ఆనందవర్ధనుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆనందవర్ధనుడు (820–890) ధ్వన్యాలోకం అనే గ్రంథ రచయిత. ఈయన గురుంచి కల్హణుడు తన రాజతరంగిణిలో ప్రస్తావించాడు. అవంతివర్మ కాలం నాటి వాడు.ఆనందవర్ధనుడు ఐదు కావ్యాలు రచించాడు. ఇందులో ఇప్పుడు రెండు మాత్రమే లభించుచున్నవి. ఇందులో ప్రసిద్ధమైనది ధ్వన్యాలోకం. రెండవది దేవీశతకం. ధ్వన్యాలోకం రచన ద్వారా ఆనందవర్దనుడిని ధ్వనికారుడు గా గుర్తించబడ్డాడు. ధ్వని తత్త్వ ప్రతిష్ఠాపనతో ఈ గ్రంథం మొదలవుతుంది. ధ్వని ముఖ్యంగా వ్యంజన వ్యాపారమైనదని,, వ్యంగ్యార్థ ప్రాధాన్యం కలదని చెప్పబడింది. అటువంటి రచననే ధ్వని కావ్యం అని వర్తించబడుతున్నది, వ్యంగ్యార్ధం లేనిచో అది గుణీభూత కావ్యం అవుతుంది అని ఇందులో వివరిస్తాడు.

ఈ ధ్వన్యాలోకం గ్రంథంలో ఆయన రచన భాసించాలంటే ఎలాంటి లక్షణాలుండాలో వివరించాడు. అభినవ గుప్తుడు అనే తత్వవేత్త దీనిమీద ముఖ్యమైన భాష్యం రాశాడు. ఆనందవర్ధనుడు ధ్వని సిద్ధాంత సృష్టికర్తగా సుప్రసిద్ధుడు. ఒక కవి కవిత్వం రాస్తున్నప్పుడు ధ్వని దానికి ఆత్మ లాంటిదనీ, ఆ కవి ఒక భావ తరంగాన్ని సృష్టిస్తాడనీ. కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చదివేవారు లేదా వినేవారు ఆ ఆలోచనల్లోకి వెళ్ళగలిగేలా ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇది కవి, పాఠకుడు కూడా గుర్తెరగాలి.[1] ధ్వన్యాలోకం, దానిమీద అభనవగుప్తుడు రాసిన భాష్యాలను ప్రసిద్ధ సంస్కృత పండితుడు డేనియల్ ఇంగాల్స్ మరికొంతమందితో కలిసి ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.

ఈయన వ్రాసిన మరొక రచన, దేవీశతకం, ఇది శబ్దాలంకార ప్రాధాన్య రచన.

ఆధునిక సంస్కృత పండితులకు ఆనందవర్ధనునిపై విశేషమైన అభిప్రాయం ఉంది. పి.వి.కానే అనే పండితుడు ధ్వన్యాలోకం గురించి ఇలా అభివర్ణించాడు.

ధ్వన్యాలోకం అలంకార సాహిత్యంలో ప్రముఖమైన గ్రంథం. వ్యాకరణంలో పాణిని రచించిన అష్టాధ్యాయి, వేదాంతంపై ఆదిశంకరాచార్య భాష్యాలు ఎంత ప్రముఖ స్థానం వహించాయో ఇది కూడా కవిత్వంలో అంత స్థానం వహిస్తుంది.

డేనియల్ ఇంగాల్స్ ఆనందవర్ధనుని సంస్కృత విమర్శకులలో అత్యున్నత మేధావిగా పేర్కొన్నాడు.

మూలాలు[మార్చు]

  1. Premnath, Devadasan; Foskett (Ed.), Mary; Kuan (Ed.), Kah-Jin (15 November 2006), Ways of Being, Ways of Reading: Asian American Biblical Interpretation, Chalice Press, p. 11, ISBN 978-0-8272-4254-8