సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసంగా రూపుదిద్దాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
| death_date = {{death date and age|1995|8|21|1910|10|19}}
| death_date = {{death date and age|1995|8|21|1910|10|19}}
| birth_place = [[లాహోర్]], [[పంజాబ్]], [[British India]]
| birth_place = [[లాహోర్]], [[పంజాబ్]], [[British India]]
| death_place = [[చికాగో]], [[United States]]
| death_place = [[చికాగో]], [[అమెరికా]]
| nationality = [[British India]] (1910-1947)
[[భారతదేశం]] (1947-1953)
[[United States]] (1953-1995)
| nationality = అవిభక్త భారతదేశం (1910-1947)
[[భారతదేశం]] (1947-1953)
[[అమెరికా]] (1953-1995)
| field = [[Astrophysics]]
| field = [[అంతరిక్ష భౌతిక శాస్త్రం]]
| alma_mater = [[ట్రినిటీ కళాశాల]], కేంబ్రిడ్జి
[[ప్రెసిడెన్సీ కళాశాల]], మద్రాసు
| alma_mater = [[Trinity College, Cambridge]]
[[Presidency College, Chennai|Presidency College, Madras]]
| work_institution = [[చికాగో విశ్వవిద్యాలయం]]
[[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం]]
| work_institution = [[చికాగో విశ్వవిద్యాలయం]]
[[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం]]
| doctoral_advisor = [[Ralph H. Fowler|R.H. Fowler]]
| doctoral_advisor = [[రాల్ఫ ఫౌలర్]]
| doctoral_students = [[Donald Edward Osterbrock]], [http://www.gursey.gov.tr/~nutku/ Yavuz Nutku ]
| doctoral_students = డొనాల్డ్ ఎడ్వర్డ్ ఓస్టర్‌బ్రోక్, [http://www.gursey.gov.tr/~nutku/ Yavuz Nutku ]
| known_for = [[Chandrasekhar limit]]
| known_for = [[చంద్రశేఖర్ అవధి]]
| prizes = {{nowrap|[[Nobel Prize in Physics|Nobel Prize, Physics]] (1983)}}
[[Copley Medal]] (1984)
[[National Medal of Science]] (1967)
| prizes = {{nowrap|[[నోబెల్ బహుమతి]] (1983)}}
[[కోప్లే మెడల్]] (1984)
[[నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్]] (1967)
| religion = None, [[atheist]]
| religion = [[హేతవాది]]
| footnotes =
| footnotes =

01:07, 14 జనవరి 2014 నాటి కూర్పు

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
జననం(1910-10-19)1910 అక్టోబరు 19
లాహోర్, పంజాబ్, British India
మరణం1995 ఆగస్టు 21(1995-08-21) (వయసు 84)
చికాగో, అమెరికా
జాతీయతఅవిభక్త భారతదేశం (1910-1947)
భారతదేశం (1947-1953)
అమెరికా (1953-1995)
రంగములుఅంతరిక్ష భౌతిక శాస్త్రం
వృత్తిసంస్థలుచికాగో విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుట్రినిటీ కళాశాల, కేంబ్రిడ్జి
ప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు
పరిశోధనా సలహాదారుడు(లు)రాల్ఫ ఫౌలర్
డాక్టొరల్ విద్యార్థులుడొనాల్డ్ ఎడ్వర్డ్ ఓస్టర్‌బ్రోక్, Yavuz Nutku
ప్రసిద్ధిచంద్రశేఖర్ అవధి
ముఖ్యమైన పురస్కారాలునోబెల్ బహుమతి (1983)
కోప్లే మెడల్ (1984)
నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ (1967)

సుబ్రహ్మణ్య చంద్రశేఖర్(తమిళం: சுப்பிரமணியன் சந்திரசேகர்) (అక్టోబర్ 19, 1910ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983 లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఫోలర్ చంద్రశేఖర్ కు తొలి గురువు. ఇతని మేనమామ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ ను భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదు తో సత్కరించింది.[1]

బాల్యం

చంద్రశేఖర్ అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది), లాహోర్ పట్టణంలో 1910, అక్టోబర్ 19వో తేదీన పదిమంది సంతానంలో మూడో వాడిగా, నలుగురు కొడుకుల్లో పెద్దవాడిగా పుట్టిన చంద్రశేఖర్‌ చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. ఆయన తల్లిదండ్రులు సుబ్రపహ్మణ్య అయ్యర్, సీతాలక్ష్మి. తండ్రి ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప-ఆడిటర్ జనరల్ గా లాహోర్ లో పని చేస్తున్నపుడు చంద్రశేఖర్ జన్మించాడు.తండ్రి ఉద్యోగరీత్యా పలుప్రాంతాలు తిరిగినా వాళ్ల కుటుంబం తమిళనాడుకు చెందినదే. ఆయన చిన్నతనంలో తల్లి దగ్గర చదువుకున్నాడు. ఆయన చదువు కోసం కుటుంబం 1922లో చెన్నై కి మారింది.

విద్యాభ్యాసం

చంద్రశేఖర్ చెన్నైలోని హిందూ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో బీయెస్సీ ఆనర్స్ పట్టా పొందాడు. ఆయన బీయెస్సీ చదివే రోజుల్లో ఆర్నాల్డ్ సోమర్‌ఫెల్డ్ అనే శాస్త్రజ్ఞుడి ఉపన్యాసం నుంచి ప్రేరణ పొందాడు. ప్రభుత్వ ఉపకార వేతనంతో 1930 లో ఇంగ్లండు వెళ్ళి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ట్రినిటీ కళాశాలలో ప్రొఫెసర్ ఫౌలర్ వద్ద పరిశోధన ప్రారంభించాడు.

ఆయనకు అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే ఆసక్తి. ఇంగ్లండుకు వెళ్ళక ముందే విశ్వాంతరాళంలో నక్షత్రాలు ఏర్పడే విధానం, తారలలో జరిగే పరిణామాలు, వాటి స్థిరత్వం తదితర అంశాలపై పరిశోధనలు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందాడు. ట్రినిటీ కళాశాలలో ఆయన చేసిన పరిశోధనలకుగాను, 1933 వ సంవత్సరంలో అంతరిక్ష శాస్త్రంలో డాక్టరేట్ ప్రధానం చేశారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం ఇరవై మూడేళ్ళు మాత్రమే.

పరిశోధనలు

ఒక ప్రక్క ట్రినిటీ కళాశాలలో ఉన్నత విద్యనభ్యసిస్తూనే జర్మనీలోని గొట్టింగన్‌ లోని బ్రౌన్ పరిశోధనాలయంలో, కోపెన్‌హాగన్ లోని భౌతిక విజ్ఞానశాస్త్ర సిద్ధాంత సంస్థలోనూ పరిశోధనలు చేశాడు. పరమాణు నిర్మాణంపై అద్భుతమైన పరిశోధనలు చేసిన నీల్స్ బోర్ శాస్త్రజ్ఞడిని స్వయంగా కలుసుకున్నాడు.

1936 లోనే ఆయన అంతరిక్ష శాస్త్రంలో కృష్ణ బిలాలపై ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన సర్ ఆర్ధర్ ఎడింగ్టన్ తో విభేదించి, అమెరికాలోని ఇల్లినోయ్ రాష్ట్రంలోని షికాగో విశ్వవిద్యాలయానికి వచ్చేసి భౌతిక విజ్ఞాన శాస్త్రం, అంతరిక్ష శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. పదవీ విరమణ చేసేవరకూ అక్కడే కొనసాగాడు. 1985లో పదవీ విరమణ అనంతరం ఎమిరిటస్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.

ప్రతి వ్యక్తి జీవితంలో బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలున్నట్టే, నక్షత్రాల్లో రెడ్‌జెయింట్‌, వైట్‌డ్వార్ఫ్‌, సూపర్‌నోవా, న్యూట్రాన్‌స్టార్‌, బ్లాక్‌హోల్‌ అనే పరిణామ దశలుంటాయి. వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్‌ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ పొందారు. ఈయన ఈ పురస్కారాన్ని తన గురువైన డాక్టర్ ఎ.ఫౌలర్ తో కలిసి పంచుకోవడం విశేషం.

సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా ఆయన నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్‌ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో చెప్పిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్‌నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ చివరికి బ్లాక్‌హోల్‌ (కృష్ణబిలం) అయిపోతాయి.

1966లో ఆయన అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని అందుకున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నెలకొల్పిన ఖగోళ భౌతిక పరిశోధనాలయంలో కీలక బాధ్యత వహించారు. ఆయన సేవలకుగాను నాసా ఒక పరిశోధన ప్రయోగశాలకు ఆయన పేరు పెట్టారు.

సంగ్రహం

• 1929-39 అంతరిక్ష నిర్మాణం. చంద్రశేఖర్ పరిమితి, అంతరిక్ష గతిశాస్త్ర పరిశోధనలు
• 1939-43 న్యూట్రాన్ రేడియేటివ్ ట్రాన్స్‌ఫర్, ఋణాత్మక హైడ్రోజన్ ల క్వాంటమ్ సిద్ధాంతం
• 1943-50 హైడ్రో డైనమిక్. హైడ్రో మాగ్నటిక్ స్థిరత్వం
• 1950-69 ఎలిప్స్ ఆకృతిగల నిర్మాణాల సమతా స్థితి, స్థిరత్వాలు
• 1971-83 కృష్ణబిలాల భౌతిక విజ్ఞాన గణిత సిద్ధాంతం
• 1980 గురుత్వాకర్షణ తరంగాల పరస్పర తాడనాల సిద్ధాంతం

రచనలు

అంతరిక్ష శాస్త్రంలో ఆయన ఎనిమిదికి పైగా గ్రంథాలను ప్రచురించాడు.

వృద్ధాప్యంలో సైతం ఆయన న్యూటన్‌ సిద్ధాంతాలను విశ్లేషిస్తూ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాసిన 'న్యూటన్‌ ప్రిన్సిపియా ఫర్‌ కామన్‌ రీడర్‌' సైన్స్‌ అభిరుచి ఉన్నవారందరూ చదవవలసిన పుస్తకం. చంద్ర ఎక్స్‌రే వేధశాల, చంద్రశేఖర్‌ సంఖ్య, గ్రహశకలం 1958 చంద్ర అనేవి ఆయన సేవలకు శాస్త్రలోకం అర్పించిన నివాళులకు గుర్తులు.

వివాహం

చంద్రశేఖర్ 1936,సెప్టెంబర్ లో లలితా దొరైస్వామిని వివాహమాడాడు. ఆమె ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయనకు జూనియర్.

విశేషాలు

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్‌ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒక వ్యక్తి దేశంలోనే తొలి నోబెల్‌ పొందిన శాస్త్రవేత్త సర్‌ సీవీ రామన్‌ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌. తారల పరిణామ దశలకు సంబంధించిన పరిశోధనల్లో 'చంద్రశేఖర్‌ లిమిట్‌'గా ఇప్పటికీ ఉపయోగపడుతున్న సిద్ధాంతాలను అందించిన చంద్రశేఖర్‌, ప్రపంచ శాస్త్రవేత్తల సరసన నిలిచాడు.

పదవులు, పురస్కారాలు

• 1952-71 అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్ర జర్నల్
• 1955 న్యూటన్ సిద్ధాంతాల ప్రచురణ
• 1966 అమెరికా జాతీయ విజ్ఞాన శాస్త్ర మెడల్
• 1968 పద్మ విభాషణ్ పురస్కారం
• 1983 భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం
• 1984 కోప్లే మెడల్

మరణం

ఆయన 1995 ఆగస్టు 21న షికాగోలో తన 85వ ఏట గుండెజబ్బుతో మరణించాడు.

మూలాలు

1. సాక్షి ఫన్‌డే డిసెంబరు 8, 2013 నోబెల్ ఇండియా.