అమరపు సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమరపు సత్యనారాయణ
AMARAPU SATYANRAYANA
జననంఅమరపు సత్యనారాయణ
(1936-04-12)1936 ఏప్రిల్ 12
పాములవలస గ్రామం
బొబ్బిలితాలూకా,
శ్రీకాకుళం జిల్లా
మరణం2011 అక్టోబరు 20(2011-10-20) (వయసు 75)
రాజాం
నివాస ప్రాంతంపాములవలస గ్రామం
బొబ్బిలితాలూకా,
శ్రీకాకుళం జిల్లా
వృత్తినటుడు
గాయకుడు
రంగస్థల కళాకారుడు
ప్రసిద్ధికలియుగ కృష్ణుడు
మతంహిందూ
తండ్రిఅప్పలనాయుడు
తల్లికన్నమ్మ

అమరపు సత్యనారాయణ (ఏప్రిల్ 12, 1936 - అక్టోబరు 20, 2011) రంగస్థల నటుడు. ఈయన "కలియుగ కృష్ణుడు" గా పేరొందాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అమరపు సత్యనారాయణ విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, పాములవలస గ్రామంలో అప్పలనాయుడు, కన్నమ్మలకు 1937 ఏప్రిల్ 12 న జన్మించాడు. చిన్నతనంలో పాటలు, పద్యాలు గొంతెత్తి అందరూ వినెలా పాడేవారు. అతని కంఠ మాధుర్యాన్ని గుర్తించి పక్కి సత్యన్నారాయన అనే ఉపాధ్యాయుడు శిక్షణనిస్తే మంచి కచ్ళాఇంకారుడవుతాడని చేరదీసాడు. ఒకవైపు నాటకాల్లో అవకాశాలిస్తూ మరొకవైపు నోము సూర్యారావు వద్ద శిక్షణ యిప్పించాడు. పద్యం భావయుక్తంగా పాడటానికి సంగీతం చాలా అవసరమని అందులో శిక్షణ పొందాడు. శ్రావ్యమైన కంఠం, చూడచక్కని రూపం, భావాత్మక గానం ఆయనను అందరిలో మేటిగా నిలిపింది.[2] ఆయన ఏ పాత్ర ధరించవలసి వచ్చినా ఆహార్యం మొదలుకొని అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు. నిండుతనం కోసం పరితపించేవాడు. అందువల్ల ఆయన పాత్రలకి ఆయనకు ప్రజాదరణ పెరిగింది. అమరపు సత్యనారాయణ అనేక పాత్రలు ధరించినా ఆయనకు కొన్ని పాత్రలతొ విడదీయరాని సంబంధం పెరిగింది. ముఖ్యంగా రామాంజనేయ యుద్ధంలో రాముడు, గయోపాఖ్యానం నాటకంలో కృష్ణుడు, అర్జునుడు, చింతామణి నాటకంలో బిల్వమంగళుడు పాత్రలు మంచి ఆదరణ పొందాయి.

మరణం[మార్చు]

2011, అక్టోబరు 20రాజాం లో కన్ను మూశాడు.

అవార్డులు - రివార్డులు - సన్మానాలు[మార్చు]

  • 1960 లో ఆంధ్ర రాష్ట్ర పరిషత్ పోటీల్లో స్వర్ణ పతకం పొందాడు.
  • 1965 లో పొద్దుటూరుకు చెందిన శ్రీ రాయన నాటక పరిషత్ వారిచే స్వర్ణ కిరీటం పొందాడు.
  • రూర్కెలా లోని శ్రీ వెంకటేశ్వర ఫైనాంస్ సంస్థ 'నాటక కళా విశారదా అనే బిరుదుతో సత్కరించింది.
  • అప్పటి గవర్నర్ పి.సి.అలెగ్జాండర్ చేతుల మీదుగా 'రాఘవ అవార్డు ' అందుకున్నాడు.
  • అప్పటి సినీ నటులైన కాంతారావు, ధూళిపాళ, అల్లురామలింగయ్య, చంద్రమోహన్, రాజనాల వంటివారితో కలసి రంగస్థలంపై నటించాడు.
  • గయోపాఖ్యానంలో అర్జునుడు, కర్ణసందేశంలో కర్ణుడు పాత్రల సంభాషనలు రికార్డులు తయారయ్యాయి.
  • వృత్తి పరంగా రాజాం నందు కళాశాల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీవిరమణ పొందినా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. History of Amarapu Satyanrayana in the "eenadu sahityam"[permanent dead link]
  2. "Andhraprabha Daily Telugu News Paper - రంగస్థల కృష్ణుడు సత్యం మృతి". Prabhanews.com. 2011-10-22. Archived from the original on 2013-01-31. Retrieved 2013-05-11.

ఇతర లింకులు[మార్చు]