కుతుబ్ మీనార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
72.5 మీటర్ల కుతుబ్ మీనార్, ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల నిర్మాణం.

కుతుబ్ మీనార్ (ఆంగ్లం: Qutub Minar హిందీ: क़ुतुब मीनार ఉర్దూ: قطب منار), ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల మీనార్, , ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు ఒక అపురూపమైన ఉదాహరణ. ఇది ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్లో గలదు. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను నమోదు చేశారు.

వర్ణన[మార్చు]

కుతుబ్ అనగా ధృవం, మీనార్ అనగా స్తంభం, కుతుబ్ మీనార్ అనగా "ధృవపుస్తంభం".ఐనను దానిని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు గనక అతని పేరు మీదుగానూ దీనికి కుతుబ్ మీనార్ అనే పేరొచ్చిందని ప్రతీతి. కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పైవరకూ గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీనిని 1193 లో నిర్మించారు. కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణం ప్రారంభించగా, ఇల్ టుట్ మిష్ పూర్తికావించాడు.దీని ప్రాంగణంలో ఢిల్లీ ఇనుప స్థంబం, ఖువ్వతుల్ ఇస్లాం మస్జిద్.

ఇంజనీరింగ్ ప్రతిభ[మార్చు]

మన దేశంలో ప్రాచీన నిర్మాణ శాస్త్రం, ఇంజనీరింగ్ ప్రతిభను సాక్షాత్కరింపజేసే చారిత్రాత్మక కట్టడమే కుతుబ్ మీనార్. ఢిల్లీలోని మెహ్రోలీ వద్ద ఉంది. ప్రతి ఏడాది జూన్ నెలలో 22 వ తేదీన భూమి మీద దీని నీడ పడదు. అత్యద్భుతమైన భౌగోళీక శాస్త్ర నిగూఢతను తెలిపే ఈ కట్టడం 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద ఉంది. ఈ కట్టడం 5 డిగ్రీలు వంపు కలిగి వుండటం వలన భూమధ్య రేఖకు అటు ఇటుగా సూర్యుడి చలనం వలన దీని నీడ ఆ ప్రత్యేక రోజున భూమి మీద పడటం లేదు.

కుతుబ్ మీనార్ ప్రక్కన వున్న కట్టడము
కుతుబ్ మీనార్ ప్రక్కన వున్న కట్టడము

ఇవీ చూడండి[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]