Coordinates: 17°22′24″N 78°28′15″E / 17.373247°N 78.470932°E / 17.373247; 78.470932

అఫ్జల్‌గంజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అఫ్జల్‌గంజ్
సమీప
అఫ్జల్‌గంజ్ is located in Telangana
అఫ్జల్‌గంజ్
అఫ్జల్‌గంజ్
Location in Telangana, India
అఫ్జల్‌గంజ్ is located in India
అఫ్జల్‌గంజ్
అఫ్జల్‌గంజ్
అఫ్జల్‌గంజ్ (India)
Coordinates: 17°22′24″N 78°28′15″E / 17.373247°N 78.470932°E / 17.373247; 78.470932
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్ జిల్లా
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500 012
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
విదాన్ సభ నియోజకవర్గంమహారాజ్‌గంజ్
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

అఫ్జల్‌గంజ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది మూసీనది సమీపంలో ఉంది. ఇక్కడ సెంట్రల్ బస్టాండు ఉండడం వల్ల ఈ ప్రాంతం ప్రముఖ రవాణాకేంద్రంగా ఉంది. ఈ బస్టాండు నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులను ఏర్పాటుచేయడం జరిగింది.[1]

నిజాం కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఈ ప్రాంతంలోనే నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం, హైకోర్టు, సాలార్ ‌జంగ్ మ్యూజియం వంటివి అఫ్జల్‌గంజ్ లోనే ఉన్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం ఆగ్నేయదిక్కులో పురానీహవేలిలో నిజాం మ్యూజియం కూడా ఉంది. అఫ్జల్‌గంజ్ నుండి ముసీనది మీదుగా ఉత్తరంగా విస్తరించివున్న రహదారి సర్దార్ పటేల్ రోడ్డుతో కలుస్తుంది. అఫ్జల్‌గంజ్ నుండి దక్షిణం వైపు చార్మినార్ ఉంది.

చరిత్ర[మార్చు]

5 వ నిజాం రాజైన అఫ్జల్ ఉద్ దౌలా, ధాన్యం గింజల వర్తకవ్యాపారులకు ఈ భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆయనానంతరం ఈ స్థలానికి అతని పేరు పెట్టబడింది. మోహంజాహీ మార్కెట్, సిద్దిఅంబర్ బజార్, ఉస్మాన్ గంజ్ మార్కెట్, బేగంబజార్, పూల్ బాగ్ వంటి అనేక మార్కెట్లు దీని చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నాయి.[2]

హైదరాబాదు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణములో వున్న ఒక చింత చెట్టు. దానికున్న ఒక బోర్డులో వున్న విషయం: 'ఈచెట్టు 1908 వ సంవత్సరంలో వచ్చిన వరదలలో సుమారు 150 మంది ప్రాణాలను కాపాడింది '

వాణిజ్య ప్రాంతం[మార్చు]

ప్రజలు అవసరాలకు కావలసిన అనేక వస్తువుల దుకాణాలు ఇక్కడ ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. ది హన్స్ ఇండియా (2 December 2014). "Afzal Gunj formerly grain merchants' hub; now a city hot spot". Ch Saibaba. Retrieved 18 December 2017.
  2. "Archived copy". Archived from the original on 2013-08-14. Retrieved 2017-12-18.{{cite web}}: CS1 maint: archived copy as title (link)