కదిరి బాబూరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కదిరి బాబూరావు

కదిరి బాబూరావు భారత దేశ రాజకీయనాయకుడు. అతడు కదిరి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఉన్నాడు. అతడు తెలుగుదేశం పార్టీ నేత. అతడు నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలోనికి చేరాడు.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

బాబూరావు చంద్రశేఖరపురం మండలానికి చెందిన సీలంవారి పల్లిలో వెంకట నరసయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. అతడిని నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. అతడు సీలంవారిపల్లెలో విద్యాభ్యాసం చేసాడు. 1981లో హైదరాబాదులోని నిజాం కళాశాలలో బి.ఎ.డిగ్రీని పొందాడు. అతడిని నలుగురు కుమార్తెలు, ఒక కూమారుడు.

2004లో రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో అతడు దర్శి శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి బుచ్చెపల్లి సుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. 2009 శాసనసభ ఎన్నికలలో కనిగిరి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పటికీ భారత ఎన్నికలు కమిషన్ తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి కనిగిరి నియోజగవర్గం నుండి గెలుపొందాడు.

మూలాలు[మార్చు]

  1. "Prakasam ministerial aspirants disappointed". The Hindu. 11 June 2014. Retrieved 7 August 2014.
  2. "Kanigiri TDP candidate's nomination rejected". Times of India. 7 April 2009. Retrieved 7 August 2014.