అనంతవర్మన్ చోడగాంగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంతవర్మన్ చోడగాంగ
తూర్పు గంగ సామ్రాజ్యపాలకుడు
Reignసుమారు 1077 –  1150 CE
తండ్రిరాజరాజ దేవుడు
తల్లిరాజసుందరి
అనంతవర్మన్ చోళగాంగుని చే నిర్మించబడిన పూరీ జగన్నాధ ఆలయం

అనంతవర్మ చోడగంగ దేవుడు (1077-1150), తూర్పు గంగ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు, కళింగని పాలించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

గంగవంశపు రాజైన రాజరాజదేవుడు, చోళరాజు వీరరాజేంద్రచోళుని కుమార్తె అయిన రాజసుందరి. లు, ఈతని తల్లిదండ్రులు. చోళరాజు కులోత్తుంగచోళునికి ఈతడు మేనల్లుడు. శిథిలనమైపోయిన పూరీ జగన్నాథ ఆలయాన్ని, అనంతవర్మ పునర్నిర్మించాడు. [1][2] [3]

శైవునిగా శ్రీముఖలింగంలో జన్మించిన చోళగంగ రాజు అనంతవర్మ., పూరీ దర్శించినపుడు, రామానుజాచార్యుని ప్రభావంతో వైష్ణవునిగా మారాడు. మేనల్లుడు అయినప్పటికీ, మేనమామ అయిన కులోత్తుంగచోళుని నుండి వచ్చిన దాడిని ఎదుర్కొన్నాడు. వరుసగా రెండు సంవత్సరాలు., చోళగంగరాజు అనంతవర్మ కప్పం చెల్లించకపోవడంతోనే, కులోత్తుంగచోళుడు., అనంతవర్మ యొక్క రాజధానిని దగ్ధంచేశాడని చరిత్రకారులు భావిస్తున్నారు. కులోత్తుంగ చోళుని సేనాని కరుణాకర తొండమాన్ చేతిలో అనంతవర్మ ఓడిపోయినట్టుగా, కళింగట్టుప్పరణి అనే తమిళ గ్రంథంలో వర్ణింపబడింది. ఈ ప్రాంతాన్ని పాలించిన తదుపరి రాజులు., తమ చోళ, గాంగ వారసత్వాన్ని సూచింస్తూ, చోళగంగ అనే ఉపనామాన్ని ధరించారు. తిరుమల వెంకటేశ్వరుని ఆలయం ఉత్తరద్వారంవద్ద రాజరాజు-3 వేయించిన, తామ్రఫలకం ద్వారా, జగన్నాధాలయాన్ని గంగేశ్వరుడు, (అనంతవర్మ చోళగంగ దేవుడు) నిర్మించినట్టు తెలుస్తోంది.

సా.శ. 1223 సంవత్సరంలో అనంతవర్మ, త్రికోణమలై వద్ద కోణేశ్వరాలయంలో., తమిళ సంవత్సరాది పుతాండు సందర్భంగా పెద్దయెత్తున దానధర్మాలు చేసినట్టు ప్రస్తావనలు కనిపిస్తున్నాయి.

పుస్తకాలు[మార్చు]

  • Sastri, K. A. Nilakanta (2000) [1935]. The Cōlas. Madras: University of Madras. pp. 322–323.

మూలాలు[మార్చు]

  1. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. p. 36-37. ISBN 978-9-38060-734-4.
  2. Cesarone, Bernard (2012). "Bernard Cesarone: Pata-chitras of Orissa". asianart.com. Archived from the original on 23 సెప్టెంబరు 2012. Retrieved 2 July 2012. This temple was built between approximately 1135-1150 by Codaganga
  3. "Chodaganga Deva". indiadivine.org. 2012. Archived from the original on 29 ఫిబ్రవరి 2012. Retrieved 2 July 2012. Chodaganga Deva (1078-1150), the greatest of the Ganga kings, built a new temple on the ruins of the old one

ఇతర లింకులు[మార్చు]