావహులు మాత్రం బహుస్వల్పం, అవకాశము అంతంత మాత్రము కావచ్చు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:20, 14 నవంబర్ 2013 (UTC)
t.sujatha , విశ్వనాధ్, జె.వి.ఆర్.కె.ప్రసాద్ గార్ల స్పందనలకు ధన్యవాదాలు. ప్రసాద్ గారి వ్యాఖ్యల్లో భావం పూర్తిగా అర్ధంకాలేదు. విశిష్టవికీమీడీయన్ గుర్తింపుకి స్వంత ప్రతిపాదనలే భేషు అని అనుకుంటే ఆ ప్రతిపాదన ముసాయిదా వికీపీడియా పేరు బరిలో చేర్చి ఇక్కడ లింకు ఇవ్వండి.--అర్జున (చర్చ) 01:26, 15 నవంబర్ 2013 (UTC)
ఎంపిక సంఘం సభ్యుడిగా ఉండటానికి నాకే అభ్యంతరం లేదు. --వైజాసత్య (చర్చ) 06:58, 15 నవంబర్ 2013 (UTC)
నేను ఎంపిక సంఘ సభ్యుడిగా ఉండటానికి సమ్మతమే. అర్జునరావుగారు ఎంపిక సంఘ సభ్యుడిగా ముందుకు వచ్చినందుకు, ధన్యవాదాలు. కాని, నేను ఇందుకు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నాను. ఎందుకంటే, ఎంపిక సంఘ సభ్యులు కొత్త గుర్తింపుకు అనర్హులవుతారు కాబట్టి. మనకున్న ముఖ్యమయిన కృషీలురులలో వీరు ఒకరు కనుక. నా అసమ్మతిని పెద్ద మనసుతో క్షమించగలరు.రాధాక్రిష్ణ (చర్చ) 10:35, 15 నవంబర్ 2013 (UTC)
ఎంపిక కోసం నిర్ణయించే సంఘంలో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడానికి నేను మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను. మన తెవికీలో పదిమంది కృషీవలుల్ని గుర్తించి సన్మానించడం చాలా మంచిపని. ఇది మిగిలినవారికి ప్రోత్సాహకంగా కూడా వుంటుంది. ప్రైజ్ మనీ రూ. 10,000 వేలకు తక్కువకాకుండా ఉండాలి. అంటే పదిమందికి ఒక లక్ష రూపాయలు అవసరం అవుతాయి. వాటికి దాతల్ని గుర్తించి వారిని సంప్రదించాలి. ఆ ధనాన్ని మనం తేగలం అనుకుంటేనే ముందుకు పోవాలి. లేకపోతే సభ్యుల్ని నిరుత్సాహ పరచినట్లుగా భావించే ప్రమాదం ఉంది. నామినేషన్ ఇవరైనా వికీపీడియను ముగ్గురు సహ సభ్యుల్ని ఈ ప్రోత్సాహకాలకు ప్రతిపాదించవచ్చును. అలా వచ్చిన ప్రతిపాదనల నుండి ఎంపిక సంఘ సభ్యులు పదిమందిని గుర్తించిన పిదప; సమావేశం ద్వారా అందరము అభినందిస్తాము.Rajasekhar1961 (చర్చ) 11:00, 15 నవంబర్ 2013 (UTC)
రాధాకృష్ణగారి అభిప్రాయమే నా అభిప్రాయం. వైజాసత్యగారికి, అర్జునరావుగారికి విశిష్ఠ వికీపీడీయాన్ అర్హత లేకపోవడం వారిద్దరిని ప్రతిపాదించలేకపోవడం నేను అంగీకరించలేను. జ్యూరీసభ్యులను కూడా ఇతర సభ్యులు ప్రతిపాదించడానికి వీలుపడేలా నియమాలను సవరించాలని కోరుకుంటున్నాను. --t.sujatha (చర్చ) 12:28, 15 నవంబర్ 2013 (UTC)
సుజాత గారి అభిప్రాయాన్ని నేను సమర్ధిస్తున్నాను. గుర్తింపు కృషిచేసిన అందరికీ లభించాలి. జ్యూరీ సభ్యులుగా మినహాయింపు కావడం సరిగాదు. ఎన్నికకు మరేవైనా మార్గాలుంటే సూచించగలరు...విశ్వనాధ్ (చర్చ) 12:54, 15 నవంబర్ 2013 (UTC)
చర్చ ప్రారంభమైంది సంచిక కొరకు ఒక్క వాడుకరి ఫోటో ఉపయోగించడానికే కాబట్టి మనం ఆ దిశగా మాత్రమే అడుగులేసి ఒక్క సభ్యుడిని గుర్తిస్తే సరిపోతుందనుకుంటున్నాను. పదేళ్ళ తెవికీ చరిత్రలో ఎనిమిదిన్నర సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి, లక్షకుపైగా విలువైన దిద్దుబాట్లతోనే కాకుండా నిర్వహణలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచి, అందరి మన్ననలందుకున్న వైజాసత్య గారి పేరును నేను ప్రతిపాదిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:27, 15 నవంబర్ 2013 (UTC)
  • రాధాక్రిష్ణ, t.sujatha , విశ్వనాధ్,Rajasekhar1961 , చంద్రకాంతరావు గారి స్పందనలకు ధన్యవాదాలు. తెవికీలో కృషి చేసిన అనుభవమున్న వారు ఎంపిక మండలి లో వుండడం చాలా ముఖ్యం, దానికి వైజాసత్య గారు, Rajasekhar1961 గారు ముందుకు రావడం హర్షణీయం. నా సేవలకు వికీపీడియా సందర్భంలో ఎంతో కొంత గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ పథకం ద్వారా సహ వికీసభ్యులను గుర్తించడానికి అవకాశమే నాకొక పెద్ద గుర్తింపుగా భావిస్తాను. ఇంకా మీరందరు మరీ మరీ కోరితే పురస్కార సభలో అభినందన మాటలు ఒకటీ రెండుచాలు. ఇంకెవరైనా ఎంపిక మండలిలో వుండదలిస్తే ఆది వారంలోపల తెలియచేయమని మనవి. అప్పుడు త్వరగా నియమాలు రూపొందించుకొని ముందుకు కొనసాగవచ్చు. పురస్కారం లో భాగంగా నగదు వుంటే మంచిదే, ఒక వేళ ఏకారణంచేతనైనా లేకపోయినా గుర్తింపు కి విలువ ఏమీ తగ్గదు. రాజశేఖర్ కు మరియు సుజాత గార్లకు వికీమీడియా భారతదేశ సమావేశంలో ధృవపత్రాలు మాత్రమే అందచేశాము కదా అయినా వారి గుర్తింపు ఏమీ తగ్గలేదుకదా. --అర్జున (చర్చ) 13:33, 15 నవంబర్ 2013 (UTC)
వికీపీడియా శిక్షణ పుస్తకం మీద వైజాసత్యగారి చాయాచిత్రం ఉపయోగించడాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. వారు అంగీకరిస్తే నేను హర్షిస్తాను. నగదుపురస్కారం వీలైతే మంచిదే . నగదు కంటే ధృవపత్రాలు విలువైనవి. --t.sujatha (చర్చ) 14:55, 15 నవంబర్ 2013 (UTC)
రాధాకృష్ణ గారు, సుజాత గారు, చంద్రకాంతరావు గారు, అర్జున గారు, విశ్వనాథ్ గార్లతో ఏకీవభవిస్తూ, వైజాసత్య గారి పేరునే నేనూ ప్రతిపాతిస్తున్నాను. అన్ని కోణాలనుండీ వైజా గారిపేరే సరైనదని భావిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 18:47, 15 నవంబర్ 2013 (UTC)
రవి వైజాసత్య గారి బొమ్మతో సంచిక వెలువడటం హర్షణీయం. ఆయన సేవలకు ఇలాటివి ఎన్నో కావాలి. ఆయన బొమ్మ ప్రచురణకుగాను రవి గారి అనుమతి కొరకు అభ్యర్ధిస్తున్నాను..విశ్వనాధ్ (చర్చ) 06:24, 16 నవంబర్ 2013 (UTC)
వైజాసత్య గారి చిత్రపటం ఉంచడం మంచి ఆలోచన. గురువు గారు తెలుగు వికీపీడియాలో ప్రారంభం నుండి అనితర సాధ్యంగా; అందరు సభ్యులతో స్నేహభావంగా సమస్యలను అర్ధం చేసుకుంటూ; తెవికీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారు. వారిని ఈవిధంగా గౌరవించడం చాలా బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 08:09, 16 నవంబర్ 2013 (UTC)
అర్జునరావు గారు, రాజశేఖర్ గారు, సుజాతగారు, వైజాసత్యగారు, కాసుబాబు గార్ల పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను. (మరెందరో మహానుభావులను నేనెరుగక ప్రతిపాదించలేకపోయాను. క్షమించగలరు)

రాజశేఖర్ గారు చెప్పినట్లు, కొద్దిగా ప్రైజ్ మనీ కూడా ఉంటే బాగుంటుంది. నిర్ణయించే మొత్తంలొ పదవవంతు (అంటే, లక్ష రూపాయలకు గాను, 10,000/-) నేను స్పాన్సర్ చేయదలచాను.