వైఖానసం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:బ్రాహ్మణ శాఖలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Priests performing Yagnya as part of Kumbhaabhishekam at Gunjanarasimhaswamy Temple, T. Narasipur.jpg|thumb|right|250px|[[Vaikhanasa]] Brahmin priests performing Yagna according to Vedic rites on the occasion of the [[Kumbhabhishekham]] of Gunjanarsimhaswamy Temple at [[T.Narsipura]], [[Karnataka]]]]
[[శ్రీవైష్ణవం]], [[శైవం]], [[మధ్వాచార్యుడు|మాధ్వం]] లాగానే '''వైఖానసం''' కూడా [[హిందూమతము|హిందూ సాంప్రదాయా]]ల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు [[విష్ణువు]]ని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ [[యజుర్వేదం|యజుర్వేద]] తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించే [[బ్రాహ్మణులు]]. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన [[విఖనస ఋషి]] నుండి వస్తుంది. ఈ మతం [[ఏకేశ్వరోపాసన|ఏకేశ్వర]] భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే [[తిరుమల]] [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన [[వైఖానస ఆగమం]].<ref>[http://www.vaikhanasa.com/vaikhanasam.html వైఖానసం జాలగూడు]</ref>
[[శ్రీవైష్ణవం]], [[శైవం]], [[మధ్వాచార్యుడు|మాధ్వం]] లాగానే '''వైఖానసం''' కూడా [[హిందూమతము|హిందూ సాంప్రదాయా]]ల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు [[విష్ణువు]]ని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ [[యజుర్వేదం|యజుర్వేద]] తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించే [[బ్రాహ్మణులు]]. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన [[విఖనస ఋషి]] నుండి వస్తుంది. ఈ మతం [[ఏకేశ్వరోపాసన|ఏకేశ్వర]] భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే [[తిరుమల]] [[వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన [[వైఖానస ఆగమం]].<ref>[http://www.vaikhanasa.com/vaikhanasam.html వైఖానసం జాలగూడు]</ref>
==చరిత్ర==
==చరిత్ర==

12:23, 3 జనవరి 2014 నాటి కూర్పు

Vaikhanasa Brahmin priests performing Yagna according to Vedic rites on the occasion of the Kumbhabhishekham of Gunjanarsimhaswamy Temple at T.Narsipura, Karnataka

శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను మరియు వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తర మీమాంసను నమ్మకుండా, కేవలం పూజాపునస్కారాల పైనే వైఖానసం నడుస్తుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమయిన వైఖానస భగవత్ శాస్త్రమే తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం.[1]

చరిత్ర

వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా మనుధర్మశాస్త్రంలో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తుంది. నారాయణీయంలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. కానీ సైద్ధాంతికంగా వైఖానస సూత్రాలు నాలుగోశతాబ్దికన్నా పాతవి కావని తెలుస్తోంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. రామానుజాచార్యుడి రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు)తెచ్చే వ్యక్తి - వంట చేసే వ్యక్తి - ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం - గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా శూద్రులకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.

వైఖానస-పాంచరాత్ర వైరం

ఒక కథనం ప్రకారం శైవుల రాక వలన వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. వీరు వీడి వచ్చిన ఆలయాలన్నీ అప్పటి చోళ రాజు స్వాధీనం చేసుకుని శైవాలయాలుగా మార్చివేస్తాడు. కొద్ది కాలానికి ఆ ఆలయాలలో తిరిగి వైష్ణవ పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తారు. అంతలోనే అందరు వైఖానసులు నరికివేయబడతారు. అది చోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా అవుతుంది. అప్పుడు రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమై చర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనే పూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగి తేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారి వైభవం తెలుసుకున్న ఇతరులు, రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో వైఖానస-శ్రీవైష్ణవ వైరం ముందుకొస్తుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై వివాదాలున్నాయి. అయినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివశరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే.

ఈ మతాన్ని పాటించేవారు

దాదాపుగా 4000కుటుంబాలున్న ఈ మతానుయాయులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు, ఇంకా విదేశాల్లోని వైష్ణవాలయాల్లో పూజారులుగా కనిపిస్తారు. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారు. వీరెక్కువగా తెలుగు మాట్లాడుతారు. అరవం వారు కూడా తెలుగు లిపిని చదవగలుగుతారు.

మత సిద్ధాంతం

వైఖానసులు, వారి నమ్మకం ప్రకారం, వైదిక సాంప్రదాయమైన కృష్ణ యజుర్వేదీయ తైత్తీరియ శాఖను పాటించే జీవిత సమూహం. వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషివిఖనసుడు మహావిష్ణువు యొక్క అంశతో మహావిష్ణువుకే జన్మించాడు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు, మరియు భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు మరియు మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం, మరియు మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు. వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు. విష్ణువు యొక్క ఐదు రూపాలను వీరు కొలుసారు -

  1. విష్ణువు - సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు
  2. పురుషుడు - జీవితం యొక్క సూత్రము
  3. సత్యము - దైవం యొక్క మారని అంశం
  4. అచ్యుతుడు - మార్పు చెందని వాడు
  5. అనిరుద్ధుడు - ఎన్నటికీ తరగని వాడు

మూలములు

  1. వైఖానసం జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=వైఖానసం&oldid=991350" నుండి వెలికితీశారు