హెచ్.వి.బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 20: పంక్తి 20:
[[వర్గం:1903 జననాలు]]
[[వర్గం:1903 జననాలు]]
[[వర్గం:1968 మరణాలు]]
[[వర్గం:1968 మరణాలు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]

15:24, 2 జనవరి 2014 నాటి కూర్పు

హనుమప్ప విశ్వనాథ్ బాబు (1903-1968) 1930వ దశకములో ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు. విశ్వనాథ్ బాబు మార్చి 27, 1903న బెంగుళూరులో జన్మించాడు. ఈయన వైద్యవిద్యను అభ్యసించాడు. ఈయన బావ హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన తొలి తమిళ టాకీ సినిమా కాళిదాసులో నటించాడు.

హెచ్.వి.బాబు బొంబాయిలో సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్న కాలంలో హైదరాబాదులో అధ్యాపకునిగా ఉన్న హెచ్‌.ఎం.రెడ్డి అక్కడ ప్లేగు రావడంతో బొంబాయిలో ఉంటున్న బావమరిది దగ్గరికి వెళ్ళి ఉన్నాయి. హెచ్.వి.బాబు ప్రోద్భలంతో హెచ్.ఎం.రెడ్డి సినీరంగంలో ప్రవేశించాడు.

హెచ్‌.వి. బాబు బొంబాయికి చెందిన కోహినూర్‌ ఫిల్ము కంపెనీ ద్వారా నటుడుగా చిత్రరంగంలో ప్రవేశించారు. తర్వాత తన బావగారైన హెచ్‌.ఎం.రెడ్డి ద్వారా ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీలో నటుడిగా, సహాయ దర్శకునిగా చేరారు. సినిమా ఆర్టిస్టుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సహనపరుడుగా ఆయనకు మంచి పేరుండేది. కన్నాంబ కథానాయకిగా అనేక పౌరాణిక చిత్రాలు తీశాడు.

చిత్ర సమాహారం

బయటి లింకులు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హెచ్.వి.బాబు పేజీ