భోగి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
==భోగి పులక==
==భోగి పులక==
కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర [[సాగునీరు]] పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.

==కోడి పందాలు==
కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది, పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి, ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. తాహత్తుకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్ధాల వలన పందాలు కాయడంపై నిషేదాంక్షలు ఉన్నాయి.

{{హిందువుల పండుగలు}}
{{హిందువుల పండుగలు}}

21:53, 13 జనవరి 2014 నాటి కూర్పు

భోగిమంటలు సినిమా కొరకు చూడండి భోగిమంటలు (సినిమా)

భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.

భోగి మంటలు

చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటారు, ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగిమంటలకు ఎక్కువగా తాటిఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు.

కొత్త బట్టలు

ఈ పండుగనాడు ఆంధ్రులు కొత్తబట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగిమంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.

ముగ్గులు

పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.

భోగి పళ్ళు

భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.

భోగి పులక

కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.

కోడి పందాలు

కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది, పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి, ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. తాహత్తుకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్ధాల వలన పందాలు కాయడంపై నిషేదాంక్షలు ఉన్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=భోగి&oldid=998031" నుండి వెలికితీశారు