Coordinates: 18°36′47″N 83°31′46″E / 18.613061°N 83.529475°E / 18.613061; 83.529475

బలిజిపేట (విజయనగరం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:


'''బలిజిపేట''' ([[ఆంగ్లం]]: Balijipeta), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు [[మండలము]].
'''బలిజిపేట''' ([[ఆంగ్లం]]: Balijipeta), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు [[మండలము]].
[[File:Balijipeta - Te.ogg]]


==శాసనసభ నియోజకవర్గం==
==శాసనసభ నియోజకవర్గం==

14:43, 12 జనవరి 2014 నాటి కూర్పు

విశాఖపట్నం జిల్లా లోని ఇదే పేరుగల మరొక గ్రామం కోసం బలిజిపేట (విశాఖపట్నం జిల్లా) చూడండి.

బల్జీల కులదైవం శ్రీ వేంకటేశ్వరుని దివ్యసన్నిధి.
బలిజిపేట
—  మండలం  —
విజయనగరం పటంలో బలిజిపేట మండలం స్థానం
విజయనగరం పటంలో బలిజిపేట మండలం స్థానం
విజయనగరం పటంలో బలిజిపేట మండలం స్థానం
బలిజిపేట is located in Andhra Pradesh
బలిజిపేట
బలిజిపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో బలిజిపేట స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°36′47″N 83°31′46″E / 18.613061°N 83.529475°E / 18.613061; 83.529475
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం బలిజిపేట
గ్రామాలు 31
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 62,787
 - పురుషులు 31,216
 - స్త్రీలు 31,571
అక్షరాస్యత (2001)
 - మొత్తం 45.21%
 - పురుషులు 58.31%
 - స్త్రీలు 32.31%
పిన్‌కోడ్ {{{pincode}}}


బలిజిపేట (ఆంగ్లం: Balijipeta), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము.

శాసనసభ నియోజకవర్గం

బలిజిపేట 1955 మరియు 1962లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజక వర్గం. తరువాత దీనిని ఉనుకూరు నియోజకవర్గంలో విలీనం చేశారు.

  • ఎన్నికైన శాసనసభా సభ్యులు:
  • 1955 - పెద్దింటి రామస్వామి నాయిడు.[1]
  • 1962 - వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయిడు.[2]

వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 1869 సంవత్సరంలో బరిగెడ చిన్న నరసయ్య గారు శుక్ల నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.

విశేషాలు

  • చరిత్రకారుల పరిశీలనల రీత్యా, బలిజ జాతి ప్రజలు ఈ గ్రామం నుంచి రాష్టమంతా వ్యాపించినట్లు భావిసున్నారు.[3]
  • శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం 3 కి.మీ. దూరంలోని నారాయణపురం గ్రామంలో ఉన్నది. ఇది బహు పురాతనమైనదిగా 10 వ శతాబ్దంలో కళింగ రాజులచే నిర్మించబడినది.[4]
  • ఈ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలదు.[5]
  • ఆంధ్రా బ్యాంకు శాఖ మరియు తపాళా కచేరి ఇక్కడ ఉన్నవి.

ఈ గ్రామంలో ప్రముఖులు

అంగజాల జగన్నాథయ్య

అంగజాల జగన్నాథయ్య (1932 - 1989) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. వీరి స్వస్థలం విజయనగరం జిల్లాలోని బలిజిపేట గ్రామం. వీరు వ్యాపారరీత్యా సాలూరు పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు. ఈయన తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య మరియు ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు. ఈయన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. కోసం దగ్గరిలోని విద్యాకేంద్రమైన బొబ్బిలి వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివారు. వీరు 1952 లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నారు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అన్నయ్య అయిన కృష్ణమూర్తి గారు చనిపోవడంతో చదువు ఆపి తండ్రి గారి వ్యాపార విషయాలలో కేంద్రీకరించారు. జగన్నాథయ్య గారు, బావమదరులైన మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య మరియు భరతారావు గార్లతో కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా చింతపండు వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు కుడా చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను మరియు తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం మరియు కమిషన్ కోసం కూడా క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. వాటిని బస్తాలలో లారీలు లేదా రైలు ద్వారా సాలురుకు తరలించి నిలువచేసేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) కొట్లు పెట్టి ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేశేవారు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. Election Commission of India-1955 results
  2. Election Commission of India-1962 results
  3. "Kapunadu History". Retrieved 2007-02-28.
  4. Jistor:Narayanapuram-A Tenth Century site of Kalingas
  5. School Information System of Department of School Education