వెల్లాల ఉమామహేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:వైఎస్ఆర్ జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21: పంక్తి 21:
[[వర్గం:రాయలసీమ ప్రముఖులు]]
[[వర్గం:రాయలసీమ ప్రముఖులు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా ప్రముఖులు]]

16:45, 20 డిసెంబరు 2013 నాటి కూర్పు

ఇల్లాలు చిత్రంలో కాంచనమాలతో ఉమామహేశ్వరరావు

వెల్లాల ఉమామహేశ్వరరావు (V. Umamaheswara Rao) తెలుగు సినిమా తొలితరం హీరోల్లో ఒకరు. కడప జిల్లాకు చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.[1] రచయిత మరియు నాటకకర్త, ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తరువాత ఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అవి నాగయ్య సొంత చిత్రమైన భాగ్యలక్ష్మి (పి.పుల్లయ్య దర్శకుడు) మరియు గూడవల్లి రాంబ్రహ్మం యొక్క పంతులమ్మ.[2]

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చిత్తూరు నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఉమామహేశ్వరరావు 1960వ దశకంలో షేక్స్‌పియర్ నాటకాలన్నీ తెలుగులోకి అనువదించాడు. ఆయనకు పుట్టపర్తి నారాయణాచార్యులు బాల్యస్నేహితుడు.[3] అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ మహాత్ముని అంతరంగము అనే రచన చేశాడు.[4]

నటించిన సినిమాలు

  1. ఇల్లాలు (1940)
  2. భాగ్యలక్ష్మి (1943)
  3. పంతులమ్మ (1943)

మూలాలు