ఆర్కిటిక్ టెర్న్ పక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్కిటిక్ టెర్న్ పక్షి

యూకేలోని ఫర్న్ దీవుల్లో ఈ పక్షులు ఉంటాయి. ఇవి చాలా దూరం వలస వెళ్ళే పక్షులు. ఐరోపా, ఆసియా ,ఉత్తర అమెరికా ఆర్కిటిక్ వలస వెళ్ళాతాయి.[1] ఇవి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. సగటున రోజుకు 250 నుండి 400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాయి[2].ఆర్కిటిక్ టెర్న్ పక్షి పోడవు సుమారు 14 అంగుళాలు, రెక్కలు సుమారు 34 అంగుళాలు ఉంటాయి.వీటి ముక్కు చిన్నదిగా సూదిగా, ఎరుపు రంగులో ఉంటుంది. తలపైన నల్లగానూ మిగతా శరీరమంతా తెల్లగానూ ఉంటుంది. పాదాలు బాతు పాదాల్లా వలె ఉంటాయి[3].ఇవి గుడ్లు మే, ఆగస్టు మాసాల్లో గుడ్లుపెడతాయి. వీటి ఆహారం చేపలు , కీటకాలను తింటాయి.[4] వీటి జీవిత కాలం మూడు, నాలుగు సంవత్సరాలు బతుకుతాయి.

వలసలు[మార్చు]

ఈ జాతి పక్షులు ఫర్న్‌ దీవుల నుండి అంటార్కిటికా వలస వెళ్లబోయే ముందు శాస్త్రవేత్తలు 29 ఆర్కిటిక్‌ టెర్న్‌ పక్షుల్ని తీసుకుని వాటికి తేలికపాటి జియోలొకేటర్లు అమర్చి పరీక్షించారు.[5]ఈ పక్షులు ఫర్న్‌ దీవుల నుంచి చలికాలంలో పొదగడానికి అంటార్కిటికా బయలుదేరి వెళ్లి తిరిగి రావడం గురించి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇవి అత్యధిక దూరం వలస వెళ్ళే పక్షులు. ఈ పక్షులు జీవిత కాలంలో సుమారు 30లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి.[6]

చిత్రమలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Nederlandse Ornithologische Unie - Ardea". ardea.nou.nu. Retrieved 2020-01-23.
  2. "Arctic terns' flying feat: same as 3 trips to Moon". Reuters (in ఇంగ్లీష్). 2010-01-11. Retrieved 2020-01-23.
  3. "Arctic Tern Identification, All About Birds, Cornell Lab of Ornithology". www.allaboutbirds.org (in ఇంగ్లీష్). Retrieved 2020-01-23.
  4. "Arctic Tern - Introduction". Birds of North America (in ఇంగ్లీష్). Retrieved 2020-01-23.
  5. "Arctic terns' flying feat: same as 3 trips to Moon". Reuters (in ఇంగ్లీష్). 2010-01-11. Retrieved 2020-01-23.
  6. "World's Longest Migration Found--2X Longer Than Thought". National Geographic News (in ఇంగ్లీష్). 2010-01-12. Retrieved 2020-01-23.