ఎమ్‌ఎల్‌ఏ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎమ్‌ఎల్‌ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి)
మంచి లక్షణాలున్న అబ్బాయి
దర్శకత్వంఉపేంద్ర మాధవ్
రచనఉపేంద్ర మాధవ్
నిర్మాతకిరణ్ రెడ్డి
భరత్ చౌదరి
తారాగణంకళ్యాణ్ రామ్
కాజల్ అగర్వాల్
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
కూర్పుబిక్కిన తమ్మిరాజు
సంగీతంమణి శర్మ
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుబ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్
సినిమా నిడివి
160 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్10 కోట్ల రూపాయలు

ఎమ్‌ఎల్‌ఏ 2018 మార్చి 23 శుక్రవారం విడుదలైన తెలుగు సినిమా.

కథ[మార్చు]

కల్యాణ్‌ (కల్యాణ్‌రామ్‌) ఓ సందర్భంలో ఇందు (కాజల్‌) ను చూస్తాడు. ఆమెను చూసిన వెంటనే ప్రేమిస్తాడు. కానీ ఇందు.. కల్యాణ్‌ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇందు ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ సమస్య నుంచి తన తెలివితేటలతో బయటపడేస్తాడు కల్యాణ్‌. ఈ తరుణంలో ఇందుకి కల్యాణ్‌పై ప్రేమ పెరుగుతుంది. ఇందు నాన్న జయప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యేని అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గాడప్ప (రవి కిషన్‌) బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. దాంతో ఇందును గాడప్పకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో కల్యాణ్‌ వచ్చి ఇందుని ప్రేమిస్తున్నానంటాడు. అది విని నువ్వు కూడా ఎమ్మెల్యే అవ్వు అని కల్యాణ్‌తో చెప్తాడు జయప్రకాశ్‌. దాంతో ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఎమ్మెల్యే అవుతానని చెప్పి కల్యాణ్‌.. గాడప్పతో సవాల్ చేస్తాడు. మరి ఆ సవాల్ ను కళ్యాణ్ ఎలా నెగ్గాడు? ఇందుని పెళ్ళి చేసుకున్నాడా? అన్న విషయాలు మిగిలిన కథ.

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • మోస్ట్ వాంటెడ్ అబ్బాయి , రచన: రామజోగయ్య శాస్ర్తీ, గానం. యాజిన్ నిజార్, రమ్య బెహరా
  • హే ఇందు రచన; కాసర్ల శ్యామ్, గానం, రాహుల్ సింప్లీ గo జ్
  • గర్ల్ ఫ్రెండ్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . అనురాగ్ కులకర్ణి
  • యుద్ధం యుద్ధం, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. అనురాగ్ కులకర్ణి

సాంకేతికవర్గం[మార్చు]

  • సంగీతం: మణిశర్మ
  • కూర్పు: బక్కిన తమ్మిరాజు
  • నిర్మాణ సంస్థ: బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాతలు: కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, విశ్వ ప్రసాద్‌
  • ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల
  • కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్‌

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]