అహ నా పెళ్ళంట (2011 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అహ నా పెళ్ళంట
దర్శకత్వంవీరభద్రం చౌదరి
నిర్మాతఅనిల్ సుంకర
తారాగణంఅల్లరి నరేష్
రీతూ బర్మేచ
శ్రీహరి
సంగీతంరఘు కుంచే
పంపిణీదార్లుఎ. కె. ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2011 మార్చి 2 (2011-03-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

అహ నా పెళ్ళంట 2011 లో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో విడుదలైన ఓ హాస్యభరిత చిత్రం. ఇందులో అల్లరి నరేష్, రీతూ బర్మేచ, అనిత ప్రధాన పాత్రలు పోషించగా బ్రహ్మానందం, నాగినీడు, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సామ్రాట్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. రఘు కుంచే సంగీతాన్నందించాడు. ఈ సినిమా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2, 2011 న విడుదలైంది.[1] 48 సెంటర్లలో 50 రోజులు,[2] అన్ని మెయిన్ సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది.[3] 2011సంవత్సరం మొదటి భాగంలో మిరపకాయ్, అలా మొదలైంది లాంటి సినిమాలతో కలిసి మంచి వసూళ్ళు సాధించింది.[4]

కథ[మార్చు]

సుబ్రహ్మణ్యం (అల్లరి నరేష్) ఒక తెలివైన, కష్టపడే మనస్తత్వం గల ఓ సాఫ్టువేర్ ఇంజనీరు. అతను తన మామ (ఆహుతి ప్రసాద్) తో కలిసి ఉంటుంటాడు. తన గదిలో బిల్ గేట్స్ ఫోటో పెట్టుకుని ఆయనంత ఎత్తుకు ఎదగాలని కలలు కంటుంటాడు. ఖాళీ సమయంలో తన స్నేహితురాలు మధు (అనిత) తోనూ, సహోద్యోగి బిజీ బాలరాజ్ (బ్రహ్మానందం) తో కాలం గడుపుతుంటాడు. ఒకరోజు రాత్రి బాగా తాగిన మత్తులో ఇంటికి వస్తాడు. లేచి చూసేసరికి తను సంజన (రీతూ బర్మేచ) అనే అమ్మయితో కలిసి పడుకుని ఉంటాడు. ఇద్దరూ ఎంత ఆలోచించినా వాళ్ళు అలా ఎందుకు కలిసి పడుకున్నారో అర్థం కాదు. తామిద్దరూ శారీరకంగా కూడా కలిశామని నమ్ముతారు.

కొద్ది రోజులకు సంజన సోదరులు వచ్చి అమాయకురాలైన తమ చెల్లెలు సంజనను పెళ్ళి చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుబ్రహ్మణ్యాన్ని హెచ్చరించి వెళతారు. అతను ఎంత ప్రయత్నించినా వాళ్ళ నుంచి, పెళ్ళి నుంచి తప్పించుకోలేక పోతాడు. ఇక విధి లేని పరిస్థితుల్లో బలవంతపు వివాహానికి అంగీకరించగా అతనికి ఆ సోదరుల గురించి ఓ రహస్యం తెలుస్తుంది. వారి గుట్టు తెలిసినా తాను వాళ్ళ మీద ఆధిక్యాన్ని ప్రదర్శించాల్సింది పోయి వాళ్ళ నాటకాల, వెన్నుపోట్లకు లొంగిపోతాడు. చివరకు సుబ్బు ఎవరిని పెళ్ళి చేసుకున్నాడన్నది మిగతా కథ.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలో పాటలు రఘు కుంచే స్వరపరిచాడు.

క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "సుబ్రహ్మణ్యం"  భాస్కరభట్ల రవికుమార్రఘు కుంచే 4:25
2. "నువ్వే"  సిరా శ్రీకె. ఎస్. చిత్ర 4:51
3. "లెఫ్ట్ చూస్తే"  భాస్కరభట్ల రవికుమార్వేణు, సింహ, భార్గవి పిళ్ళై 4:11
4. "వెన్నెల దీపం"  సిరా శ్రీరఘు కుంచే 3:26
5. "చినుకులా రాలి (రీమిక్స్)"  వేటూరిరఘు కుంచే, అంజనా సౌమ్య 4:32
6. "సాటర్ డే ఈవెనింగ్"  రామజోగయ్య శాస్త్రిపృథ్వీ చంద్ర, అనుదీప్ దేవ్, నోయెల్ 3:30
24:57

మూలాలు[మార్చు]

  1. "'Aha Naa Pellanta' for Mar 2nd". IndiaGlitz. 19 February 2011. Archived from the original on 20 ఫిబ్రవరి 2011. Retrieved 3 March 2011.
  2. "Aha Naa Pellanta completes 50 days". IndiaGlitz. Archived from the original on 9 ఆగస్టు 2011. Retrieved 19 April 2011.
  3. "'Aha Naa Pellanta' completes 100 days today". IndiaGlitz. Archived from the original on 11 జూన్ 2011. Retrieved 9 June 2011.
  4. "Mirapakaya completes 100 days of theatrical run". andhrabuzz.com. Archived from the original on 2016-03-03.