ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

image =

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (Andhra Pradesh Pollution Control Board) మన రాష్ట్రంలో అన్ని రకాల కాలుష్యాన్ని నియంత్రించడమే ధ్యాయంగా పనిచేసే ప్రభుత్వ సంస్థ.

చరిత్ర[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో నీరు చట్టం-1975లో ప్రవేశపెట్టిన తరువాత 22 జూలై 1976న నీటి కాలుష్య నియంత్రణ మండలిని ప్రారంభించినది.

భారత పార్లమెంటులో నీటి సెస్ చట్టం-1977 ప్రవేశపెట్టిన తరువాత ఈ సంస్థ 1981 నుండి నీటి సెస్ ద్వారా ఆర్థిక వనరులను పెంపొందించుకుంటుంది.

ప్రభుత్వం 1981లో ఈ మండలికి గాలిలోని కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యతను కూడా అప్పగించింది. ఆ తరువాత బోర్డు పేరును "ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి"గా మార్చింది.

కాలుష్య నియంత్రణ మండలి కొత్త టోల్ ఫ్రీ నంబరు (10741)[మార్చు]

నియంత్రణ మండలి కొత్త టోల్ ఫ్రీ నంబరు (10741) ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈ సౌకర్యం ఉన్నా నంబరు ఎక్కువ అంకెల్లో ఉండటం... జనానికీ అంతగా తెలియకపోవటంతో సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సభ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ వచ్చిన తర్వాత అందరూ సులభంగా గుర్తుపెట్టుకునేలా అయిదంకెల నంబరు ఉండాలని భావించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇది వినియోగంలోకి వచ్చింది. ప్రస్తుతం ఐడియా, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ ఫోన్ల నుంచి చేస్తేనే పనిచేస్తుంది. ఇతర నెట్‌వర్క్ వినియోగదారులకు అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వారు అప్పటివరకు 040-23812600కు ఫోన్ చేయవచ్చు. ఈ నంబరుకైతే బిల్లు పడుతుంది. సిబ్బంది 24 గంటలూ విధుల్లో ఉంటూ ఫిర్యాదులను నమోదు చేసుకుంటారు. పీసీబీ ప్రధానంగా పరిశ్రమల నుంచి వాయు, జల కాలుష్యం వెలువడుతుంటే చర్య తీసుకుంటుంది.ఫలానా పరిశ్రమ వల్లే ఇబ్బందని చెబితే అధికారులను పంపించి తనిఖీ చేయిస్తుంది. రసాయన వాసనలు వస్తున్నాయంటే మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక స్పందనకు ఆలస్యమయ్యే అవకాశముంది. మున్సిపల్ వ్యర్థాల కాల్చివేత, మురుగు పొంగి దుర్వాసన ప్రబలటం, వాహనాల నుంచి అధికంగా పొగ వంటి సమస్యలతో సంబంధం ఉండదు.[1]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.thehindu.com/news/national/telangana/telangana-pollution-board-to-start-24hour-grievance-cell/article6649133.ece

బయటి లింకులు[మార్చు]