అదితి అగర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అదితి అగర్వాల్
జననం (1987-01-27) 1987 జనవరి 27 (వయసు 37)
న్యూ జెర్సీ, యునిటైడ్ స్టేట్స్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003-2004
బంధువులుఆర్తి అగర్వాల్ (అక్క)
ఆకాశ్ అగర్వాల్ (సోదరుడు)

అదితి అగర్వాల్ (జననం జనవరి 27, 1987) తెలుగు సినిమా నటి. ఈమె సినీనటి ఆర్తీ అగర్వాల్ చెల్లెలు.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అదితి అగర్వాల్ గుజరాతీ కుటుంబములో జన్మించింది. అదితి తండ్రి పేరు శశాంక్ అగర్వాల్. ఆయన హోటల్ వ్యాపారం నడిపిస్తున్నాడు. తల్లి వీమా, గృహిణి. సోదరుడు ఆకాష్, అక్క ఆర్తీ అగర్వాల్. ఆర్తి అగర్వాల్ నటి.

సినిమారంగ ప్రస్థానం[మార్చు]

అల్లు అర్జున్ హీరోగా తెరంగ్రేట్రం చేసిన గంగోత్రి సినిమాతో అదితి అగర్వాల్ తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో గ్లామర్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా, చిన్నమ్మాయి పాత్రలో నటించింది. ఈవిడ నటించిన కొడుకు, విద్యార్థి సినిమాలు అంతగా విజయవంతంకాలేదు.

2007 లో, ఆర్తి అగర్వాల్ వివాహం సందర్భంగా తెలుగు టెలివిజన్ జర్నలిస్టు దాడి కేసులో తండ్రి, సోదరుడితో పాటు అదితి కూడా కారాగారంలో ఉండాల్సివచ్చింది.

చిత్ర సమహారం[మార్చు]

  1. గంగోత్రి (2003)
  2. కొడుకు (2004)
  3. విద్యార్థి (2004)
  4. లోకమే కొత్తగా (2011)
  5. ఏంబాబు లడ్డుకావాలా..?[2] (2012)

మూలాలు[మార్చు]

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "అదితి అగర్వాల్, AdithiAgarwal". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
  2. విశాలాంధ్ర (6 Jun 2012). "శివాజీ, అదితి అగర్వాల్‌ 'ఏం బాబు లడ్డూ కావాలా'". Retrieved 25 September 2016.[permanent dead link]