Coordinates: 36°N 76°E / 36°N 76°E / 36; 76

కారకోరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కారకోరం
మధ్య కారకోరం లోని బల్టోరో హిమానీ నదం. గిల్గిట్ బల్టిస్తాన్, పక్ ఆక్రమిత కాశ్మీరు
అత్యంత ఎత్తైన బిందువు
శిఖరంK2, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు
ఎత్తు8,611 m (28,251 ft)
నిర్దేశాంకాలు35°52′57″N 76°30′48″E / 35.88250°N 76.51333°E / 35.88250; 76.51333
భౌగోళికం
కారకోరం, మధ్య ఆసియా లోని దాని పరిసర పర్వతాలు
దేశాలుఆఫ్ఘనిస్తాన్, చైనా, భారత దేశం, పాకిస్తాన్ and తజికిస్తాన్
ప్రాంతాలుగిల్గిట్ బల్టిస్తాన్, లడాఖ్, జింజియాంగ్ and బదక్షణ్
Range coordinates36°N 76°E / 36°N 76°E / 36; 76
సరిహద్దుపామీర్ పర్వతాలు, హిందూ కుష్, కున్‌లున్ పర్వతాలు, హిమాలయాలు and లడాఖ్ శ్రేణి

కారకోరం లేదా కారాకోరమ్ ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వత శ్రేణి. ఇది పాకిస్థాన్, భారతదేశం, చైనా దేశాల సరిహద్దులో ఉంది. ఈ పర్వతశ్రేణి హిందూకుష్ నుండి హిమాలయాల వరకు విస్తరించి ఉంది.[1][2] ఈ పర్వతశ్రేణి ఆసియా లో అతి పెద్ద శ్రేణులలో ఒకటి. ఈ శ్రేణిలో 8000 మీ. కంటే ఎక్కువ ఎత్తున్న శిఖరాలు నాలుగున్నాయి. అత్యంత ఎత్తైన శిఖరం 8,611 m (28,251 ft) ఎత్తున్న కె2. ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ఎత్తైన శిఖరం.

ఎత్తైన పర్వతాలు[మార్చు]

కె2 శిఖరం, కారకోరం శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం

ఈ పర్వత శ్రేణిలో ఉన్న అతిపెద్ద పర్వత శిఖరాలు, వాటి ఎత్తులతో:

  1. కె2: 8,611 మీటర్లు (28,251 అడుగులు) దీన్ని చొగోరి అని అనడం కూడా కద్దు. ప్రపంచంలోకెల్ల ఎత్తైన శిఖరాల్లో ఇది రెండవ స్థానంలో ఉంది (ఎవరెస్టు శిఖరం మొదటి స్థానంలో ఉంది).
  2. గ్యాషర్‌బ్రమ్ I: 8,080 మీటర్లు (26,510 అడుగులు)
  3. బ్రాడ్ పీక్: 8,051 మీటర్లు (26,414 అడుగులు)
  4. గ్యాషర్‌బ్రమ్ II: 8,035 మీటర్లు (26,362 అడుగులు)
  5. గ్యాషర్‌బ్రమ్ III: 7,952 మీటర్లు (26,089 అడుగులు)
  6. గ్యాషర్‌బ్రమ్ IV: 7,925 మీటర్లు (26,001 అడుగులు)
  7. దిస్తాగిల్ సార్: 7,885 మీటర్లు (25,869 అడుగులు)
  8. కున్యాంగ్ చిష్: 7,852 మీటర్లు (25,761 అడుగులు)
  9. మషర్‌బ్రమ్ I: 7,821 మీటర్లు (25,659 అడుగులు)
  10. బటూరా I: 7,795 మీటర్లు (25,574 అడుగులు)
  11. రాకపోషి: 7,788 మీటర్లు (25,551 అడుగులు)
  12. బటూరా II: 7,762 మీటర్లు (25,466 అడుగులు)
  13. కంజుత్ సార్: 7,760 మీటర్లు (25,460 అడుగులు)
  14. సాల్టోరో కాంగ్రీ: 7,742 మీటర్లు (25,400 అడుగులు)
  15. బటూరా III: 7,729 మీటర్లు (25,358 అడుగులు)
  16. సాసర్ కాంగ్రీ: 7,672 మీటర్లు (25,171 అడుగులు)
  17. చోగోలిసా: 7,665 మీటర్లు (25,148 అడుగులు)
  18. షిస్పేర్ సార్: 7,611 మీటర్లు (24,970 అడుగులు)
  19. పాసు సార్: 7,478 మీటర్లు (24,534 అడుగులు)
  20. మాలిబిటింగ్: 7,458 మీటర్లు (24,469 అడుగులు)
  21. సియా కాంగ్రీ: 7,442 మీటర్లు (24,416 అడుగులు)
  22. కె 12: 7,428 మీటర్లు (24,370 అడుగులు)
  23. స్కిల్ బ్రమ్: 7,410 మీటర్లు (24,310 అడుగులు)
  24. హరమోష్ శిఖరం: 7,397 మీటర్లు (24,268 అడుగులు)
  25. అల్టార్ పీక్: 7,388 మీటర్లు (24,239 అడుగులు)
  26. మొమిల్ సార్: 7,343 మీటర్లు (24,091 అడుగులు)
  27. బైంత బ్రాక్: 7,285 మీటర్లు (23,901 అడుగులు)
  28. బాల్టిస్తాన్ శిఖరం: 7,282 మీటర్లు (23,891 అడుగులు)
  29. ముజ్తాగ్ టవర్: 7,273 మీటర్లు (23,862 అడుగులు)
  30. దిరాన్: 7,266 మీటర్లు (23,839 అడుగులు)
  31. గ్యాషర్‌బ్రమ్ V: 7,147 మీటర్లు (23,448 అడుగులు)

ఎత్తైన శిఖరాలలో ఎక్కువ భాగం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిట్ - బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్నాయి. బల్టిస్తాన్‌లో సముద్ర మట్టం నుండి 6,100 మీటర్లు (20,000 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తున్న పర్వత శిఖరాలు 100 కు పైగా ఉన్నాయి.

కనుమలు[మార్చు]

పడమర నుండి తూర్పు వరకు

  • కిలిక్ కనుమ
  • మింటాకా కనుమ
  • ఖుంజేరబ్ కనుమ (4,693 మీటర్లు. ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన అంతర్జాతీయ సరిహద్దు దారి)
  • షిమ్షాల్ కనుమ
  • ముస్తాగ్ కనుమ
  • కారకోరం కనుమ
  • సాసర్ కనుమ
  • నల్తార్ కనుమ లేదా పకోడా కనుమ

కారకోరం శ్రేణిలో ఖుంజేరబ్ కనుమ ఒక్కటే మోటారు వాహనాలు పోగలిగే కనుమ. ఇది కాకుండా షిమ్షాల్ కనుమ ఒక్కటే ఇప్పటికీ సాధారణ వాడుకలో ఉన్న ఇతర కనుమ దారి. అయితే, ఇది అంతర్జాతీయ సరిహద్దును దాటదు.

మూలాలు[మార్చు]

  1. Bessarabov, Georgy Dmitriyevich (7 February 2014). "Karakoram Range". Encyclopaedia Britannica. Retrieved 3 May 2015.
  2. "Hindu Kush Himalayan Region". ICIMOD. Retrieved 17 October 2014.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కారకోరం&oldid=3194984" నుండి వెలికితీశారు